Tuesday, February 18, 2014

కైలాస గౌరినోము

కైలాస గౌరి నోమును
కైలాసపు మాత గురిచి కైవల్యంబున్
మేలుగ బొందుట కొఱకై
చాలిన బెను భక్తి తోడ జరుపగ  దలతున్

అందు కొరకునై  వలసిన నన్ని సరకు
లనగ కుంకుమ పసుపు లు నరటి పండ్లు
తమల పాకులు  వక్కలు దనరు నట్లు
కోర, కొని తెత్తు  నిప్పుడ  కోటి నుండి


సరుకు లన్నియు నొకచోట సర్ది యింట
పసుపు కుంకుమ ల్మండ్లలో భద్ర పరచి
యింటి యాడ పడుచు రాక  కంట జూచి
మొదలు బెట్టిరి  నోమును  మో దమలర


ఆలయంబున పూజకై నరిగి ,యచట
భక్తి శ్రధ్ధ ల గావించి  భవుని పూజ
వచ్చి యింటికి నేరుగ  వరుస వరుస
పసుపు కుంకుమ ల్దోసిళ్ళ  బట్టి యీయ

ప్రక్క యింటిలో నున్నట్టి పడతు లపుడు
నొక్కరొకరుగ  వచ్చుచు చక్కగాను
తీసికొను చుండి రయ్యెడ వాసి యైన
పసుపు కుంకుమ ల్దోసిళ్ళ  బ్రమద మలర


పెద్ద ముత్తైదువల తోడ పిన్నలు నట
కట్టు కొనుచును బొట్లము ల్బిట్టు వెడలె
సరిగ  పన్నెండు గంటల సమయమునకు
పూర్తి యయ్యెను మానోము మాత దయను

నోములు సంపద నిచ్చును
నోములునిక నిచ్చు మనకు నూతన బలమున్
నోములు నిచ్చును నాయువు
నోములె  మఱి కాచు మనల నొవ్వల బారిన్ 

No comments:

Post a Comment