Sunday, March 16, 2014

వాల్మీకి -శ్లోక రచన

భావి గాగల  కార్యము న్భరణి  దలచి
వేసె  గణములు  వాల్మీకి  వింత గాను
భగణము మొదలుగా గల యగ ణ ము లను
నెంత చిత్రమో  యీ యది  యంత నిజము

వివిధ రకముల వృత్తము ల్విరివి గాను
తనదు కావ్య మందున జొని పెను నయముగ
రెండు పాదము లొక వృత్త ముండు మిగులు
రెండు పాదము లుండును నొండు దిగను

వేల కొలదిగ వృత్తము ల్వెసులు బాటు
లేని విధముగ రచియించె లీల లొదవ
శ్లో కమందలి వృత్తము సుస్థిరముగ
అన్ని పాదాల యందున గాన బడదు

అనగ నాలుగు పాదము లందు జూడ
గణము లా వేరు వృత్తపు గణము లుండు
తెలియు నాతని శ్లోకము ల్దీ క్ష తోడ
చదువు వారల కాతని  సంక లనము .






 

No comments:

Post a Comment