Monday, April 15, 2019

రామదాసు చూర్ఞిక

రామదాసు భక్తి పూర్వకంగా రామునిపై 24 కేశవనామాలు కలసి వచ్చేలా ఒక చూర్ణిక రాశారు. చూర్ణిక అంటేనే సరళంగా ఉంటుందని విజ్ఞులు చెబుతారు. సరళ సంస్కృతంలో ఉన్న ఈ చూర్ణికలో విశేషం ఏమిటంటే ముకుందం, రఘువీర నామాల తర్వాత ప్రతి శ్లోకం చివర కేశవాది 24 విష్ణు నామాలు వస్తాయి.
శ్రీరాముడు పురుషోత్తముడు. ఆయనను అర్చించి ఆయన భక్తిలో మునిగితేలిన ఎందరో భక్తు ల్లో తెలుగు వారిలో రామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచెర్ల గోపన్న ఒకరు. ఆయన భద్రాచలంలో రామాలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఆయన భక్తి పూర్వకంగా రాముని పై 24 కేశవనామాలు కలసి వచ్చేలా ఒక చూర్ణిక రాశారు. చూర్ణిక అంటేనే సర ళంగా ఉంటుందని విజ్ఞులు చెబుతారు. సరళ సంస్కృ తంలో ఉన్న ఈ చూర్ణికలో విశేషం ఏమిటంటే ముకుందం, రఘువీర నామాల తర్వాత ప్రతి శ్లోకం చివర కేశవాది 24 విష్ణు నామాలు వస్తాయి. ఈ చూర్ణిక రామదాస విరచితమైనా దీని గురించి అంతగా ప్రజలకు తెలియదు. శ్రీరామ నవమి సందర్భంగా ఆ చూర్ణికను స్మరించుకుందాం. దీనిని కేశవాది చతుర్వింశతి నామ ప్రతిపాదక చూర్ణికగా పేర్కొంటారు. అది
బాలకాండ :
అథ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ భాండ తండోప తండ కరండ మండల శాంతోద్దీపిత సగుణ నిర్గుణాతీత సచ్చిదానంద పరాత్పర తారక బ్రహ్మాహ్వయ దశ దిశా ప్రకాశం, సకల చరాచరాధీశం, కమల సంభవ భవ శచీధవ ప్రముఖ నిఖిల బృందారక బృంద వందమాన సందీప్త దివ్య చరణారవిందం – శ్రీముకుందం
దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలనోత్కట కపట నాటక సూత్ర చరిత్రాంచిత బహు విధావతారం – రఘువీరం
కౌసల్యా దశరథ మనోరథామందానంద కందళిత హృదయార వింద నిరూఢక్రీడావిలోలన శైశవం – శ్రీకేశవం
విశ్వామిత్ర యజ్ఞ విఘ్న కారణోత్కట తాటకా సుబాహు మారీచ బాహు బల విదళన బాణప్రవీణ కోప పరాయణం- శ్రీమన్నారాయణం
నిజపాద రజ:కణ స్పర్శనీయ శిలారూప అహల్యా శాప విమోచన గౌతమ సతీ వినుత మహీధవం – శ్రీ మాధవం
ఖండేందుధర ప్రచండకోదండ ఖండనోద్దండదోర్దండ కౌశిక లోచనోత్సవ జనక చక్రేశ్వర సమర్పిత సీతా కళ్యాణోత్సవానందం – శ్రీ గోవిందం
పరశురామ భుజా ఖర్వ గర్వ నిర్వాపణతానుగత రణ విజయ వర్ధిష్ణుం – శ్రీమహావిష్ణుం
అయోధ్యకాండ:
పితృవాక్య పరిపాలనోత్కట జటా వల్కలోపేత సీతా లక్ష్మణ సహిత రాజ్యాభిమత దృఢ వ్రత కలిత ప్రయాణ రంగద్గంగావతరణ సాధనం
– శ్రీ మధుసూదనం
భరద్వాజోపచార నివారిత క్రమ క్రమ నిరాఘాట చిత్రకూట ప్రవేశ క్రమం – శ్రీత్రివిక్రమం
జనక వియోగ శోకాకులిత భరత శత్రుఘ్న లాలనానుకూల బంధు పాదుకా ప్రదాన పట్టాభి షేక సుధా నిర్మితాంత కరణ దష్టచేష్టాయమాన క్రూర కాకాసుర గర్వోపశమనం – శ్రీవామనం
అరణ్యకాండ:
చతుర్దశ వర్ష దండకారణ్య ప్రవేశ నిరోధ విరాధనల జ్వాలానిర్వాపణ జలధరం–శ్రీధరం
శరభంగ సుతీక్ష్ణా త్రిదర్శనాశీర్వాద నిర్వ్యాజ కుంభ సంభవ కృపాలబ్ధ మహాదివ్యాస్త్ర సముదాయార్చిత ప్రకాశం – శ్రీహృషీకేశం
పంచవటీతటీ సంఘటిత విశాల పర్ణశాల గత శూర్పనఖా నాసికాఖరచ్చేదనావబోధన మహా హవారంభణ విజృంభణ రావణ నియోగ మాయా మృగ మారీచ సంహార కార్యార్థ లాభం – శ్రీపద్మనాభం


రాత్రించర వంచనాపహృత సీతాన్వేషణ పథపంక్తిముఖ క్షోభ శిథిలీకృత పక్ష జటాయు మోక్ష బంధు ప్రియావసాన నిర్బంధన కబంధ వక్త్రోదర శరీర నిరోదరం – శ్రీ దామోదరం
కిష్కంధ కాండ :
శబర్యుపదేశ శబరీ సమర్పిత బదరీఫల భక్షణ పంపాతట హనుమత్‌ సుగ్రీవ సంభాషిత బంధురోర్బంధుర  దుందుభి కళేబరో త్పతన సప్త తాళచ్ఛేదన వాలి నిగ్రహణ ప్రసన్న సుగ్రీవ సామ్రాజ్య పట్టాభిషేక సుఖ మర్షణం–శ్రీసంకర్షణం
సుగ్రీవాంగదనీల జాంబవాశ్చ నలకేసరి ప్రముఖ నిఖిల కపి నాయక సేనా సముదయార్చిత దేవం – శ్రీ వాసుదేవం.
సుందరకాండ:
నిజదత్త ముద్రికా జాగ్రత్సమగ్రాంజనేయ వినయ వచన రచనాంబుధి లంఘనోల్లంఘిత లంకిణీ ప్రాణోల్లంఘన, జానకీ దర్శన అక్ష కుమార మారణ ఇంద్ర జిత్‌ బ్రహ్మాస్త్ర బంధన లంకాపురీ దహన తత్ప్రతిష్ఠిత సుఖ ప్రసంగ ధృష్టద్యుమ్నం – శ్రీప్రద్యుమ్నం


యుద్ధకాండ:
అగ్రజోదగ్ర మహోగ్ర నిగ్రహ పలాయమానాపమానీయ నిజ శరణ్యాగణ్య ప్రణ్యానయ విభీష శరణాగతి, అభయ ప్రదానానిరుద్ధం – శ్రీమదనిరుద్ధం
అపార లవణ పారావార సముజృంభితోత్కరణ గర్వ నిర్వాపణ దీక్షా సమర్థ సేతు నిర్మాణ ప్రవీణాఖిల తరు చరోత్తమం – శ్రీపురుషోత్తమం
నిస్తుల ప్రహస్త కుంభకర్ణేంద్రజిత్‌ కుంభ నికుంభ అగ్నివర్ణాతికాయ మహాకాయ,  మహోదర మహా పార్శ్వ ఇంద్రాంతక దేవాంతక, నరాంతకాది దనుజ తను ఖండనాయమాన కోదంద గుణ శ్రవణ శోషణ హత శేష రాక్షస వ్రజం – శ్రీ అధోక్షజం
అకుంఠిత రణోత్కంఠ దశకంఠ దనుజ కంఠీరవ కంఠ లుంఠనాయ మాన జయా వహం – శ్రీ నారసింహం
దశగ్రీవానుజ పట్టభద్ర త్వాసక్త విభవ లంకాపురీ స్ఫురణ సకల సామ్రాజ్య సుఖాచ్యుతం – శ్రీమదచ్యుతం
సకల చరాచర సురాసురాద్భుత ప్రజ్వలిత పావక ముఖ పూతాయమాన సీతా లక్ష్మణానుగత మహనీయ పుష్పక విమానాధిరోహణ నందిగ్రామ స్థిత భరత శత్రుఘ్న భ్రాతృభిర్యుత జటా వల్కల విసర్జనాంబర భూషణాలంకృత  శ్రేయో వివర్ధనం – శ్రీజనార్దనం

అయోధ్యానగర శ్రీసీతారామ చంద్ర మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవ నిరంతర దిగంత విశ్రాంత హార హీర కర్పూర పయః పారావార పారద వాణీ కుందేందు మందాకినీ చందన సురధేను శరదంబుదాళీ, దర రంభోళీ శత ధార ధావళ్య శుభ కీర్తిచ్ఛటాంతర పాండురీభూత సభా విభ్రాజమాన నిఖిల భువనైక యశస్సాంద్రం
– శ్రీమదుపేంద్రం
భక్త జన సంరక్షణ దీక్షా కటాక్ష విజృంభమాణ శుభోదయ సముజ్ఝరిం
–శ్రీహరిం
కేశవాది చతుర్వింశతి నామగర్భ సందర్భిత నికథాంగీకృత మేధావర్ధిష్ణుం –శ్రీమహావిష్ణుం
సర్వ సుపర్వ పార్వతీ పరమేశ్వర హృదయ కమల తారక బ్రహ్మనామ సంపూర్ణ కామం – శ్రీరామం
భవ తారణాను గుణ సాంద్రం, భవ జనిత భయోచ్ఛేద చిద్రమచ్చిద్రం భక్త మనోరథోన్నిద్రం శ్రీమద్భద్రాచల రామ భద్రం భక్త రామ దాస సుప్రసన్నం

భజే~హం, భజే~హం, భజే~హం, భజే~హం, భజే~హం.
ఇతి శ్రీరామదాస విరచిత చూర్ణికా రూప సంక్షిప్త రామాయణం సమాప్తం.

No comments:

Post a Comment