Wednesday, April 2, 2025

విశ్వావసు నామ సంవత్సరము

 విశ్వావసు యుగాది: 

ఓ విశ్వావసు నామ వత్సరమ పౌరోద్యోగ సంధాత్రివై  

భావోద్రేక వినాశకారిణివి నై భద్రార్థ సంరంభివై 

దైవానుగ్రహ పాత్రులై జనులు నిత్యంబుండు నట్లింపుగా 

వే వీక్షింపుమ శాంతి సౌఖ్యము లిలం బెంపొంద నిమ్మా దయన్


విశ్వక్షేమ రతాంతరంగ వికసద్విశ్వావసూత్తుంగ నా

మైశ్వర్యప్రమ దాయు రుచ్చతమ విద్యా కార్య సంధాయకీ  

శశ్వల్లోక జనౌఘ వర్ధన సు రక్షాదక్ష విఖ్యాత మ

మ్మాశ్వాసింప దయార్ద్ర చిత్త వయి రమ్మా వర్ష వర్గాగ్రణీ

   

అలసిరి జనులీ క్రోధిని 

నల పొసఁగక సుఖ మొసంగ నందఱి కిలలోఁ 

జెలువము మీఱఁగ వత్సర

లలామ విశ్వావసు వెస వ్రాలుమ జగతిన్

Thursday, December 12, 2024

Drawig mater

 సోదర తుల్యులు శ్రీ డ్రాయింగు మాస్టరు గారికి  శ్రద్ధాంజలి

--------------------------------

లేవు లేవాయె  యికమాకు లేవు నీవు

కాన రానట్టి దూరమ్ము  గడచి నావు 

మాయ మర్మము  లెఱు గని  మనిషి వీవ 

సాటి  యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?


ఆశ లేదయ్య  నీకుగా నాశ లేదు

ఉన్న దానితో సంతృప్తి నొంది తీవు

నీవు చేసిన సేవలు నిండు హృదిని

 భద్ర పఱతుము నిక్కము భవ్య చరిత!


రక్త బంధమ్ము  మనమధ్య మృగ్యమైన 

బావయంచును బిలిచెడు వాడవీవు 

నీదు ప్రేమకు చిహ్నము నిజము గాను 

దివిని చూచుట కేగిన ధీర వర్య!


ఏమి  నేరము జేసితి  మింత లోన

విడిచి పోతిరి మమ్ముల విడిచి యిచట

నీదు రాకకు మేమిట యెదురు చూతు

మయ్య !రాగదే వేవేగ యార్య బావ !


 సకల శుభములు గలిగించు శంకరుండు  

నీకు శాంతిని జేకూర్చి నిన్నుఁగాచు 

నశ్రు పూరిత నయనాలఁగోరు చుంటి 

యందుకొనుమయ్య శ్రద్ధాంజ లందుకొనుము.

ఇట్లు 

పెద్ద తెలుగు మాస్టరు

18-12- 2024

Saturday, July 6, 2024

సమస్యాపూరణము

 [12/05, 11:23 am] subbarao airtel: పావన మూర్తులు వారలు 

భావింపఁగ శౌర్యవరులు భరణిని సుమ్మీ 

సేవింపగ వారి నెపుడు 

ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్

[12/05, 11:31 am] subbarao airtel: ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్”

[13/05, 1:01 pm] subbarao airtel: కొండపై నున్న దేవుని గుండె రాయి”

(లేదా...)

[13/05, 1:23 pm] subbarao airtel: ఎన్ని మ్రొక్కులు మ్రొక్కిన నెంత వేడ 

కరుణఁ జూపడు సరికదా కలుగఁజేయు

కష్టము

[13/05, 3:08 pm] subbarao airtel: ఎన్ని మ్రొక్కులు మ్రొక్కిన నెంత వేడ 

కరుణఁ జూపడు సరికదా కలుగఁజేయు నిడుము 

కొండపై నున్న దేవుని గుండె రాయి 

యనెడు వచనము సత్యమె యక్షరాల

[13/05, 3:20 pm] subbarao airtel: దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను కొండ కోనలన్ 

నావచనంబుసత్యములు నంతియెచెప్పుమ నీరజాక్షి!నీ 

భావము కూడ తెల్పుమిఁక భర్గుని డెందము జాలి గుండెయా? 

కావును నెల్లవేళలను గాతరమొందిన భక్తకోటినిన్

[14/05, 10:24 am] subbarao airtel: రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్”

[14/05, 10:26 am] subbarao airtel: ఎన్ని మ్రొక్కులు మ్రొక్కిన నెంత వేడ 

కరుణఁ జూపడు సరికదా కష్టమిడును

కొండపై నున్న దేవుని గుండె రాయి 

యనెడు వచనము సత్యమె యక్షరాల

[14/05, 11:37 am] subbarao airtel: కోమలి సీతాదేవిని

గోముగఁదావెదకి యచటకువలయ సుతదౌ

సేమముఁదెలుపుట కొఱకై 

రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్

[14/05, 11:38 am] subbarao airtel: రాముఁడు పిల్చినన్ హనుమ రాననె రావణుఁ గొల్వ నెంచియున్”

[14/05, 2:21 pm] subbarao airtel: రాముఁడు పిల్చినన్ హనుమ రాననె రావణుఁ గొల్వ నెంచియున్ 

భామరొ! వింతపోకడలు భైరవు మాటను లెక్క చేయడా?  

రాముని కోపధాటికిల రంజన మందున నిల్వనోపునే? 

రాముఁడు లోకమంతటిని రంజిలఁజేయును బాలనంబునన్

[14/05, 2:32 pm] subbarao airtel: రాముఁడు పిల్చినన్ హనుమ రాననె రావణుఁ గొల్వ నెంచియున్ 

భామరొ! వింతపోకడలు భైరవు మాటను లెక్క చేయడా?  

రాముని కోపధాటికిల రావణుఁడియ్యెడ  యోర్వనోపునే?

రాముఁడు లోకమంతటిని రంజిలఁజేయును బాలనంబునన్

[15/05, 10:13 am] subbarao airtel: కవికంటెను మేలు గాదె గాడిద భువిలో

[16/05, 1:07 pm] subbarao airtel: సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు

[16/05, 2:06 pm] subbarao airtel: పంట పొలముల సాగును బాడు చేయు 

మూషికములను జంపనౌ పూర్తిగాను 

సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు 

నాహరించుట మూలాన యదియ జరుగు

[16/05, 2:07 pm] subbarao airtel: సంతతి వృద్ధి సేసినవి సర్పము లీభువి మేలుఁ గోరుచున్”

[16/05, 2:32 pm] subbarao airtel: సంతతి వృద్ధి సేసినవి సర్పము లీభువి మేలుఁ గోరుచున్ 

వింతగ నుండెయీపలుకు బేరిమి తోడన వృద్ధి చేసెనా? 

యంతముఁజేయునే మనిషి యాకృతి కంటికి గానిపించుచో 

కంతలు సేయుచున్  శరము కాటును వేయుచు నాక్షణంబునన్

[16/05, 2:38 pm] subbarao airtel: సంతతి వృద్ధి సేసినవి సర్పము లీభువి మేలుఁ గోరుచున్ 

వింతగ నుండెయీపలుకు బేరిమి తోడన వృద్ధి చేసెనా? 

యంతముఁజేయునే మనిషి యాకృతి కంటికి గానిపించుచో 

కంతలు సేయుచున్  మెయిని కాటును వేయుచు నాక్షణంబునన్

[17/05, 10:38 am] subbarao airtel: సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్”

(లేదా...)

[17/05, 11:14 am] subbarao airtel: చోరుని కడుహింసించిన 

చోరత్వము మానఁడతఁడు ,చుక్కలు పొడవన్ 

చొరబడ యత్నముఁజేయును 

సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్

[17/05, 11:17 am] subbarao airtel: సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్”

[17/05, 12:09 pm] subbarao airtel: చోరుని చూచియా వనిత చోరుఁడ యంచును గేక వేయగా 

వారును వీరునున్  పరుగు పర్గున నాతని కట్టి కొట్టగా

[17/05, 12:18 pm] subbarao airtel: చోరుని చూచియా వనిత చోరుఁడ యంచును గేక వేయగా 

వారును వీరునున్  పరుగు పర్గున నాతని కట్టి కొట్టగా

భైరవమించుకైన మది పట్టక చోరగుణంబుమానకే 

సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్”

[17/05, 12:21 pm] subbarao airtel: చోరుని చూచియా వనిత చోరుఁడ యంచును గేక వేయగా 

వారును వీరునున్  పరుగు పర్గున నాతని కట్టి కొట్టగా

భైరవమించుకైన మది పట్టక యేగును దొంగ వానిగన్

సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్”

[18/05, 10:46 am] subbarao airtel: యువతినిఁ బెండ్లాడె వనిత యొప్పఁగ విబుధుల్

[18/05, 3:20 pm] subbarao airtel: అవయవ పుష్టిం గలిగిన 

యువతినిఁ బెండ్లాడె ,వనిత యొప్పఁగ విబుధుల్ 

వివరించిన పాఠములను 

నవగాహనఁజేసికొనుచు ఠు

[18/05, 3:56 pm] subbarao airtel: అవయవ పుష్టిం గలిగిన 

యువతినిఁ బెండ్లాడె ,వనిత యొప్పఁగ విబుధుల్ 

వివరించిన పాఠములను 

నవగాహనఁజేసికొనుచు  నచ్చెరువందెన్

[18/05, 3:58 pm] subbarao airtel: యువతిన్ బెండిలియాడె నొక్క జవరా లోహో యనన్ బండితుల్”

[20/05, 11:59 am] subbarao airtel: పద్మనాభుని దూరిరి భక్తులెల్ల”

(లేదా...)

[23/05, 2:04 pm] subbarao airtel: గర్భముం దాల్చె నా పతి గౌరవముగ”

(లేదా...)

“గర్భముఁ దాల్చె నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్”


కంది శంకరయ్య వద్ద 5/22/2024 09:00:00 PM

[23/05, 2:12 pm] subbarao airtel: లింగ మార్పిడి యగుటన యంగనవలె 

గర్భముం దాల్చె నా పతి గౌరవముగ 

నెలలు నిండిన తదుపరి నీరసపడి 

పనస పండును బోలెడు పట్టిఁగనెను

[23/05, 2:16 pm] subbarao airtel: “గర్భముఁ దాల్చె నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్”

[23/05, 2:38 pm] subbarao airtel: అర్భకు వోలెఁగాక తను హర్షము తో డన లింగ మార్పిడిన్ 

నిర్భయ మొందగా జరుగ నేరపు భావన లేకసంతుకై 

గర్భముఁ దాల్చె నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్

[23/05, 2:43 pm] subbarao airtel: అర్భకు వోలెఁగాక తను హర్షము తో డన లింగ మార్పిడిన్ 

నిర్భయ మొందగా జరుగ నేరపు భావన లేకసంతుకై 

గర్భముఁ దాల్చె నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్ 

దుర్భరమైననున్  గనెను దొడ్డగుణంబులు గల్గు పుత్రునిన్

[24/05, 9:15 am] subbarao airtel: కుంతిసుతుఁడు వాలియె నలకూబరు గెల్చెన్”

[25/05, 9:27 am] subbarao airtel: తార్క్ష్యుని పదములకు మ్రొక్కె దామోదరుఁడే”

[28/05, 9:49 am] subbarao airtel: సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్”

(లేదా...)

[02/06, 2:03 pm] subbarao airtel: కృష్ణుఁడె బెండ్లాడెను గద కృష్ణనుఁ బ్రేమన్

[03/06, 1:24 pm] subbarao airtel: ఆకారంబును జూడగ 

శ్రీకారముఁ జుట్టినట్లు చెలువముఁదోడన్ 

హ్రీంకారపు నామముతో 

సాకారముఁజేసికొనెను సతతము బ్రదుకున్

[04/06, 10:52 am] subbarao airtel: సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె

[11/06, 11:22 am] subbarao airtel: ఆంగ్ల  ప్రభువుల సంకెళ్ళ బారినుండి 

బంధ  నిర్వ్రతి కొఱకునై  గాంధితాత

శాంతి యుతముగఁబోరాడి  యంతిమముగ 

శస్త్రసన్యాసముం జేసి జయమునందె

[15/06, 2:02 pm] subbarao airtel: అతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ”

[15/06, 2:19 pm] subbarao airtel: అతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ”

సతులను జూడగావలపు సాకునజేరుచుమాయమాటలన్ 

సతతమునమ్మజేయుచును సారెకుసారెకు తాక దేహమున్  

బతనమునొందుఁదప్పకను బండరినాధుని గోప మంటకున్

[26/06, 2:26 pm] subbarao airtel: వివశతతోవరూధినట విహ్వలనొందుచు చూచుచుండ వి 

ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్

[26/06, 2:41 pm] subbarao airtel: ప్రవరుని జూచిమోహమునఁబైబడివాంఛ నుదెల్ప నంతటన్  

జవనికి చెప్పవిప్రుఁడిటు చాలను దీర్చగనీదుకోరికన్  

వివశతతోవరూధినట విహ్వలనొందుచు చూడమాయ వి 

ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్

[28/06, 2:33 pm] subbarao airtel: చిరకాలంబును నుండియున్ దనకు దాసేవానుసంధానమున్  

గరముంజేయగ సంతసిల్లుచును  సాక్షాత్కార మీయంగ నౌ 

నరసింహాకృతి నుద్భవించెఁ గలి నానాభీతులం గూర్చఁగన్ 

బరమామోదముఁజెందునట్లుగను నాప్రహ్లాదుడెందంబిలన్

Saturday, February 24, 2024

wishes

 good afternoon

Sunday, November 12, 2023

శ్రీపతి శశికాంత్ ,మంజూషల వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.


శ్రీపతి వంశ భూషణుఁడ! శీతమయూఖుని కాంతి నొప్పుచున్   

ఱేపగ లెల్లవేళలను బ్రీతిమనంబున  బంధుకోటికిన్ 

బ్రాపుఁగ నుండువే, నిజము పైకము లిచ్చుచు బీదసాదకున్  

మాపులు ఱేపులున్ భవుఁడు మాన్యత తోడను రక్షసేయుతన్ .


వరుఁడు పుట్టెను శ్రీపతి వంశమందు 

మగువ మంజూష యుదయించె మాచిరాజు 

వంశమందున గారాల పట్టి వోలె 

శివుఁడు కలిపెను వీరిని శ్రేయముగను 


శ్రీలు బొంగెడు కళ్యాణ సీమయందు 

వివిధ రకముల వాద్యాలు వీనులలరి

వేదమంత్రాలు సదువగ విబుధు లచట 

శ్రీనివాసుని సాక్షిగాఁ జేయికలుపు


అమ్మా మంజూష!


తల్లిదండ్రుల గారాబు తనయవగుచు  

ముద్దమందార పుష్పమై ముద్దులొలుకు 

బాల! కుడిచేయి చిటికెన వ్రేలు నిచ్చి 

శశిని బొందుము మంత్రాల ఝరుల మధ్య.


అమ్మ నాన్నల విడిచియు నరుగు వేళ

బెంగయుండును నిజముగ బేల! యపుఁడ

యత్త యందున జూడుమ యమ్మ నికను 

గుదుట పడునమ్మ నీహృది కోమలాంగి!


మానవత్వంబు  తోడను మసలుగొనుచు 

మానినులయందగుచుఁ దలమానికముగ 

బిల్లపాపల తోడను జల్లగాను 

నిండు నూరేళ్ళు బ్రదుకుమాy నెమ్మనమున.


నూతన దంపతులకు  ఆశీస్సులతో...

పోచిరాజు సుబ్బారావు

Saturday, December 3, 2022

నాన్న పుట్టిన రోజు సందర్భము

 తరణార్థంబు భవాబ్ధి వ్రాసితివి గీతాసార భాష్యమ్మునున్
విరియం జేసితి పుష్ప సంచయము సావిత్రీ కథాగమ్మునం
బర భాషామృత భాండ మిచ్చితివి వప్తా సంయమీంద్రత్వమున్
వరమై యొప్పగ నిన్ను గొల్చెదము నీ పాదద్వయం బానుచున్

నర వంద్యోత్తమ సేద దీరితి శివానందద్రుమచ్ఛాయలన్
దరిఁ జేరంగఁ దలంచి వింటి వట సత్యానంద సద్బోధలం
బరమానందము నొందవే రమణ దేవజ్యోత్స్నధామంబునన్
సరి లేరెవ్వరు నీకుఁ దండ్రి యిల సంసారంపు సన్యాసివే            

మాన ధనుండు గ్రామ జన మండిత తత్త్వ విశోధకుండు స
త్సూనృత గీతసార పరిశోధిత  మానస భాసమానుఁడున్
మానిత వేద సూక్త పరిమాణ మహోదయ కావ్య రాజ సం
ధానుఁడు సత్యవంత వర దార చరిత్ర మనంగ ధాత్రినిన్                

సత్యాధ్యాత్మిక చింతనా కలిత భాస్వద్జ్ఞాన సంభావ్యుఁడున్
నిత్యోద్దీపిత పద్య కీర్తిత మహానీలాంగ విష్ణుండు నౌ
న్నత్యభ్రాజిత వర్తనుండు స్వపురీ నాథత్వ ధౌరేయుఁ డా
రాత్యామ్నాయ విహీనునిం గొలుతుఁ బేర్రాజాఖ్య విఖ్యాతునిన్        

దొడ్డవరంబు నాఁ బరఁగు దొడ్డ పురమ్ము సలీలఁ గాచి తీ
వడ్డము లేని చందమున వ్యర్థపుఁ బల్కుల సంహరించుచున్
దుడ్డున కీక విస్తరము దోరపు గడ్డగు కాల మందునన్
గొడ్డము లెన్ని వచ్చినను గుండె దిటమ్మున నుంటి విద్ధరన్                 

ఫల్గు దురంత కార్యచయ భంజన! చిత్తము నందు స్వార్థమే
కల్గ నెఱుంగ వీ వెపుడుఁ గామ మదోద్ధృత ఖాండ వాటవీ
ఫల్గుణ! బంధు మిత్ర జన వర్గ సమంచిత పూజ్య పూరుషా!
వెల్గితి వీవు దొడ్డవర వీర్య జనప్రవ రాధి నేతవై                        

శత వర్షంబులు గాంచఁ జాగినను మా స్వాంతమ్ము లందుండు నీ
దు తలంపుల్ నెఱి నింపుఁ జిత్తముల సంతోషామృతద్రోణి నీ
వితతస్ఫూర్తి వచో నికాయ మొసఁగున్ విజ్ఞాన విత్తమ్ములం
బితృలోకాంతర వాస! మమ్ముఁ గరుణన్ వీక్షించి దీవింపుమా!            

జననం బంది సు కౌశి కాన్వయమునన్ సద్బ్రాహ్మణజ్యోత్స్నఁ జి
ద్ధన రాజత్కపిలేశ్వరాఖ్య పురి విద్యాశుద్ధ చేతస్కుఁడై
మనమం దెన్నఁడు విష్ణు నామ రతి నే మాత్రమ్ము క్షీణింప నే
రని వృత్తమ్మున గ్రామపాలకుఁడు బేర్రాజాఖ్య జీవించెనే                

చిరకాలమ్ము సనాతనార్ష గుణ సంశ్లేషైక సన్మానసుం  
బర మార్థాతత శోధనార్థ పరితప్తస్వాంత సంచారినిన్  
గురు సేవానుగ తాఖిలాంచిత మహా గుప్తార్థ విజ్ఞానినిన్
దరహాసాస్య విరాజమాన జనకున్ ధాతాభునిం దల్చెదన్             

శ్రీకృష్ణార్పిత నిర్మ లాతిశయ చిచ్చేతో మహాంభోధికిన్
రాకా పూర్ణ సుధాకరుండ వయి భార్యా పుత్ర బంధమ్ముతో
నేకాంతస్థిర భావ మగ్నుఁడవు విశ్వేశున్ మదిన్ నిల్పి ని
త్యైకాగ్రస్ఫుట రక్తి నుంటి విట సత్యాకాంక్షఁ దండ్రీ మహిన్

Saturday, September 10, 2022

కవిసామ్రాట్ విశ్వనాథవారి జయంతి


డా.బల్లూరి ఉమాదేవి

  అంశం:విశ్వనాథ సత్యనారాయణగారు.


ఆ.వె:చెళ్ళపిళ్ళ వారి శిష్యుడి గా విద్య

        నేర్చి నట్టి గొప్ప నేర్ప రితడు

        అన్ని ప్రక్రియల ను నలవోక గా వ్రాసి

         మన్న నంది నట్టి మాన్యుడితడు.


ఆ.వె:అవిరళ కృషిచేత నభ్యాస బలముచే

         వ్రాసె కావ్యములను రమ్యముగను

          రామకథను కూర్చి రక్తి కట్టించిన

          గొప్ప కవివరుండు కువలయాన.


ఆ.వె: వేయిపడగలనెడి విస్తృతగ్రంథమున్

       వ్రాసి మెప్పునందె వసుధ యందు

        నాంధ్ర పౌరుషమ్ము నందముగాచాటి

           ఖిలము కాని యట్టి కీర్తి నందె.


ఆ.వె:సంప్రదాయములకు చక్కని పాదును

        కూర్చిన కవివరుడు కువలయాన

       విశ్వనాథ పేరు విననివారుండరు

       తెలుసుకొనుము నీవు తెలుగు బాల.


ఆ.వె:విశ్వమెరిగినట్టి విశ్వనాథుడితడు

            రామకథను వ్రాసె రమ్యముగను

           జ్ఞానపీఠమందె ఘనముగా నీతడు

           కూర్చె నెన్నొ కథలు కువలయాన.


ఆ.వె:ధర్మ స్థాపనమ్ము ధరలోన చేయంగ

         నెంచి తాను కూర్చె మంచి కథను

       వేయి పుటలయందు వేయిపడగ లను

        నాణ్యమైన యట్టి నవల వ్రాసె.


ఆ.వె:వాణిపుత్రుడితడు వాగ్ధాటి చూపుచు

         కమ్మనైన యట్టి కావ్యములను

      వ్రాసి ఖ్యాతి గాంచె వసుధలో నీకవి

      మేలుమేలటంచు మెచ్చిరెల్ల.


ఆ.వె:విశ్వమెల్ల ప్రాకె విశ్వనాథుని ప్రభ

    తెలుగు తల్లి మురిసి దీవనొసగె   

    సంప్రదాయములకు సముచితస్థానము

  నిచ్చినట్టి కవియు నితడె భువిని.