Friday, January 31, 2014

రామ యనెడి నోరు ఱాతి రోలు

రామ యనెడి నోరు,  ఱాతి రో లును రెండు
మేలు జేయు మనకు  బాల! వినుము
ముక్తి నిచ్చు  నిజము  మొదటిది ,. ఱోలుతో
పప్పు రుబ్బ వచ్చు  బాగు గాను
 

పరశురాముడు నిర్జించె పాండవులను

రాజు లనబడు ప్రతి యొక్కరాజు నిలను
పరశురాముడు నిర్జించె ,పాండవులను
పంపె నడవికి జూదాన పణము గెలిచి
దుష్ట దుర్యోధనాదులు దుష్ట మతిని 

Thursday, January 30, 2014

తండ్రీ రమ్మనుచు బిలిచె దరుణి తన పతిన్

ఉండ్రాళ్ళ తద్ది దినమున
ఉండ్రాళ్ళను బోసి పిలిచె నూ రంత యునున్
తండ్రిని భర్తను జూచుచు
తండ్రీ రమ్మనుచు బిలిచె దరుణి తన పతిన్ 

Wednesday, January 29, 2014

నిండు వెన్నెల జాబిలీ నీట మునిగె

  రేయి  యంతయు రిక్కల రేడు భువిని
తనదు కాంతిని  విదజల్లి తమము బాపి
ప్రజల హితమును  గాంక్షించు ప్రభువు నైన
నిండు వెన్నెల జాబిలీ నీట మునిగె 

పగటి పూట నిద్రింప సంపద పెరుగును

లేమి గలుగును దప్పక  భామ లార !
పగటి పూట నిద్రింప, సంపద పెరుగును
శివుని బూజించు వారల కవిర ళ ముగ
పగటి నిద్రలు మానుట బాగు మనకు 

Tuesday, January 28, 2014

కటికి చీకటి నొసగె భాస్కరుడు వచ్చి

చంద్ర గ్రహణము రోజున  చందు రుండు
కటికి చీకటి నొసగె, భాస్కరుడు వచ్చి
భాస మానపు కాంతుల  బ్రభల నింపి
యుల్ల సిలగంగ జేసెను  నుల్ల ములను 

Monday, January 27, 2014

శార్జ్గ్యం ఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్

శార్జ్గ్యం ఘ్రి యనగ దెలుపుదు
శార్జ్గ్యం ఘ్రు లనంగ నొప్పు  శార్జ్గ్యు ని పదము  ల్
శార్జ్గ్యం ఘ్రిని సేవించియు
శార్జ్గ్యం ఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్

 

Sunday, January 26, 2014

కాలకూట విషము కాత్యాయని మ్రింగె

కాలకూట విషము కాత్యాయని మ్రింగె
ననుట యొప్పు గాదు  యజ్ఞ పురుష!
సదరు విషము మ్రింగ శంకరు డొక్కడే
యర్హు డార్య !గౌరి యనుట కాదు 

శివుని నైన గాసి చేయ గలరు

ధరను భస్మ యనెడ సురుడు శివుని గోరె
చేయి వెట్ట శిరము చిద్ర మయ్యి
భస్మమగునని మఱి , భవునిపై కరమిడ
శివుని నైన గాసి చేయ గలరు 

Saturday, January 25, 2014

నరసింహుని బిలువ బలుకు నరకాసురుడున్

హరిహరి యని నెమ్మనమున
నరసింహుని బిలువ బలుకు, నరకాసురుడున్
కరివరదుని బాణం బున
మర ణం బును బొంది జేరె మరుత్తుల దరిన్ 

Friday, January 24, 2014

రామ కోటి వ్రాయ చీమ జన్మ గలుగు

రామ కోటి వ్రాయ చీమ జన్మ గలుగు
ననుట యొ ప్పు గాదు వినుడు నిజము
భుక్తి కలుగు మఱియు ముక్తి చే  కూరును
కల్లగాదు నమ్ము డుల్ల మలర 

అ త్యాశను గలిగి యుంట ,యరయగ మేలౌ

విత్తము దొరకుట కష్టమె
య  త్యాశను గలిగి యుంట ,యరయగ మేలౌ
నిత్యము శివనామమునే
సత్యముగా బలుకు నెడల సర్వుల కిలలోన్ 

కుంభ కర్ణుండు రూపసి కుంతి మగడు

రావణాసురున నుజుడు  రాక్షసుండు
కుంభ కర్ణుండు, రూపసి కుంతి మగడు
పాండు రాజునా  బఱగుచు  భ్రాత బదులు
రాజ్య పాలన గావించె  రమ్యముగను 

Thursday, January 23, 2014

యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్

మమతల తోడన మెలగుచు
విమలంబగు  మనసు తోడ ,వీడని ప్రేమన్
దమవా రందఱు నిడుసా
యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్ 

కోట్లు దినుట నేర్చె కుక్కుటములు

క్రొత్త యధికారి వచ్చియు  కోట్లు దినుట
నేర్చె , కుక్కుటములు మఱి నేల బడిన
గింజ లనునేఱి  తినుచుండె  గుంజు కొనుచు
సహజ మేగద యియ్యది సర్వు లకును


 

అక్కినేని వారె యారాధ్య దైవము

అక్కినేని వారె  యారాధ్య దైవము
నిజము  మూడు పాళ్ళు  నిజము గదర
నటన యందు మిగుల నాగేశ్వరు డు మేటి
కాన దైవ మేను గాద! చెపుమ ?

Wednesday, January 22, 2014

ఓడినవారలకు దృప్తి యొనగూ డు గదా

పాడగును వారి  మనసులు
ఓడినవారలకు దృప్తి యొనగూ డు గదా
వీడగ విభజన సంగతి
పోడిమతో నుం డదగును పురజను లికపైన్ 

అక్కినేనికి శ్రద్ధాంజలి

నటన యందున నినుమించు నటుడు భువిని
కాన రాడయ్య !యెవరును  కన్ను గవకు
అక్కినేని కు  లాంబుధి నగ్ర గణ్య !
అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము 

Monday, January 20, 2014

వేలకొలదిగ పూరణలు

శంకరాభరణ బ్లాగు శతముకొలది
పూరణల దోడ విలసిల్లె  పొలుపుగాను
శంకరార్యుల కృషి  తోడ ,శంక లేదు
వందనంబులు వానికి  వంద లాది . 

Sunday, January 19, 2014

త్యాగరాజ స్తుతి

పుట్టి కారణ జన్ముడై  పుడమి యందు
వ్యాప్త మొనరించె  సంగీత  భవ్య కళను
యోగి గణములో  శ్రేష్టుడీ త్యాగరాజు
వంద నంబులు వానికి  వందలాది 

ఓ టమి తదుపరిన వచ్చు నొప్పుగ గెలుపున్

ఆటల యందున నోడిన
నో  టమి తదుపరిన వచ్చు నొప్పుగ గెలుపున్
రాటలు దేరిన వారును
నాటలలో నోడిపోవు ట రుదుగ జరుగున్ 

Saturday, January 18, 2014

కవినాశన మయ్యె మేటి కావ్యము చేతన్

అవకత  వకరచ  యిత రవి
కవినాశన మయ్యె,  మేటి కావ్యము చేతన్
కవియగు రాయలు మఱి యీ .
భువినిం బే రొందె  యాంధ్ర భోజుం డ నగన్ 

Thursday, January 16, 2014

ముక్కం టిం దూ ఱు నెడల మోక్షము గలుగున్

మక్కెలు విఱు గం  గొట్టుదు
ముక్కం టిం దూ ఱు నెడల మోక్షము గలుగున్
జక్కగ బూజలుసేసిన
ముక్కం టికి ననుదినమ్ము మురిపము తోడన్  

కాశి యతి పవిత్రము గద క్రైస్త వులకు

క్షేత్రముల లోన నెన్నగ క్షితిని నుండు
కాశి యతి పవిత్రము గద,  క్రైస్త వులకు
బెథలె హేము ప విత్రము భీ మసేన !
ధాత్రి దైవప్ర ధానము క్షేత్రము లగు 

Wednesday, January 15, 2014

దుష్ట జనముల సాంగత్య మిష్ట మగును

దుష్ట జనముల సాంగత్య మిష్ట మగును
దుష్ట జనులకు ,నిజమది  దుహిత లార!
సంది యంబును  నిసుమంత  చెంద వలదు
 దూర ముండుట  మేలది  దుష్టు లకును 

Tuesday, January 14, 2014

తొయ్యలి దునుమాడి నట్టి దొరను నుతింతున్

అయ్యా ! వినుడీ  సంగతి
కయ్యమునకు వచ్చి నట్టి కాంతను  గనుచున్
 చయ్యన తాటకి నాబడు
తొయ్యలి దునుమాడి నట్టి దొరను నుతింతున్



 

రోగము లవి వచ్చు చుండు రుద్రుని గరుణన్

మాగిన పండ్లను దినునెడ
రోగము లవి వచ్చు చుండు, రుద్రుని గరుణన్
రోగములు మాయ మగునట
వేగముగా రండి మీరు విభునిం  గొలువన్ 

Monday, January 13, 2014

కుబేర యాగము

అలకా పురమ్ము నందున
కళకళ లాడంగ నచట గ్రతువులు జేయ
న్నలనాటి యజ్ఞ శాలను
దలపించెను శంక రార్య !తలపుల లోనన్

(విజయవాడ లో కుబేరయాగము  చేయుచున్న
ప్రాంగ ణ మునకు అలకాపురము అను పేరు
పెట్టిరి )

వేద మంత్రాలు జదువగ విబుధ వరులు
చేయు చుండిరి యాగంబు శిష్య గణము
విజయ వాడను  పురమున వైభవముగ
వేయి కన్నులు సరి వోవు వీ క్ష కులకు

ఘంట సాల సంగీతపు మంటపమున
పెద్ద యెత్తున నేర్పాట్లు  దద్దరిల్లె
చూడ ముచ్చట గొల్పెను  చూచు కొలది
వంద నంబులు వారికి  వంద లాది

యాగ మీయది  చేసిన నాయువుయును
 ధనము మెండుగ కలుగును దళితు లకును
చేత నైనంత రీతిలో చేయు నెడల
వేరుచెప్పగ బనిలేదు వేత్తల కిది .

దేశ సౌభాగ్యము నకునై దేశికు లట
చేయు చుండిరి యాగము ల్చెలువ గాను
దాన ,నభివృద్ధి జెందును ధరను మరిని
పాడి పంటలు ,సిరులును  బహు ళ ముగను

కణ కణం గుగ  నిప్పులు గన బడంగ
హోమ ద్రవ్యాలు వేయుచు హోత లచట
మంత్ర పూర్వక హోమంపు తంతు జరుప
హాయి గొలిపెను మనసున కమితముగను

ఇట్టి యాగంబు  జరిపించి  నట్టి స్వామి
భారతీ మహా స్వామియే  భవ్యు డార్య !
వాని కిడుదును మనసార వందనములు
అంద జేయుడు మఱి మీరు యాబ లూ రి !





 

Sunday, January 12, 2014

రోగముల దెచ్చు పండుగై భోగి వచ్చె

క్షంతవ్యుడను

రోగముల దెచ్చు పండుగై భోగి వచ్చె
ననుచు నార్యులు బలుకుట యనుచితంబు
సుఖము లీయును మఱియును శుభము గలుగు
పండుగ వలన గద మఱి పండి  తార్య !

శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులకు  సంక్రాంతి శుభా కాంక్షలు

కందుల వారిని  గోరుదు
నందముగానీయు డార్య !యందరి సుఖముల్
విందుగ గోరుచు మదినిన్
వందనములు సేతు మీ కు వందల కొలదిన్

 

Saturday, January 11, 2014

తండ్రినే భర్తగా బొంది తరుణి మురిసె

తలచె రాముడు పుడమిని దైవముగను
తండ్రినే భర్తగా బొంది తరుణి మురిసె
నీల మేఘపు దేహుని నిరతి శయుని
రామ చంద్రుని ముదమార రామ సీత  

Friday, January 10, 2014

ఆశీర్వచనము

ఇరగ వరపు కుల భూష ణ !
యరమరికలు లేకమదిని నాదుకొ మమ్మున్
నిరతము మీ పాదములను
కరములతో బట్టు కొందు గరుణలు గలుగన్

 బంధు ప్రీతిని గలిగిన  బాంధ వుండు
స్నేహ సంపద నొందిన చెలియ కాడు
భువిని  నిరగవ రపు వంశ  బుధు డతండు
కల్ల కాదిది నిజమునే బల్కు చుంటి

మాయ మర్మము లెరుగని మనిషి యతడు
మత్సరమ్మును లేనట్టి  మాన్యు డతడు
సాటి మనుజుని మనిషిగా సాకు నతడు
సాటి లేరిక యతనికి మేటి భువిని

స్వార్ధ మనునది లేనట్టి సహృద యుండు
వీ రు నావారు వారు పైవారనుటను
వినగ లే దె పుడును మఱి ,వీ ను తోడ
దైవ తుల్యుడే యిక పైన ధరణి ప్రజకు

రామ కృష్ణ రావనగ మా మామకు నిక
సకల శుభములు గలిగించు శంక రుండు
మరల పుట్టుక లేకుండు వరము నిచ్చి
యతని యాత్మకు శాంతిని నిచ్చు గాక !


(లేటు  మామయ్య గారి సంవత్సరీకములు సందర్భముగా
 పోచిరాజు సుబ్బారావు సమర్పించు పుష్పాంజలి )
22-01-2014.
-----------------



 

మామ ముగ్గు బెట్ట మగువ మురిసె

మామ ముగ్గు బెట్ట మగువ మురిసె నట
సహజ మ యది తనదు సహచరుండు
తనకు సాయ మొంద దన్వి  సంతస మొంద
యమ్మ సోద రుండె  యతడు మఱి ని 

Thursday, January 9, 2014

శుష్క వేదాంత మును జెప్పె శుక మహర్షి

గిట్టు మనుజుడు తప్పక గిట్టు ననుచు
శుష్క వేదాంత మును జెప్పె శుక మహర్షి
యనుట సత్య దూరము గద యార్య !శుకుడు
భాగవతమును బోధించె బండితులకు 

Wednesday, January 8, 2014

ఆశీ ర్వచనము

 రాపాక వంశ మండన
మాపాపము ల ణ ఛి వైచి మమ్ముల దయతో
కాపాడు మయ్య నిరతము
మీ పాదము లాశ్ర యింతు మీ దయ కొఱకున్

బంధు ప్రీతిని గలిగిన  బాంధ వుండు
స్నేహ సంపద నొందిన చెలియ కాడు
భువిని రాపాక వంశపు బుధు డతండు
కల్ల కాదిది నిజమునే బల్కు చుంటి

మాయ మర్మము లెరుగని మనిషి యతడు
మత్సరమ్మును లేనట్టి  మాన్యు డతడు
సాటి మనుజుని మనిషిగా సాకు నతడు
సాటి లేరిక యతనికి మేటి భువిని

స్వార్ధ మనునది లేనట్టి సహృద యుండు
వీ రు నావారు వారు పైవారనుటను
వినగ లే దె పుడును మఱి ,వీ ను తోడ
దైవ తుల్యుడే యిక పైన ధరణి ప్రజకు

ప్రభల కాకర మైన ప్రభాకరునకు
సకల శుభములు గలిగించు శంకరుండు
మరల జన్మము లేకుండు వరము నొసగి
యతని నాత్మకు శాంతిని నిచ్చు గాక !

[ అన్న గారైన  లేటు  ప్రభాకర రావు గారి  సంవత్స రీ కములు  సందర్భముగా
పోచిరాజు సుబ్బారావు  సమర్పించు పుష్పాంజలి }
9-01-2014.



 

Monday, January 6, 2014

తాటకిని జంపె భరతుడు తపసి కనగ

రామ భద్రుడు కోపాన లేమ యైన
తాటకిని జంపె,  భరతుడు తపసి కనగ
రామ చంద్రుని పాదముల్ రమ్య మలర
హత్తు కొనియెను  శిరమున హర్ష మొదవ 

Sunday, January 5, 2014

నారికేళ జలమ్ము ప్రాణమ్ము దీయు

శుభ్ర పఱచును  రక్తమున్  శుద్ధి గాను
నారికేళ జలమ్ము , ప్రాణమ్ము దీయు
క్రుళ్ళి పోయిన వాటిని  కుడువ ధరను
సందియంబును నిసుమంత జెంద వలదు 

Saturday, January 4, 2014

గోవర్ధనపర్వతమును గోమలి యెత్తెన్

గోవుల కాపరి యెత్తెను
గోవర్ధనపర్వతమును గోమలి యెత్తెన్
గోవుల మలమును మూత్రము
నోవనజా! యీవిషయము నోపుదె వినగన్

Friday, January 3, 2014

హైద్రా బాదెంత దూరమయ్య కడపకున్ ?

భద్రాచల మున కేగితి
హైద్రా బాదునకు నేగ నవసర మయ్యెన్
 భద్రయ్యా ! తెలుపుము మఱి
హైద్రా బాదెంత దూరమయ్య కడపకున్ ?

Thursday, January 2, 2014

పెండ్లి కానివారలకె వేవిళ్ళు గలుగు

పెండ్లి కానివారలకె వేవిళ్ళు గలుగు
పెండ్లి తోబంధము మఱి వే  విళ్లకు నిల
కలుగ బోదార్య !  నిజమిది  కనుము నీవు
కుంతి మొదలగు మహిళల  గూర్చి యికను

 

భార్య పదములన్ భక్తితో బట్ట దగును

 భార్య పదములన్  భక్తితో బట్ట దగును
నేమి దౌర్భాగ్య మీయది యింత బ్రదుకు
బ్రదికి నిటులుగా  జేయంగ పరమ పురుష !
మృడు ని పదములన్ బట్టిన మోక్ష మబ్బు 

Wednesday, January 1, 2014

నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలు




ఇరువది,  యొకటి యు,  నాలుగు
నరయంగా  మంచి  సంఖ్య యన్నిటి  కంటెన్
తిరముగ  వత్సర మంతయు
సిరి రాసుల  నిచ్చి  మనకు శ్రీ పతి  జేయున్






ఇరువది,  యొకటి యు, నైదిది
నరయంగా  మంచి  సంఖ్య యన్నిటి  కంటెన్
తిరముగ  వత్సర మంతయు
సిరి రాసుల  నిచ్చి,  మనల శ్రీ పతి  జేయున్

ప్రజలు రోదింత్రు నూత్న సంవత్సరమున

ముక్క లగు నెడ  రాష్ట్రము  ముదిత లార !
ప్రజలు రోదింత్రు , నూత్న సంవత్సరమున
నొ కరికి నొకరు  మోదాన నొడలు మఱచి
చెప్పు కొందురు  గ మఱి యా  శీ స్సు లిలను