Thursday, December 31, 2015

అవధానంబుల నుండ రాదనె సమస్యా పూ ర ణ ల్

అవహేళం బును జేయు వారలట హాహాకారము ల్జేయుచో
అవధానంబుల నుండ రాదనె, సమస్యా పూ ర ణ ల్
కవనంబందున నుండుగా యవియ యాకా త్యాయనీ మాతయే
యవధానమ్ముల బ్రోత్స హించెగద  యాయా చోటులన్ దాసుమా

పద్య రచన -నూతన ఆంగ్ల సంవత్సరాది శుభా కాంక్షలు


వచ్చెను వత్సర మయ్యది
యిచ్చకమును మనకుజేయ యీవత్సరమున్
మెచ్చుచు జెప్పుచు నుంటిని
నెచ్చెలులకు శుభములిడుత నీరజ భవుడున్


క్రొత్త వత్సరమునకోటి వెతలుదీరు


క్రొత్త వత్సరమునకోటి వెతలుదీరు
ననుట యందు సంది యంబు వలదు
అనవ రతము నీశ్వరా నుగ్రహ మ్ముండు
మనకు సామి! చింత మాను డిపుడు

షణ్మాసములనగనొక్క సంవత్సరమే

షణ్ముఖుడ ! యారునెలలే 
షణ్మాసములనగ, నొక్క సంవత్సరమే
షణ్మాసపురెండింతలు
షణ్మతములుజెప్పెనిట్లు సరియా?కాదా?

పద్య రచన =విప్రుడు -రాజు

విప్ర జనముల మనములు విమల మగుచు
పలుకులయ్యవి కఠినమై బరగు చుండు
విభుల యందున నీయవి వేరుగుంట
మార్చ నోపడు శాపము మహివి భుండు

అ వనీశ్వరులెల్ల కల్లలాడెడు వారల్


అవసరమా యిట్లనుటకు
న  వనీశ్వరులెల్ల కల్లలాడెడు వారల్
భువిలోగల  రాజులలో
నెవరును మరి నిజము పలికె యీశులు లేరా?

పద్య రచన -మిర్చి తోట


మిర్చి తోటను జూడుడు మిలమిలమరి
మెరయు చుండెను నచ్చట మెరుపువోలె
పండ్ల తోడను గాయల వరుస తోడ
చెలువు మీరగ వ్రేలాడ గలుగు  నార్య!