పుట్టితి వట యీ రోజున
పుట్టిన మధు సూదనుండ !పూర్ణిమ చంద్రున్
బిట్టుగ బోలుచు వెలుగుము
నట్టింటను దిరుగు చుండి నలుగురి లోనన్
పుట్టి నేటికి యాయెను పొలుపుగాను
వత్సరమ్ములు నేబది వాస్తవముగ
నందువలనన స్వర్ణ జయంతి యనెడు
నుత్సవమ్మును జరుపగ నుత్సహించె
రాయల సీమన బుట్టిన
రాయుడు మధు సూ దనుండు రామ తులసినిన్
జాయగ జేయుట కతనన
పాయని సంపదలు గలిగె బహు ముఖములుగన్
నియమ ని ష్ట ల యుతుడు సు నీతు డనగ
బుట్టె వారికి నేకైక పుత్రు డొకడు
బుద్ధి మంతుడు చదువరి బుధ జ నులను
జేరి వినయాన నతులను జేయు నతడు
తండ్రి పేరును నిలబెట్టు తనయు డేను
వితరణ బుద్ధిని గలిగిన
నతులితమగు సుగుణ శీ లు నతనికి మేమున్
సతతము నర్పణ సేతుము
శతములుగా వందనమ్ము సాదర ముంగాన్
బంధు ప్రీ తిని గలిగిన బాంధ వుండ !
స్నేహ సంపద నొందిన స్నేహ శీ ల !
సాయ మొనరించు గుణమున సద్గుణుం డ !
సాటి యెవరయ్య ! నీ కిల సాటి యెవరు ?
పుట్టు తోడనే నబ్బెను నిట్టు లైన
సాయ మొనరించ యీ బుద్ధి సామి !నీ కు
లేని యెడ లన నిట్లుగా లేశ మైన
చేయ లేవయ్య సాయము చిత్స్వ రూ ప !
ఉండు మాత్రాన జేయడు నొండు మనిషి
సాయ మెపుడును ,నీ పట్ల సరియ కాదు
చేసితివి మఱి యింకను జేతు వీ వు
పుట్టి నుండియు వచ్చిన బిట్టు గుణము
సకల శుభములు గలిగించు శంక రుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల జల్ల గాను
--------------------------------------
రచన :::: పోచిరాజు సుబ్బారావు
No comments:
Post a Comment