భూమి మనది యరయ పుణ్యభూ మి య సుమ్ము
పుణ్య తీర్ధ ములను గణ్య ముగను
కలిగి యుంట వలన కామితార్ధములను
దనర గూర్చు నార్య ! తప్ప కుండ
భూమి తిరుగు చు దన పుడమిప రిధి లోన
సూర్యు చుట్టు దిరుగు సొంపలరగ
దాని వలన కాల మానమే ర్పడు గద
రమ్య మైన దిమన జన్మ భూమి
సుకవు లండ్రు ధరను స్వర్గ ము కంటెను
మిన్న యనుచు ,నిజమె యెన్నగాను
పంట లిచ్చు నికను పండ్లు కాయలు
ధనము ధాన్య ములను దానె యిచ్చు
ఖనిజ సంప దలను గ లిగియుం డుదనలో
వెలికి దీయ నిచ్చు వేలవేలు
పుడమి లేని యెడల పుట్టుకయే లేదు
శూన్య మీజ గమ్ము మాన్యు లార !
మట్టి యనుకొ నకుడు మాణిక్య మేభువి
వంద నములు సేతు వంద లాది
పుడమి మాత కనిశ ముసవినయముగ ను
నాశిసు లను నిచ్చు నాశ తోడ
భూమి తిరుగు సంద్రపు టుపరి తలమున
వేగ ముగగి రగిర రాగ మిడుచు
బొంగ రమ్ము వోలె భంగము లవడికి
గాన రాదు మనకు దాని చర్య
భరత మాత నుగని భవ్యచ రితయయ్యె
పుణ్య పురుషు లగని పూత యయ్యె
దేశ భక్తు లగని దీ ప్తి నొం దెమిగుల
కవివ రులను గనియు గణుతి కెక్కె
భూమి తిరుగు సంద్రపు టుపరి తలమున
వేగ ముగగి రగిర రాగ మిడుచు
బొంగ రమ్ము వోలె భంగము లవడికి
గాన రాదు మనకు దాని చర్య
భరత మాత నుగని భవ్యచ రితయయ్యె
పుణ్య పురుషు లగని పూత యయ్యె
దేశ భక్తు లగని దీ ప్తి నొం దెమిగుల
కవివ రులను గనియు గణుతి కెక్కె
No comments:
Post a Comment