Wednesday, September 30, 2015

పద్య రచన -గురు శబ్ద వాచ్యు డెవ్వడు ......


గురు శబ్ద వాచ్యు డెవ్వడు
మరి తెలియదె మీకు సామి !మాన్యుడు గురువే
గురువే జ్ఞానము నిచ్చును
గురువను శబ్దమ్ము భువిని గురుతర మయ్యెన్ 

Tuesday, September 29, 2015

తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్

తారా పథమున మబ్బులు
తా రాడుచు నుండ మిగుల తమమున్గలుగ
న్బాఱి న  మబ్బుల దాగిన
తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్ 

పద్య రచన -ఇనుము సూదంటు రాయి ....

ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు
మేన క సొగసు  జూచియు  మిగుల వగలు 
జెంది  యా గాధి తనయుడు  చేరి దనను 
భంగ మొనరింప  జేసెను  దనత  పసును

ఇనుము సూదంటు రాయికై  యెగయు నట్లు
భార్య పొందుకై తపియించు భర్త యెపుడు
క్రొత్త గాబెండ్లి  యగుటన  కోర్కె లుండు
సహజ మయ్యది  క్రొ త్త దౌ  జంట కిలను  

Monday, September 28, 2015

ఘటమున నేనుగుల గుంపు గలదు ముకుందా !


నట రాజు ప్రతిమ యుండెను 
ఘటమున, నేనుగుల గుంపు గలదు ముకుందా !
యటవీ ప్రాంతపు హద్దుల 
జటిలంబగు  మార్గమగుట జనశక్యంబే ?

పద్య రచన -చనుబాలు ద్రాగు బిడ్డడు ........

చను బాలు  ద్రాగు బిడ్డడు
ఘనమగు రక్కసుల జంపె గనుగొను చుండన్
వినయముగా నే జేతును
వన మందలి పూల దెచ్చి భక్తిని బూజన్ 

అష్టావధానము ప్రభావతి గారిచే

అవధానము లన్నిట మీ
యవధానమె  గొప్పదౌను నమ్మా ప్రాభా !
యవధానం బొ నరింపుమ
యవనిన్గల ప్రముఖ గణము హాహా యనగన్



పద్య రచన -----కవివర!నీ కవిత్వము ........

కవివర!నీ కవిత్వమునగాం తుము చక్కని సూక్తులెన్నియో
యువతకు  పట్టుకొమ్మలయియొప్పును  బాగుగ నుంట జేసి యే
యవ  గుణముల్ త్యజించియును  హాయిగ జీవన మార్గ మెంచగా
నవిరళ జీ వనంబును నయం బుగ జేయుచు హాయి గొల్పెడిన్

Sunday, September 27, 2015

దత్తపది -ఈగ -దోమ -పేను -నల్లి (భారతార్ధము )


జడను బేనుకొ  నుమయిక జాయ ! నేను 
ఈ గ  దాదండ మునవాని  సాగనంపి 
కురుల  నల్లి నీ  యవియిక  గూర్తు ముదము 
మంచి గామఱి  మనగదో  మగువ !యిపుడు 

Saturday, September 26, 2015

పద్య రచన -గణేశు నిమజ్జనము


చిత్ర మయ్యది జూడగ జిన్న పెద్ద 
లంద ఱచ్చట  గుమిగూడి యందముగను 
నీటి లోపల  గణపతి నిబ్రమ  దమున 
ముంచ నుద్యుక్తు లయ్యిరి మూర్తి ! చూడు 

వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్


అనుదినము బూజ జేసియు
ననువుగ నిక దశమి రోజు హాహా యనుచు
న్ననుపమ , సారధి తోడుగ
వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్

Friday, September 25, 2015

.పద్యరచన -ఎక్కడ కేగువాడ నిపుడెవ్వని ........

ఎక్కడ కేగువాడ నిపుడెవ్వని వేడుదు  నేమి చేతు నే
మ్రొక్కిన దైవమే ననిల మోడుగ జేసెను నెవ్వడిం క యీ
చిక్కుల బారి న్గృపను బ్రోవును నీశ్వరు డే గతంచు నే
మక్కువ తోడ నుంటినయ మాన్యుడ ! నన్నిక గావుమా మఱిన్


పదునె నిమది పదునెనిమిది పదునెనిమదియే


హృదయపు చప్పుడు వోలెను
మదికిన్మఱి  సంతసంబు మాన్యా ! కలిగె
న్బ దముల యల్లిక యీ యది
పదునె నిమది పదునెనిమిది పదునెనిమదియే 

టా బ్లెట్టు కానుక


మిత్రు డొక్కడు ప్రేమతో చిత్ర మైన 
టా బ్లెటు నునీయ సంతసంబ బ్బె మామ
నంబునకు నార్య ! మఱి వందనంబు జేతు 
వంద లాదిగ నతనికి కంది వర్య !

నలుగురితో దిరుగు పడతి నాయిల్లాలే

అలకా పురమున జరిగెడి
పలురకముల సభలయందు ప్రమదము తోడ
న్గలగల మాటలు బలుకుచు
నలుగురితో దిరుగు పడతి నాయిల్లాలే 

Thursday, September 24, 2015

పద్య రచన -తమ్ముడా ! యిట్లొనర్చుట ధర్మ మగునె.....

పూట పూటకు ద్రాగుచు  పొట్ట నిండ
యిం టి నిల్లాలి బిల్లల  నొంటి జేసి
యిలబ లాదూ రు గదిరుగ నెగ్గు లేదె ?
తమ్ముడా !  యిట్లొనర్చుట ధర్మ మగునె.....

Wednesday, September 23, 2015

మూత్రపిండము - రాయి

మూత్ర పిండపు రాళ్ళను మొదట గానె 
తెలిసి కొనుచును గ రగించి తీయ వలయు 
మందు దానికి తెలియుడు ముందు గాను 
ద్రా గ  వలయును నీటిని దనివి దీర 
యార్య ! శంకర ! ద్రాగుడు నీరము మఱి 
కరగి పోవును రాళ్లన్ని , కనబ డవిక . 

అన్న దానమ్ము సేయువా రధము లిలను


సర్వ సౌభాగ్యములతో డ వర్ధిలుదురు
అన్న దానమ్ము సేయువా ర,ధము లిలను
బనియు పాటలు లేకుండ బ్రతుకు వారు
వారు బ్రదుకుట  వ్యర్ధము వారి జాక్ష !

Tuesday, September 22, 2015

కోడలా నాపతియె నీకు కొడుకు గాదె


మామయగునమ్మ మఱి నీకు మఱచి తీవ ?
కోడలా! నాపతియె, నీకు కొడుకు గాదె
సోమ శంకర నా ముండు  సుచరి తుండు
మఱపు  వచ్చిన దోయమ్మ ! మందు వాడు

Monday, September 21, 2015

పద్య రచన -బొంగరాల ఆట

ఆడుచుండెను బాలుడు చూడు మచట 
యుంగ రమ్మును వోలెను  బొంగ రమును 
ద్రిప్పు చుండెను  గిరగిర  తిరుగు నటుల 
తనదు నఱ చేతి పైనను దన్మయతన 

రతిపతి మన్మధు డు గాడు బ్రహ్మయె తలపన్


అతివా ! వినుమీ మాటను
రతిపతి  మన్మధు డు గాడు ,బ్రహ్మయె తలప
న్సతి భా  రతికి న్బెనిమిటి
సతి పతుల న్నెంచ వలయు  సరియగు రీతిన్ 

Sunday, September 20, 2015

పద్య రచన -మనసిజ పుష్ప బాణములు ...........


మనసి జ పుష్ప బాణములు  మాటికి గ్రుచ్చగ  సంత సంబున
న్దనరగ  గోపకాంతలు నెద న్బుల కాం కితు  లౌచు వారలు
న్దనువు  గగుర్పొడం గను నెద న్గ ల  చంగ దృ గంచిత బుధ్ధి దా
నెనరగ గృ ష్ణు డప్పుడట యెన్నడు  లేని విధంబు గన్పడె న్

రాము లందు గొప్ప రాము డతడు


పరశు రాము డొకడు బలరాము డొక్కడు
వీర్య వంతు లుమఱి  ధరణి యందు
రాజ ! యా  ద  శరధ  రాముడే యెన్నగ
రాము లందు గొప్ప రాము డతడు 

పద్య రచన -చెరువు

రంగు రంగుల కాంతిని రంగ రించి
కలువ పూలతో చెఱువది కానిపించె
ప్రకృతి మాత యందమచట ప్రస్పుటముగ
ద్యోత మయ్యెను జూడుడు తోయలార!



వాసుదేవుని, గంసుడు పట్టి జంపె



పూజ జేయుడు నిత్యము పూల తోడ 
వాసుదేవుని, గంసుడు పట్టి జంపె 
సప్త వశువులు ననబడు సప్త శిశుల 
ప్రబల మగుటన నతనిలో ప్రాణ భీతి

పద్య రచన -గణపతి -లాపుటాపు

పూజ లందు కొ  నంగను  ముదము కలిగి 
లాపు టాపున  సౌందర్య లహరి చదువు 
చుండె ను శివుని  మదిలోన చూచు కొనుచు 
పరమ  శివునిపై  గలయట్టి  భక్తి తోడ 

ఆడు వారు బొంకు లాడు వారు

ఆడు వారు బొంకు లాడు వారనుటను
మంచి కాదు మనకు మాన నీయ !
తిరగ బడుదు రుమఱి  దినముది  నమ్మును
కూడు దొరక దండి కొంచె మైన 

Thursday, September 17, 2015

పద్య రచన -వలదు వల దన్న వినక ..........

సా హసంబులు  సేయక సంయమనము
తోడ మెలగుమా యనుచును దుదిని వరకు
వలదు వలదన్న వినక యీ  పనులొ  నర్చి
కోరి లోనయ్యె  యాపద గురిచి  సీను

కొఱవి తోడను ద లగోకి కొనుట మేలు

కాని పనులను జేయుచు కాంత యొకతె
యూరి వారల చేతను నూరి నుండి
వెలువ వేయించు కొనగను వీలు కన్న
కొఱవి తోడను ద లగోకి కొనుట మేలు

పద్య రచన -కురు నృప ! పాండు నందను లకుం ఠిత............

కురు నృప ! పాండు నందను లకుం ఠిత భక్తిని ,ధర్మ బుద్ధితో
నిరత   ముసేవ  జేయుదు  రునీ చ రణాల  కుగాదె  ? వారి
న్నరసి   ముదంబు నొప్పగ ,దయన్గలు గంగ, సగర్వ ముగాగ
న్నిరవుగ వారి భాగపు మహిన్దగ నిమ్ము సుబుద్ధితో నికన్



భక్షించెను గోవు జంపి పాప మెటులగున్

రక్షించ వలయు గోవుల
భక్షించెను గోవు జంపి పాప మెటులగు
న్వీ క్షింతుము  నరకంబును
నక్షయముగ  బాపమొదవి  యార్యా ! వినుమీ

పద్య రచన -గణపతి


చిత్ర మందున గణపతి చిత్ర చిత్ర
వర్ణ  ములతోడ శోభిల్లె బంధురముగ
వేయి కళ్ళును జాలవు  వీ క్షితులకు
చూడ  రారండియందరు శుభము  కలుగు

ఏక దంతుని వాహన మెలుక కాదు


ఏక దంతుని వాహన మెలుక, కాదు
నా న  ననగను  భావ్యమే  నార సింహ !
యెలుక యే వాహ   నము గద  యీ శు సుతున
కు మఱి సంశయ మువలదు  కొంచె మైన

Tuesday, September 15, 2015

శిశుపాలుని జంపినట్టి శివునకు జేజే


పశువుల కాపరి చంపెను
శిశుపాలుని ,జంపినట్టి శివునకు జేజే
దిశలెల్ల దద్ద రిల్లగ
నిశినిం జరియించువారి  యు క్క డరంగన్ 

Monday, September 14, 2015

పద్య రచన -పట్టీలు


పట్టీలను నేజూచితి
బిట్టుగ నవి మెఱయు చుండె  వెండివి కతన
న్బ ట్టీ ల  తోడ  పదములు
చిట్టీ ! మఱి యందగించె జి గిజిగి  వోలెన్ 

Sunday, September 13, 2015

రామ కధ విని మురిసెను రాక్షసుండు

తనదు పిల్లల నోటన తల్లి సీత
రామ కధ విని  మురిసెను,  రాక్షసుడగు
నా  హిరణ్య కశిపు డు దా  ననుమ తించె
దనదు కొమరుడు ప్రహ్లాదు దండ జేయ
విష్ణు భక్తుడు నగుటన  విసుగు జెంది



Saturday, September 12, 2015

భీము డతి భీ కరమ్ముగ భీము జంపె

భీము డనుపేర న సురుడు భీకరముగ
భక్తు  డైన సు  దక్షిణు వెతల బఱు ప
తనదు  మూడవ కంటిని నెనర దెఱచి
భీము డతి భీ కరమ్ముగ భీము జంపె 

పద్య రచన -వరమయ్యొ శాప మయ్యెను

వర మయ్యొ  శాప మయ్యెను
నిరవుగ భస్మాసురుండు నీశుని వరము
న్దిరమగు  బుద్ధిని దలపక
వర గర్వము జేత నతడు  భస్మం బగుటన్ 

Friday, September 11, 2015

ధర్మ మార్గము దప్పడు దానవుండు


మానవత్వము గలిగిన మానవుండు
ధర్మ మార్గము దప్పడు, దానవుండు
దమన మార్గాన జనులపై దాడి జేసి
చంపి భక్షించు నది వాని జాతి వృత్తి 

పద్య రచన -గేదె మీద కుక్క


శునక మొక్కటి నిదురించె సుఖము గాను 
మహిషి మీదను జక్కగా  మాననీయ !
జంతు ప్రేమను జూచియు  జనులు మనము 
నేర్చు కొనవల యును వాటి నెనరు ప్రేమ 

పద్య రచన -ఎందుల కిన్ని బాధలు ,,,,,,,,,,,

ఎందుల కిన్ని బాధలు సహింతువు వద్దను కొన్న వారు దా 
నిందలు మోపగా మరిని బందుగు లౌటను సైచుటొ ప్పుగా 
డెందము నందలం  చియిక మందుడు వోలెను నుంట గా దగ
న్నందరి సౌఖ్యము ల్నరసి యుంటకు నేమని జెప్పగా వలెన్ 

అనుభవ మ్మన రానిది యనుభ వమ్ము


స్వప్న   మందున గాంచితి స్వామి శివుని
పార్వ తీదేవి శ్రీరాము డుర్వి సుతను
నేమి భాగ్యము నాయది యిదియ యరయ
య నుభవ మ్మన రానిది యనుభ వమ్ము 

Wednesday, September 9, 2015

రామున కెచెందు నెల్లప్డు రాధ వలపు

అవని పుత్రిక సీతమ్మ యార్య ! వినుము
రామున కెచెందు నెల్లప్డు ,రాధ వలపు
చెందు నాకృ ష్ణ  పరమాత్మ డెంద మునకు
వలపు గలిగించు నాతడె వలచు మఱియు 

పద్య రచన -గాలి మేడలు

ఉన్న దానితో దృప్తిని నొందు చుండి 
జీవ నంబును సాగించు నెవరు  నైన 
సుఖము శాంతుల తోడన శోభి లుదురు 
కాక  యూహను గాలిలో కట్టు నట్టి 
మేడ  లన్నియు గూలును మిగలదేది 
కాన గాలిమే  డల నిక  కట్ట కెపుడు 

Tuesday, September 8, 2015

కాంతా రమ్మనెను మోక్ష కాముడు తమిన్


సాంతము  వినునా మాటను
కాంతా! రమ్మనెను మోక్ష కాముడు తమి
న్యాం త్రిక జీవన పరిధిని
మాం త్రికముగ దాటు కొఱకు మదినిం పలరన్ 

పద్య రచన -ముసలి దనము ,చేతి కర్ర


ముసలి దనమున కుగు ఱు తు , ముఖము వడలు
కాళ్ళు సేతులు బనిచేయ వెల్లపుడును
కఱ్ఱ యుండును జేతికి కాటి కరుగు
వరకు  హాహత  విధి,పగ  వా డికినిల
నుండ కూ డ దీ  యవస్థ  యొజ్జ లార !

Monday, September 7, 2015

పద్య రచన -విద్యా ధనం సర్వ ధన ప్రధానమ్

చోరుల కశక్య మైనది
గౌరవ మున్బుష్టి నిచ్చు క్రూ రత  తొలగు
న్భారము గాదెప్పు  డుమఱి 
యారయ యిది గొప్ప ధనము నన్నిటి కంటెన్ 

దేవు డే లేడ నెడువాడు దేవు డ య్యె


నాస్తికు డనబ డును గదా   నరుడు భువిని
దేవు  డే లేడ నెడువాడు  ,దేవు డ య్యె
మానవాకార  మందుండి మహితు డగుచు
రాక్షసుల జంపిన కతన  రాము  డరయ



Sunday, September 6, 2015

ఏనుగు చిట్టెలుక గాంచి యెంతొ భయ పడెన్


కానగ బోలును గొండను
నే నుగు, చిట్టెలుక గాంచి యెంతొ భయ పడె
న్సీ నయ  దాపున బోవగ
వీనుల నారవము వినుచు వివశత తోడన్  

పద్య రచన -నాట్యము


ముద్దు గుమ్మలు  నాట్యము ల్ముద్దు లొలుక 
చేయు చుండిరి  చూడుము చిత్ర మందు 
వారి  నృత్యభం  గిమము ల  నా ర యంగ 
కూచి పూడిని దోచెను కోమ లాంగి !

Saturday, September 5, 2015

పాపకర్ములు దుష్టులు భాగవతులు


చేయు చుందురు నిరతము శివుని నింద
పాపకర్ములు దుష్టులు,  భాగవతులు
భార ముంతురు మఱి భగ  వంతు పైన
కల్ల కపటమ్ము లేనట్టి యుల్ల మునన

పద్య రచన -వేమన

వేమన పద్యము లన్నియు 
నా మూలము జదువు నెడల నాతని వోలె
న్బా మరుడు గూడ నౌనుగ 
నీ మహిలో  గొప్ప యోగి యీ శుని గరుణన్ 

పద్య రచన -శ్రీ కృష్ణుడు -పార్ధుడు

చిత్ర మయ్యది జూడగ జిత్త మందు 
తోచె  మఱి నాకు కృష్ణుని తోడ కవ్వ 
డి,పలు కుచు వందనం  బులి   డియు న  టులుగ 
బాండు సూనుని  నమ్రత  వరలె నిట్లు 

Friday, September 4, 2015

గురు పూజోత్సవము


దైవముండును పలకడు ధరణి యందు-
- దర్శనంబది కష్టంబు తపముసేయ--
మార్గ దర్శకుడయ్యును మాటునుండు-
-కోరి నంతనె కనిపించు గురువొకండె. -
- గురువు పాదాలు తాకంగ కరుణ గలుగు
- గురువు దృక్కులు సోకంగ తెరవు దొరకు-
గురువు లాలింప ప్రేమలు పెరుగుచుండు-
-మాన్య గురువుల సతము నమస్కరింతు!!

--------పొన్న కంటి వారు ---------

అధ్యా పకు డనగ నెవ్వ డజ్ఞాని గదా

అధ్యయనము జేయుచుదను
నధ్యా పన  జేయునతడు నధ్యా పకుడౌ
మిధ్యా లాపము గలిగిన
న ధ్యా పకు డనగ నెవ్వ డజ్ఞాని గదా

ఉపాధ్యాయ దినోత్సవము

గురువున కిత్తును  నతులను
గురువుయె కద తల్లి దండ్రి గురువుయె దైవం 
గురువునె మఱి  పూజించిన 
గురువుయె యిక నిచ్చు మనకు గూరిమి ,దెలివిన్

శంకరుడు మొద  లుకొనుచు శంక రార్యు
లనడుమగలుగు గురువు ల  లహరి  నుండి
నాదు  గురుపరం  పరలకు నతుల నిడుదు
శతము కొలదిని  భక్తిని సవిన యముగ

Thursday, September 3, 2015

పద్య రచన -హనుమ -సూర్యుడు

ఫలమ యనుకొని  సూర్యుని బట్ట బోవ
కాలి  నీ మూతి  యె ఱ్ఱగ గంది పోయె 
నంత సాహసం బదియేల  హనుమ !నీకు ?
పట్టు కొంటివి చివరకు పగటి ఱేని


న్యస్తాక్షరి [య -తి -ప్రా -స } తేటగీతి

యముని మెప్పించి సావిత్రి హర్ష మునన 
తిరిగి యిచ్చు నటుల జేసె దీయ నైన 
బ్రాణములు భర్తవి యముని  బారి నుండి 
సతులు జేయలే నిదిలేదు జగము నందు 

భూమి -(ఆటవెలదిలో )

భూమి మనది  యరయ పుణ్యభూ మి య సుమ్ము
పుణ్య తీర్ధ ములను గణ్య ముగను 
కలిగి  యుంట వలన కామితార్ధములను 
దనర గూర్చు నార్య ! తప్ప కుండ 

భూమి తిరుగు చు దన   పుడమిప  రిధి లోన 
సూర్యు చుట్టు దిరుగు సొంపలరగ 
దాని వలన  కాల  మానమే ర్పడు గద 
రమ్య  మైన దిమన  జన్మ భూమి 

సుకవు లండ్రు ధరను స్వర్గ ము  కంటెను 
మిన్న యనుచు ,నిజమె  యెన్నగాను 
పంట లిచ్చు  నికను పండ్లు  కాయలు
ధనము  ధాన్య ములను దానె  యిచ్చు 

ఖనిజ  సంప దలను గ లిగియుం  డుదనలో
వెలికి దీయ నిచ్చు వేలవేలు 
పుడమి లేని యెడల పుట్టుకయే లేదు 
శూన్య మీజ  గమ్ము  మాన్యు లార !

మట్టి యనుకొ నకుడు మాణిక్య మేభువి 
వంద నములు సేతు వంద లాది 
పుడమి మాత కనిశ  ముసవినయముగ ను 
నాశిసు లను నిచ్చు  నాశ తోడ

భూమి తిరుగు సంద్రపు టుపరి తలమున
వేగ ముగగి రగిర రాగ మిడుచు
బొంగ రమ్ము వోలె భంగము లవడికి
గాన రాదు మనకు దాని చర్య

భరత మాత నుగని  భవ్యచ రితయయ్యె
పుణ్య పురుషు లగని  పూత యయ్యె
దేశ భక్తు లగని  దీ ప్తి నొం దెమిగుల
కవివ రులను గనియు గణుతి కెక్కె






Wednesday, September 2, 2015

పద్య రచన -ఉండేలు బద్ద -బాలుడు

ఉండేలు బద్ద జేకొని 
మొండిగ నట బాలుడొకడు మోదము తోడ
న్ఖండిత  రాళ్ళను  దరువున 
వెండియు వెంవే  యుచుండె  బిట్టల కొఱకున్ 

చట్రాతిని నారదీయ జయ్యన వచ్చున్


గట్రా చూలిగ దలతును
చట్రాతిని,  నారదీయ జయ్యన వచ్చు
న్మట్టను జీల్చిన పిమ్మట
బిట్టుగ  మఱి శక్తి కొలది పీకుచు దానిన్ 

Tuesday, September 1, 2015

రో గములొసంగు జనులకు భోగములను


క్రుళ్ళి నటువంటి  భోజ్యము ల్గుడుచు  నెడల
రో గములొసంగు  జనులకు, భోగములను
గలుగ జేయును రోగాలు గలుగు నెడల
నాసు పత్రుల యందున  హాయి గాను
-------
రోగముల వలన గలుగు రోదనములు
రోగములపహరించును రొక్కములిల
గార్య హానియు జేకురు గాక,యెట్టి
రోగము లొసంగు  జనులకు  భోగములను ?
---------కామేశ్వరరావు ------------

పద్య రచన -వడలు


దోరగ  వేచిన వడలవి 
నోరూ రెను  వాటి జూడ  నోముల పద్మా !
బేరము లాడక  నాకై 
కారము గాలేని దొకటి  క్రచ్చర దెమ్మా !