Thursday, April 24, 2014

ఏడడుగులు -వివరణ

మొదటి అడుగు ; జీవితాంతము స్నేహపుర్వకముగా నుండుట
రెండవ అడుగు ; కలిసి మెలిసి ధైర్యముగా నుండుట కొఱకు
మూడవ అడుగు ; పరస్పరాభి వృద్ది కొఱకు
నాల్గవ అడుగు ; ఎల్లప్పటికి ఒకరి కొఱకు నొకరు  జీవించుట కై
ఐదవ అడుగు ; మాన ప్రాణ ధనములను రక్షించుట కొఱకు
ఆరవ అడుగు ; మన పిల్లల భవిష్యత్తు కొఱకు
ఏడవ అడుగు ; సుఖ దుఃఖములను పంచు  కొనుట కొఱకు
---------------
వరుని జేబట్టి నడచును వధువు నిచట
యడుగు లేడును వరుసగ నరయ దాని
యర్ధ మేమన వివరింతు నార్య !నిపుడు
సావధానముగ వినుడు శ్రద్ద్ష గాను

మొదటి యడుగున కర్ధమ్ము  ముదిత ! వినుము
జివితాంతము  మెలగుము స్నేహ పూర్వ
కంబుగను మఱి  నీభర్త కనుల యెదుట
కనులు మీయవి నాలుగు  కలిసి కొనగ

రెండవ యడుగున కర్దము
మెండుగ నిక కలిసి మెలిసి మెలగుట  మేలౌ
నిండగు ధైర్యము కలిగియు
నుండంగా మేలు గలుగు నుర్వి జనులకున్

ఒకరి యభివృద్ధి కొఱకునై నొకరు పూను
ట యది మూడవ యడుగున డచుట యగును
నాలుగవదియ దెలుపును నయము గాను
నొకరి కొఱకునై మఱియొక  రుండ వలయు
జీ వితాంతము  వరకుగా జీవ నంబు

ప్రాణ మాన ధనము పరిరక్ష ణమునిక
అయిదవ యడుగున కర్ధ మబల !
ఆరవది యగు నడుగును నరయ తెలియు
సంతు భావి జీవితమును జక్క దిద్ద

సుఖము మఱియును దుఃఖము జూర గొనుట
కొఱకు గానేడ వయడుగు గూర్చు నుగద
యేడడుగుల బంధమిదియ ,యీ వ చనము
లాల కించుచు వర్తిలు డార్యు లార !

No comments:

Post a Comment