Wednesday, December 13, 2017

అరుణాచలయాత్ర


అరుణాచలశివుజూడగ
పురములనేదాటిమేముపోవుచునుండ
న్దిరుమన్నామలయనునొక
కరివరదునియూరుమాకుకనబడెసాగెన్

మల్లెపూలవోలెదెల్లదనముతోడ
పత్తిపూలుమెరిసెపథమునందు
జొన్న చెట్లుగలవుజొన్నకంకెలతోడ
జూడ ముచ్చటయ్యె జూడ్కులకట

చేరితితిరువన్నామల
చేరితిమీరాత్రియందుచేరుచునొకచో
న్నారసిశివసన్నిధినట
జేరితిమోగదినినీయసేమముతోడన్

చేసితిమభిషేకమ్మును
జేసితిమాబావమరదిచెప్పుటవలన
న్జూసితిమంగళరూపుని
వాసిగనభిషేకమైనపార్వతినియునున్

తల్లియుదండ్రియునతనిగ
నుల్లమునన్దలచుకొనుచునుత్సుకతోడ
న్నల్లదెయభిషేకమ్మును
గళ్ళారాచూచియుంటిగనబడువరకున్

భోజనమ్మునుటిఫినులుముదముతోడ
బెట్టుచుందురటయ్యయివేళలందు
భక్తవరులకునిత్యమురక్తితోడ
వారిగదులందువాసపువారలకట


తపముజేసెనురమణుడుతాదాత్మ్యమున
గుహలుమూడింటశ్రధ్ధగాగుట్టుగాను
జేరిచూచితివాటినిజేరుగాను
నేమిభాగ్యముమాయదియేమికరుణ

తనరుగుహవిరూపాక్షునిమరియు
యోంన మశ్శివాయకందగుహనబడునవి
మాకుకలిగెనుదర్శనభాగ్యమవియ
పూర్వజన్మపుసుకృతమువరలుకతన

ఏతావుగనదపమునకు
నాతావునుజేరిధూర్తులారడిజేయ
న్బాతాళలింగమందున
దాతపమునురమణుజేసెదన్మయదృష్టిన్

రమణుడెనీవటనీవే
రమణుడవటసత్యమయిది?రాకాచంద్రా!
యెటజూచిననీనామమె
పటుతరముగబలుకుచుండెపశుపతినాధా!


రమణునివోలెనునాకును
నమలంబగుమోక్షమిచ్చియాదుకొలేవా?
కమలాప్తుబాదుకొలిపిన
ప్రమధాధిప!యాదిదేవ! పార్ధివలింగా!

దర్శనీయంబులైనట్టిదైవములను
వరుసవెంబడిజూచుచుపర్వతమ్ము
చుట్టుతిరిగితిమయ్యదిచూడదవ్వు
పదియునాలుగుమైళ్ళుగబలికెజనము

ఈరకంబుగయాత్రనుబూర్తిజేసి
యన్నపానాదులన్నియునైనపిదప
పయనమగుచునునికరైలుబండిమీద
చేరియుంటిమియింటికిక్షేమముగను

(8-12-2017 to 13-12-2017)

No comments:

Post a Comment