Wednesday, February 26, 2014

చిన్న తిరుపతి

ద్వారకా తిరు  మలగల  దైవ మరయ
స్వయము వెల సిన  ప్రత్యక్ష స్వామి యనుచు
జెప్పె నచ్చటి పూజారి  శిష్యు డొకడు
కనుల  విందొన  గూడెను  గాంచ గానె .

వెండియు నచట  మఱి యొక వేంక టేశు
విగ్ర హంబు బ్ర తిష్ఠ గా వించె, మౌని
యైన దూర్వాసు  ఘనముగ నాహ యనగ
వంద నంబులు మౌనికి వంద లాది

చిన్న తిరు పతి యందుండు చిన్మ యుండు
వేంక టేశు ని జూడంగ వెళ్లి యచట
భక్త జనముల సందడి బరగ లేమి
 మూడు మారులు  దర్శన మునకు నేగ
కలిగె  దర్శన భాగ్యము  కన్ను గవకు

చిన్న  తిరుపతి యందున చెలువు గాను
వేంక టేశుని  సోదరి విడిది జేసె
గ్రామ దేవత రూపాన గనుల పండు
గ వలె  కుంకుళ మ్మను బేర కాంతి తోడ

అమ్మ పాదము ల్దల పైన నాను నట్లు
వంగి ,భక్తి యు  తము గ నే  బ్రణతు లిచ్చి
ఆర్యు లిచ్చిన ప్రాసాద మార గించి
పయన మైతిమి యింటికి  భద్ర ముగను

చక్ర పొంగలి పులిహోర ,చాలీ నన్ని
లడ్డు పొట్లము ల్గొని నట సడ్డ తోడ
ఆర గించితి మచ్చట , యాహ రించి
బయలు దేరగ  న ట నుండి  బాగుగాను
చేరితిమి మఱి  యింటికి  క్షేమ ముగను

 

No comments:

Post a Comment