Monday, January 2, 2017

గంగాసాగరుటూరు

గంగాసాగరుటూరును
మంగళమగురీతినిపుడుమాన్యామీరున్
 గంగారుపడకసాగుడు
మంగమ్మయెమీకునిచ్చుమంగళములనే

ఇప్పుడెక్కడయుంటిరియెట్లుగాను
పయనమంతయుసుఖముగబరగినట్లు
మదినిభావింతునార్యుడ!మరియటగల
దృశ్యములయినవింతలుదెలుపగలరు

కోణంగులైన శిల్పులు
, కోణార్కనుజెక్కినారు కూరిమిమిగులన్,
నాణెంబుగసింగారము
, రాణింపునుదెచ్చుకొఱకు రమణులవలపున్.


కామాఖ్యజూడనేగితి
జామాత్రుడువెంటరాగసాయంత్రమున
న్నామాతయుండెనడుగున
భూమాతకుబంటిలోతుపూజలుగొనుచున్
శిలుపులచెక్కడమరయగ
నలుపులకున్వలనుగాదుహాహాయనగన్
 వలపులురేకెత్తించును
నలతులకున్దప్పకుండయార్యా!యవునా?

పూరీయందునవెలసిన
మారమణునిగొల్వనిచ్చుమడిమాన్యముల
న్దీరనిసంపదలెన్నియొ
కోరినమరితప్పకుండకుముదముతోడన్

వైద్యనాధునిజూపునుబడతిరార్య!
పుణ్యసంపదనెంతయోగణ్యముగను
బొందుభాగ్యముమీయదిపుణ్యచరిత!
నోచుకొనవలయునుగదచూచుకొరకు

ఆర్య యీశకుంతలమాతయాలయమ్ము
గల్గుప్రాంతముజెప్పుడుకనికరించి
తెలియనడిగితిమిమ్ములదేటపరచ
గనికగోరుదుమిత్రమ!కవివరేణ్య!


గంగానదిజలములలో
నంగాంగముదానమాడనైశ్వర్యంబున్
 భంగముగానివిధంబుగ
ఖంగుననికమ్రోగునింటగనకపురాసుల్

తారకేశ్వరప్రభువులదర్శనమ్ము
జరిగియుండునుబాగుగసామిమీకు
వారిమహిమనుదెలుపుడుభావయుక్త
ముగనుచదువుదుగనులారమోహనాంగ!

అండరు గ్రౌండున నడకలు
వండరుఫుల్ గాదెసామిపయనముజేయన్
 గొండలలోపలవెలుతురు
దండిగనేనుండియుండుదళుకులతోడన్


సంత సంబును గలిగించె సత్క వీంద్ర !
మీరు రాకను నిచటకు మిగుల సేమ
ముగను వత్తుమి మ్ములజూడ ముదము తోడ
నందు కొనుమార్య వందన మందు కొనుము


No comments:

Post a Comment