Saturday, February 6, 2010

మెరామెక్ గుహలు-ఇతర స్థలములు

ది .౧౪-౧-౨౦౧౦ తేది గురువారము ఉదయము ౧౦ గంటలకు బయలు దేరి సాయంత్రము ౪-౧౫ నిమి ష ములకు మె రా మె క్ గుహలకు చేరి కొంటిమి .౪-౩౦ నిమి ష ముల తర్వాత ఆ గుహల లోనికి ప్రవే శ ము లేదు .మా తర్వాత ఒక జంట వచ్చిరి .టిక్కె ట్టులు కొని లోపలకు వెళ్లి తిమి .ఆ గుహల క్రింద నుండి మె రా మెక్ అను నది ప్రవ హించు చున్నది .ఆ నది యెంతో లోతు లేక పోయిననూ కరెంటు దీ పాల మూ లంగా చాల లోతు ఉన్నట్లు గా కన బడు చున్నది .లోపల కొండ తాలూకు ద్రవపూం చారలు మఱ్ఱి ఊ డల వలె చాల బాగున్నవి .కరెంటు దీ పపు కాంతు ల తొ మెరియు చున్నవి .ఇద్దరు దొంగలు దోచుకున్న ధనముతో ఆ గుహ లోనికి వెల్లిరట. దానిని స్థా నికులు చూఛి ఆ గుహను యాత్రా స్థ లము గా మార్చిరట.ఆ గుహలు వేల సంవత్సరముల క్రిందటే ఏ ర్ప ద్దాయిట. ఒక ఫార్మేషను రావడా నికి సుమారు ౧౦౦ సంవత్సరములు పడుతుందట.ఆ గుహలను జే మ్సు అను దొంగ కని పెట్టాడుట .ఆ గుహ మొత్తము ౭ ఫ్లో రులు .౫ వ ఫ్లో రు వరకు మాత్రమే అనుమతి ఉంది .ఒక చోట సినిమా దియేటరు వలె ఫార్మేషను ఉంది .దానిని కరెంటు దీ పాలతో ఉంది .చివరగా అమెరికా దేశపు జెండా బాగా వెలుగులో కనిపించినది .అది చూసి రాత్రికి హిల్టన్ హోటల్ కి వెళ్లి ఆ రాత్రి అక్కడ బస చేసాము .
ఉగాది శుభా కాంక్షలతో కేంపు ============
ది .౧౬-౩-౨౦౧౦ వ తే ది ఉగాది రోజున కిరణ్ తో సియా టెల్సుకు విమానములో
వెల్లి తిమి .మైక్రో సాఫ్టు అధిపతి యైన బిల్ గే ట్సు స్వగ్రామము .అక్కడ గల వాషింగు తన్ లేకు దరినే ఆయన ఇల్లు ఉందిట .ఆ సాయంత్రానికి హోమ్ ఉడ్ స్యూట్సు అను హోటలు కి వచ్చితిమి .అక్కడకు దగ్గర గా నే రెడ్ మాండు సిటి గలదు .అది యే మైక్రో సాఫ్టు .బిల్ గే ట్సు ప్రపంచ ధనికులలో రెండవ వాడు .నిన్న ఓ హేర్ విమానాశ్రయములో
విమాన మెక్కి డెన్వెర్ విమానా శ్ర యములో దిగి అక్కడ ఒక గంట విరామము .మరల
అక్కడ విమానమెక్కి సియాటేల్సు లో దిగి కారులో రెడ్మాండు వెళ్లి అక్కడ మయూరి
అను నెల్లూరు వారి హోటలు లో లంచు చేసి సియాటేల్సు వెళ్లి రూంకి వెళ్ళాము
ఈ రోజు అనగా ౧౭-౩-౨౦౧౦ తేదిన కారు హేండు ఓవరు చేయడానికి డౌన్ టౌన్ కి వెళ్లి హేండు ఓవరు చేసాము ;కారు పార్కింగు కు ౧౦ లేదా ౧౨ ఫ్లోరులు ఉంటాయి .
ఈ షియా టెల్ వాషింగుతన్ స్టేటు లో ఉన్నది .ఇక్కడి బస్సులు కరెంటు ద్వారా
నడుస్తాయి .ఈ సిటి లోనే విమానములు తయారగును .ఇక్కడ నుండియే అన్ని దేశాలవారు విమానాలను కొనుక్కుంటారు .ఇక్కడి భవనములు ఒక్కొక్కటి సుమారు ౫౦ ,౬౦ ఫ్లోరు లు ఉంటాయి .కారు పార్కిన్గుకే ౧౦ ,౧౫ ఫ్లోరులు ఉంటాయి .
౧౯-౩-౨౦౧౦ న మధ్యాహ్నము హోటలు వారి కారు లొ వెస్టు లేకు సెంటరు కి
వెళ్లి అక్కడ మోనో రైలు సెంటరు దగ్గర రైలు ఎక్కి స్పేసు నీ డు టవరుకు వెళ్లి
లిఫ్టులో పైకి ఎక్కాము .ఆ టవరు ౫౨౦ అడుగుల ఎత్తు ఉన్నది .అక్కడ పైన చూస్తే
పసిఫిక్కు మహా సముద్రపు ఓడల రేవును చూసాము .అక్కడ దూ రానికి మంచు
పర్వతాలు కనిపించాయి .సాయంత్రము ౪ గంటలకు ఇంటికి చేరాము .
హోటలు అడ్రస్సు =హోము ఉడ్ స్యూట్సు బై హిల్టన్ ,సియాటిల్ -కాన్వెన్షన్ సెంటర్
పిక్ స్ట్రీట్ ,౧౦౧౧ పిక్ స్ట్రీట్ ,సియాటెల్ ,డబ్ల్యు ఏ .౯౮౧౦౧ .-౧-౨౦౬-౬౮౨-౮౨౮౨.

ది .౨౦-౩-౨౦౧౦ వ తేది శనివారము మధ్యాహ్నము కారులో ఎవరెట్టు అను సిటీకి
వెళ్ళాము .కారు రఘు అను కిరణు స్నేహితుడు . అతడు రెడ్మాండు లో ఉంటాడు .
అతని ఇంటికి టూరు అయిన తరువాత వెళ్లి మయూరి హోటలులో టిఫిను చేసాము .
ఎవరెట్టు లో గ్రౌండ్ ఫ్లోరులో విమానముల నమూనాలు విడి విడి భాగాలుగా చూపించిరి
అవి బ్లోయింగు విమానములు .అది అతి పెద్ద విమానాల కర్మాగారము . తరువాత
బస్సు లో ౭౪౭ నెంబరు విమానములు తయారు చేయు షెడ్డు కి వెళ్ళాము .అక్కడ
అయిదారు విమానములు తయారగు చున్నవి .అది ఒక పెద్ద షెడ్డు .మొత్తము
అరవయి లక్షల మంది ఉద్యోగులు .అది చూసిన తరువాత ౭౮౭ నెంబరు విమానములు తయారు చేయు షేడ్డుకి వెళ్ళాము .అక్కడ ఏడెనిమిది విమానములు
తయారగు చున్నవి .౭౭౭ నెంబరు విమానమును మన భారత దేశము కొనుగోలు
చేసినదని సూ చనగా ఆ విమానము మీద ఎయిరు ఇండియా అని వ్రాయ బడినది .
అక్కడ ౭౩౭ ,౭౪౭,౭౬౭,౭౭౭,౭౮౭, నెంబరుల విమానములు తయారు చేయు చున్నారు .విమానముల ఫ్రంటు పైలట్టు ఉండు భాగము .మధ్యన పాస్సింజరులు
ఉండు భాగము చివర భాగము సామానులు వేయు భాగములు విడి విడిగా ప్రదర్శన
లో భద్ర ప ర చిరి .౭౪౭ నెంబరు విమానము ఎక్కువ టెక్నాలజీతో ను ౭౮౭ నెంబరు
విమానము తక్కువ టెక్నాలజీ తో తయారు కాబడుతోంది అని చెప్పారు .
సియా టెల్ లో కూడ ఒక మినీ బోయింగు విమానము లు తయారు చేయు కర్మాగారము ఉన్నది.

ది. ౨౭-౩-౨౦౧౦ తేది .శ నివారము ౧౦౦ మైళ్ళ దూరము లొ గల మౌంట్ రైయనిర్
అను చోటికి కారు లొ వెళ్ళాము .అది ఒక పెద్ద కొండ .౨౪౦౦౦ అడుగుల ఎత్తులో
ఉన్నది .ఎత్తులో హిమాలయముల కన్నా సగము .అది అంతయు మంచు
మయము .కొండయె మంచు కొండ. మంచు కొండ పైకి ఎక్కాను .దిగడము కష్ట మైనది.

రె యినీ రు కొండ చూసితి
రె యి నీ రె మంచు మయము రేయిం బగలున్
రె యి నీ రొక కైలాసము
రె యి నీ రే మూడు మైళ్ళు నెత్తున నుండెన్ .

దారి పొడుగున నడవులు దారి యియ్య
పైను వృక్షాల సొగసుకు బైర్లు కమ్మ
సాగినది మాదు పయనము సంత సమున
భరత దే శ పు వాసిగా భాగ్య మదియ .

కొండ దారికి ప్రక్కల గోడ లుండె
గోడ లన్నియు మంచు తొ కూడి యుండె
చూడ ముచ్చట గొల్పును చూపరులకు
చూడ మీరును వేవేగ రండి తరలి.

శి ఖరముల మిన్న రెయనీ రు శి ఖర మరయ
కొండ కొండల నడుమన నొదిగి యుండె
వర్ణ ణీ యంబు గాదది నలువ కైన
చిత్రములు గాదె యీ శ్వర కృతము లకట .

ఎవరెస్టు శి ఖర మయ్యది
ఎవరెస్టును నెక్క గలమ ఏనాడైనన్
ఎవరెస్టు పొడవు నరయగ
నీ వనియే మైళ్ళు నార నిప్పుడ యనఘా !


ది.౨౮-౩-2010వ తే ది .ఆదివారము మౌంటు హెలెను అను అగ్ని పర్వతము గే ట్లు మూసి వేయడము చేత అక్కడకు వెల్ల లేదు. తుల్పి టౌను కు వెళ్ళాము. అది స్కాగితు వాలీ .అక్కడ అనేక రకముల పూ లు మనోహరము గా ఉన్నవి.మొక్కల ఆకులు ప్లాస్టిక్కును పో లి యున్నవి. అక్కడ గుర్తుగా రంగు రంగుల పతంగములు ఆకా శ మున రెప రెప లాడు చున్నవి.అక్కడి నేల యంతయు నల్ల రేగడి నే ల.అక్కడి పూ లు ముదురు ఎరుపు ,తెలుపు,పింకు కలరు, పర్పులు కలరు ఉండి అన్నియు కలువ పూ ల వలె యున్నవి.అక్కడ ఉన్న పూ ల రకములు.ఆరంజి క్లొ,కాస్మో , అలస్క స్టార్ ,హావరోన్,కేన్దిaఆపిలు , మే జిక్ లావెండర్ , మున్లైట్టు ,ఆరెంజు ,నంబర్ ౫౨౬ , పింకు గ్లోరి మొద లుగా చాల రకములు గలవు.

రకరకముల పూ మొక్కలు
రకరకముల పూ లతోటి రంగులు విచ్చన్
సకలము తోటను జూచితి
నాస్కా జితు వేలి నందు నబ్బుర మయ్యెన్ .

















No comments:

Post a Comment