Thursday, December 12, 2024

Drawig mater

 సోదర తుల్యులు శ్రీ డ్రాయింగు మాస్టరు గారికి  శ్రద్ధాంజలి

--------------------------------

లేవు లేవాయె  యికమాకు లేవు నీవు

కాన రానట్టి దూరమ్ము  గడచి నావు 

మాయ మర్మము  లెఱు గని  మనిషి వీవ 

సాటి  యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?


ఆశ లేదయ్య  నీకుగా నాశ లేదు

ఉన్న దానితో సంతృప్తి నొంది తీవు

నీవు చేసిన సేవలు నిండు హృదిని

 భద్ర పఱతుము నిక్కము భవ్య చరిత!


రక్త బంధమ్ము  మనమధ్య మృగ్యమైన 

బావయంచును బిలిచెడు వాడవీవు 

నీదు ప్రేమకు చిహ్నము నిజము గాను 

దివిని చూచుట కేగిన ధీర వర్య!


ఏమి  నేరము జేసితి  మింత లోన

విడిచి పోతిరి మమ్ముల విడిచి యిచట

నీదు రాకకు మేమిట యెదురు చూతు

మయ్య !రాగదే వేవేగ యార్య బావ !


 సకల శుభములు గలిగించు శంకరుండు  

నీకు శాంతిని జేకూర్చి నిన్నుఁగాచు 

నశ్రు పూరిత నయనాలఁగోరు చుంటి 

యందుకొనుమయ్య శ్రద్ధాంజ లందుకొనుము.

ఇట్లు 

పెద్ద తెలుగు మాస్టరు

18-12- 2024

No comments:

Post a Comment