పుట్టితి వట యీరోజున
పుట్టిన యోపో తుకూచి ! పూర్ణిమ చంద్రున్
వట్టున వెలిగితి వార్యా !
యెట్టుల నినుగొలు వగలను నిచ్చయు నుండన్?
నిన్న మొన్నటి వాడవె యన్న !నీవు
వచ్చె మఱి యెనుబదియవ వత్సరమ్ము
కాల గమనంపు వేగము కనుగొ నంగ
దరమె యోసామి ? తలవంచ దప్ప మనకు
న్యాయ వాదులు పుడమి న న్యాయములను
దూర మాపుదు రనుమాట దొలగ కుండ
నీయె డలసా ర్ధ కమునయ్యె నిజము గాను
నందు కొనుమయ్య జోహార్ల నందు కొనుము
పత్రికా రంగమున నీదు ప్రతిభ నెన్న
దరమె యెవరి కైననునిల దప్పు గలుగు
చోట నిర్భయముగ మఱి చాటి చెప్పు
గుణము నీ సొత్తు నిజమిది గురువ రేణ్య !
పరగ సాహిత్య రంగమున్ వదల కుండ
రచన లెన్నియో గావించి రచయి తలకు
మార్గ దర్శకు డైనట్టి మాన నీయ !
వంద నంబులు నీకివే వంద లాది
సూర్య నారాయ ణా ఖ్యుడ ! చూడు మిదియ
కాన బడలేని దూరాన నేన యుంటి
నిన్ను సేవించు కోరిక మిన్న గాను
నాకు గలదార్య ! మఱి యెట్లు నాకు కలుగు ?
కాన నర్పించు చుంటిని కాంక్ష దీర
సేవ పూర్వక పద్యాల శ్రేణి నీకు
కరుణ తోడన గ్రహియించి కరము నాకు
నీదు దీవన లిమ్ముమా ! నెమ్మనమున
సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటి కినిరెప్ప యట్లయి కాచు గాత !
నిన్ను నోసామి ! నిరతము చెన్ను మీర
--------------
( రచన : పోచిరాజు సుబ్బారావు )
No comments:
Post a Comment