Sunday, July 17, 2016

బమ్మెర పోతన్నరచన : కంది శంకరయ్య




మ.        పలుకుల్ జాజులఁ జల్లు చందమునభావస్ఫూర్తి దైవార ము
ద్దులు గుల్కంగరసంబు చిప్పిలఁగనెంతో మెత్తనౌ శైలి రం
జిలసౌందర్యము మీఱఁగమ్రకవితాశ్రీవైభవారూఢి భా
సిలఁగా భాగవతమ్ము వ్రాసిన కవిశ్రేష్ఠుండవే పోతనా!

సీ.         ఏ మహామహుఁడు సంస్కృత భాగవతమును
తేనె లొల్కఁగఁ దేట తెలుఁగు జేసె
నే ఘనుండు పొలమ్ము నిట దున్ని రాజస
త్కృతిఁ గాలఁ దన్ని జీవించి మించె
యే సద్గుణార్ణవుం డిట భారతీదేవి
కన్నీరు తుడిచి సత్కవిగ నెగడె
నే కోవిదవతంసుఁ డిందిరారమణ స
ద్భక్తి మాధురిలోనఁ బరవశించె
తే.        నే కవీంద్రుని పేరు నూహించినంత
           జనహృదయసీమ కావ్యశోభను గ్రహించి
రసపరిప్లుతమై భక్తి రక్తిఁ గనునొ
యట్టి బమ్మెర పోతన కంజలింతు.

 మ.      వరవాచావిభవంబు శోభిలఁగభాస్వచ్ఛైలి యేపారదై
వ రహస్యమ్ముల భక్తలోకమనముల్ భాసిల్లఁగాఁ జెప్పిభా
వ రసారూఢి సెలంగమేలగు ననుప్రాసాద్యలంకారశో
భ రహింపంగఁ దెలుంగు భాగవతమున్ వ్రాయన్ వలం తీవె పో.

క.        నరపాలుర కంకితమిడి
సిరులు గొను తలంపు లేక శ్రీరామనకున్
వరకృతి నర్పించిన బ
మ్మెర పోతన నీకు సేతు మిదె వందనముల్.

చ.        మృదుమధురోక్తులన్ గలిగి మేలొనరింపఁగఁ జాలునట్టి నీ
సదమల సత్కవిత్వమున సంతస మందుచుఁ దెల్గువారు నీ
సదనము బమ్మెరాహ్వయ ప్రశస్త పురమ్మును మెచ్చినారునే
డిదె ముదమార నిన్ను నుతియింపఁగఁ జేరితిమయ్య పోతనా!

No comments:

Post a Comment