ఓం నమో భగవతే శ్రీ విద్యా ర ణ్యా య !
సాహితీ సమాలోచనం ద్వారా సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది .అది సమాజంలో చైతన్య వికాసానికి దోహదం చేస్తుంది .మన తెలుగు భాషకు సాహిత్యం ,ఆ సాహిత్యం లొ లాలిత్యము ,లాలిత్యముతో బాటు ప్రగాఢ భక్తి ,సంస్కారము ఉన్నాయి .నిజమే . ఏ భాషలో లేవు గనుక .ఏ సంస్కృతిలో గాన రావు గనుక .కాని ఎందుకో గాని తెలుగు వాడికి తన జాతి ,సంస్కృతీ , భాష అంటే అమితానందము .కార ణం ఆ సంస్కృతిలో ,భాషలో ,సాహిత్యంలో భక్తి ,జ్ఞానం ,వైరాగ్యం ఉట్టి పడతా యి.
హనుమ పేరు తలుస్తూనే తెలుగు వాడి హృదయం భక్తితో ఉప్పొంగి పోతుంది .దేశం లో హనుమద్ భక్తులు ,నిరతిశయా నందంతో ఊ గి పోతారు .ఆ భక్త శిఖా మ ణు ల కోవకు చెందినవారు మాన్య శ్రీ సుబ్బారావు గారు .
నిజానికి తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని చొప్పించిన గొప్ప కవితా శిఖా మ ణులు.ఒక్క పొల్లు మాటను కూడ వాడ కుండ మర్రి విత్తన మంత చిన్ని పద్యములలో మహా వృక్ష మంత భావాన్ని అందించారు .అదే సాహితీ వేత్తల మధుర గీతము .ఆ గీతమును పాడుకొంటూ ఆ హనుమను తన మనస్సునందే యుండమని శతక పద్యములతో బంధించి వేశారు శ్రీ సుబ్బారావు గారు . భక్తుడు కోరేదే అది .భగవంతుని భక్తితో బంధింస్తే భవ బంధాలు వాటంతట అవే ఊ డిపోతాయి.
చిత్త శుద్ధిగ చేసెద సేవ నీ కు ముక్తి కోసము నెప్పుడు మ్రొక్క నిన్ను పారమార్ధికమునకు నే బాటు పడనునా మనంబున నుండుమా రామ భక్త !వాసనానాం పరిత్యజ మొక్షార్ధిత్వ మపి త్యజ అను నది ఉపనిషద్వా ణి.అంత పెద్ద అర్ధం కాని ఉపనిషద్వా ణి ని చిన్న పద్యం లో చిన్ని చిన్ని పదములలో ఇ రికించారు శ్రీ సుబ్బారావు కవీన్ద్రులు .ఇట్లాంటివి ఎన్నో ,ఎన్నెన్నో .ఇక సాహిత్య సేవా దృక్పధంలో -సమాస వికాస మునకు మార్గగామి శ్రీ సుబ్బారావు .మచ్చు తునక లాంటి -మంచి కంద పద్య సౌరభాలను సమాజము మీదికి వెదజల్లినారు.మానుము ననుమానమ్మును
మానుము మఱి దుష్ట జనుల మైత్రిని పుడమిన్
మానుము చెడు నలవాట్లను
మానుము నిక చెడ్డ పనుల మహిలో నరుడా !
ఇట్లా చెప్పినవే -ఓ వంద కందాలు .విందా ర గిన్చండని వందనముతో డ పలికిన రమ్య మైన సాహి తీ సుధా పరంపర .
తన అమెరికా పర్యటనలో ఆ దేశ ఆనందాన్ని చవి చూచి పలవ రింపుతో పలుకరించిన పద్య సుమాలు ఆహ్లాదము కలిగిస్తాయి .
మా తృ మూర్తిని మన్నించమని ,దైవ సాన్నిధ్యమే తనకు రక్ష యని , ప్రేమ మూర్తి శ్రీ శ్రీ శ్రీ బాబా గారిని తనను కనిక రించమని వేడుకొనే పద్యాలు .కాదు అవి అమృత బిందువులు .
శ్రీ సుబ్బారావు గారిని వారి సాహితి సేవను మరువలేరు అనడానికి ఈ చిన్న పద్యాలే నిదర్శనములు .
శుభాభి నందనలతో ------వ . వేం. సత్యనారాయణ
౫-౫-౨౦౧౦. ph.no.o4024037759
saraswata visarada ,vedanta siromani,daivajna ratna
Rtd.dy.scy to govt&ex member
aagama examinationsadvisory board
ap,state govt,Endoments Department
AlsoGuest facuity dr MCr HRd institute of A.P.
H.no.4-53,New Nagole colony,saroor nagar,hyd-500035.