Sunday, July 31, 2016

దత్త పది =అసి -రసి -కసి -నుసి ,పల్లె పడుచు వర్ణన

అసితవర్ణముగలిగినకుసుమయనెడు
పల్లెపడుచురసికతనవలపుగలిగి
వికసితవదనమునుసిరులు గలు గంగ 
దనరెధరణినిశoకరుదయను వలన

పద్మావతీ శ్రీనివాసము

సురుచిరపదాాలకూర్పుచేశుధ్ధముగను
రచనసాాగుచుoడెనుగడురమ్యముగను
పూర్వజన్మాానజేసినపుణ్యఫలిత
మీయదినిజముసోదర!యిట్టిరచన




Friday, July 29, 2016

పద్మావతీ శ్రీనివాసము

వేంక టేశునకారయ వేగముగను
వచ్చె గళ్యాణ ఘడియలు వకుళ వలన
చదువ నాహ్లాదము గలిగె సార మదియ
వేంక టేశుని బూజింతు విరుల తోడ 

వ్యర్ధ మొనరింప దగును సంపదల బుధులు

కఠిన హృదయుల మెప్పించు గార్య మరయ
వ్యర్ధ,మొనరింప దగును సంపదల బుధులు
నర్హులకు మాత్రమే చెందు నటుల నెపుడు
సార్ధ కంబగు నయ్యది సఫల మగును 

Thursday, July 28, 2016

పద్మావతీ శ్రీనివాసము

ద్విపద పద్యము లన్నియు దే జ ! వినుము
ద్రాక్ష పాకము వోలెను దనరి మాకు
దీ య గుండె జదువు కొలదిని ,యవియును
గొలుసు కట్టెడు రూపాన వెలిగె కూడ 

హారము కోసమై ప్రజలహర్నిశము ల్ కృషి చేయగా దగున్

బీరము బోకనెప్పుడును వీడక ధర్మము నెల్ల వేళ లా
హారము కోసమై ప్రజలహర్నిశము ల్  కృషి చేయగా దగు
న్వా రలు దారుగా నగును భారత మాతకు ముద్దు బిడ్డలే
వీరలు వారుగా దలచి వేరుగ జూడకు మెప్పుడు న్మదిన్  

పోరు వలన శాంతి పొంద గలము

శాంతి యుండ దార్య !సంయ మీంద్రునకును
పోరు వలన, శాంతి పొంద గలము 
మనముమనముకలిసి మనుగడగడుపుచో
నెదురు లేక  హాయి గ దరము గను 

వాార్షికోత్సవము

వార్షికోత్సవపిలుపునుస్వాగతించి
యేగుదెంచినపెద్దలకిత్తునతుల
నందుకొనగనువేడుచునందరింక
నాసనంబులలలరుడుహాయిగొలుప

మొట్టమొదటిదిసారిగముఖ్యముగను
జరుపుకొనుచుంటిమిప్పుడుసభికులెదుట
నారవదియగునుత్సవమార్యులార
శ్రధ్ధతోడనుజూడుడుసర్వముయును

పెద్దలందరిసూక్తులువినినపిదప
యాటపాటలయందుననగ్రగణ్యు
లైనవారలకునుబహుమానములను
నిత్తురార్యులుజేజేలునినుమడింప

నృత్యగీతాదికమ్ములునెరపిపిదప
యుత్సవపుతుదిపలుకులునుడువ,మనము
భోజనంబులుసేసియుపుష్టిగాను
సరగుపోదమయిండ్లకుసభికులార

Wednesday, July 27, 2016

పద్య రచన -సెలయేరు

జలజల రవముల దోడను 
నలరించెను గొండ లచట హాహా యనగ 
న్గలయా నిజమా యది నా 
తలపించెను పటము జూడ దండ్రీ కంటే ?

అన్నను,పతిగాాగొనెచెలియయదృృష్టమునన్

మిన్నగజూసెనుభరతుం
డ న్నను,పతిగాాగొనెచెలియయదృృష్టమున
న్నున్నవసంంజాాతకుడగు
కన్నప్పనుమిగులవలచి,కాామింంచియునున్

Tuesday, July 26, 2016

ప్రజలునిరోధకులటమనప్రగతికినెపుడున్


ప్రజలనగనుమనమేగద
ప్రజలునిరోధకులటమనప్రగతికినెపుడు
న్నిజముగనటులుగజేతుమ?
విజయాా!యదినీవజెప్పువివరణతోడన్

ప్రజలుప్రతిరోధకులుమనప్రగతికెపుడు

ప్రజలుప్రతిరోధకులుమనప్రగతికెపుడు
కాదుకాదార్య!యెప్పుడుకాదుకాదు
దేశప్రగతికివారలుదెగువజూపి
పాటుపడుదురునిరతముభవితకొరకు

నాాపతిచనుదేరజూచి,నాాపతినక్కెన్

పాాపముబాాలుడువణకెను
నాాపతిచనుదేరజూచి,నాాపతినక్కెన్
దాాపునపాామునుజూడగ
బాాపురెవేరంండనుచుపరుపునచుట్టన్

అ న్నను భర్తగా గొని నయన్నుల మిన్న యదృష్ట రాశియూ

మిన్నగ జీతమున్ గొనుచు మేదిని మంచిగ పేరునొందు సా
య న్నను భర్తగా గొని నయన్నుల మిన్న యదృష్ట రాశియూ
కన్నుల పండువై దనరి గాఢము గానిల బ్రేమతో మరి
న్న న్నువ దేలి యాడగను  హాయిగ బంధము గట్టి యూ  గదే

Wednesday, July 20, 2016

పద్మావతీ శ్రీనివాసము

నీదు శైలపు వర్ణన నిజము గాను
గండ్ల యెదుటన నున్నట్లు కానిపించె
వర్ణనా శక్తి నీయది  భళిర యద్భు
తంబ, వ్రాయయ టులుగను దరమె నాకు ?

సన్యాసికి బిల్ల నిచ్చి సంబర పడియెన్

సన్యాసి పేర నొప్పుచు
విన్యాసము లెన్నియో వి విధరకములుగన్
ధన్యత నొందగ జేయుత
సన్యాసికి బిల్ల నిచ్చి సంబర పడియెన్ 

Tuesday, July 19, 2016

మాతను బెండ్లి యాడి జనమాన్యుడుగా నుతి కెక్కె మిత్రమా

వీత భయంబు తోడ రఘు వేవురు జూడగ మండపంబు న
న్మా తను బెండ్లి యాడి జనమాన్యుడుగా నుతి కెక్కె మిత్రమా
యాతని చేష్ట కున్బ్ర జలు నద్భుత మందిరి యాక్షణంబున
న్మాత యనంగ నేర్వు డిలమాపినమామకు గూతు రే సుమా 

పద్మావతీ శ్రీని వాసము

శ్రీని వాసుని జరితము వీనులకును
నింపు గానుండె జదువఁగ నెంతయోను
పద్మ యుతుడగు వెంకన్న బరఁగ నిచ్చు
నాయు రారోగ్య సంపద లధిక ముగను 

పద్మావతీ శ్రీనివాసము

బిట్టు కోపాన విడిచియు విష్ణు పదము 
మాత యైన ర  మాదేవి పతిని వీడి 
చేరె వెంకటా చలమను శిఖర మునకు 
వెదుక గనబడె నచ్చట విష్ణు నకును 

మాతను బెండ్లాడి లోక మాన్యుo డ య్యెన్

గీతా !ఖగ గమ నుడు శ్రీ
మాతను బెండ్లాడి లోక మాన్యుo డ య్యె
న్సీతామాతను రాముడు
ప్రీతిని దను  బెండ్లి యాడి ప్రేమగ నుండెన్ 

పద్మావతీ శ్రీని వాసము

నీదు పద్యాల యొ రవడి నిజము గాను
జదువు కొలదిని ముదమును సంత రించె
గధ  నడకయున లలను  గలిగి యుండి
తూగు టుయ్యాల వోలెనునూగు చుండె

శత్రువు లేని వాని కిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే

శత్రువు లేని వాని కిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే
మిత్రమ !యేమియీ పలుకు మీరుగ బల్కిన మాటయే భళా
చిత్రము గాదె యిట్లుడువ చిత్రపు బల్కులు వింటిమీ గదా
శత్రువు లేని వాని కిట శాంతి సుఖంబులు గల్గు నెప్పుడున్ 

Monday, July 18, 2016

శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము

శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము
నేల గలిగెను సంశయ మేమి సామి !
శాంతి సుఖము లు గలుగును శత్రు లేమి
నిజము ముమ్మాటి కియ్యది నిజము సుమ్ము  

బమ్మెర పోతనార్యు డొక వ్యాకరణ మ్మును వ్రాసె దెల్గునన్

కమ్మగ వ్రాసె భాగవత గాధను నందఱు హాయనంగనా
బమ్మెర పోతనార్యు డొ ,క వ్యాకరణ మ్మును వ్రాసె దెల్గున
న్నమ్ముడు  మీరలందఱును నాణ్యత యైనది యీభు విన్సదా
యమ్మరొ చూడగా నతడునా  మన చిన్నయసూరియే గదా 

Sunday, July 17, 2016

బమ్మెర పోతన్న వ్రాసె వ్యాకరణ మ్మున్

కమ్మని భాగవతమ్మును
బమ్మెర పోతన్న వ్రాసె ,వ్యాకరణ మ్ము
న్ని మ్ము గ చిన్నయ సూరియ
తెమ్మెర లోనూ గువిధము దీయగ వ్రాసెన్ 

బమ్మెర పోతన్నరచన : కంది శంకరయ్య




మ.        పలుకుల్ జాజులఁ జల్లు చందమునభావస్ఫూర్తి దైవార ము
ద్దులు గుల్కంగరసంబు చిప్పిలఁగనెంతో మెత్తనౌ శైలి రం
జిలసౌందర్యము మీఱఁగమ్రకవితాశ్రీవైభవారూఢి భా
సిలఁగా భాగవతమ్ము వ్రాసిన కవిశ్రేష్ఠుండవే పోతనా!

సీ.         ఏ మహామహుఁడు సంస్కృత భాగవతమును
తేనె లొల్కఁగఁ దేట తెలుఁగు జేసె
నే ఘనుండు పొలమ్ము నిట దున్ని రాజస
త్కృతిఁ గాలఁ దన్ని జీవించి మించె
యే సద్గుణార్ణవుం డిట భారతీదేవి
కన్నీరు తుడిచి సత్కవిగ నెగడె
నే కోవిదవతంసుఁ డిందిరారమణ స
ద్భక్తి మాధురిలోనఁ బరవశించె
తే.        నే కవీంద్రుని పేరు నూహించినంత
           జనహృదయసీమ కావ్యశోభను గ్రహించి
రసపరిప్లుతమై భక్తి రక్తిఁ గనునొ
యట్టి బమ్మెర పోతన కంజలింతు.

 మ.      వరవాచావిభవంబు శోభిలఁగభాస్వచ్ఛైలి యేపారదై
వ రహస్యమ్ముల భక్తలోకమనముల్ భాసిల్లఁగాఁ జెప్పిభా
వ రసారూఢి సెలంగమేలగు ననుప్రాసాద్యలంకారశో
భ రహింపంగఁ దెలుంగు భాగవతమున్ వ్రాయన్ వలం తీవె పో.

క.        నరపాలుర కంకితమిడి
సిరులు గొను తలంపు లేక శ్రీరామనకున్
వరకృతి నర్పించిన బ
మ్మెర పోతన నీకు సేతు మిదె వందనముల్.

చ.        మృదుమధురోక్తులన్ గలిగి మేలొనరింపఁగఁ జాలునట్టి నీ
సదమల సత్కవిత్వమున సంతస మందుచుఁ దెల్గువారు నీ
సదనము బమ్మెరాహ్వయ ప్రశస్త పురమ్మును మెచ్చినారునే
డిదె ముదమార నిన్ను నుతియింపఁగఁ జేరితిమయ్య పోతనా!

Saturday, July 16, 2016

సౌజన్యుo డైన నేమి సంకట మందున్

తేజో మూర్తుల రాముడు
సౌజన్యుo డైన నేమి సంకట మందు
న్నా జిని రిపులను జంపను
భాజనుడే యైన యెడల భవ్యుడు నైనన్ 

బమ్మెర -అవధానము

అవధానమ్మును వినుటకు 
కవులందఱు వెళ్ళు చుండ్రు గద ,యీ తరుణి
న్గవివర ! మీరును నేగుట 
నవిరళ మగు సంతసంబు నందితి సామీ !

Friday, July 15, 2016

ఆహ్వానము -బమ్మెర

బమ్మెర పేరును వినగను 
దెమ్మెరలో నూగునట్లు తీయగ నుండున్ 
బమ్మెర పోతన రచనలు 
కమ్మగ నవియుండుగతన కలియుగ మందున్ 

అమ్మ కాతడు మగడయ్యె నక్కజముగ

పెండ్లి సంబంధ ములతడు వెదకి వెదకి
విసిగి వేసార చివరకు వీధి చివర
నుండు భీముడే కుదిరెను చుండ్రు శార
ద మ్మ కాతడు మగడయ్యె నక్కజముగ 

పొగ త్రాగని వాడు దున్న పోతై పుట్టున్

పొగద్రాగుట నేరము గద
పొగ త్రాగని వాడు దున్న పోతై పుట్టున్
పొగ గుఱిచి యట్లు బలుకుట
తగునే యది మీకు సామి ! దారుణ మేగా 

మామిడిపండు

పండ్ల యందు మిన్న పండ్లవి మామిడి 
పీల్చ రసము దీ పి గల్గి యుండు 
గుంజు దినగ నుండు గంజమ వోలెను 
వాటి మించు పండ్లు  వసుధ లేవు 

Thursday, July 14, 2016

వాన కురియు నెండు గడ్డి వామును వేగన్

ఆ నల్ల మబ్బువలనన
వాన కురియు, నెండు గడ్డి వామును వేగన్ 
భానుని కిరణాలు దగుల 
మేనంతయుజెమట పుట్టి మిసమిస లాడున్ 

పద్మావతీ శ్రీని వాసము

ద్విపద కావ్యము జక్కగ వెలువరించి
కవి వరేణ్యుల మనసులు కైవసమ్ము 
జేసి కొనుటకు యత్నించు జ్యేష్ఠ సోద 
రా !శు  భములు గ లుగుగాక రహిని నిలను

Wednesday, July 13, 2016

నవనీతము రావణుని మనము స్త్రీల యెడన్

అవనిజ యెడలను మినహా
నవనీతము రావణుని మనము స్త్రీల యెడన్
పవనా !యియ్యది సత్యము
శివ భక్తుడు నగుట వలన జేతును నతులన్ 

Tuesday, July 12, 2016

పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్

ఎట్టా  యేమని యంటిరి ?
పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్
కట్టా  యే మీ ఘోరము
లిట్టుగయును గలదె సామి ! యి ధ్ధర లోనన్ 

Monday, July 11, 2016

జబ్బలు దా జఱచి యబ్బి జబ్బుల ను బ్బె న్

అబ్బులు దూసుకు బోయెను
జబ్బలు దా జఱచి, యబ్బి జబ్బుల ను బ్బె న్
గబ్బున రోగము ముదరగ
న బ్బుర ముగ నుండె నొడలు నాయతరీతిన్  

Sunday, July 10, 2016

అక్రమ సంతానులును మహాత్ములు గారే ?

విక్రమ వంతులు నగునెడ
న క్రమ సంతానులును మహాత్ములు గారే ?
య క్రమ సక్రమ మనుచును
వక్రముగా మాటలాడ వనజా !తగునే !

Saturday, July 9, 2016

దత్తపది - (వంద-వేయి-లక్ష-కోటి)భారతార్థంలో

వంద నమ్ములు సేతును నంద తనయ !
లలిత మైనట్టి మాపాలు లక్షణ ముగ
వే యిడఁగ నడుగుము లేని విధము బంధు
కోటిని రణమున దప్పక  కూల్చెద మను 

దత్తపది - (వంద-వేయి-లక్ష-కోటి)భారతార్థంలో

వంద నమ్ములు సేతును నంద తనయ !
లలిత మైనట్టి మాపాలు లక్షణ ముగ
వే యిడఁగ నడుగుము లేని విధము బంధు
కోటిని రణమున దప్పక  కూల్చెద మను 

Friday, July 8, 2016

దత్తపది (రారా-సారా-తేరా-పోరా) భారతార్థంలో

రారాజు భూమి నీయమి
సారాంశము జెప్పుచుంటి సవినయ మున్గా న్
పోరాట పటిమ తోడన
తేరా మఱి రాజ్య మిపుడు తెగువత తోడన్ 

Thursday, July 7, 2016

గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

నిజమా యిది సామీ యిట
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
గజమునకు ఖరము పుట్టుట
నిజముగ గని కట్టు సుమ్ము నెఱి పరికింపన్ 

వరంగల్లు అష్టావ ధానము

కాకతీయ పద్య కవితాస దనమగు  
హనుమకొండ పూర్వ మందు పుణ్య 
మెంత జేసి కొనెనొ ?నింత యనుచు జెప్ప 
దరమె యేరికి నిల దఱచి చూడ 

సీతారామునికి గీడు జేయందగునే

ఆతడు నీ పెనిమిటి గద
సీతారామునికి గీడు జేయందగునే
పాతకమబ్బును నిజముగ
నాతని కిం గీడు జేయ నరయుము మదిలోన్ 

Wednesday, July 6, 2016

సీతారామునికి గీడు జేయందగునే

మాతాపితరుల సములగు
సీతారామునికి గీడు జేయందగునే
మాతా !నీవే చెప్పుము
సీతారామునికి గీడు జేయ న్వశమే ?

Tuesday, July 5, 2016

ధీరత నొక దోమ తుమ్మె దిక్కరు లడరన్

ఆరయ  సమస్య యియ్యది
ధీరత నొక దోమ తుమ్మె దిక్కరు లడరన్
పూరణ గురించి యిచ్చిరి
వీరా !పూరించి పంపు వేగమె యిపుడున్

లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా

ఈవేళ న్నుదయాన నే జదివితి న్నీశా ! సునామంబులన్
వేవేగ న్గలు ణించు మమ్ములను నీవీసాలి కోదేవ !నా
యీవిన్నాణము నాలకించి మలి నీ విప్పుo డు లాగోలె దన్
లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా 

లావే యీశ్వల ములాలి లక్షించు హలీ!

నావేదన వినుమా హలి !
నీ వేగా నాకు దిక్కు నిన్నే కొలుతున్
నావేదన గ్ల హి  యించుచు
లావే యీశ్వల  ములాలి లక్షించు హలీ!

లావే యీశ్వల ములాలి లక్షించు హలీ!

నావేదన వినుమా హలి !
నీ వేగా నాకు దిక్కు నిన్నే కొలుతున్
నావేదన గ్ల హి  యించుచు
లావే యీశ్వల  ములాలి లక్షించు హలీ!

Sunday, July 3, 2016

ఆతడు శంకరుండు పరమాత్ముడు మాధవుడై వెలింగిడి న్

ఆతడు శంకరుండు పరమాత్ముడు మాధవుడై వెలింగిడి న్
ధాతకుదండ్రియై బరఁగి తల్లియు దండ్రియు మామయున్బళా
యాతడె నౌ నుగా మనకు నాయత రీతిని రక్షకుండుగ
న్గా తర మేమియు న్నిడక కాంక్షలు దీర్చును నెల్లవే ళ లన్

అతడు శంభుడు మాధవుడై వెలుంగు

శంక రుండును శివుడును నింక పే  ర్లు
పార్వతీ పతి యార్తుల ప్రాణ దాత
నీల కంఠుడు భవుడుగా పిలువ బడెడు
న తడు శంభుడుమాధవుడై వెలుంగు 

రక్తంబంచు ను నిర్మలోదకములన్ ద్రా వంగ భీతిల్లె దాన్

రక్తంబంచు ను నిర్మలోదకములన్ ద్రా వంగ భీతిల్లె దాన్
ముక్తాఫా ! యికనెన్నడున్ గలుపకే రక్తంపు రంగున్ సుమీ
రక్తమ్మిట్టుల గానిపించ నెవరున్ ధ్రా గంగ నో పుండునే
యుక్తా యుక్త మెఱుంగుచున్ మసలుమా యుక్తిన్ సదా యీభు విన్ 

రక్తమని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు

రక్తమని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు
 నోయి  సాంబుడ !నీటిలో వేయకెపుడు
నెఱుపు రంగును గూడిన దేదియు నిక
మంచి నీటిని నుంచుము మంచి గానె 

Friday, July 1, 2016

దత్తపది - 91 (కుండ-దండ-బండ-బెండ)గొడుగు వర్ణన

వాన బడకుండ గాపాడు వస్తు వగుచు
నండదండ లు గానుండి యా త పత్ర
మనగ నొప్పును బుడమిని నార్య !మరియు 
బండ హృదయులు సహితము బెండ లేమి 
దీని చేబూని బోదురు వాన లోన