Saturday, April 12, 2014

(ఛి . సౌ . తన్మయి -తేజ ల వివాహము సందర్భముగా ఆశీ ర్వచనములు )

ఓయి ! తన్మయి !వినుమిది యొక్క మాట
జోడు కుదిరిన నాతడు  సుందరుండు
ఈ డు జోడును సరివోయె నిద్దరకును
కలిసి బ్రదుకుడు  పాలును జలము వోలె

అన్నపూర్ణకు బుట్టిన ననుగు పట్టి
చదువు సంధ్యలు బాగుగ సలిపి మరిని
రామ లందున నన్నిట రాణ కెక్కి
తనది యగు వృత్తి  యందున తనరెమిగుల

తల్లి దండ్రుల ననుమతి దనదు భర్త
నెన్నుకొనియెను జక్కటి వన్నె గాని
నేమి యెన్నిక యీ యది యింత నేర్పు
నెటుల  వచ్చెనో నడుగుడో యింతు లార !

వరుడు పుట్టెను మఱి సాగి వారి యింట
వధువు జక్క రాజుల యింట వరము  గాను
చూడ చక్కని జంటయై  చూపరులకు
సంత సంబును  గలిగించు  సంతతమును

అమ్మ నాన్నల విడిచియు నరుగు దేర
బెంగ యుండును నిజముగ బేల !నీకు
అత్తలోనన జూడుమా యమ్మ నికను
కుదుట పడునమ్మ మనసు నీ కొంత వరకు


కంటి కింపగు కళ్యాణ మంటపమున
హితులు బంధువుల్ మంగళాక్షతలఁ జల్లి
శుభ సుఖంబుల జీవన శోభ నంద
దీవెనల నీయ మీ జంట దీప్తినందు.

కలకాలము మీ రిద్దరు
కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప
త్నులు మిత్రులుగా కష్టం
బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.

 
ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.

 
సరిలేని శుభ సుఖంబుల
సిరు లన్యోన్యతను పొంది చిరకాలము సు
స్థిర దాంపత్యముతో మీ
రిరువురు సత్కీర్తి నంది హిత మందవలెన్


సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల చల్ల గాను


రచన ; పోచిరాజు సుబ్బారావు 

 

No comments:

Post a Comment