Thursday, September 7, 2017

జింకను గాంచి తక్షణమె సింహము పారె నదేమి చిత్రమో

డొంకల చాటున న్మిగుల డో గుచు నుండిన చిన్నదైన యా
జింకను గాంచి తక్షణమె సింహము పారె నదేమి చిత్రమో
జంకుచు దానితల్లి యట  సాగిలు చుండను   భావము న్మదిన్
శంకను బొందుచు న్మృగము సానువు వీడుచు నత్తఱిన్సుమా

జింకను గని తక్షణ మ్మె సింహము పారెన్

జంకుచు నేడ్చెను బాలుడు
జింకను గని, తక్షణ మ్మె  సింహము పారెన్
డొంకల మాటున మృగమను
శంకను దా బట్టు కొనగ సానువు నుండిన్

Wednesday, September 6, 2017

పండుతులువసింపనిధరపావనముగదా

దండిగ సంస్కృతి యుండియు
మెండగు గర్వంబుతోడమేదినిబ్రజలన్
 బండగ దూషించునట్టి
పండుతులువసింపనిధరపావనముగదా

Tuesday, September 5, 2017

దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యి ధ్ధరన్

దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యి ధ్ధరన్
రంగడు చెప్పగా దెలిసె రాహువు కేతువు లిద్దరు న్సదా
దొంగతనంబున న్గలిసి దొడ్డతనంబున మంత్రిగారితోన్
భంగముగాక నెప్పుడును భారిగ జేతురు నిర్భయంబుగన్

దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా

రంగని యాభరణమ్ములు
దొంగలతో గుడికి పెద్ద ,దోచెను గలిసీ
రంగా ! చెప్పుమ యిప్పుడు
దొంగలతో  దొరలు గలిసి దోచెదరు గదా

Monday, September 4, 2017

ఉపాధ్యాయుల దినోత్సవము

గురువున కిత్తును నతులను
గురువుయె కద తల్లి దండ్రి గురువుయె దైవం
గురువునె మఱి పూజించిన
గురువుయె యిక నిచ్చు మనకు గూరిమి ,దెలివిన్

శంకరుడు మొద లుకొనుచు శంక రార్యు
లనడుమగలుగు గురువు ల లహరి నుండి
నాదు గురుపరం పరలకు నతుల నిడుదు
శతము కొలదిని భక్తిని సవిన యముగ



 

దత్త పది =గు -రు -పూ -జ

గురువు కలిగించు నుత్తమ గుణము లనిల
రుచిర వాక్కుల నిరతము రోత లేక
పూజ జేయుడు నుత్సవ  ముపగిదినిక
జపతపంబులనొప్పెడు చైత్య మతడు