Tuesday, January 31, 2017

సరములు జీవులకు గడు నసహ్యము లయ్యెన్

ఇరవగునుగా దె దలపగ
సరములు జీవులకు, గడు నసహ్యము లయ్యెన్
 మురికిని గూడిన నవియగు
సరములలో దానమాడ జబ్బుల వలనన్ 

తెలుగాట

తెలుగాటనునేజూచితి
నలవోకగమీరుచెప్పహర్షముకలిగె
న్నలరితిరికాదెమీరలు
లలితంబగుగళలయందులాహిరివోలెన్

Monday, January 30, 2017

తల్లిని జంపి యశ మందె ధర్మ మూర్తి

తండ్రి యాజ్ఞను బాటించె భార్గ వుండు
తల్లిని జంపి, యశ మందె ధర్మ మూర్తి
మరల బ్రదికించి యామెను మహిత కెక్కె
దండ్రి యాజ్ఞను మీరని త నయు డుగను


సుందరకాండ

సుందరకాండనుదెనుగున
నందముగావ్రాయునీకుహరిహరులికనీ
ముందరనిలబడిమిగులప
సందుగనుండుకొరకుదగుశక్తినినిచ్చున్

Sunday, January 29, 2017

చీరనువిప్పిమానవతిచిందులువేసెనుజూడనెల్లరున్

భారమయైననున్దనకుభార్యకుగేగదయంచునాతడు
న్వారమువర్జ్యమున్గనకపట్టునుగల్గినచీరతీయగా
చీరనువిప్పిమానవతిచిందులువేసెనుజూడనెల్లరు
 న్చీరదిచూడగామిగులజేగురురంగునుబోలియుంటకున్

చీరవిప్పిసుదతిచిందులాడె

భర్తప్రేమమీరబట్టుచీరనుగొన
చీరవిప్పిసుదతిచిందులాడె
చినుగునటులగనగచీరలోపలయది
విభుడుజూసిదెచ్చెవేరొకటిది

Saturday, January 28, 2017

భండనమందు,భార్గవుడుపారెనుభీతమనస్కుడైవడిన్

కండలుబెంచినంతయవికావుబలంబులుగెల్వగాసుమా
భండనమందు,భార్గవుడుపారెనుభీతమనస్కుడైవడి
న్నండనుసోమునిన్గనుచునాశివునేతరుమన్నెకాయెకి
న్నొండదిచేయలేకయికనుస్సురుగొంచునువిష్ణుపాలికిన్

భండనమ్మునపారెనుభార్గవుండు

విగతజీవులజేసెను విస్మయంబు
గొలుపరాముడురాక్షసకులమునంత
భండనమ్మునపారెనుభార్గవుండు
భస్ముధాటికిభయపడిపరుగులిడుచు

ఆముదాలమురళియష్టావధానము

ఆముదాలమురళియష్టావధానము
నవరసయుతముగనెనరుత!శార
దాంబగరుణవలనగమ్మనిభావాలు
తేనెలూరునటులదీపిగలిగి

జీపీశాస్త్రీ!

స్పందనమీయదిజూడగ
గందివరునిమించిపోయెగవికులతిలకా!
వందనములనర్పించుచు
జిందాబాద్ తెలుపుచుంటిజీపీశాస్త్రీ!

Friday, January 27, 2017

మూషిక మొండు పిల్లిగని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్

రోషము తోడరాదరికి రోయుచు దూరెను బిల్వ మందునన్
మూషిక మొండు పిల్లిగని ,ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్
వేషము లెన్నివేసినను భేషజ మన్నది లేక యుండగన్
భాషణ పధ్ధతిన్వి నుచు భారతి సీతను మెచ్చుచున్మ దిన్ 

మూషికంబొండు పిల్లిని ముద్దు లాడె

జాతి వైరము లేకను జగము నందు
ప్రాణు లన్నియు నెయ్యాన బ్రతుకు చుండె
ననుట కునిది నిదర్శన మార్య !చూడ
గణ్వునాశ్రమ మందున గాన నగును
మూషికంబొండు పిల్లిని ముద్దు లాడె 

Thursday, January 26, 2017

వర్షమొసంగురైతునకవారితచింతనుదీవ్రదుఃఖముల్

వర్షములెక్కువైభువినిపంటలునాశనమొందుచోనికన్
 వర్షమొసంగురైతునకవారితచింతనుదీవ్రదుఃఖముల్
 వర్షములెప్పుడున్మనకుబాధలులేనివిధంబునన్సదా
కర్షువులేవియున్జెడకకాపులునుండగగుర్వమేలుగా

వర్ష మిచ్చు జింత కర్షకునకు

వర్ష మిచ్చు జింత కర్షకునకు నిల
బాగు బాగు జక్క పలికి తిరిగ
వర్ష మిచ్చు నెపుడు కర్షకు నకుసంత
సంబు గా నెఱుగుడు శంక రార్య !

భారతేశదేమందుజనభారమగున్ ,గణతంత్రమన్నచో

పౌరులు దాము గానిపుడుశస్త్రచికిత్సలుచేయకే యికన్
భారతేశదేమందుజనభారమగున్ ,గణతంత్రమన్నచో
పౌరులచేతనేనికనుబౌరులశ్రేయముగూర్చియేసుమా
పౌరులకేర్పడెన్నిదియపూర్వపునాయకులెల్లమెచ్చగన్

భారతగణతంత్రముజనభారంబయ్యెన్

ఔరా స్వార్ధముతోడను
నేరాలకుబాలుపడుచునేతలుమిగులన్
 జూరగొనంగనుసంపద
భారతగణతంత్రముజనభారంబయ్యెన్

Wednesday, January 25, 2017

రాంబాబు

ముచ్చటాయెనునినుజూడమోహనుండ!
పచ్చపచ్చనివృక్షాలప్రక్కనుండ
యెంతచక్కనిదృశ్యమువింతగొలిపె
చూడజాలవువేయియుచూడ్కులైన


Tuesday, January 24, 2017

మారీచుడు రక్షకుండు మహి బ్రాణులకున్

ఆరావణు మేనల్లుడె
మారీచుడు, రక్షకుండు మహి బ్రాణులకున్
శ్రీరాముడుగా నెఱుఁగుము
నారాయణుమారు గవని నరుడుగబుట్టెన్ 

శ్రీను!

శ్రీను!
నిన్నుజూడగ ముదమాయెగన్నుగవకు
గోపితోడననుంటకుగురువుయొద్ద
యిచ్చుగావుతస్వామిమీయిద్దరకును
నాయురారోగ్యసంపదలన్నియికను

రమణిరొపుత్రివోమనుమరాలివొచెల్లివొధర్మపత్నివో

కమలదళాయతాక్షివిముఖంబునుజాటుగవేయకిత్తరిన్
 బ్రమదముగల్గునట్లుగనుమాకునుబంధుజనంబువారికిన్
 విమలమనంబుతోడననభేద్యముగానికజెప్పుమాయిదిన్
 రమణిరొపుత్రివోమనుమరాలివొచెల్లివొధర్మపత్నివో

Monday, January 23, 2017

తరుణి!పుత్రివోపౌత్రివోధర్మసతివొ!

తరుణి!పుత్రివోపౌత్రివోధర్మసతివొ!
నిజమునరయగనన్నియునీవెయౌదు
నీవులేనిదిశూన్యమేయవనియందు
తరుణి!గైకొనుమమ్మవందనశతమ్ము

హరిహరులు

హరిహరులిరువురకునాద్యక్షరముముఖ్య
మనుచుసంస్కృతమునవినుతికెక్కు
నటుల వ్రాసిమమ్మునలరించిరార్యులు
వారికిడుదుకోటివందనములు

తాతావారి యవధానము

అవధానములన్నిటమీ
యవధానముమంచిదనిరియార్యులుశర్మా!
నవరసభరితమువెలయగ
నవధానముజేయుమపుడయాశువుతోడన్







గమ్మత్తైన పద్యం

నవరి 2017, మంగళవారం

గమ్మత్తైన పద్యం

పూర్వం ఒక రామ భక్తుడు....  రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.

ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.
"విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.

గవీశపాత్రో నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః। 

లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాదిః  పరమేశ్వరో నః॥ 
ఆశ్చర్య పోయాడు చదవగానే.

అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్  అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి  విశేషణాలు. అర్ధం చూడండి...

గవీశపాత్రః ... గవాం ఈశః  గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే. 

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ. 

అనాదిః ... ఆది లేని వాడూ  ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,

అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.

చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.

ఇది మరో ఆశ్చర్యం.

అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....

పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.
ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః  అంటే పక్షి అని అర్ధం. వీనామ్  ఈశః  వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.

కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.  

లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.

అతడు మనలను కాపాడు గాక ....
గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో  విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని  దర్శించగలిగితే వాడు  శైవుడు.  ఇది మన భారతీయ కవితా వైభవము.


విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి
('అనంత్ మూగి' గారికి ధన్యవాదాలత

జ నవరి 26

జ నవరి 26
-------
మూడు రంగుల  జెండాను  ముచ్చ ట గను
చేత బూనుచు పది మంది   నేత లపుడు
జయము బలుకుచు జెండాను చాపి మనకు
సంత సంబును  బంచిరి  జనవ రి యిరు
వదియ   యారు తే దియుదయా న దిశ లెల్ల
మారు మ్రోగంగ రవములు  మదిని  నిండ

ప్రజల కొరకును నింకను బ్రజల చేత
బ్రజల వలనను మఱియును బ్రజల గూర్చి
యేర్ప డెను నీగ ణ న తంత్ర మప్పు డచట
సాటి నాయక గణముల సమ్ము ఖమున


 ప్రణతి ప్రణతి శ్రీ భారత
గణ తంత్రమ! నీకు నేడు కరములు మోడ్తున్
ఘనమెరుగని యల్పులకీ
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్

రణములు సేసిరి పెద్దలు
గణ తంత్రము దెచ్చు కొఱకు గణ నీ యముగా
గుణ హీన నేత లుండుట
గణ తంత్రము చిక్కి వోయె గణ నీ  యముగాన్

 గణనీయుల త్యాగముల
న్గు ణహీనులు ప్రభువు లగుచు  కొల్లగొనంగన్
సణుగులె దక్కెను జనులకు
గణతంత్రమ! నీకు నతులు కాదన కమ్మా !


తృణభుక్కులు, స్వార్ధపరులు,
గుణహీనులు నేతలగుట గుండియలోనే
వ్రణమయిన  భరతమాతకు
ననయము నిక యిచ్చు మోడి యా నందంబున్


 గణతంత్ర శుభాకాంక్షలు
వ్రణముననిడు కారమువలె బాధను బెంచెన్
గుణహీన నేతల వలన
గుణవంతుల నెన్ను కొనుడు కూరిమి తోడన్

సకల శుభములు గలిగించు శంకరుండు
గణన తంత్రపు దివసాన గుణము లాఱు
కలుగు నటులుగ దీవించి కరుణ తోడ
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళలీ వృద్ధుల చల్ల గాను .

( ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము. ఇవి షడ్గుణములు.)
రచన = పోచిరాజు సుబ్బారావు

Sunday, January 22, 2017

ఇంతుల నెల్ల నంత మొనరించెడు వాడె ఘనుండు వీరుడున్

ఇంతుల నెల్ల నంత మొనరించెడు వాడె ఘనుండు వీరుడు
న్నింతుల సంహరించుటిల నెంతయొ గొప్పను భావ మొందుట
న్నంతగ మంచి గాదనుట నందఱు నేర్వగ నొప్పునౌ గదా
యింతి య శక్తి రూ పిణి గ నెల్లజ నంబుల రక్షజేసెడిన్ 

భామినుల నంత మొందించు వాడె ఘనుడు

భామినుల నంత మొందించు వాడె ఘనుడు
ఘనుడు కాడా ర్య !పరమనీచు నిగ జూడ
వలయు మఱియును వెలివేయ వలయు నతని
నింతి యనగనుసా క్షా త్తు శక్తి రూపు  

పురుషుండేప్రసవించియాశిశువునంభోజాక్షికిచ్చెంగదా

పురుషుండేప్రసవించియాశిశువునంభోజాక్షికిచ్చెంగదా
పురుషుండేప్రసవించుచోనికనునంభోజాక్షులన్దవ్వుగా
నిరతంబుంచుటమేలుగాదెయికయోనెల్లూరురాజేశ్వరా!
యరసింజెప్పుమనీవెయీప్రసవమాహాత్మ్యంబునిర్భీతిగా

Saturday, January 21, 2017

పురుషుడుప్రసవించిశిశువుబొలతికొసంగెన్

అరయుముజగతినివింతలు
పురుషుడుప్రసవించిశిశువుబొలతికొసంగెన్
 వెరవదియాయెను,జన్యుల
మారుపులైయుండునేమొమననముజేయన్

Wednesday, January 18, 2017

కాంచగంధర్వనగరమ్ముకాపురమ్ము

వలపువలలోనజిక్కినవారిజాక్షి
ప్రేమవిఫలమైకొరగానివెర్రివాని
జేసికొనెనార్య!పెండ్లినిజేష్టలుడిగి
కాంచగంధర్వనగరమ్ముకాపురమ్ము

Tuesday, January 17, 2017

దత్త పది -కుడి - గడి - జడి - పొడి

కుడియెడమల నెఱుగుచు నిక
జడిజేయక నిమ్ము పాలు సాదర మొప్పన్ 
బొడిచెద రీ యక పోయిన 
గడిచెను బదునాలు గేండ్లు కౌరవ నాధా !

పార్వతిమెచ్చిముద్దుగొనెపంకజనాభునిబ్రేమమీరగన్

శార్వరిసూనుకున్దిరిగిజన్మనునిచ్చినశంకరున్సదా
పార్వతిమెచ్చిముద్దుగొనెపంకజనాభునిబ్రేమమీరగన్
 సర్వులుభక్తిభావమునసాదరమొప్పగమ్రోకరిల్లగా
సర్వముదానయిచ్చునికశంకరునానతినెల్లవేళలన్

పార్వతిముద్దాడెమెచ్చి,పంకజనాభున్

శర్వునిమహిమనునెరిగిన
పార్వతిముద్దాడెమెచ్చి,పంకజనాభున్
సర్వులుభక్తినిగొలిచిన
సర్వముదానిచ్చునిజముశంకర!వినుమా

Monday, January 16, 2017

కవివ రేణ్య

సంస్కృ తమ్మున  శ్లోకాల సరళి తోడ
దండ్రి కొడుకుల నిరువుర దలఁచు విధము
రచన జేసిన సోదర !రాణ కెక్కి
వాహ మేటిక విగ రెండు  భాష లందు
ఘనత నొందితి వీవె గా కవివ రేణ్య

ధై వస్తుతి


1. విఘ్నేశ్వర స్తుతి:

శ్రీగణేశం శ్రితార్తిఘ్నం సర్వ విద్యా ప్రదాయినమ్।
పుష్టికాంతం సురాధ్యక్షం పృథ్వీగర్భం నమామ్యహమ్॥1॥

మూషికానింద్య సంచారం మోదక హస్త భాసురమ్।
నమామి గిరిజా సూనుం వక్రతుండం వినాయకమ్॥2॥

లంబోదరం సదాదాన మేకదంతం గజాననమ్।
చతుర్భుజం మహాకాయం వందే హరవరాత్మజమ్॥3॥

ద్వైమాతృక వరం దేవం నాగోపవీత భాసితమ్।
విఘ్నరాజం గణాధ్యక్షం ప్రణమామి భవాత్మజమ్॥4॥

శూర్పకర్ణం కుమారాగ్ర్యం హేరంబం కుబ్జవిగ్రహమ్।
శుక్లాంబరం ప్రసన్నాస్యం మందహాసం నమామ్యహమ్॥5॥


2. శంకర స్తుతి:

శ్రీశైలస్థిత కేదారం కాశీనాథం త్రిలోచనమ్।
హరం త్రిపుర సంహారం దిగంబరం నమామ్యహమ్॥1॥

కైలాస గిరి సంవాసం హైమవతీ మనోహరమ్।
గంగాధరం మహాదేవం నమామి చంద్ర శేఖరమ్॥2॥

హాలాహల విషాహారం భస్మకాయ విరాజితమ్।
భూతప్రేత గణాధ్యక్షం నటరాజం నమామ్యహమ్॥3॥

ఫాలనేత్రం జటాజూటం శాశ్వతం నాగభూషణమ్।
ఊర్ధ్వరేతస మీశానం వృషధ్వజం నమామ్యహమ్॥4॥


                         రచన == కామేశ్వర రావు 


Sunday, January 15, 2017

కంసుడు మిము బ్రోచుగాత కరుణా మయుడై

హింసించె నెల్ల జనులను
కంసుడు ,మిము బ్రోచుగాత కరుణా మయుడై
కంసారి యెల్ల వేళల
సంసారము నిండ యుండు శంకరు కరుణన్ 

శాత కర్ణి

తనరగౌతమీపుత్రశాతకరిణినట
చూడకోణార్కకేగగజోద్యమాయె
చిత్రమంతయుననితోడచేదుపరచి
యుండుకతనానసంతసమొండులేక
యట్లెచూచితికడవరకయ్యదినిక



Saturday, January 14, 2017

తరుణము మించ గా ర్యము లుదద్దయు మేలొనరించు నిధ్ధరన్

తరుణము మించ గా ర్యము లుదద్దయు మేలొనరించు నిధ్ధరన్
తరుణము మించ గా ర్యము లుదద్దయుమేలొనరించ వెప్పుడున్
ద రుణము జూసియే నిలను దానొనగూరగజేయుటొప్పగున్
గరము నిగూఢమౌ విధము గాతర మొందకనుండు కార్యముల్ 

తరుణాతీతకృతకర్మతతులిడుశుభముల్


హరునిగృపగలుగునెడలను
తరుణాతీతకృతకర్మతతులిడుశుభముల్
హరహరయనుచుంబలికిన
'హరుడే కాపాడగల డహర్నిశము మమున్

Friday, January 13, 2017

సంకటమేకదామకరసంక్రమణమ్మునరైతులేడ్వగన్

సంకటమేకదామకరసంక్రమణమ్మునరైతులేడ్వగన్
శంకయదియేలగలిగెశంకరభక్తుడ!మీకుగానిటన్
సంకటమేమియున్మకరసంక్రమణంబునలేదురైతుకున్
పంకజనాభునిన్దయనుభార్యయుబిల్లలుహాయిగుందురే

రైతు దుఃఖించు మ కర సంక్రాంతి నాడు

రైతు దుఃఖించు మ కర సంక్రాంతి  నాడు
సంత సించును సంక్రాతి సంబర ముల
జేసి కొనుచును రైతన్న చెలువు మీర
ధాన్య లక్ష్మిని జూచుచు దడవ తడవ 

కటిక చీకటి

కటిక చీకటి యం తట క్రమ్ము కొనియె
కాన వచ్చుట లేదయ్యకంటి కేది
యెటుల పోవలె నిప్పుడ యే ది  దారి
పోవ ను చి తము ప్రతి వారు ముందు చూచి 

Thursday, January 12, 2017

జలమున నగ్ని పుట్టెనని సంతసమందెను మీ నజాలముల్

జలమున దాన మాడగను జాస్మిను బోవగ దె ల్సె నామెకున్
జలమున నగ్ని పుట్టెనని, సంతసమందెను మీ నజాలముల్
జలములు బొర్లి వచ్చె దమ సాగర మందున  నంచు బ్రీతితో
జలజల పారు చుండె నట సాటిగనౌ చిరు చేప లత్తఱిన్ 

జలములోనగ్నిపుట్టె,మత్స్యములుమురిసె

తనరబడబాగ్నిపైపైకిదన్నుకతన
జలములోనగ్నిపుట్టె,మత్స్యములుమురిసె
చెరువులోనికిజలములుచేరువలన
జలములేకదచేపలసదనములిల

Wednesday, January 11, 2017

వేవుర సంప్రతించ నవివేకము బోవును విద్య లేలయా

వేవుర సంప్రతించ నవివేకము బోవును విద్య లేలయా
వేవుర సంప్రతించ నవివేకముబోవదు గాక పో దుగా
నీవ యెఱుంగుమా భువిని నీతియు ధర్మము నుండ గోరుచో
పావన మైన యీచదువు వారధి గానిక నుండునే గదా 

చ ను నజ్ఞత విన బలువుర జదువది యేలా

వినుముర చదువును మించిన
ధనమనునది యొండు లేదు ధారుణి నెచట
న్వినకుము సుద్దులు పరులవి
చ ను నజ్ఞత విన బలువుర జదువది యేలా 

మురళీ!

అవధానములన్నిటమీ
యవధానముమేటియనిరియార్యా మురళీ!
నవరసభరితముగాగను
నవధానముజేయుడయ్య! యందరియెదుటన్

ఖరమునుగాంచినంతమదిగమ్మనిభావముపొంగులెత్తెడిన్

ఖరమునుగాంచినంతమదిగమ్మనిభావముపొంగులెత్తెడిన్
 ఖరమదిమోయుమూటలనుగావిడివోలెనుదాభుజంబుపై
నిరతముబాధనోర్చుచునునేరముగాదలపోయదెన్నడున్
 నరుడునుదానెరుంగవలెనాలుకలేనిదిమూగజీవిగా

Tuesday, January 10, 2017

ఖరమును గనినంత నాకు గడు సంతసమౌ

హరహర శంభో యనుచును
శిరమున గైమోడ్పు లిడుచు శివుని న్గనగన్
మెరసెడి దేవా లయపు శి
ఖరమును గనినంత నాకు గడు సంతసమౌ 

Sunday, January 8, 2017

చెల్లెలి బెండ్లి యాడిన విశేషముగా జన మెల్ల మెచ్చరే

అల్లదె యెంత పాపమగు హర్ష కుమారుడ ! లేకవావియున్
చెల్లెలి బెండ్లి యాడిన ,విశేషముగా జన మెల్ల మెచ్చరే
పాలును నీరులా కలిసిభవ్యము గానిక గల్సియుం డి న
న్గా లుని నానతిన్ దనుక కాపుర మట్లుగ జేయుటొప్పగున్ 

చెల్లెలిని బెండ్లియాడ మెచ్చెను జగమ్ము

జగము నాడించు బోషించు జంపు కృష్ణు
చెల్లెలిని బెండ్లియాడ మెచ్చెను జగమ్ము
పార్ధు నెంతయో పరిణయం బాడు కత న
కృష్ణు డనగను సాక్షాత్తు విష్ణు వుగద

సోదరు లిర్వురున్మి గుల శోభిల జేసిరి రెండు గాథ లన్

సోదరులే గదా భువిని జూడగ గొప్పర వంశ జ న్ములా
సోదరు లిర్వురున్మి గుల శోభిల జేసిరి రెండు గాథ ల
న్నా దరమొప్పగా ధరను భారత భా గవతాది గా ధలన్
వేదపు వాక్కులా యనగ వేత్తలు మిక్కిలి మెచ్చు నట్లుగన్ 

సోదరులు రెండు కధలకు శోభ నిడిరి

కొప్పరపు వారి పుత్రుల గొప్పదనము
భారతమ్మును నింకను భాగవ తపు
కధలు జదువంగ  దెలియును ,గమ్మగా ను
సోదరులు రెండు కధలకు శోభ నిడిరి 

Friday, January 6, 2017

ఆపదలంద మానవుల యాశలు దీరును సత్వరంబు గన్

ఆపర మేశ్వరు న్స తము బ్రార్ధన జేతుర యెల్ల వారలు
న్నా పదలంద ,మానవుల యాశలు దీరును సత్వరంబు గన్
శ్రీ పద సీతయై భువిని శ్రీలను దా కురి పించుచో మరిన్
 దీపగు నాశలే యికను దీరును నెప్పుడు ఖచ్చితంబు గన్



ఆపదలు మానవుల యాశ లన్ని తీర్చు

ఆపదలు మానవుల యాశ లన్ని తీర్చు
ననుట సరికాదు మిత్రమా !యాశ లవియ
తీరు నవియ కా దనిశము గోరు చుండు
ధరను గ్రొత్తవి సెలయేరు ఝ రుల వోలె

నరుడయి జన్మ నెత్తె గరుణారహితుండయి చంద్రమౌళియే

నరుడయి జన్మ నెత్తె గరుణారహితుండయి చంద్రమౌళియే
నరుడుగజన్మ నెత్తె గ రుణా సహితుండయి రాముడి ధ్ధర
న్నరయగ రాము శంకరు లయా చిత సంపద లేప్రజాళికి
న్బ రమ పదంబు వోవగసబంధు సమే తముగాగనెత్తరిన్

నరుడుగా జన్మ నెత్తె శంకరుడు గనలి

దుష్ట రాక్షసు లందరిన్  దునుమ హరియ
నరుడుగా జన్మ నెత్తె ,శంకరుడు గనలి
భస్మ మగునట్లు జేసెను మన్మ ధునిల
దనదు మూడవ కంటిని దనర దెఱచి 

Thursday, January 5, 2017

ధనికుడు పుట్ట గోచిని సతంబు ధరించి ముదంబు నందురా

ధనికుడు పుట్ట గోచిని సతంబు ధరించి ముదంబు నందురా
ధనికుడు వోలె  బేదయును దా భరియించగ లేక దాపము
న్నన వరతంబు గట్టును ననాదిగ బట్టును గాక గోచియున్
విను మదియేగదా భువిని వేసవి వేడికి మార్గ మయ్యెడున్

Wednesday, January 4, 2017

పుట్ట గోచిని ధనికుండు పెట్టి మురియు

గ్రీష్మ తాపంబుదా ళక గీము లోన
దాన కూర్చుండి యొంటరి దనము దోడ
పట్టు వస్త్రము లయ్యవి బరువ నుచును
పుట్ట గోచిని ధనికుండు పెట్టి మురియు 

Tuesday, January 3, 2017

కడచె రాతిరి చుక్కల గములు వొడమె

వేడి వేడిగా బగలంత భీకర ముగను
గడచె, రాతిరి చుక్కల గములు వొడమె
చంద్రు రాకకుమోదానజ ద లు నిండ
సూర్య చంద్రులు జగతికి జూడ్కు లుగద






సందిత -బెంగుళూరు

సంది త కవివర సోదర !
వందనములు నీకు జేతు వందల కొలదిన్ 
 విందుగ  నుండెను వీనుల 
కందంబగు నీదు రచన నాస్వాదించన్ 

కవన మియ్యది పంపుడు కంది శంక 
రార్యు లమెయిలు నకుమరి ,యాయనగద
మనకు  గురువులు ,పంపిన మరల పోస్టు 
చేతు రార్యులు బ్లాగున , వ్రాత జూచి 


అందియు నందనట్టి దగు నందమె విందొసగున్ బ్రజాళికిన్

సందియమేమియున్వలదుశంకరుసాక్షిగజెప్పుచుంటినే
పందెముగూడవేయుదునుబాతికరోజులలోపలన్సదా
విందుగరూప్యముల్దొరకువేలకువేలుగజూడుడీయన
న్నందియు  నందనట్టి దగు నందమె విందొసగున్  బ్రజాళికిన్ 

Monday, January 2, 2017

అం దియందనియందమేవిందొసంగు

విరిసివిరియనిపుష్పమ్మువిందుగొలుపు
పండిపండనికాయయేప్రమదమిచ్చు
వచ్చిరానట్టిపలుకులుబలుకశిశువు
ముదముగలిగించువిధముగముదితయొక్క
యం  దియందనియందమేవిందొసంగు

గంగాసాగరుటూరు

గంగాసాగరుటూరును
మంగళమగురీతినిపుడుమాన్యామీరున్
 గంగారుపడకసాగుడు
మంగమ్మయెమీకునిచ్చుమంగళములనే

ఇప్పుడెక్కడయుంటిరియెట్లుగాను
పయనమంతయుసుఖముగబరగినట్లు
మదినిభావింతునార్యుడ!మరియటగల
దృశ్యములయినవింతలుదెలుపగలరు

కోణంగులైన శిల్పులు
, కోణార్కనుజెక్కినారు కూరిమిమిగులన్,
నాణెంబుగసింగారము
, రాణింపునుదెచ్చుకొఱకు రమణులవలపున్.


కామాఖ్యజూడనేగితి
జామాత్రుడువెంటరాగసాయంత్రమున
న్నామాతయుండెనడుగున
భూమాతకుబంటిలోతుపూజలుగొనుచున్
శిలుపులచెక్కడమరయగ
నలుపులకున్వలనుగాదుహాహాయనగన్
 వలపులురేకెత్తించును
నలతులకున్దప్పకుండయార్యా!యవునా?

పూరీయందునవెలసిన
మారమణునిగొల్వనిచ్చుమడిమాన్యముల
న్దీరనిసంపదలెన్నియొ
కోరినమరితప్పకుండకుముదముతోడన్

వైద్యనాధునిజూపునుబడతిరార్య!
పుణ్యసంపదనెంతయోగణ్యముగను
బొందుభాగ్యముమీయదిపుణ్యచరిత!
నోచుకొనవలయునుగదచూచుకొరకు

ఆర్య యీశకుంతలమాతయాలయమ్ము
గల్గుప్రాంతముజెప్పుడుకనికరించి
తెలియనడిగితిమిమ్ములదేటపరచ
గనికగోరుదుమిత్రమ!కవివరేణ్య!


గంగానదిజలములలో
నంగాంగముదానమాడనైశ్వర్యంబున్
 భంగముగానివిధంబుగ
ఖంగుననికమ్రోగునింటగనకపురాసుల్

తారకేశ్వరప్రభువులదర్శనమ్ము
జరిగియుండునుబాగుగసామిమీకు
వారిమహిమనుదెలుపుడుభావయుక్త
ముగనుచదువుదుగనులారమోహనాంగ!

అండరు గ్రౌండున నడకలు
వండరుఫుల్ గాదెసామిపయనముజేయన్
 గొండలలోపలవెలుతురు
దండిగనేనుండియుండుదళుకులతోడన్


సంత సంబును గలిగించె సత్క వీంద్ర !
మీరు రాకను నిచటకు మిగుల సేమ
ముగను వత్తుమి మ్ములజూడ ముదము తోడ
నందు కొనుమార్య వందన మందు కొనుము


మాతనుబెండ్లియాడిజనమాన్యతనందెనురామభద్రుడే

ఆతతవీర్యవంతుడునునాయువుపట్టువుగాగదండ్రికి
న్బూతననామకంబలరుబోడినిజంపినవీరుడేయిట
న్బూతచరిత్రయైమిగులబోడిమితోడనుజక్కనైనభూ
మాతనుబెండ్లియాడిజనమాన్యతనందెనురామభద్రుడే

Sunday, January 1, 2017

మాతనుబెండ్లాడిలోకమాన్యుండయ్యెన్

రాతిగనహల్యయుండగ
నాతిగనేజేసినట్టినారాయణుడే
ప్రీతినినీమాసీతా
మాతనుబెండ్లాడిలోకమాన్యుండయ్యెన్

నూతనవత్సరమ్మనివినోదవిహారములేలమిత్రమా

నూతనవత్సరమ్మనివినోదవిహారములేలమిత్రమా
పాతదిరోతయైయికనుపారెనునామనసేలకోమరిన్
 నూతనమార్గమున్దరికినోములపంటగజేరెనత్తరిన్
 నూతనవత్సరమ్మునవినోదవిహారములేయికన్గదా