skip to main
|
skip to sidebar
subbarao
Saturday, June 30, 2012
పద్య ర చన -38
విశ్వ విఖ్యాతి గాంచిన విశ్వ గురుడు
భ రత మాత కు బుట్టిన భవ్య చరితు
డ త డె , ఠా కూ రు పేరున నాప్తు డ య్యె
సకలమునకు గీ తాంజలి సృష్టి కర్త .
Friday, June 29, 2012
తులను పట్టు నెడల గలుగు సుఖము
జ్ఞాన మనగ నెరిగి మాన వంతుల పధ్ధ
తులను పట్టు నెడల గలుగు సుఖము
భక్తి కలిగి యుండి భ గ వంతు సేవించ
ముక్తి కలుగు సత్య ముగను నిలను .
పద్య రచన -37
చంటి పిల్ల గ కూ ర్చుని చాపి చేయి
చంద మామను బిలు చుండె చక్క గాను
చూడ ముచ్చట గొలుపును చూప రులకు
దిష్టి కొట్టక యీ యుడు దీ వన లను .
గౌరి ముఖమును చుం బిం చె గ రి వర దుడు
తనయు డైనట్టి గణపతి తల్లి యైన
గౌరి ముఖమును చుం బిం చె , గ రి వర దుడు
శ్రీ మహా విష్ణు డన ఘుడు సిరుల పంట
కాచు గావుత ! మమ్ముల గరుణ తోడ .
నొప్పులు --నివారణ
కాళ్ళ నొప్పులు మరియును కడుపు నొప్పి
కీ ళ్ళ నొప్పులు నింకను గేలు నొప్పి
ఓవ రాను యస్సది మంచి యౌష ధం బు
అన్ని నొప్పులు మటు మాయ మగును సుమ్ము .
షుగ రు వ్యాధి - నివారణ
మెంతి కూరను మధు మేహం బు కొఱకు గా
మంచి దనిరి చాల మంది వైద్యు
లార్య ! దినము దినము నా కూర దిను చుండి
నయము జేసి కొనుము రయము గాను
Thursday, June 28, 2012
పద్య రచన -36
తిండి లేదయ్య ! ముప్పది దినము లయ్యె
కావ రాలేదె వారును గరుణ తోడ
తీ సి కొని పొమ్ము నన్నిక దేవ ! దేవ !
యనుచు సాయిని బ్రార్ధించె యా చ కుండు .
-----
తిండి నే దిని ముప్పది దినము లయ్యె
దేహ మంతయు శుష్కిం చె దైన్య ముగను
వేడు చుంటిని మిమ్ముల వేయు డిం త
కబళ మో యమ్మ ! దీ నుని గని కరించె .
Wednesday, June 27, 2012
పద్య రచన -35
నిండు సభ లోన ద్రౌపది నేక వస్త్ర
యనియు జూడక యొక దుష్టు డా మె బట్టి
వలువ లూ డ్వం గ కృష్ణుడు వలువ లిచ్చి
మాన రక్షణ గావించె మాన వ తి కి .
నిషిధ్ధాక్షరి -4, నిషిధ్ధములు =ట ఠ డ ఢ ణ లు
ఆంద్ర కేసరి బిరుదున కర్హ తాను
గొ న ము తేజస్సు గలిగిన గొప్ప ధీ ర !
ఆంగ్ల పాలన నీ వ ల్ల నంత మయ్యె
వంద నములు ప్రకాశము పం తు ల య్య !
పద్య రచన -34
ఆకసంబున మేఘంబు లావ రించి
వాన కు రి యం గ సంతోష మూ న కేకి
జంట పించము లాడించి జతను గలిసి
కామ కేళి ని విహ రించ కాంక్ష నొం దె .
Tuesday, June 26, 2012
అ ల్పు డెపుడు పల్కు నాదర మున
అన్ని వేళ లందు నాడంబర ముగాను
అ ల్పు డెపుడు పల్కు, నాదర మున
సజ్జ నుండు మెలగు సర్వుల యె డ లన
సత్పు రు షు ల కిదియె సహజ గుణము .
Monday, June 25, 2012
నల కూ బరు మంచ మందు నల్లులు జేరెన్
నల కూ బ రు డ ను నాతడు
నలకాపుర వైశ్య సుతుడు నలసియు లాడ్జి న్
వె లకితలగ శ య నించిన
నల కూ బరు మంచ మందు నల్లులు జేరెన్
పద్య రచన -33, భీ ష్ము డు అం ప శయ్య
బాణ నిర్మిత శయ్య పై బవ్వ ళించు
భీ ష్ము ద రి జేరి కవ్వడి ప్రియము తోడ
గరిమ బా ణా న పాతాళ గంగ దెచ్చి
తీ ర్చి దాహము దీ వ న ల్ దీ సి కొనెను .
Sunday, June 24, 2012
పద్య రచన -32
మన్ను తిం టివి లోటు రా వెన్న నీ కు
ఏమి యీ పని ? తిం దు రె యె వ్వ రైన
నెందు బోకుము కద లకు మిచట నుండి
ననుచు నా యశో దమ్మ నె దనయు తోడ .
----
కుండ నిండుగ నుండెను గృష్ణ ! వెన్న
తనివి తీ రను భుజియించు తప్పు పట్ట
నంతె కాకయ పొ రు గింటి చెంత కేగ
చెంప వాయింతు లాగుదు చెవులు నీ వి .
దత్త పది =అక్క --అన్న --వదిన -- మామ
మామ మాటను విని నీ వు మగ డ ! నిపుడు
వదిన సీ తను రామన్న వశము జేసి
మమ్ము కాపాడు నిన్ను నే నమ్మినాము
కాని యె డ ల న నక్కట ! కాలు గతి యె .
శివుని పూజ సేయ చితియ ప్రాప్తి
సర్వ శుభము లిచ్చు సంపద లొ స గును
శివుని పూజ సేయ, చితియ ప్రాప్తి
మరణ మొందు నట్టి మానవు నకు నిల
పూర్వ పాప ఫల మె పుట్టుక యన .
క డు దరిద్రుడు రాజ యోగమ్ము నందె
భార్య పంపున కృష్ణుని వా డ కేగి
యల కుచేలుండు దర్శించె నబ్జ భవుని
బాల్య మిత్రుల బంధంబు వలన సుమ్ము
క డు దరిద్రుడు రాజ యోగమ్ము నందె
Saturday, June 23, 2012
పద్య రచన -31
పండు భ్రాంతిని సూర్యుని పట్ట బోవ
కాలి నీ మూతి యెర్రగ కం దిపోయె
అంత సా హ సం బ ది యే ల ? యౌర! నీ కు
అంజ లింతు ను సతతము హనుమ ! నీ కు .
పాపఱేని యొడలు బాచి పోయె
పాతయింటి నొకటి పడ గొట్టి గాల్చగ
పీ చు లోన నుండు త్రాచు పాము
పరుగు పరుగు వెట్టి పాఱిపో లోపున
పాపఱేని యొడలు బాచి పోయె
కనులు లేని వాడు కన్ను గొట్టె
చూడ లేడు సరిగ నాడ లేడు గదమ్మ !
కనులు లేని వాడు , కన్ను గొట్టె
పైత్య మెక్కు వయ్యి పడతుల జూడగ
తగిన శిక్ష వే య దగును నపుడు
తండ్రి నేర్పిన విద్యయే తనయు జంపె
తండ్రి నేర్పిన విద్యయే తనయు జంపె
----
తండ్రి యొ ద్దన నేర్చెను దనయు డొకడు
పాము మంత్రము నయ్యెడ వల్లె వే య
సర్ప మొక్కటి జను దెంచి సరగు నతని
కాటు వేసియు బంపె ను గాలు కడకు
బాలక !
పాఠ మందలి నీతిని బాగు గాను
నేర్చు కొనుముర ! బాలక నేమ మలర
చెడ్డ యలవాట్లు మఱియును చెడ్డ పనులు
దరికి వచ్చిన దూరము తప్పు కొనుము
కలికి కంటి నీ రు కలిమి నొసగు
వెతల బారు జేయు వేయి విధములుగ
కలికి కంటి నీ రు, కలిమి నొసగు
భక్తి ,శ్రద్ధ కలిగి భవుని నర్చించగ
వ ర ము నిచ్చు వాడు పరమ శివుడు .
Friday, June 22, 2012
పద్య రచన -30
మొఘలు సామ్రా జ్య మంతయు మో హరించి
పా ఱ ద్రోలితి వీ వయ్య ! వారి నెట కొ
నీ దు శౌర్యము , శక్తియు నె ఱు గ దరమె ?
అందు కొను మయ్య ! రా ణా జి ! వంద నాలు .
బంజరు భూములు దొరకవు పది కోట్లన్న న్
అంజయ్య యమ్మ భూముల
సంజయ్యే కొనెను నన్ని చౌకగ నె పు డో
అంజన వేసియు చూ సిన
బంజరు భూములు దొరకవు పది కోట్లన్న న్
Thursday, June 21, 2012
పద్య రచన -29
ప్రతిన నీ యది యిప్పుడు భంగ పఱు చ
నాయుధం బూ ని వత్తువ? యాది దేవ !
పలుక భీ ష్ము డు బాణ ముం బా ఱ వైచె
కృష్ణ భగవాను డ య్యెడ గరుణ తోడ .
ఆలిని ద్యజియించె డి పతి హాయిగ నుండున్
వేలుగ నవ్వుల బాలగు
నాలిని ద్యజియించె డి పతి, హాయిగ నుండున్
నాలుం బిడ్డల తోడన
మే లగు నాకాపురంబు మేదిని జూడన్ .
పద్య రచన -మోహిని అమృతము పంచుట
దేవ దానవు లిరు వైపు తిష్ట వే య
పంచ మొదలిడె వారికి పరమ యోగి
మోహినీ రూ ప మె త్తి యు ముదము గొ లుప
నమృ తంబును దేవత లచ్చెరు వడ .
Wednesday, June 20, 2012
పద్య రచన- 28
విరహము నొందితి వినుమా !
సరగున నా నా ధు జేరి సరసపు బలుకుల్
నరమరిక లేక జెప్పుము
సరళ ముగా హంస తల్లి ! సాకను నన్నున్ .
దశర ధు డే వనుల కేగె దపసులు మెచ్చన్
వశుడ య్యె ను గద కైకకు
దశ రధు డే , వనుల కే గె దపసులు మెచ్చన్
దశరధ నందను డ య్యె డ
కుశలము నే గోరు కైక కోరిక మీదన్ .
గ్రామ గ్రామాన నుండెను గాంధి బొమ్మ .
ఆంగ్ల పాలకు లందరు హడలు నట్లు
శాంతి మార్గాన పోరాడి సముచితము గ
దేశ స్వారాజ్య మవ లీ ల దెచ్చు కత న
గ్రామ గ్రామాన నుండెను గాంధి బొమ్మ .
Tuesday, June 19, 2012
కంచియే చేను మేయుట కల్ల గా దు
కంచియే చేను మేయుట కల్ల గా దు
కల్ల లైనవి జగతిని క ల్ల కాని
వేమి యున్నవి ? దెలుపుడు నెంచి చూసి
కాన బడు నవి యెల్లను గ ల్ల లేను .
రాళ్ళుగలిగిన వాడె పో రాజు నేడు
బండ్లు నగునయ్య ! నోడలు బండ్లు నగును
నోడలొయ్యన కతమున వీ డు పొగరు
ఎవ్వ రేమను కొనినను నిలను నాల్గు
రాళ్ళు గలిగిన వాడె పోరాజు నేడు .
బస్సు బస్సును ఢీ కొని పరువు తీ సె .
అక్క డ క్కడే మరణించి రాడ వారు
బస్సు బస్సును ఢీ కొని , పరువు తీ సె
పంతులయ్యను గసి తీ ర బాది బాది
గన్న వరమున దగ్గరి గ్రామ ప్రజలు .
బస్సు పయన మనిన భయము పుట్టె .
ఏమి జాడ్య మే మొ ? యీ మధ్య బస్సులు
వరుస జేయు ఛుండ్రి ప్రాణ హాని
మరణ వార్త వినిన మదిలోన గుబులాయె
బస్సు పయన మనిన భయము పుట్టె .
Monday, June 18, 2012
బిడ్డడా వాడు ? రణరంగ భీ కరుండు .
రెల్లు గడ్డిన బుట్టిన పిల్లవాడు
దుష్ట రాక్షసు దారకు దునిమె న త డు
స్కందు డా త డు పార్వతీ నంద నుండు
బిడ్డడా వాడు ? రణరంగ భీ క రుండు .
Sunday, June 17, 2012
చదువులలో సార మెఱిగి చవటగ మారెన్.
చదువుల దల్లని బిలుతురు
చదువులలో మేటి గాన సాధన వలనన్
మదినిండ చదువులే యయి
చదువులలో సార మెఱిగి చవటగ మారెన్.
జాల మే యవరోధమ్ము సాధకులకు.
బంధముల ద్రెంచి తపసుకై బదరి కేగ
జ్ఞాపకంబులు మది లోన కలుగు చుండ
బంధు మిత్రుల పాలిట పరగు మోహ
జాల మే యవరోధమ్ము సాధకులకు.
కాళేశ్వరి బస్సు పంపె కాటికి ప్రజలన్
-----
వేళాకోళము గాదిది
వేళాపాళయును లేక వెళ్లుచు బస్సున్
షోళాపూరును దాటుచు
కాళేశ్వరి బస్సు పంపె కాటికి ప్రజలన్.
Saturday, June 16, 2012
అర్ధ రాత్రి రవికి నర్ఘ్యము లిడె
------
పండు కొందు రయ్య , ప్రజ లందరు కద
అర్ధ రాత్రి, రవికి నర్గ్యము లిడె
వేకు వంబె లేచి వేద మంత్రాలతొ
నిత్య కృత్య మదియ నేస్తమునకు
మగ డెఱుగని మర్మము లవి మామ యెఱుంగున్
-----------
విగతుల బ్రాణము దెచ్చుట
మగడెఱుగని మర్మము లవి , మామ యెఱుంగున్
దగవులు వారించుటయును
పగలును లేకుండజేయు పధ్ధతులన్నీ.
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చు
భవ్య చరితుని శంభుని భవుని మృడుని
సకల శుభకరు డభయుని శంకరు సత
తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.
బైకు బైకును గుద్దగ మంట లెగసె
పార్టు లన్నియు జెడి పోయె బైకు యొక్క
బైకు బైకును గుద్ద గ , మంట లెగసె
పట్ట ణం బగు వైజాగు పరి సరమున
అంటు కొనియెను ఫేక్టరి యబ్బురము గ .
కల్ల లాడువారు కవులు సుమ్ము
పాప భీతి లేక పాపముల్ సేతురు
కల్ల లాడు వారు , కవులు సుమ్ము
కావ్య రచన చేయ గల యట్టి మనుజులు
కల్ల లాడ రెపుడు కల్ల గాదు .
Friday, June 15, 2012
బాణు రాజ్య మొసగు పరమ సుఖము
పడతి ప్రాణ మాన భంగముల్ మొదలుగా
బాణు రాజ్య మొసగు , పరమ సుఖము
రామ రాజ్య మొస గె రాజ్యమం దరికి ని
హారతు లివె రామ ! యందు కొనుము .
Thursday, June 14, 2012
రక్ష ణమ్ము నొసగు రాక్ష సుండు
ఎల్ల వేళలందు నీ శ్వరు వేడిన
రక్ష ణమ్ము నొసగు , రాక్ష సుండు
పాప కర్మ లందు బద్ధుడై యుండుచు
మాంస భక్ష ణంబు మాన కుండు .
Wednesday, June 13, 2012
పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్
కతిపయ దినముల నుండియు
మితి మీరగ తాగి నతడు మిడిమిడి గ్రుడ్లన్
మతి సెడి తూలుచు వచ్చిన
పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్
బంధంబుల కెల్ల మేలు వైవా హికమున్
బంధములు బెంచు కొనుముర
బంధాలే దెలుపు మనకు బంధు త్వంబుల్
బంధములు నెన్ని యున్నను
బంధంబుల కెల్ల మేలు వైవా హికమున్
పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్
బాలుడు నేడువ సాగెను
పాలిమ్మని , సుతుని భర్త పాలికి బంపెన్
బాలకు సొమ్ములు దెమ్మని
మాలతి దా జెప్పె నపుడు మసలక రారా .
Tuesday, June 12, 2012
తండ్రి మించిన శత్రువు ధరణి గలడె?
తరచి చూడంగ గానడు దైవ మొండు
తండ్రి మించిన , శత్రువు ధరణి గలడె ?
ధర్మ బద్ధుడు , గుణ శీలి ధర్మజునకు
కాన రాడయ్య నొక్కడు గాన రాడు.
Monday, June 11, 2012
రక్ష కుండు గాదు రాక్ష సుండు
నీట మున్గు చుంటి నీ త రాదు తనకు
ననిన , నొడ్డు జేర్చి ననుభ వించె
రక్ష సేయ వచ్చి రాక్ష సుండు గ మారె
రక్ష కుండు గాదు రాక్ష సుండు
పుణ్య మూర్తుల యింటను బురుడు వచ్చె
పుణ్య మూర్తుల యింటను బురుడు వచ్చె
అంద రిండ్లను వచ్చును నబ్బు రంబ?
కొత్త దంపతు లున్నట్టి గృహము లందు
పురుడు పుణ్యాలు మాములె పుడమి మీద .
పద్య రచన -౨౭
తనకు పుట్టిన బిడ్డను తానె గంగ
నదిని వేయంగ వారించె నపుడు రాజు
విడిచి వెళ్ళెను నియమము వీ డె నంచు
శంతనుం డంత బ్రతిమాలె సత్య వతిని
భోగ రక్తుడగు ముముక్షు వెపుడు
భోగ భాగ్యముల్గల యట్టి భువన విభుడు
భోగ రక్తుడగు , ముముక్షు వెపుడు
దైవ చింతన , భజనల ధ్యాస తప్ప
అన్య మెరుగడు రానీయ డాడ గాలి
Sunday, June 10, 2012
వికలాంగుడు రధము నడిపె విను వీధి పయిన్
అకటా ! నడువ న శక్తుడు
వికలాంగుడు , రధము నడిపె విను వీధి పయిన్
వికల మనస్కు డ నూరుడు
పకపకలే నాపి మీరు పలుకుడు జేజేల్.
పద్య రచన -౨౬
ఆకసంబున నుండియా యమ్మ గంగ
శివుని దల మీద జారగ శివుడు నంత
జటల యందున బంధించ జడల మౌని
భాగి రధుడు ను గోరంగ వదలె గంగ
Saturday, June 9, 2012
పద్య రచన -౨౫
దేశ రక్షణ గావింతు దేవి! యనుచు
అందు కొనియెను ఖడ్గము హైమ నుండి
శత్రు మూకల దునుమాడి క్షాత్ర మొప్ప
దేశ భక్తిని జాటెను ధీ శి వాజి.
వార్ధిలో మున్గె భానుడు పగటి వేళ
సంధ్య వేళయ యగుటన చందు రుండు
వార్ధిలో మున్గె, భానుడు పగటి వేళ
నుష్ణ కిరణాల గరిమచే నుగ్రు డగుచు
మండు చుండెను భగ భగ మంట లెగయ
కొడుకునే భర్తగా బొంది పడతి మురిసె
కన దలంచిన శీ ఘ్ర మె కనుము నీవు
కొడుకునే , భర్తగా బొంది పడతి మురిసె
వలచి వలపించు కొనునట్టి వాని నామె
పాలు నీరును పగిదిని బ్రతుకు గాక !
Friday, June 8, 2012
కుండ పోతగ గురిసెను గుండ మందు
చేరి మౌనులు యాగముం జేయు చుండ
రక్త వర్ణము గలిగిన రక్త ధార
కుండ పోత గ గురిసెను గుండ మందు
భయము నొందిరి యయ్యెడ మౌని వరులు .
Thursday, June 7, 2012
పతిపైనన్ బరమ సాధ్వి పాదము మోపెన్
సతియౌ రుక్మిణి కొరకని
పతియగు శ్రీ కృష్ణు డిచ్చె పరిజత పూవున్
పతి చేష్టకు నాసత్యయు
పతిపైనన్ బరమ సాధ్వి పాదము మోపెన్ .
చిత్ర రచన -సావిత్రి
నీది యగు శైలి నొకదాని నిర్వ హించి
పాత్ర లన్నియు, సెహబాసు బలుకు నట్లు
చిత్ర రంగాన రాణించు పుత్రి వమ్మ !
అందు కోవమ్మ ! సావిత్రి ! వంద నాలు .
శ్రద్ధాంజలి -(రాజోలు బాబయ్య )
౧. లేవు బాబయ్య యిక మాకు లేవు నీవు
కాను పించియు కనుమరు గ య్యె మాకు
చూడ నిన్నిక బామ్మను జూచి నట్లు
భ్రాంతి కలిగించు మాకయ ! మరువ లేము
౨. ఉన్న దిక్కుల రెంటను నొకటి పోయె
నియమ నిష్టల పాలన నేర్పి తీవు
మాకు నెవరయ్య దిక్కిక మాకు నిలను
వీడి యేగుట మమ్ముల పాడి యగునె ?
౩. అన్న దమ్ముల మూవురి కాప్తు డీవ
చదువు సంధ్యలు వారికి సాగ గాను
పంపి నావట సొమ్ములు బామ్మ చెప్పె
అందు కొనుమయ్య ! జోహార్ల నందు కొనుము .
౪. కోప మధికంబు శాంతము కొంచె మరయ
నీవు వచ్చిన మేమును నిజము గాను
భయము నొందుచు పరుగెడి వార మపుడు
భయము లేదయ్య,యిక మాకు భయము లేదు .
౫. చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు
తిరిగి జన్మలు లేకుండ తిరము గాను
స్వర్గ మందున నుంచియు శంకరుండు
నీదు నాత్మకు శాంతిని నిచ్చు గాక !
ఇట్లు ,
అశ్రు నయనాలతో
సుబ్బారావు
Wednesday, June 6, 2012
ఎండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్
మెండుగ కందును ముఖములు
నెం డను నిద్రించ , సుఖము నిచ్చును మిగులన్
నెండల బారిన బడి నీ
రెండను బోవంగ మనుజు నెడదమ్మునకున్.
Tuesday, June 5, 2012
రావణుండు దిక్కు రాఘవునకు
రణము నందు చచ్చె రాముని శరమున
రావణుండు , దిక్కు రాఘవునకు
కాదు ,దిక్కు మనకు కైక తనయుం డౌను
వేడ నతని మిగుల వినయ ముగను .
Monday, June 4, 2012
కారము లేకున్న కావు కార్యము లెందున్
కూరలు రుచించ వెప్పుడు
కారము లేకున్న, కావు కార్యము లెందున్
పోరంబోకుని మాదిరి
భీకరముగ వాదు లాడి బిగుసుకు నుండన్ .
Sunday, June 3, 2012
ఫాల లోచనుండు పాపి సుమ్ము
భక్త రక్ష ణుండు భవబంధముల ద్రెంచు
ఫాల లోచనుండు , పాపి సుమ్ము
పరుల బాధ జూచి పబ్బము గడుపంగ
నిచ్చ సేయు వాడు ,నీసు డూను
రావణా గమనము గోరె రమణి సీత
భయము కల్గిం చె సీతకు బాధ కలిగె
రావణా గమనము , గోరె రమణి సీత
రాము డేతేరి లంకకు రయము గాను
రావణాదుల మర్దించి కావ తనను
Saturday, June 2, 2012
సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్?
సురభులు ఖరములు నొకచో
పెరుగుచు మఱి యొకటి కొకటి ప్రేమ ను గలవన్
ఇరువురి ప్రేమకు ఫలితము
సురభికి
జన్మించె
ఖరము చోద్య మెటు లగున్ ?
సురభులకు పుట్టు చుండెను ఖరము లకట
మాల్య వంతుడు బోధించె మంచి గాను
సీ త నంపుము రావణ ! శీ ఘ్రము గను
సురభులకు పుట్టు చుండెను ఖరము లకట !
దుష్ట శకునము లయ్యవి దొర్లు చుండె .
Friday, June 1, 2012
దూతను వధించు టెంతయు నీతి యగును
పాప మగు నయ్య ! పర దేశ వాసు డైన
దూతను వధించు ,టెంతయు నీతి యగును
రాయ బారిగ వచ్చిన రాజ సుతుని
నెంతొ ప్రేమ తొ కానుక లిచ్చి పంప .
కాముకులను గొలువ గలుగు యశము
భయము దొలగు ,కోప మడగును నిల శాంతి
కాముకులను గొలువ , గలుగు యశము
ప్రజల మంచి కోరి బహు విధముల మంచి
పనులు చూపి చేయు మానవునకు .
తనయను సేవింప నొదవు దద్దయు సుఖముల్
అనయము ప్రేమ తొ జూడుము
తనయను , సేవింప నొదవు దద్దయు సుఖముల్
నిరతము భక్తి తొ శివునకు
వినయముగా నొదిగి యుండి వేమరు విధముల్ .
ఇంటికి పని కంచు వచ్చి యిల్లా లయ్యెన్
వింటి రె మీ రీ వింతను
వంటలు నే జేతు నంచు పావని రాగా
గంటయ్య వలచ నామెను
ఇంటికి పని కంచు వచ్చి యిల్లా లయ్యెన్ .
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
About Me
subbarao
View my complete profile
Blog Archive
►
2024
(3)
►
December
(1)
►
July
(1)
►
February
(1)
►
2023
(1)
►
November
(1)
►
2022
(70)
►
December
(1)
►
September
(1)
►
August
(2)
►
July
(14)
►
June
(44)
►
March
(3)
►
February
(4)
►
January
(1)
►
2021
(480)
►
December
(3)
►
November
(3)
►
September
(31)
►
August
(57)
►
July
(54)
►
June
(61)
►
May
(61)
►
April
(53)
►
March
(56)
►
February
(53)
►
January
(48)
►
2020
(740)
►
December
(58)
►
November
(60)
►
October
(58)
►
September
(66)
►
August
(58)
►
July
(62)
►
June
(61)
►
May
(64)
►
April
(66)
►
March
(65)
►
February
(58)
►
January
(64)
►
2019
(676)
►
December
(57)
►
November
(47)
►
October
(61)
►
September
(56)
►
August
(57)
►
July
(62)
►
June
(45)
►
May
(40)
►
April
(62)
►
March
(76)
►
February
(53)
►
January
(60)
►
2018
(659)
►
December
(46)
►
November
(62)
►
October
(56)
►
September
(68)
►
August
(58)
►
July
(62)
►
June
(57)
►
May
(54)
►
April
(34)
►
March
(35)
►
February
(65)
►
January
(62)
►
2017
(525)
►
December
(21)
►
November
(53)
►
October
(44)
►
September
(61)
►
August
(30)
►
July
(25)
►
June
(31)
►
May
(16)
►
April
(50)
►
March
(71)
►
February
(56)
►
January
(67)
►
2016
(773)
►
December
(70)
►
November
(52)
►
October
(77)
►
September
(65)
►
August
(46)
►
July
(54)
►
June
(58)
►
May
(77)
►
April
(78)
►
March
(59)
►
February
(82)
►
January
(55)
►
2015
(743)
►
December
(53)
►
November
(44)
►
October
(72)
►
September
(62)
►
August
(75)
►
July
(50)
►
June
(55)
►
May
(54)
►
April
(62)
►
March
(64)
►
February
(71)
►
January
(81)
►
2014
(781)
►
December
(73)
►
November
(80)
►
October
(74)
►
September
(64)
►
August
(61)
►
July
(50)
►
June
(61)
►
May
(60)
►
April
(80)
►
March
(90)
►
February
(45)
►
January
(43)
►
2013
(795)
►
December
(32)
►
November
(21)
►
October
(51)
►
September
(65)
►
August
(88)
►
July
(76)
►
June
(48)
►
May
(61)
►
April
(83)
►
March
(119)
►
February
(94)
►
January
(57)
▼
2012
(621)
►
December
(46)
►
November
(35)
►
October
(53)
►
September
(63)
►
August
(65)
►
July
(70)
▼
June
(74)
పద్య ర చన -38
తులను పట్టు నెడల గలుగు సుఖము
పద్య రచన -37
గౌరి ముఖమును చుం బిం చె గ రి వర దుడు
నొప్పులు --నివారణ
షుగ రు వ్యాధి - నివారణ
పద్య రచన -36
పద్య రచన -35
నిషిధ్ధాక్షరి -4, నిషిధ్ధములు =ట ఠ డ ఢ ణ లు
పద్య రచన -34
అ ల్పు డెపుడు పల్కు నాదర మున
నల కూ బరు మంచ మందు నల్లులు జేరెన్
పద్య రచన -33, భీ ష్ము డు అం ప శయ్య
పద్య రచన -32
దత్త పది =అక్క --అన్న --వదిన -- మామ
శివుని పూజ సేయ చితియ ప్రాప్తి
క డు దరిద్రుడు రాజ యోగమ్ము నందె
పద్య రచన -31
పాపఱేని యొడలు బాచి పోయె
కనులు లేని వాడు కన్ను గొట్టె
తండ్రి నేర్పిన విద్యయే తనయు జంపె
బాలక !
కలికి కంటి నీ రు కలిమి నొసగు
పద్య రచన -30
బంజరు భూములు దొరకవు పది కోట్లన్న న్
పద్య రచన -29
ఆలిని ద్యజియించె డి పతి హాయిగ నుండున్
పద్య రచన -మోహిని అమృతము పంచుట
పద్య రచన- 28
దశర ధు డే వనుల కేగె దపసులు మెచ్చన్
గ్రామ గ్రామాన నుండెను గాంధి బొమ్మ .
కంచియే చేను మేయుట కల్ల గా దు
రాళ్ళుగలిగిన వాడె పో రాజు నేడు
బస్సు బస్సును ఢీ కొని పరువు తీ సె .
బస్సు పయన మనిన భయము పుట్టె .
బిడ్డడా వాడు ? రణరంగ భీ కరుండు .
చదువులలో సార మెఱిగి చవటగ మారెన్.
జాల మే యవరోధమ్ము సాధకులకు.
కాళేశ్వరి బస్సు పంపె కాటికి ప్రజలన్-----వేళాకో...
అర్ధ రాత్రి రవికి నర్ఘ్యము లిడె------పండు కొందు రయ...
మగ డెఱుగని మర్మము లవి మామ యెఱుంగున్-----------విగత...
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చు భవ్య చర...
బైకు బైకును గుద్దగ మంట లెగసె
కల్ల లాడువారు కవులు సుమ్ము
బాణు రాజ్య మొసగు పరమ సుఖము
రక్ష ణమ్ము నొసగు రాక్ష సుండు
పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్
బంధంబుల కెల్ల మేలు వైవా హికమున్
పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్
తండ్రి మించిన శత్రువు ధరణి గలడె?
రక్ష కుండు గాదు రాక్ష సుండు
పుణ్య మూర్తుల యింటను బురుడు వచ్చె
పద్య రచన -౨౭
భోగ రక్తుడగు ముముక్షు వెపుడు
వికలాంగుడు రధము నడిపె విను వీధి పయిన్
పద్య రచన -౨౬
పద్య రచన -౨౫
వార్ధిలో మున్గె భానుడు పగటి వేళ
కొడుకునే భర్తగా బొంది పడతి మురిసె
కుండ పోతగ గురిసెను గుండ మందు
పతిపైనన్ బరమ సాధ్వి పాదము మోపెన్
చిత్ర రచన -సావిత్రి
శ్రద్ధాంజలి -(రాజోలు బాబయ్య )
ఎండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్
రావణుండు దిక్కు రాఘవునకు
కారము లేకున్న కావు కార్యము లెందున్
ఫాల లోచనుండు పాపి సుమ్ము
రావణా గమనము గోరె రమణి సీత
సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్?
సురభులకు పుట్టు చుండెను ఖరము లకట
దూతను వధించు టెంతయు నీతి యగును
కాముకులను గొలువ గలుగు యశము
తనయను సేవింప నొదవు దద్దయు సుఖముల్
ఇంటికి పని కంచు వచ్చి యిల్లా లయ్యెన్
►
May
(55)
►
April
(56)
►
March
(34)
►
February
(32)
►
January
(38)
►
2011
(202)
►
December
(72)
►
November
(43)
►
October
(13)
►
September
(25)
►
August
(22)
►
July
(10)
►
June
(17)
►
2010
(64)
►
June
(2)
►
May
(1)
►
March
(10)
►
February
(36)
►
January
(15)
►
2009
(9)
►
November
(1)
►
July
(6)
►
March
(2)
►
2008
(5)
►
November
(5)