లేవు లేవమ్మ ! యిక మాకు లేవు నీవు
నె చటి కేగితి వమ్మ నీ విచటి నుండి
కళ్ళు మాయవి కాయలు కాచె నమ్మ !
రమ్ము వేవేగ మమ్ముల రక్ష జేయ
జ్ఞాప కంబులు నీయవి జ్ఞప్తి కలిగి
ఉన్న లేకున్న నున్నట్టు లుండె మాకు
అమ్మ ! చూతుము నొ కపరి యమ్మ రమ్ము
మునుపు వోలెను ,నీ రాక ముదము మాకు
ఎవరు వచ్చిన విసుగక నెందు కనక
కడుపు నిండుగ బెట్టుట కలదు నీకు
నాన్న కూడను నిందుకై నమ్మి నిన్ను
నుత్స హించును గదమ్మ !యుత్సు కతన
అమ్మ! ప్రేమను బంచితి వమ్మ నీవు
మరువ జా లము మరి మేము మరువ మమ్మ !
మాట లాడుచు నుండంగ మరణ మగుట
దైవ నిర్ణయ మీ యది , దరమె దా ట ?
ఆ శ లేదమ్మ ,నీ కిల యాశ లేదు
ఉన్న దానితో సంతృప్తి నొంది తీ వు
సా టి రారమ్మ యెవరును సాటి రారు
అందు కోవమ్మ ! జోహార్ల నందు కొనుము
నాన్న ,యమ్మమ్మ యిచటనే హాయి గాను
వెళ్లి పోయిరి మమ్ముల విడిచి మరిని
నీవు కూడను వారికి నేస్త వైతి
దిక్కు లేనట్టి మాకిక దిక్కు సాయి
అమర లోకము జేరితి వమ్మ నీవు
అమరు లందరు నినుజూచి యాద రించ
మసలు కొనుమమ్మ యచ్చట మాన్యు రీతి
నాదు కొనగను నమరులు , హాయి కలిగి
చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు
జన్మ లేకుండ జేయను సమ్మ తించి
సకల శుభములు గలిగించు శంక రుండు
నీ దు నాత్మకు శాంతిని నించు గాక !
( ది .3-5-2015 వ తే దీన మా అమ్మ గారు ,రాపాక సీ తా మహలక్ష్మి గారు పరమ పదించిన సందర్భముగా
అశ్రు పూర్వక నయనాలతో ... .............
కుమార్తెలు మఱియు కుటుంబ సభ్యులు .