Thursday, March 28, 2013

ఆవకాయ పెట్టు విధానము

మెత్త నుప్పును  మరియును  మిర్చి  పొడిని
ఆవ  పిండిని  సమ పాళ్ళ  యట్లు  జేసి
కలప వలె నమ్మ ! సమముగ  గలి యు  వరకు
ఆవకాయకు  కారము  నిదియ  సుమ్ము .

మామిడి  కాయల ముక్కలు
గోముగ నా కార మందు  కొంచెము  కొంచెం
ప్రేమగ  వేయుచు   నూ నెను
దామాషగ వేసి  కలిపి   దాపున  జాడిన్ .

మూ డు  దినములు  నటులన   ముచ్చ టంగ
భద్ర  ప ఱచియు  తదుపరి  వాడు కొనిన
మంచి  రుచి గల్గి   నో రూ రి  మరల మరల
దినగ గోరిక  గలుగును  దేవి ! మనకు .

 
 

1 comment:

  1. పూజ్యులు మత్పితృ మిత్రులు శంకరాభరణ విద్వన్మిత్రులు అగు శ్రీ పొచిరాజు సుబ్బారావుగారికి నమస్సులు. అతి తేలిక పదములతో ఆవకాయనిర్మాణ విధిని చక్కగా అందరికి అర్థమగు రీతిని చెప్పిన మీకు అభినందనలు.

    ReplyDelete