Sunday, November 12, 2023

శ్రీపతి శశికాంత్ ,మంజూషల వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.


శ్రీపతి వంశ భూషణుఁడ! శీతమయూఖుని కాంతి నొప్పుచున్   

ఱేపగ లెల్లవేళలను బ్రీతిమనంబున  బంధుకోటికిన్ 

బ్రాపుఁగ నుండువే, నిజము పైకము లిచ్చుచు బీదసాదకున్  

మాపులు ఱేపులున్ భవుఁడు మాన్యత తోడను రక్షసేయుతన్ .


వరుఁడు పుట్టెను శ్రీపతి వంశమందు 

మగువ మంజూష యుదయించె మాచిరాజు 

వంశమందున గారాల పట్టి వోలె 

శివుఁడు కలిపెను వీరిని శ్రేయముగను 


శ్రీలు బొంగెడు కళ్యాణ సీమయందు 

వివిధ రకముల వాద్యాలు వీనులలరి

వేదమంత్రాలు సదువగ విబుధు లచట 

శ్రీనివాసుని సాక్షిగాఁ జేయికలుపు


అమ్మా మంజూష!


తల్లిదండ్రుల గారాబు తనయవగుచు  

ముద్దమందార పుష్పమై ముద్దులొలుకు 

బాల! కుడిచేయి చిటికెన వ్రేలు నిచ్చి 

శశిని బొందుము మంత్రాల ఝరుల మధ్య.


అమ్మ నాన్నల విడిచియు నరుగు వేళ

బెంగయుండును నిజముగ బేల! యపుఁడ

యత్త యందున జూడుమ యమ్మ నికను 

గుదుట పడునమ్మ నీహృది కోమలాంగి!


మానవత్వంబు  తోడను మసలుగొనుచు 

మానినులయందగుచుఁ దలమానికముగ 

బిల్లపాపల తోడను జల్లగాను 

నిండు నూరేళ్ళు బ్రదుకుమాy నెమ్మనమున.


నూతన దంపతులకు  ఆశీస్సులతో...

పోచిరాజు సుబ్బారావు

No comments:

Post a Comment