Saturday, March 28, 2015

అంశం- రామకథ. ఛందస్సు- (పన్నెండు పాదాల) తేటగీతిక. పన్నెండుపాదాల మొదటి అక్షరాలు వరుసగా ‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’ ఉండాలి.

శ్రీ క  రుండగు రాముడు చిన్మ యుండు
సీత జాడను  కొఱ కునై వాత సుతుని
తా ను గానంపె నోరమ ! త్వరిత గతిని
రామ సీతను కనుగొని  రమ్య మైన
ముద్దు టు o గర  మిమ్మని ముదల నిచ్చె
లక్ష్మ ణుం డును  వెడలెను రాము నా జ్ఞ
కుదిరె  నెయ్యము హనుమంతు గుంపు తోడ
వంద లకొలది  సైన్యముల్ వంది పలుక
దక్షి ణం బున కేగెను దండు తోడ
నమ్మ కంబుగా  బోవగ నమ్మ సీత
ముదము గలుగంగ గనబడ మోడు క్రింద
లుప్త మయ్యెను శోకము  నాప్తు లకును


No comments:

Post a Comment