Thursday, June 30, 2016

మాంసము దిన విప్రవరుడు మా న్యు o డ గురా

హింసించుట యగు బ్రాణుల
మాంసము దిన, విప్రవరుడు మా న్యు o డ గురా
హింసల జోలికి బోవక
కంసారిని గొలుచు నెడల కాంక్షలు లేమిన్ 

పతితులె పుణ్య జీవులని వాదన జేసెద రంగనా మణుల్

సతతము దైవ ప్రార్ధన లుసల్పుచు దానము జే యు శీలుడే
యితరము లైన పానమున కిష్టుడు నైనను వాని నందురే
పతితులె పుణ్య జీవులని వాదన జేసెద రంగనా మణు
ల్లతి వల మాటలన్నియు ను నాదరణీయములౌ గ దా యిలన్


Wednesday, June 29, 2016

పతితులె పుణ్యపు రుషులని వాదింత్రు సతుల్

సతతము శంకరు గొలుచుచు
వితరణముంజేయు నెడల బేర్మిని నెపుడు
న్ని తరులు నోపక పోయిన
పతితులె పుణ్యపు రుషులని వాదింత్రు సతుల్

దయ్యమె భార్య యైనపుడు దక్కును భర్తకు సర్వ సౌఖ్యముల్

కయ్యము లెన్నియో జరుగు కాంతకు గాంతునికి న్జ గంబున న్
దయ్యమె భార్య యైనపుడు, దక్కును భర్తకు సర్వ సౌఖ్యముల్
కయ్యము లేక యుండగను గాంతుని సేమము జూర నొందుచు
నెయ్యము తోడనే మెలఁగి నేర్పున నోర్పున నుండనోపినన్ 

Tuesday, June 28, 2016

దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్

అయ్యా !బాగుగ జెప్పితి
రెయ్యెడలనుసత్య మదియ యి ధ్ధర  లోన
న్నియ్యదిమనుజునిభాాగ్యము
దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్

Monday, June 27, 2016

భైరవు డిచ్చు చుండు నశుభంబులు నమ్మిన భక్త కోటికిన్

భారము గాగనాబ్రదుకు భార్యను బిల్లలు జూడకుండు రీ
ధారుణి నెట్లుగా మనుచు దారణ జేయుదు జీవనంబు నున్
వారము వారము న్భజన బాగుగ జేయుచు నుండగానిక న్
భైరవు డిచ్చు చుండు నశుభంబులు నమ్మిన భక్త కోటికిన్ ?


భైర వుండి చ్చునశు భము ల్భ క్తులకును

భైర వుండి చ్చునశు భము ల్భ క్తులకును
ననుట నాయమె మీకిది యార్య !చెపుమ
భైర వుండి చ్చుశుభములు వరదు డగుట
భక్త కోటిని రక్షించి రక్తి తోడ