పుట్టితివట యీ రోజున
పుట్టిన యో శైల సంహి !పున్నమి చంద్రున్
బిట్టున బోలియు వెలుగుచు
బట్టున నూరేండ్లు దాటి బ్రదుకుమ నీవున్
చదువులు సదువుచు బాగుగ
చదివిన మరి సారమంత శ్రధ్ధగ మదినిన్
బదిలముగ భద్ర పరచుచు
బదిమందికి పంచుమమ్మ !ప్రమదము తోడన్
అల్లరి జేయకు మెప్పుడు
కల్లలు మాటాడ కమ్మ !కలలో నైనన్
చిల్లర తిండ్లను దినకుము
ఉల్లము సంతోష బడగ నుండుము నెపుడున్
గురువులు సెప్పెడు పాఠ ము !
లిరవుగ వినుచుండి నీ వు నెప్పటి కపుడున్
కరమవి మననము జేసిన
తిరముగ నీ మనసు నందు దీ టుగ నుండున్
సకల శుభములు గలిగించు శంక రుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
నెల్ల వేళల నీ సంహి జల్ల గాను
పుట్టిన యో శైల సంహి !పున్నమి చంద్రున్
బిట్టున బోలియు వెలుగుచు
బట్టున నూరేండ్లు దాటి బ్రదుకుమ నీవున్
చదువులు సదువుచు బాగుగ
చదివిన మరి సారమంత శ్రధ్ధగ మదినిన్
బదిలముగ భద్ర పరచుచు
బదిమందికి పంచుమమ్మ !ప్రమదము తోడన్
అల్లరి జేయకు మెప్పుడు
కల్లలు మాటాడ కమ్మ !కలలో నైనన్
చిల్లర తిండ్లను దినకుము
ఉల్లము సంతోష బడగ నుండుము నెపుడున్
గురువులు సెప్పెడు పాఠ ము !
లిరవుగ వినుచుండి నీ వు నెప్పటి కపుడున్
కరమవి మననము జేసిన
తిరముగ నీ మనసు నందు దీ టుగ నుండున్
సకల శుభములు గలిగించు శంక రుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
నెల్ల వేళల నీ సంహి జల్ల గాను
No comments:
Post a Comment