శంకరాభరణ మనెడి శాల యందుఁ
బృచ్ఛకునిఁ బోలె మెలఁగుచు నైచ్ఛికముగ
సాటి కవి పుంగవుల చేత సరసముగను
బూరణములను గావించు భూరి గాను 1
పూరణంబుల దోషాలు పొసఁగఁ జూచి
మృదు మధురపుఁ బదమ్ముల మెఱుఁగు పఱచి
తీరుచును దగ నందరి పూరణలను
సాటి యెవరయ్య యతనికి సాటి యెవరు 2
ఏడు పదులు నిండిన యౌవనుండు నగుచుఁ
గోప తాపాలు లేకుండఁ గూర్మి తోడ
సాటి కవి యెడఁ బ్రేమను సాదరమ్ము
చూపు నంతటి మహితునిఁ జూడ లేము 3
సహకరించక పోయిన దేహ మతని
సాహితీ సేవయే దన సత్వ మనును
బట్టు గన విక్రమార్కుని పట్టు సుమ్ము
వందనంబులు సేయుదు వంద లాది 4
బృచ్ఛకునిఁ బోలె మెలఁగుచు నైచ్ఛికముగ
సాటి కవి పుంగవుల చేత సరసముగను
బూరణములను గావించు భూరి గాను 1
పూరణంబుల దోషాలు పొసఁగఁ జూచి
మృదు మధురపుఁ బదమ్ముల మెఱుఁగు పఱచి
తీరుచును దగ నందరి పూరణలను
సాటి యెవరయ్య యతనికి సాటి యెవరు 2
ఏడు పదులు నిండిన యౌవనుండు నగుచుఁ
గోప తాపాలు లేకుండఁ గూర్మి తోడ
సాటి కవి యెడఁ బ్రేమను సాదరమ్ము
చూపు నంతటి మహితునిఁ జూడ లేము 3
సహకరించక పోయిన దేహ మతని
సాహితీ సేవయే దన సత్వ మనును
బట్టు గన విక్రమార్కుని పట్టు సుమ్ము
వందనంబులు సేయుదు వంద లాది 4
No comments:
Post a Comment