Friday, July 8, 2022

అప్రాచ్యుల్ బుధులై వధానములఁ జేయం జొచ్చి రాంధ్రావనిన్”

 కప్రా నామక పట్టణంబున గనన్ గారుణ్య భావంబు నన్

నప్రాచ్యుల్ బుధులై వధానములఁ జేయం జొచ్చి రాంధ్రావనిన్
సప్రామాణిక శాస్త్ర సమ్మతము నై శ్లాఘించు చందంబునన్
విప్రో త్తంసమ ! సాగె ధారలు సెవుల్ బేజారి పోనట్లు గన్

రిప్లయితొలగించు

అప్రాచ్యులు సేయసాగి రవధానములన్”

 కాప్రా నగరం బందున

నప్రాచ్యులు సేయసాగి రవధానములన్
నప్రాచ్య జనము లంతట
సప్రేమను మెలగు చుండ్రు సరసత తోడన్

importat points

 .* భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

*2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.

*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.

*4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.

*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.

*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.

*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.

*8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.

*9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.

*10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.

*11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.

*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)

*13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.

*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.

*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.

*16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.

*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.

*18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

*19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

*20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.

Thursday, July 7, 2022

పండితులెల్ల మెచ్చకయె వాసిఁ గనెన్ రసరమ్యపద్యమై”

 నిండగు భావ సంపదను నేర్పుగఁ జూపుచు వ్రాయు చేతనే

పండితులెల్ల మెచ్చకయె వాసిఁ గనెన్ రసరమ్యపద్యమై
మండిత మౌవిధం బుగను మాలలు గూర్చిన సంధి ప్రక్రియన్
దండిగఁ జేయుచుండి యిక దామర తంపర గావెలింగె నే

పండితులు మెచ్చనిది రమ్యపద్యమయ్యె” (లేదా...)

 భావ సంపద గలిగియు భాసుర మగు

శబ్ద లాలిత్య ముఁగలిగి సరస మైన
దియని మెప్పును బొందె భూ దివుజు లగుట
పండితులు మెచ్చనిది రమ్యపద్యమయ్యె.

Monday, July 4, 2022

దినమధ్యంబున మ్రింగె రాహువు శశిన్ దిక్కుల్ ప్రకాశింపఁగన్”

 వినుమా వారిజ లోచనా ! యిదియ యావేశంబు లేకుండ గా

దినమధ్యంబున మ్రింగె రాహువు శశిన్ దిక్కుల్ ప్రకాశింపగన్
దినమధ్యంబన ,రాత్రియౌ యమెరి కాదేశంపు భూవాసికిన్
కనుకన్ వారికిఁ గన్పడున్ నటుల నాకాలంబు వేరౌటనే

పగలె చంద్రుని రాహువు పట్టి మ్రింగె” (లేదా...)

అమెరి కాలోన నున్నట్టి యాడ బిడ్డ
చంద్ర గ్రహణపుఁ జిత్రాల సరముఁ బంప
భరత ఖండము వారికి పగలె యగుట
పగలె చంద్రుని రాహువు పట్టి మ్రింగె