Showing posts with label mu. Show all posts
Showing posts with label mu. Show all posts

Tuesday, November 20, 2018

palakollu bava

లేవు లేవాయె  యికమాకు లేవు నీవు
కాన రానట్టి దూరమ్ము  గడచి నావు 
మాయ మర్మము  లెఱు గని  మనిషి వీవ 
సాటి  యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?

ఆశ లేదయ్య  నీకుగా నాశ లేదు
ఉన్న దానితో సంతృప్తి నొంది తీవు
నీవు చేసిన సేవలు నిరత ము హృ ది
 భద్ర పఱతుము నిక్కము భవ్య చరిత!

ఏమి  నేరము జేసితి  మింత లోన
విడిచి పోతిరి మమ్ముల విడిచి యిచట
నీదు రాకకు మేమిట యెదురు చూతు
మయ్య !రాగదే వేవేగ యార్య బావ !

వత్తుననుకొంటిమిముజూడపరమపురుష!
యింతలోపలనాకయ్యెవింతగాను
కడుపుమంటలుజెలరేగెగాఢముగను
నాసుపత్రికిబోతినత్యవసరముగ

 కలగానయ్యెనునీదుబంధములుమాకార్యా,యవేమంటివా
 యలుపుల్లేకయెమాగృహంబులకుబాహాటంబుగావచ్చిరే
విలసిల్లన్సుగుణంబులన్నియును,దాపేరాశకున్బోవకే
ఫలముంబెట్టినగ్రొత్తగుడ్డలనుసాఫల్యంబునొందన్గొనెన్


అమ్మ నాన్నయు నక్కయ్య లంతె కాక 
బావ లిరువురు మమువీ డి దివము జేరె
వారి మార్గమ్ము నీవును బడసి తీవ
దిక్కు మాకిక యెవరయ్య యిక్కడింక


సకల శుభములు  గలిగించు శంకరుండు
మరల జన్మమ్ము లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ  ననుమ తించి
యొసగు  గావుత ! యాత్మకు  నొనరు శాంతి