Thursday, December 31, 2015

అవధానంబుల నుండ రాదనె సమస్యా పూ ర ణ ల్

అవహేళం బును జేయు వారలట హాహాకారము ల్జేయుచో
అవధానంబుల నుండ రాదనె, సమస్యా పూ ర ణ ల్
కవనంబందున నుండుగా యవియ యాకా త్యాయనీ మాతయే
యవధానమ్ముల బ్రోత్స హించెగద  యాయా చోటులన్ దాసుమా

పద్య రచన -నూతన ఆంగ్ల సంవత్సరాది శుభా కాంక్షలు


వచ్చెను వత్సర మయ్యది
యిచ్చకమును మనకుజేయ యీవత్సరమున్
మెచ్చుచు జెప్పుచు నుంటిని
నెచ్చెలులకు శుభములిడుత నీరజ భవుడున్


క్రొత్త వత్సరమునకోటి వెతలుదీరు


క్రొత్త వత్సరమునకోటి వెతలుదీరు
ననుట యందు సంది యంబు వలదు
అనవ రతము నీశ్వరా నుగ్రహ మ్ముండు
మనకు సామి! చింత మాను డిపుడు

షణ్మాసములనగనొక్క సంవత్సరమే

షణ్ముఖుడ ! యారునెలలే 
షణ్మాసములనగ, నొక్క సంవత్సరమే
షణ్మాసపురెండింతలు
షణ్మతములుజెప్పెనిట్లు సరియా?కాదా?

పద్య రచన =విప్రుడు -రాజు

విప్ర జనముల మనములు విమల మగుచు
పలుకులయ్యవి కఠినమై బరగు చుండు
విభుల యందున నీయవి వేరుగుంట
మార్చ నోపడు శాపము మహివి భుండు

అ వనీశ్వరులెల్ల కల్లలాడెడు వారల్


అవసరమా యిట్లనుటకు
న  వనీశ్వరులెల్ల కల్లలాడెడు వారల్
భువిలోగల  రాజులలో
నెవరును మరి నిజము పలికె యీశులు లేరా?

పద్య రచన -మిర్చి తోట


మిర్చి తోటను జూడుడు మిలమిలమరి
మెరయు చుండెను నచ్చట మెరుపువోలె
పండ్ల తోడను గాయల వరుస తోడ
చెలువు మీరగ వ్రేలాడ గలుగు  నార్య!



Monday, December 28, 2015

భజనాదులనిష్టపడడు,పరమాత్ముండే


నిజమైన భక్తుడెప్పుడు
భజనాదులనిష్టపడడు ,పరమాత్ముండే
సుజనుల భక్తికి మెచ్చుచు
నజరామర ముక్తినిచ్చి యాహ్వానించున్

పద్య రచన -చలి


చలిగా నున్నది ప్రేయసి
గిలిగింతలు బెట్టబోకు గీరల తోడ
న్నలుపుగ మారును దేహము
లలనా! మరి చెప్పుచుంటి లాస్యంబేలా?

యాగ మనగ గడుభ యమ్శు కలిగె


మఖము నాశ నంబు మారీచుడేచేయ
తెలిసి నాదు మనసు తెలివివోయి
యాగ మనగ గడుభ యమ్శు కలిగెనార్య!
ప్రజల మేలు కొరకు వలయు చేయ

Sunday, December 27, 2015

పద్య రచన -శునకము



రక్ష కభటుని వోలెను రమ్యముగను
నాల్గు మార్గాల మధ్యన గల్గునట్టి
యున్నతంబగు గద్దెపై యూరుసింహ
మద్భుతంబుగ గూర్చుండె నార్య! కంటె?


దినదినముగండమాయెను


దినదినముగండమాయెను
తినవెప్పుడు భోజనంబు తేజా! నీవు
న్దినిపించుట నే నేరను
వినవమ్మా నాదు మాట వీనులు సోకన్

ప్రద్యుమ్నుండొకడు ,పంచపాండవులందున్


విద్యా! పాండవ కులమున
ప్రద్యుమ్నుండొకడు ,పంచపాండవులందున్
విద్యలనన్నిటినేర్చెను
ప్రద్యుమ్నునిమామయైన పార్ఢుడె సుమ్మీ


నాగఫణిగారు

నాగఫణిశర్మగారికి నతుల నిడుచు
నీసమస్యను నిత్తునునిపుడు నేను
సభికు లందరు మెచ్చగ సబబురీతి
పూరణంబును గావించు డార్య! మీరు

Saturday, December 26, 2015

అవధానము(నాగఫణి శర్మ గారు )


అవధానము లన్నిటమీ
యవధానమెహాయి గొల్పు నందరకుగదా
యవధానంబున బాల్గొని
నవిరళమగు నీదుధార నాస్వాదింతున్




Friday, December 25, 2015

దత్తపది -మసి -కసి -అసి -నుసి (సూర్యోదయము )


మసిబో సినటుల మేఘము
కసికసి గానుంట మిన్నుకానక రవియు
న్నసిబో లుచునా మింటను
నుసిజే సెను దనదుకాంతి నోముల రాజా!



పద్యరచన -ఇందు గల డందు .......


ఎందున వెదకిన తండ్రీ!
యందండే యుండు చక్రి యనుమానంబున్
డెందమునకు రానీయక
వందనములు సేయుమయ్య! పరమాత్మునకున్



క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి


గొడ్ల సాలన నొకరోజు గోముగాను
క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి
శిలువ వేసిన సమయాన చేత లుడిగి
సిక్త మగుటఃను నాక్రీస్తు రక్త మందు

కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో


కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో
నిక్కము జెప్పుమా రమణ! నీయదిచేష్టలుజూడగామరిన్
మక్కువ తోడనుంటినిట చక్కనివంశము నందుపుట్టియు
న్నిక్కరణిన్ భుజించుటయ యెట్లుగ దోచెనునీకునక్కటా!

Wednesday, December 23, 2015

పద్య రచన -సీతాకోక చిలుక

రంగు రంగుల తోడను  రమ్య మలరి 
చూడ ముచ్చట గొల్పును  జూప రులకు 
చెలువు గలదిసీ  తాకోక  చిలుక యార్య !
దశ లు  దశలుగ మారును  దనర యదియ 

పద్య రచన ...ఇంతలు కన్నులుండ దెరువెవ్వరివేడెదు


ఇంతలు కన్నులుండ దెరువెవ్వరివేడెదు నాదుసోదరా!
సుంతయులేద నీకుదెలివింతగ చింతనుబొందనెలనో?
వింతగ నుండెనీయునికి సాంతమువీనుల విందుజేయుమా
యంతయు నాకుదెలిపి హాయిగ నుండుము లేకదుఃఖముల్




శివధనుర్భంగ మొనరించె ,బవనసుతుడు

సీత నుద్వాహమాడగ శీఘ్రతతిని
నిండు సభలోన రాముడు నెమ్మితోడ
శివధనుర్భంగ మొనరించె ,బవనసుతుడు
రామ బంటుగ జగతిని రాణ కెక్కె

Monday, December 21, 2015

పద్య రచన -చింత కాయలు

చింత చెట్టును వ్రేలాడె  చిత్ర మందు
చింత కాయల గుత్తులు చిత్ర ముగను 
కోసికొని రమ్ము  పచ్చడి కొఱకు గాను 
పప్పు లోకూడ వేతును  బాల ! వెళ్ళు 

మార జనకు డతడె మార వైరి

భస్మ ధారు డతడు  వసియించు కాటిలో
సకల శుభము లీయు  శంకరుండు
నాగ భూష ణుండు  నగజప  తియు ను ,కు
మార జనకు డతడె మార వైరి 

ధనమునమ్మి ధనముదారకొసగె


కన్న వారి కతడు కడుపు నిండుగ గూడు
పెట్టలేక తనదు కొట్టమందు
గున్న వోలెనుం డుగోమాతదూడను
ధనమునమ్మి ధనముదారకొసగె

పామునుదినగోరికప్ప బారెడు సాగెన్


ఏమో యనుకొంటినిమరి
పామునుదినగోరికప్ప బారెడు సాగెన్
పాములుకప్పల,కప్పలు
పాముల వలె నుండు వాన పాముల ను దినున్ 

చేదుతీయనగుచుక్షేమ మొసగు


చేదుతీయనగును జేదగుదీపియు
నొడలు కుదురు లేక యుండు నపుడు
క్షేమ మొసగునుగద చేదు మాత్రలు వాడ
చేదుతీయనగుచుక్షేమ మొసగు 

అ ర్వాచీనమ్ములు స్మృతులామ్నాయమ్ముల్


శర్వర! నిజమే యయ్యది?
య  ర్వాచీనమ్ములు స్మృతులామ్నాయమ్ము
ల్లుర్వికి మొదటే గలవని
సర్వులకున్దెలియునయ్య! సంపూర్ణముగన్

దైవము గొల్వరాదనుచుధర్మవిధుల్ వచియింతురెల్లెడన్


దైవము గొల్వరాదనుచుధర్మవిధుల్ వచియింతురెల్లెడన్
దైవముగొల్వరాదనుట ధర్మవిరుధ్ధముగాదలంచుమా
దైవము, దల్లిదండ్రుల పదంబులుమ్రొక్కెడువారికెప్పుడు
న్నీవసు ధన్గలుంగునట యిబ్బడిగామరి మోక్షముల్సదా

Sunday, December 13, 2015

రామచంద్రుని రక్షించు రావణుం డు

తండ్రి యా జ్ఞను బాటించు తనయు డగుట
రామచంద్రుని రక్షించు, రావణుం డు
పరమ శివుని నా రాధించు భక్త వరుడు
వేయి శివలింగ  ములకుదా జేయు బూజ 

Saturday, December 12, 2015

కొ ట్టెడు పతిసుజనుడను చు గోమలి పలికెన్

ఎట్టుల నగునయ్య ధరను
కొ ట్టెడు పతిసుజనుడను చు గోమలి పలికె
న్బిట్టుగ నది పరికించిన
నట్టులె గద నామెమాట యన్నా! సత్యా!

Friday, December 11, 2015

గంగాసుతుడాలమున శిఖండి ని చంపెన్


మంగా! భీష్ముడెగద మరి
గంగాసుతుడాలమున శిఖండి ని చంపెన్
చెంగావిములుకుతోడన
గంగాసుత! కావుమనుచుగలవర మొందన్

కలిమి వివేక శీలురకు గల్గగ జేయు ను...........


కలిమి వివేక శీలురకు గల్గగ జేయు ను శాంతి సౌఖ్యముల్
చెలిమిని గూర్చు వారలకు సేమమునిచ్చును నెంతయోయికన్
కలిమి వివేక హీనులకు గల్గగ జేయును దర్పమున్ భువిన్
మెలకువ తోడనుండుచు ను మిక్కిలి యో ర్పును గల్గియుండుమా

పె ద్దవాడు దగడు వృధ్ధు డనగ

తల్లి క ర్మ కాండ తనరగ జేయంగ
పె ద్దవాడు దగడు, వృధ్ధు డనగ
వయసు మీరునతడు , పనిపాటు లే వియు
చేయలే ని వాడు,క్షితిని బరగు

ఇడుములు వచ్చును పోవును.........

ఇడుములు వచ్చును పోవును
దడవక మరి వాటికెపుడు ధైర్యము తోడన్
కడగండ్ల నధిగమించుచు
కడవరకుంసాగునతడు గమ్యము చేరున్

కటకట యెంతమాట..............


కటకట యెంతమాట ననుగాదనియాతడు వీడునే రమన్
పటుతరమైనబంధము నుబాయుట నాయముగాగ దోచెనే?
కటువుగ నేలయైతివి? బకాసురుమేనమరందివే యిలన్ ?
చిటికెన వ్రేలితో నిపుడుచీల్తునుగాహృదయంబునీయదిన్ 

మిరియములకుదీయదనము మిరపకు వలెనే


మిరియము మిరపను రెంటిని
నిరవుగ మరిపోత బోయ ని క్షుర సంబున్
న్న రమరలు లేక యంటగ
మిరియములకుదీయదనము మిరపకు వలెనే

Thursday, December 10, 2015

సోనియా గాంధి మోడీకి చుట్ట మగును


సోనియా గాంధి మోడీకి చుట్ట మగును
నవును రాజకీయము నందు నగుదురుగద
చుట్టములుశత్రువుగను సుమ్ము వార
రాజకీయపు చతురత రమ్య! యదియ

హృత్పద్మ ము వికసించును.........


హృత్పద్మ ము వికసించును
తత్పదముల శరణుగోర ధార్మిక బుద్ధిన్
తత్పురుషోత్తము డయ్యొడ
సత్పురుషుని జేయుకతన జక్కగ మనకున్

విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్


విస్కీ బ్రాండీ లిరువురు
కస్కంభటు యొద్ద వారు గరపియు విద్యన్
తస్కిసు రచనలు జేయగ
విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్

జననీ జనకులపదములు..........


జననీ జనకులపదములు
కని మ్రొక్కని వాడు భువిని కఠినాత్ముండే
వినుమరి యాతని ప్రాణము
కననొల్లని దూరమేగు గడచిన పిదపన్

మావిచివురుదినెను , మధుకరమ్ము


కోయిలమ్మ చూడు కొమ్మ మీదనయుండి
మావిచివురుదినెను , మధుకరమ్ము
చక్కగానుగ్రోలె చిక్కని తేనెను
పూల పైన వ్రాలి పూజ! యచట

తండ్రి చావు సుతునకు, సంతసమొసంగె


బాధగలిగించు సరిగదా పైకముడుగు
తండ్రి చావు సుతునకు, సంతసమొసంగె
మరణ మొందిన తండ్రిదా మరల బ్రదికె
ననగ సుతునకు నయ్యెడ నాననమున

కూడుగుడ్డలేల మేడలుండ


కూడుగుడ్డలేల మేడలుండయనుచు
నుడువ రాదు మేడ లుండు నెడల
కూడు గుడ్ఢలకును కొదవగలదె యిల?
నార్య! చెపుమ ,మీరు నవునొ ,కాదొ ?

వదినను ముద్దాడె మరది పదుగురు చూడన్

అదియేమి చిత్రమో యది
వదినను ముద్దాడె మరది పదుగురు చూడ
న్నదియా , బాలున కప్పుడు
పదిమాసములే గద మరి వయసున్జూడన్

క్రోధ లోభమోహములు సద్గుణము లండ్రు



పాపమునకివి హేతువుల్ భరణి యందు
క్రోధ లోభమోహములు సద్గుణము లండ్రు
పుణ్య మార్జన కొరకునై భువినిజేయు
కర్మ లన్నిటిని బుధులు వర్మ! వినుము

నన్నెచోడుడు రచియించ, నైషధమును


స్కంద చరిత మగుకుమార సంభవమును
నన్నెచోడుడు రచియించె, నైషధమును
వ్రాసి శ్రీనాధు డలరెను వాసి కవిగ
భువిని నాచంద్ర తారార్క ముగను సుమ్ము

కుసుమముదాకగ నె నుసురుగోల్పడెనయ్యో


కుసుమము వెనుకన పురువది
కసికసిగా దినుచురేకు కాపుర ముండన్
విసమునుగానక తుమ్శెద
కుసుమముదాకగ నె నుసురుగోల్పడెనయ్యో

జూదమాడువారు సుజనవరులు


పరమ దుష్టు లార్య! భాగవతులునైన
జూదమాడువారు, సుజనవరులు
సాటివారి కెపుడు సాహాయ్య మొనరించు
గుణము కలుగు నట్టి గొప్ప వారు

చనుబాలను తండ్రితీయ సంతసమందెన్

వినయా! కంటికి వాడుము
చనుబాలను, తండ్రితీయ సంతసమందెన్
తనయనుగుంబిడ్డనునపు
డనురాగముతోడ పిలిచి యాడించంగన్

కమలములు వికసించె చంద్రకాంతులు సోకన్

కమలాప్తుని గాంచగనే
కమలములు వికసించె , చంద్రకాంతులు సోకన్
కమలంబులు ముకుళించియు
విమలంబుగ గలువ పూలు వికసించునుగా

రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్


నాధా! వింటివె యీయది
రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్
రాధేయుడు కురురాజులు
నీధరణిన్నేలిరార్య! యిచ్చను జెలిమిన్

యరటి పండు ప్రాణహరము విషము


చలువజేయునయ్య! సామి!యీ పచ్చని
యరటి పండు ప్రాణహరము విషము
కుళ్ళినట్టి పండు కొంచెమై నదినకు
మా,యెపుడును గలుగు మైకముయును