Tuesday, March 10, 2015

పద్య రచన -ముదుసలి -అద్దము

అవ్వ తనమోము  జూచుచు నద్దమందు
ముడుత ముడుతలు  గానుండ , ముసలి ముండ
వోలె గన్పడు చుంటిని  భూరి గాను
ననుచు వాపోవు చుండెను దనదు  భర్త
యొద్ద కూర్చుండి ముదుసలి తద్దయు నట

మంచి యద్దము కాదిది మగడ ! నీవు
తెచ్చి యిచ్చిన దీ యది తేరి జూడ
ముసలి దానిగా గనబడె  ముఖము నా ది
యేల దెచ్చితి విటువంటి బోల సరుకు

No comments:

Post a Comment