skip to main
|
skip to sidebar
subbarao
Monday, March 31, 2014
నీతి పరుని మాటనీటి మూట
కల్లిబొల్లి మాట లల్లి జ నంబును
మోస గించు వారి బాస లన్ని
వినగ నమ్మ బలుకు పెద్ద న నను నవి
నీతి పరుని మాటనీటి మూట
పద్య రచన -మామిడి పండ్లు
బాల ! చూడుము మామిడి పండ్ల రాశి
జూడ బంగిని పల్లి మా మిడిని బోలి
పసిమి రంగున మెఱయుచు బాగు గాను
నూరు చుండెను దినగను నోరు నాది
పద్య రచన -ఉగాది పచ్చడి
వేపపూవును మఱియును బెల్లము దగు
నరటి పండును మామిడి చెరకు ముక్క
లాది గకలిపి యీదిన మార్య !చేయు
దురట పచ్చడి సుఖము బొం దుకొఱకునిల .
Sunday, March 30, 2014
మత్సరము గూర్చు జయనామ వత్సరమ్ము
మత్సరము గూర్చు జయనామ వత్సరమ్ము
నార్య లిఖితము జదువగ నర్ధ రహిత
ముగను దోచెను జదువుము మూర్తి నీవు
జయము జేకూర్చు మనకది సతతము మఱి
కన్నతల్లిని బరిమార్చ గలుగు దివియ
కలుగు నరకము పుడమిని గల్ల గాదు
కన్నతల్లిని బరిమార్చ గలుగు దివియ
దాన ధర్మము ల్జేయునో ధరను నెవడు
నట్టి వానికి దప్పక యార్య !నిజము
కామితార్ధములొన గూరు కపుల వలన
శివుని బూజను జేయగా జేతులార
కామితార్ధములొన గూరు కపుల వలన
బాధ లెన్నియో గలుగును బ్రజల కిలను
నోట కఱచుచు ఱక్కుచు గోటివలన
Saturday, March 29, 2014
విజయకు వీడు కోలు
వీ డుకోలును జెప్పుదు విజయ నామ
వత్సరంబున కీ రోజు వత్సలతన
సుఖము లెన్నియో బొందితి ,శుభము లొదవె
వత్సరంబంతయు నిజము వార్ధి శయన !
గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ
గతమును దలపకు మయ్యా
వెతలెన్నియొ కలిగె నాకు వేవిధములుగాన్
గతమొక నరకమె యాయెను
గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ
Friday, March 28, 2014
మల్లియ తీ వియకు గాచె మామిడి కాయల్
లల్లీ చూడుము పూలను
మల్లియ తీ వియకు, గాచె మామిడి కాయల్
మల్లేశుని వృక్షమునకు
కొల్లలుగా జూడు డా ర్య !కూరిమి తోడన్
పద్య రచన -తెల్లని గుఱ్ఱము
తెల్లని గుఱ్ఱము జూడుం
డల్లన నా వార్ధి దరిని నటునిటుదిరుగన్
మెల్లగ దృ గ్గో చ ర మయె
నల్లది దేవేంద్రు నశ్వమని యి పు డరయన్
Thursday, March 27, 2014
నాలు గైదులు పదునాఱు నలిన నయన!
ఇరువది యగును శంకరా!యిరవు గాను
నాలు గైదులు, పదునాఱు నలిన నయన!
నాలు గంకెకు రెట్టింపు మేళవించి
వచ్చు సంఖ్యకు రెట్టింపు బరగు నెడల
చమత్కార పద్యము
భగవంతుని లీల లువరు
సగ పదియునుదెలిపి రార్య ! చక్కగ నచట న్
మొగములు మఱి విక సించెను
పగతుర కది కంటకమ్ము పావన చరితా !
త్రిశంకు స్వర్గము
గాదె కొమరుండు నిర్మించ గగన మందు
బిట్టు యా త్రిశంకు మునికి బ్రియము తోడ
నటనె నుండెను నాముని నబ్బురముగ
నదియె గ త్రి శంకు గగన మనగ బరగు
Wednesday, March 26, 2014
బద్ధ కించు వాడె భాగ్య శాలి
బద్ధ కించు వాడె భాగ్య శాలి యగునా ?
అబ్బురమ్ము గొలిపె యార్య !యిదియ
బద్ధ కించు వాడె భరణి సో మరి యగు
భక్తి గలుగ నగును భాగ్య శాలి
తల్లిని హింసించువారు దైవసములగున్
ఎల్లరు నరకముజుతురు
తల్లిని హింసించువారు దైవసములగున్
అల్లరి చేసిన యైనను
పిల్లలు మఱి నిజముగాను ప్రీతిని పుడమిన్
Tuesday, March 25, 2014
బధ్ధకముం గలుగు నెడల భాగ్యము గలుగున్
ఇధ్ధర సోమరి యగు మఱి
బధ్ధకముం గలుగు నెడల, భాగ్యము గలుగున్
బధ్ధకమును విడనాడుచు
శుద్ధుడవై శివుని పూజ శుచితో జేయన్
పద్యరచన -ఉపాధ్యాయుడు
ఒజ్జ యనగ మేటి యుపదే శికుండిల
నుత్తములుగ దీర్చి దిద్ది బాల
బాలి కలను ,మఱియు భావిపౌ రులజేయు
వంద నంబు సేతు వందలాది
Monday, March 24, 2014
దుప్పటి ముసుగేసి కొట్టు దుప్పిని బావా !
అప్పులు దీర్చని సోముని
దుప్పటి ముసుగేసి కొట్టు , దుప్పిని బావా !
చప్పున బరుగిడి దెచ్చిన
నిప్పుడె నేనాడు కొందు నిష్టము తోడన్
గరళ కం ఠుని బూజింప గరళ మిచ్చు
సకల సంపద లిచ్చును సర్వులకును
గరళ కం ఠుని బూజింప గరళ మిచ్చు
పాము శిరమును గట్టిగా బట్టు కొనుచు
పిండ మొదలిడ ,కక్కుచు దండి గాను
సజ్జనులు సుభాషితముల సరకు గొనరు
సజ్జనులు సుభాషితముల సరకు గొనర
టంచు పలుకుట సరియౌనె యార్య!యిపుడు
సరకు గొనువారు మొదటన సజ్జ నులెను
సత్క వుల భాషి తమగుట సదరు సూక్తి
పద్యరచన -ఆకు కూరలు
ఆకు కూరలు దినినచో నాయు వృ ధ్ధి
మఱియు కంటికి నిమిగుల మంచి దండ్రు
ఆకు కూరల లోనన గోగి యాకు
నొలిచి చేయుదు రతివలు లలితముగను
పచ్చడి, రుచిగ నుండును భామ ! దినగ
Sunday, March 23, 2014
పద్యరచన -దైవ మొక్కడే
దైవ మొక్కడే యనుచును దమము తోడ
ని తర మతముల వారును నీశు లైన
సీత మఱియును రాముని జేరి పూజ
చేయు చుండిరి చక్కగ జిత్ర మందు .
జందెము విడనాడు వాడె సద్బ్రాహ్మణుడౌ
అందరి కంటెను మూర్ఖుడు
జందెము విడనాడు వాడె , సద్బ్రాహ్మణుడౌ
జందెము దానెల్లప్పుడు
నందముగా దాల్చు నతడుననుపమ రక్తిన్
మూడు పదుల లోపు ముసలి దనము వచ్చు
మూడు పదుల లోపు ముసలి దనము వచ్చు
కలియుగంబు నందు కనగ నగును
అన్నమందు సారమసలు లే నందున
జరుగ వచ్చు నటులు జగము నందు
Saturday, March 22, 2014
గోవర్ధన గిరిని నెత్తె గోపిక లపుడున్
గోవుల పాలకుడాహరి
గోవర్ధన గిరిని నెత్తె, గోపిక లపుడున్
గోవులు వెంబడి రాగా
గ్రావము దరి కేగి యుండె గాసిలు వోవన్
పద్య రచన -స్త్రీ పుస్తకము చదువుట
ఇంటి పనులన్ని గావించి యింతి యచట
చదువు చుండెను బొత్తము శ్రద్ధ గాను
చూడ్కు లామెవి క్రిందకు జూచు చుండి
బయటి సంగతు లేవియు బట్ట కుండె
శ్రీ జయనామ సంవత్సర శుభా కాం క్షలు
ఇందు మొదటగా గురువులు కంది శంక
రయ్య ,నేమాని ,గోలివారాది కవిగ
ణంబుల కిడుచు ననిశము నతుల శతము
నందు కొనుడని బ్రార్ధింతు నాదరమున
జయము కలిగించి గావుత ! జయ మనబడు
వత్సర మెపుడు శంకరా భరణ గణపు
సోదరీ మణులు మఱియు సోదరులను
నెల్ల వేళల దప్పక చల్ల గాను
జయనాబడు వత్సరమ్ము సకలము దోచున్
జయనామ వత్సరంబది
భయముల బోగొట్టు ననుచు భావిం చం గన్
రయముగ బంతులు సెప్పెను
జయనాబడు వత్సరమ్ము సకలము దోచున్
Friday, March 21, 2014
ద్వాదశి పారణము నిచ్చు దండిగ జిక్కుల్
మేదిని నిండుగ శుభములు
ద్వాదశి పారణము నిచ్చు, దండిగ జిక్కుల్
మీదకు వచ్చును నిరతము
పేదల కవి లేమివలన పీకల వరకున్
ఒ కటికి రెండాయె నార్య ! యూ హలకిలలోన్
తికమకగా విభజించను
నొ కటికి రెండాయె నార్య ! యూ హలకిలలో
న్నకటా మన యాంధ్రముమఱి
యిక మనకే దీని బాగు నీ క్షణ జేయన్
చద్దన్నము దినిన యెడల శవముగ మారున్
బొద్దుగ నుందురు జనములు
చద్దన్నము దినిన యెడల, శవముగ మారున్
బద్దలు గొట్టిన గుండెలు
తద్దయు మఱి పోవు గాలి తనువును నుండిన్
కామి తార్ధముల్ సిద్ధించు లేమి వలన
శాస్త్రసమ్మత మగునట్టి చర్య వలన
కామి తార్ధముల్ సిద్ధించు , లేమి వలన
బ్రదుకు నన్నాళ్ళు భూమికి భార మగుచు
గడుప వలయును రోజులు కాకి వోలె
లలితా పారాయణ మ్ము లయమున్జేయున్
లలితా స్తోత్రము నెప్పుడు
నలతిదిగా దలచి మదిని నవహే ళ న గాన్
గలగల చదివిన ,వినుముర
లలితా పారాయ ణమ్ము లయము న్జేయున్
గీతా పారాయణ మ్ము గీడొ నరించున్
నీతియు మనుగడ నేర్పును
గీతా పారాయణ మ్ము గీ డొ నరించున్
బాతకము జేయు నెడలను
మాతయె శి క్షించు మనల మరువకు నరుడా !
శల్యుడ నగ నెవ్వడు పార్ధసారధికద
శల్యుడ నగ నెవ్వడు పార్ధ!సారధికద
సహజ కవచ కుండల ధారి సామి కతడు ,
పాండవుల మేలు కొఱకునై పాటు పడిన
మేటి యోధుడు ,పార్ధుని మేన మామ .
Thursday, March 20, 2014
పద్య రచన -చిల్లర పైసలు
చిల్లర పైసల జూడుము
చెల్లవు మఱి యిప్పు డసలు చెలియా ! వినుమీ
చెల్లిన చెల్లక పోయిన
నుల్లము దా నొచ్చుకొనుచు నూర్పులు నిగిడెన్
నీ టితో నగ్ని నార్పెడి మాట కల్ల
కొండ లన్నియు భగభగ మండు చుండి
మిన్ను నంటె ను మంటలు మన్ను నుండి
యెంత యత్నము జేసిన సుంత గూడ
నీ టితో నగ్ని నార్పెడి మాట కల్ల
శ్రీ మాతృ స్తోత్రము - నేమాని వారు
మాతృ మూర్తిని గూరిచి మాలి కంబు
రచన జేసిన గురువర ! రామ జోగి !
సాటి యెవరయ్య ! నీ కిల ? సాటి లేరు
అందు కొనుమయ్య ! వందనా లందు కొనుము .
పద్య రచన-నరనారాయణులు
నరుడు మఱి యునా రాయణు లిరువురచట
దర్శనము నీ యగను నారదాదులు గడు
నయము తోడన సాష్టాంగ నతులొనర్ప
చూడ కనువిందు గొలిపెను జూ డ్కులకును
Wednesday, March 19, 2014
పార్ధ సారధి చంపెను పరమ శివుని
కంసుడు మొదలు గాగల కఱకు జనుల
పార్ధ సారధి చంపెను, పరమ శివుని
భక్తి శ్ర ద్ధ ల పూజించి భవ్య మైన
ముక్తి నొందుము బాలక ! మోద మలర
Tuesday, March 18, 2014
పద్యరచన -పార్వతీదేవి
లోకమాతగు పార్వతి లోక నాధు
బజ్జ,బాల గణపతిని పదిలముగను
నొడిని గూర్చుండ బెట్టుకు నుండె నచట
మోకరింతును వారికి ముదము తోడ
రాము డనగను సాక్షాత్తు రావణుండె
విశ్వరూపము జూపిన విష్ణు వేను
రాము డనగను సాక్షాత్తు, రావణుండె
కోటి లింగాల యర్చన కూర్మి తోడ
చేసి చూపిన భక్తుడు వాసి గాను
Monday, March 17, 2014
కాకియు కోకిలము కలసి కాపుర ముండె న్
కోకిల గ్రుడ్లను బొదుగుచు
కాకులు మఱి బెద్ద జేయు కాకను దలపున్
ఆ కణ్వుని యాశ్రమమున
కాకియు కోకిలము కలసి కాపుర ముండె న్
బాలవటుడు
బ్రహ్మ తేజస్సు తో నుండె బాల వటుడు
చూడు పొత్తము పైనన చూడ్కు లునిచి
చదువు చుండెను గావ్యము శ్రద్ధ తోడ
ముద్దు లొలుకుచు నుండెను బొద్దు గాను
Sunday, March 16, 2014
గణముల నిర్మాణ ఫలితములు
మగణ నగణము తదుపరి భగణ యగ ణ
ముండు చోటుల తప్పక నుండు జయము
మగణ నగణాలు వరుసగ మలుచ కలుగ
ఫలిత మాయది సమృద్ధి ఫలము గలుగు
మగ ణ నగణము పిమ్మట జగ ణ తగణ
ముండు తావుల యుండు శూన్యపు ఫల మది
ఫలము గురువర తెలియుము భరణి యందు
జరుగు నిజముగ నీ యది సరకు గొనుము
మగణ నగణము కంటెను రగణ సగ ణ
ములుగ లుగునెడ బంధుపీ డలు గ లుగును
సర్వ కార్యము ల్సిద్ధించు సర్వు లకును
భగణ యగాణాల కంటెను మగ ణ నగ ణ
ములు గ లుగుచోట తెలియుము ముఖ్య ముగను
భగణ యగాణాల కంటెను భగ ణ యగ ణ
ములుగ లుగుదరి యొనగూ డు మోద మలర
లాభ మొనగూ డు ననశ ము లక్షణముగ
చింత బనిలేదు తెలియుము చిత్స్వరూ ప !
ధనము నాశన మగు నార్య !ధరణి యందు
భగణ యగణము పైనను జగణము తగ
ణములు గనిపించు నచ్చట నమ్ము నిజము
ననుచు వాల్మీ కి నుడివెను నార్యు లార !
భగ ణ యగణము కంటెను రగ ణ సగ ణ
ములు గనబడు చో ట శో కము ముందు నిలుచు
కార్య సిద్ధిని బొందును కనుగొనంగ
జగణ తగణాల కంటెను మగణ నగణ
ములు గలుగు నెడ నచ్చోట మోద మిచ్చు
వశము నగు నార్య !సర్వము వశము నగును
జగణ తగణము కంటెను భగణ యగణ
ములు గలుగు నెడ నిరతము ముదము తోడ
నూ టికిం నూరు పాళ్ళు నీ మాట నిజము
శుభ మశుభముల యందును జూడ తఱచి
రెంటి యందును గనబడు రిక్త ఫలము
జగణ తగణము కంటెను సదృశ గణము
కలుగు చోటన నిజమిది కనుము బాల !
స్వజన వైరము గలుగును సత్పురుషుల
కును నెంతగా గాదను కొనిన నిలను
జగణ తగణము కంటెను రగణ సగణ
ములు దగులుకొనినయెడ ల ముఖ్యముగను
గృ హిణీ నాశన మగునట
అహరహముం రగణ సగణ యక్షరములకున్
ఇహ యా భగణము యగణము
బహుళముగా బరమైన యెడల బాధలు గలుగున్
రగణము జగణము కంటెను
మగణము తగణం బు వేయ మానిని వినుమా
యగు మఱి కుల నాశనములు
తగునా నిక నట్ల యగుట తనకే కీడున్
రగణము సగణము కంటెను
రగణము సగణంబు నిలుప రంగుగ మీరున్
జగమున జరుగును నాయకు
డుగ బేరొం దు నతడు డూ డూ పలుకున్ .
గణముల ను బట్టి ఫలితములు
ఒనర యొకదాని తదుపరి యొకటి మప్పు
గణము బట్టియే ఫలితము గలుగు బ్రజకు
సందియంబును నిసుమంత యిందు లేదు
తనర వాల్మీకి రచన సో దాహ రణలు
గణాల మధ్య భావములు
మగణ నగ ణం బు లయ్యవి మైత్రి యగును
భగణ యగణాలు భృ త్యులు భరణి యందు
జగణ తగణాలు నగుసుమీ సహృదయులు
రగ ణ సగణాలు శత్రువు లగును ధరను
వాల్మీకి -శ్లోక రచన
భావి గాగల కార్యము న్భరణి దలచి
వేసె గణములు వాల్మీకి వింత గాను
భగణము మొదలుగా గల యగ ణ ము లను
నెంత చిత్రమో యీ యది యంత నిజము
వివిధ రకముల వృత్తము ల్విరివి గాను
తనదు కావ్య మందున జొని పెను నయముగ
రెండు పాదము లొక వృత్త ముండు మిగులు
రెండు పాదము లుండును నొండు దిగను
వేల కొలదిగ వృత్తము ల్వెసులు బాటు
లేని విధముగ రచియించె లీల లొదవ
శ్లో కమందలి వృత్తము సుస్థిరముగ
అన్ని పాదాల యందున గాన బడదు
అనగ నాలుగు పాదము లందు జూడ
గణము లా వేరు వృత్తపు గణము లుండు
తెలియు నాతని శ్లోకము ల్దీ క్ష తోడ
చదువు వారల కాతని సంక లనము .
కాశీ భొట్ల !
ఎంత యెత్తున కెదిగితి వీ వ యిపుడు
సత్య నారాయణా ! నీవు సత్యముగను
రామ నామము మఱియును రామ జపము
రచన రూపాన దెలిపిన రసికు డవుర.
ఉత్తరము చదువు భామ
ప్రేమ లేఖను గాబోలు ప్రియము తోడ
చదువు చుండెను నొకయామె శ్రద్ధ తోడ
మరులు గొల్పెడు ఛాయలు మదిని నిండ
నిండు కొనియెను నామెకు నిజము గాను
విష్ణు పూజ నరులు విడువదగును
చేయవలయు సుమ్ము సితవస్త్ర ధారియై
విష్ణు పూజ నరులు, విడువదగును
పరుల తప్పు లెన్ను పధ్ధతి ని మిగుల
సంతసింతు రుర్వి జనులు నుమఱి
Saturday, March 15, 2014
సాహెబు తా నిష్టపడు వసంతో త్సవమున్
ఆహా ! యేమని చెప్పిరి ?
సాహెబు తా నిష్టపడు వసంతో త్సవమున్
సాహెబు మాత్రమె కాకను
సాహెబు బంధువులు కూడ సైయని రార్యా !
Friday, March 14, 2014
శ్రీ నేమాని వారి శ్రీ రామ అష్టోత్తర శత నామావళి
శ్రీ రాముని నామములను
మారాముడు వ్రాసె నిచట మది నింపుగగన్
మీ రాము డెవరు ? చెప్పుము
మారాముడు రామజోగి మన గురువులె గా
కుంతీ పుత్రుండు ష ణ్ము ఖుం డన నెగడెన్
పంతముతో నర్జునుడా
వంతయు మది గరుణ లేక యా శివుని పయి
న్నంతలుగ విజృం భించగ
కుంతీ పుత్రుండు ష ణ్ము ఖుం డన నెగడెన్
పొట్ట కూటికై ....
పొట్ట కూటికై యిటికల కట్ట నబల
మోయు చుండెను జూడుడు ముదిత లార!
చంటి బాలుడు నడుమున నంటి నటుల
జోలి గట్టెను పాపమా యాలి యచట
Thursday, March 13, 2014
కరకజ్జము దినిన యెడల కవి వరు డగునౌ
విరివిగ వాంతులు గలుగును
కరకజ్జము దినిన యెడల , కవి వరు డగునౌ
నిరతము కవనము లల్లుచు
తిరముగ మఱి రచన పైన దీ క్షను గలుగన్
కరివరదుని మేనమామ కంసారియె గా
ధర నేలిన గంసుడె మఱి
కరివరదుని మేనమామ, కంసారియె గా
నరకునిం జంపియు రణమున
సురలాదిగ సకల జనుల సుఖితుల జేసెన్
వెన్నెల రేని వెలుగులకు విచ్చె కమలముల్
పున్నమి రేయిని గలువలు
వెన్నెల రేని వెలుగులకు విచ్చె, కమలముల్
చెన్నుగ దినకరు రాకకు
నన్నువు తో విరిసెమిగుల యందము దోపన్
బాల కృష్ణుడు -యోగనిద్ర
యోగ నిద్రను మునిగెను యోగి వర్యు
డుట్టి పడుచుండె దేజము బిట్టు గాను
భూనభో రాంత రాళము ల్దాన యగుచు
నేమి తెలియని వాడుగ నెట్టు లుండె ?
చోద్యమే గద యీ యది చూడు డార్య !
దశావతారస్తుతి
అవతారము లెత్తును హరి
యవనింగల యట్టి జనుల యాపద దీ ర్చ
న్నవిరళ ముగ పదిగాగల
యవతారము లెత్తుభువిని నార్యా ! వినుమా .
Wednesday, March 12, 2014
పుస్తకాల పురుగు
పుస్త కంబుల పురుగుగా బోలు నతడు
ఒక్క దానిపై నొక్కటి యుండు నటుల
పేర్చి కూర్చుండె వానిపై పేర్మి తోడ
చూచు వారల కయ్యది చోద్య మాయె
పందికిన్ బుట్టె జక్కని పాడి యావు
పందికిన్ బుట్టె జక్కని పాడి యావు
చాల చిత్రము మఱి యిది శంక రార్య !
కోడికిన్ బుట్టె శునకపు కూన లనిన
సంది యంబడ నవసర మొంద వలదు
Tuesday, March 11, 2014
దశావ తారములు
శిష్ట రక్షణ మఱియును దుష్టుల నిక
సంహ రించుట కొఱకునై చక్రి యార్య !
యెత్తె నవతార ములుపది యింపు గాను
మత్స్య కూర్మము మొదలుగా మహిని దనర .
Monday, March 10, 2014
తన బాలుని జంప నెంచి తానే చచ్చెన్
వినుడీ విషయము మీరలు
పనిగొని శ్రీ కృష్ణు డపుడు బాలుని రూపం
బునపూ తనజే రగపూ
తన బాలుని జంప నెంచి తానే చచ్చెన్
ఫణి రాజు
పడగ లారు కలుగు ఫణిని జూ డగ రండు
చిత్ర మందు గలదు చిత్రముగను
ప్రణతు లిడుదు నీకు పాప రేడ ! శతము
కనిక రంబు జూపు , గసరు కొనకు
Sunday, March 9, 2014
పద్య రచన -అమ్మమ్మగారు =కంప్యూటరులో బైకు
అమ్మమ్మను జూడుమ, యట
యిమ్ముగ మఱి తిష్ట వేసి యెంతయొ దీ క్షన్
బొమ్మను గం ప్యూ టరులో
నెమ్మనమున జూచు చుండె నీ త మ బైకున్
భర్తను వధియించ వనిత పరితోషించెన్
కర్తవ్యము మఱచిన పతి
ధూర్తుడు గా మారిమఱియు దోకాడిం చ
న్నార్తిని మునుగుట కతనన
భర్తను వధియించ వనిత పరితోషించెన్
Saturday, March 8, 2014
పద్య రచన -మకరము ,బకము
మడుగు నందున జూడుము మకరమొకటి
లాగు చుండెను బకమును రయము గాను
ఆహరించను గాబోలు నైన బకము
అందకుండగ బోజూచె నయ్యదనున
కంది శంకరయ్య గారి తిరుపతి ప్రయాణము
తిరుపతి కేగిన సామికి
విరి విగ మఱి యిచ్చు గాక ! వేడిన వరముల్
వర దుడు గద మఱి యాయన
కరములు జోడింతు నెపుడు కరుణ లు గలుగన్
సీ తకు రాఘవుడు పుట్టి శివ ధను వెత్తెన్
మాతయె యగుగద యీ భువి
సీ తకు; రాఘవుడు పుట్టి శివ ధను వెత్తెన్
మాతగు నా కౌసల్యకు
మాతా! సేవింతు నమ్మ ! మరువక నిన్నున్
పద్యరచన -శ్రీ కృ ష్ణుడు =పిల్లనగ్రోవి
పిల్లన గ్రోవిని నూదుచు
నుల్లము రంజిల్ల జేయు నో పరమాత్మా !
చల్లని యౌ నీ చూపులు
మెల్లగ మాపైని బడను మిము గోరుదు మే
Thursday, March 6, 2014
హరహర శంభో !
కంఠ మందున ప్రాణమ్ము కలుగు వరకు
నీదు నామంబు జపియింతు , నిన్నె గొలుతు
వేరు చింతన మనసున జేరనీ క
నీ దు పాదాల చెంతన నీ డ నిమ్ము
పద్య రచన -శ్రీ కృష్ణుడు -గోపబాలురు
కలువ రేకుల చందము కాని పించ
గోపబాలురు కూర్చుని గుండ్రముగను
మధ్య కృష్ణున కిచ్చుచు ముదము తోడ
ఆర గింతురు చల్దుల నబ్బురముగ
చిత్ర మందున చూడుడు చిత్రముగ ను
గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
మురహరి చేసెను బంటుగ
గరుడుని, మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
దరి గనిపించిన గప్పను
హర! యని శివు వేడుకొనిన నాపద తప్పున్
పారిజాతము పూజకు పనికి రాదు
పనికి వచ్చును బూజకు బాగు గాను
పారిజాతము, పూజకు పనికి రాదు
పసిడి వర్ణము గలిగిన బంతి పూవు
పూల నన్నిటి గంటె ను మేలు మల్లి
Wednesday, March 5, 2014
ఏటేట నెన్నికల్ హిత మిచ్చు మనకు
ఏటేట నెన్నికల్ హిత మిచ్చు మనకు
సరియగు నేతలన్ సమ కూర్చు కొనగ
పద్య రచన కొబ్బరి బొండము అవిటి వాడు
పాప మాతని జూడగ బాధ కలిగె
అవిటి వాడయ్యె గదవామ హస్త మునన
బొండ మెట్లుగా కోయునో బుద్ధి తోడ
దిక్కు దేవుడే వారికి నిక్కముగను
కొబ్బరి బొండము ద్రాగిన
నిబ్బరముగ నుండు గుండె నిచ్చలు మనకున్
పబ్బములు గలుగు రోజున
కొబ్బరితో జేయు చుండ్రు కొబ్బరి నోజున్
నేమాని వారు
నేమాని రామ జోగికి
వేమారులు నతుల నిత్తు విడువక నెపుడు
న్నేమా కారణ మడిగిన
ఆ మాన్యుని రచన లుండు నద్భుత రీ తిన్
వాల్మీకి స్తుతి
ఆది కవియైన వాల్మీ కి యచట యుండి
వ్రాసి యుండెను గావ్యము ల్వాసి గాను
సం స్కృతంబున మనకుగా శ్రమను బొంది
వందనంబులు వానికి వందలాది
పద్య రచన -మకరము -కరి
మకర మయ్యది హెచ్చగు మదము తోడ
కరము నోటన బట్టుచు కరిని లాగు
చుండె నీటి లోని క చట చూడు డార్య !
జలచ రముగాన మొసలికి శక్తి మెండు
Tuesday, March 4, 2014
శ్రీ కృ ష్ణుడు శూ ర్ప ణ ఖ చెవులం గోసెన్
భీ కరుడౌ శత్రువులకు
శ్రీ కృ ష్ణుడు శూ ర్ప ణ ఖ చెవులం గోసెన్
రాకాసి దనను గోరగ
శ్రీ కరుడా ల క్ష్మణుం డు సేమము కొఱకున్
Monday, March 3, 2014
పద్య రచన .--తలిరు బోడి=భర్తను రాతిని కొట్టుట
తప్ప ద్రాగిన మగనిని దలిరు బోడి
బట్ట లుతికెడు విధముగ బాదు చుండె
రా తి మీదన ,కోపంబు రగులు కొనగ
చూడనా పైని చిత్రము చోద్య మాయె
బంధువు లనగనె ఱు గు రా బందు లనుచు
బంధువు లనగనె ఱు గు రా బందు లనుచు
అంద రట్లుండ రుభువిని కొందరార్య !
బాధ గలిగింతు రెప్పుడు బంధువులకు
వారి నైజమయయ్యది పాలసులకు
Sunday, March 2, 2014
రావణుని పత్ని సీతమ్మ రామ భగిని
మయుని కొమరిత మండోద రి,యర యంగ
రావణుని పత్ని, సీతమ్మ, రామ భగిని
కిన గు వరుసకు వదినమ్మ కీ రవాణి !
బంధు రికములు దెలియంగ బఱగు నిటుల .
పద్య రచన -అందాల భామ
ఇట్టి యతిలోక సుందరి యెక్క డైన
ఉండు నా య ను ననుమాన మొదవె నాకు
రంభ , యూ ర్వశి దలదన్ను రామ యీ మె
అందమందున నంతటి యంద గత్తె
ఆరాత్రియు మేలుకొనిన నాయువు పెరుగున్
రారాని జబ్బు లొదవు
న్నా రాత్రియు మేలుకొనిన నాయువు పెరుగున్
మారాము చేయకుండగ
నా రాముని సేవజేయ ననుదినముదగన్
విటులు మఱు పుట్టువున నేల వేల్పులు గద
పాండురోగిగ నిరతము బాధ పడును
విటులు మఱు పుట్టువున , నేల వేల్పులు గద
భక్తి శ్రధ్ధల బూజింత్రు భవుని నిలను
నాయు రారోగ్య సంపద లందు కొఱ కు
Saturday, March 1, 2014
తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్
సొలసిరి జనములు పులసల
తలకాయల పులుసు త్రాగి, తనిసిరి బాపల్
పులిహోర గలిపి బూరులు
మెలమెల్లగ దినిన పిదప మించిన రక్తిన్
పద్య రచన -అరటి పండ్లు
ఆ ఱు సంఖ్యన గలయట్టి యరటి పండ్లు
పసుపు వర్ణము తోడన బరగు చుండి
మెరయు చున్నవి చూడుడు ,మీరు కూడ
రండి తినుటకు మీరును రయము గాను
జన్మ దిన శుభా కాం క్షలు
పుట్టిటి వట యీ రోజున
పుట్టిన దామోద రుండ !పూర్ణిమ చంద్రున్
బిట్టుగ బోలుచు వెలుగుము
నట్టింటను దిరుగు చుండి నలుగురి లోనన్
ఎనుబది దాటిన వాడవె
యనువై యారోగ్య మార్య ! హాయిగ నుండ
న్ననయము మృత్యుం జయునే
పనిగొని సేవించు మెపుడు భక్తి యుతముగన్
జరిపింతువు కళ్యాణము
జరిపింతువు భేషు పలుక జనములు నీకున్
జరిపింతువు రామునికిట
జరిపింతువు సీతతోడ సర్వులు మెచ్చన్
బంధు ప్రీతిని గలిగిన బాంధ వుండ !
స్నేహ సంపద నొందిన స్నేహ శీల !
శ్వేత వస్త్రము ల్ధరియించు వినయ శీల !
సాటి యెవరయ్య ! నీకిల సాటి యెవరు ?
సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయురారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్పయట్లయి కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల జల్లగాను
(శ్రీ దామోదర శాస్త్రి గారి పుట్టిన రోజు సంద ర్భముగా )
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
About Me
subbarao
View my complete profile
Blog Archive
►
2024
(3)
►
December
(1)
►
July
(1)
►
February
(1)
►
2023
(1)
►
November
(1)
►
2022
(70)
►
December
(1)
►
September
(1)
►
August
(2)
►
July
(14)
►
June
(44)
►
March
(3)
►
February
(4)
►
January
(1)
►
2021
(480)
►
December
(3)
►
November
(3)
►
September
(31)
►
August
(57)
►
July
(54)
►
June
(61)
►
May
(61)
►
April
(53)
►
March
(56)
►
February
(53)
►
January
(48)
►
2020
(740)
►
December
(58)
►
November
(60)
►
October
(58)
►
September
(66)
►
August
(58)
►
July
(62)
►
June
(61)
►
May
(64)
►
April
(66)
►
March
(65)
►
February
(58)
►
January
(64)
►
2019
(676)
►
December
(57)
►
November
(47)
►
October
(61)
►
September
(56)
►
August
(57)
►
July
(62)
►
June
(45)
►
May
(40)
►
April
(62)
►
March
(76)
►
February
(53)
►
January
(60)
►
2018
(659)
►
December
(46)
►
November
(62)
►
October
(56)
►
September
(68)
►
August
(58)
►
July
(62)
►
June
(57)
►
May
(54)
►
April
(34)
►
March
(35)
►
February
(65)
►
January
(62)
►
2017
(525)
►
December
(21)
►
November
(53)
►
October
(44)
►
September
(61)
►
August
(30)
►
July
(25)
►
June
(31)
►
May
(16)
►
April
(50)
►
March
(71)
►
February
(56)
►
January
(67)
►
2016
(773)
►
December
(70)
►
November
(52)
►
October
(77)
►
September
(65)
►
August
(46)
►
July
(54)
►
June
(58)
►
May
(77)
►
April
(78)
►
March
(59)
►
February
(82)
►
January
(55)
►
2015
(743)
►
December
(53)
►
November
(44)
►
October
(72)
►
September
(62)
►
August
(75)
►
July
(50)
►
June
(55)
►
May
(54)
►
April
(62)
►
March
(64)
►
February
(71)
►
January
(81)
▼
2014
(781)
►
December
(73)
►
November
(80)
►
October
(74)
►
September
(64)
►
August
(61)
►
July
(50)
►
June
(61)
►
May
(60)
►
April
(80)
▼
March
(90)
నీతి పరుని మాటనీటి మూట
పద్య రచన -మామిడి పండ్లు
పద్య రచన -ఉగాది పచ్చడి
మత్సరము గూర్చు జయనామ వత్సరమ్ము
కన్నతల్లిని బరిమార్చ గలుగు దివియ
కామితార్ధములొన గూరు కపుల వలన
విజయకు వీడు కోలు
గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ
మల్లియ తీ వియకు గాచె మామిడి కాయల్
పద్య రచన -తెల్లని గుఱ్ఱము
నాలు గైదులు పదునాఱు నలిన నయన!
చమత్కార పద్యము
త్రిశంకు స్వర్గము
బద్ధ కించు వాడె భాగ్య శాలి
తల్లిని హింసించువారు దైవసములగున్
బధ్ధకముం గలుగు నెడల భాగ్యము గలుగున్
పద్యరచన -ఉపాధ్యాయుడు
దుప్పటి ముసుగేసి కొట్టు దుప్పిని బావా !
గరళ కం ఠుని బూజింప గరళ మిచ్చు
సజ్జనులు సుభాషితముల సరకు గొనరు
పద్యరచన -ఆకు కూరలు
పద్యరచన -దైవ మొక్కడే
జందెము విడనాడు వాడె సద్బ్రాహ్మణుడౌ
మూడు పదుల లోపు ముసలి దనము వచ్చు
గోవర్ధన గిరిని నెత్తె గోపిక లపుడున్
పద్య రచన -స్త్రీ పుస్తకము చదువుట
శ్రీ జయనామ సంవత్సర శుభా కాం క్షలు
జయనాబడు వత్సరమ్ము సకలము దోచున్
ద్వాదశి పారణము నిచ్చు దండిగ జిక్కుల్
ఒ కటికి రెండాయె నార్య ! యూ హలకిలలోన్
చద్దన్నము దినిన యెడల శవముగ మారున్
కామి తార్ధముల్ సిద్ధించు లేమి వలన
లలితా పారాయణ మ్ము లయమున్జేయున్
గీతా పారాయణ మ్ము గీడొ నరించున్
శల్యుడ నగ నెవ్వడు పార్ధసారధికద
పద్య రచన -చిల్లర పైసలు
నీ టితో నగ్ని నార్పెడి మాట కల్ల
శ్రీ మాతృ స్తోత్రము - నేమాని వారు
పద్య రచన-నరనారాయణులు
పార్ధ సారధి చంపెను పరమ శివుని
పద్యరచన -పార్వతీదేవి
రాము డనగను సాక్షాత్తు రావణుండె
కాకియు కోకిలము కలసి కాపుర ముండె న్
బాలవటుడు
గణముల నిర్మాణ ఫలితములు
గణముల ను బట్టి ఫలితములు
గణాల మధ్య భావములు
వాల్మీకి -శ్లోక రచన
కాశీ భొట్ల !
ఉత్తరము చదువు భామ
విష్ణు పూజ నరులు విడువదగును
సాహెబు తా నిష్టపడు వసంతో త్సవమున్
శ్రీ నేమాని వారి శ్రీ రామ అష్టోత్తర శత నామావళి
కుంతీ పుత్రుండు ష ణ్ము ఖుం డన నెగడెన్
పొట్ట కూటికై ....
కరకజ్జము దినిన యెడల కవి వరు డగునౌ
కరివరదుని మేనమామ కంసారియె గా
వెన్నెల రేని వెలుగులకు విచ్చె కమలముల్
బాల కృష్ణుడు -యోగనిద్ర
దశావతారస్తుతి
పుస్తకాల పురుగు
పందికిన్ బుట్టె జక్కని పాడి యావు
దశావ తారములు
తన బాలుని జంప నెంచి తానే చచ్చెన్
ఫణి రాజు
పద్య రచన -అమ్మమ్మగారు =కంప్యూటరులో బైకు
భర్తను వధియించ వనిత పరితోషించెన్
పద్య రచన -మకరము ,బకము
కంది శంకరయ్య గారి తిరుపతి ప్రయాణము
సీ తకు రాఘవుడు పుట్టి శివ ధను వెత్తెన్
పద్యరచన -శ్రీ కృ ష్ణుడు =పిల్లనగ్రోవి
హరహర శంభో !
పద్య రచన -శ్రీ కృష్ణుడు -గోపబాలురు
గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
పారిజాతము పూజకు పనికి రాదు
ఏటేట నెన్నికల్ హిత మిచ్చు మనకు
పద్య రచన కొబ్బరి బొండము అవిటి వాడు
నేమాని వారు
వాల్మీకి స్తుతి
పద్య రచన -మకరము -కరి
శ్రీ కృ ష్ణుడు శూ ర్ప ణ ఖ చెవులం గోసెన్
పద్య రచన .--తలిరు బోడి=భర్తను రాతిని కొట్టుట
బంధువు లనగనె ఱు గు రా బందు లనుచు
రావణుని పత్ని సీతమ్మ రామ భగిని
పద్య రచన -అందాల భామ
ఆరాత్రియు మేలుకొనిన నాయువు పెరుగున్
విటులు మఱు పుట్టువున నేల వేల్పులు గద
తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్
పద్య రచన -అరటి పండ్లు
జన్మ దిన శుభా కాం క్షలు
►
February
(45)
►
January
(43)
►
2013
(795)
►
December
(32)
►
November
(21)
►
October
(51)
►
September
(65)
►
August
(88)
►
July
(76)
►
June
(48)
►
May
(61)
►
April
(83)
►
March
(119)
►
February
(94)
►
January
(57)
►
2012
(621)
►
December
(46)
►
November
(35)
►
October
(53)
►
September
(63)
►
August
(65)
►
July
(70)
►
June
(74)
►
May
(55)
►
April
(56)
►
March
(34)
►
February
(32)
►
January
(38)
►
2011
(202)
►
December
(72)
►
November
(43)
►
October
(13)
►
September
(25)
►
August
(22)
►
July
(10)
►
June
(17)
►
2010
(64)
►
June
(2)
►
May
(1)
►
March
(10)
►
February
(36)
►
January
(15)
►
2009
(9)
►
November
(1)
►
July
(6)
►
March
(2)
►
2008
(5)
►
November
(5)