1. ఒకరి కోసము మఱి యొక రుద్భ వించి
యగ్ని సాక్షిగ పరిణయ మాడ దలచి
తీసికొని రయ్య ! విందును దీయగాను
బంధు మిత్రుల సాక్షిగ బట్ట పగలు .
2. వరుడు బుట్టెను బ్రగ డల వారి యింట
వధువు బుట్టెను వడ్డాది వారి యింట
వధువు శ్రీదేవి ,శ్రీరాము వరుడు నరయ
చూడ జక్కని జంటయె చూ డ్కులకును .
వియ్యపు రాళ్లు ........
3. ఇందును గల దొక చిత్రము
నెందును మఱి గానరాదు నెవరికి నైన
న్నందమ యిరువురి పేరులు
మందికి ముద మయ్యె రత్న మాలలె యగుట న్ .
వధువు ......అమ్మా శ్రీ దేవీ !
4. అత్త మామలు మఱియును నాడు బిడ్డ
మిగుల సౌ మ్యులు , వారిని మీర కుండ
యధిక భక్తిని మెలగితి వై న నిన్ను
రక్ష సేయును నిరతము రాము డబల !
5. తనర శ్రీ రాము నీ కును దగిన భర్త
యతని కనుసన్న మెలగుచు నలరు మ మ్మ !
సకల శుభములు గలిగించు శంక రుండు
కంటికిని రె ప్ప యట్లయి కాచు మిమ్ము .