Tuesday, September 27, 2016

ఉద్రేకము

ఉద్రేకముండ రాదుగ
యు ద్రేక మునుండు నెడల నూగును మేనున్
ఛి ద్రముగనగును గుండెలు
నుద్రేకము లేక యుంట నొప్పుగ నుండున్

మంచి చెడులను నెఱుగడు మదికి వచ్చి
నట్లు మాట్లాడు బంధు జ నముల హింస
పఱచు నొకటియ నగనేమి బహువి ధములు
గ మఱి బాధల గురి జేయు గక్ష తోడ

దరికి జేరరు బంధువుల్దాము గాను
మిత్ర వర్గము భయపడు చిత్ర ముగను
నొంటరి గను నుండ వలసి యుండు నెపుడు
కాడి మోయువా డు నుమరి కానరారు

బీపి సుగరులు రెండును బెరుగు నకట
కోప మెక్కువ గానుండి గుస్సు మనును
దీర్ఘ నిట్టూర్పు గాలుల దే లి యాడు
కనుక యుద్రేక మనునది పనికి రాదు


No comments:

Post a Comment