skip to main
|
skip to sidebar
subbarao
Monday, February 29, 2016
పద్యరచన...జింక-కోతి
చిత్రమాయదిజూడగజిత్రమాయె
లేడివీపుననెక్కియులీలగాను
చూచుచుండెనుదిక్కులుచోద్యమలర
కాంచితిరెమీరుమర్కటకందళిలను
కాకరబెల్లమ్మువోలె......
ఆకాకరయున్దీయనె
కాకరబెల్లమ్మువోలెగడుపులుపుగదా
మేకలలక్ష్మీ!వినుమా
శాకములోచింతపండుజాస్తిగవేయన్
Sunday, February 28, 2016
ధర్మసత్రనిర్మాణముల్దగనిపనులు
మంచికార్యముల్సోదర!యంచితమగు
ధర్మసత్రనిర్మాణముల్ద
గనిపనులు
హానిగలిగించుగార్యముల్లాచరించ
మంచిజేయుటశ్రేయముమందికెపుడు
పద్యరచన--సుగంధద్రవ్యములు
మిరియములులవంగములునుమిక్కుటముగ
కానబడుచుండెజక్కగగనుడుసామి!
పిండివంటలయందునవేసితినగ
మంచిరుచినిదానిచ్చునుమరియుకలుగు
నాయురారోగ్యములుగూడననవరతము
Saturday, February 27, 2016
దూఫదర్శిని
ఏమిబాధలువచ్చెనోనేమొకాని
దూరదర్శినియందునదుహితయొకతె
దుఃఖమొందుచుగనబడెదోయజాక్షి!
కారణంబునునడుగుముకలతకుమరి
మాననీయ.........
తానుజేసినపాపమ్ముదలరుదనుక
జీవిపుట్టుచునేయుండునవనియందు
జన్మరాహిత్య మెవరికోసన్మతులకు
మాత్రమందరికినికాదుమాననీయ!
Friday, February 26, 2016
ఆవునకుముద్దు
చిత్రమందునజూడుడుచిత్రముగను
నావుముఖమునుగట్టిగానదిమిపట్టి
పెట్టుచుండెనుముద్దునుబిల్లయొకతె
యాహ!జోహార్లునాయవియందజేయ
కోరుచుంటినిగురువులగూర్మితోడ
దత్తపది.తల
తలపులవలపులుగలిగెను
దలనిండుగబూలుముడిచితరుణినినిన్నే
దలచుచునుంటినినిచ్చట
తలపేమరినీకులేద?తారకరమణా!
చింటపండు..........
నోటతాకగానెనోరంతపుల్లనౌ
చింతపండుగుజ్జు,చేదుగాదె?
యరయకుంకుడురస మందీయనోటికి
దెలియజేయురుచినినాలుకార్య!
పూరణ
సద్యపు స్ఫూర్తినిన్ వినయ సంపద లందుననుత్తముండునై
హృద్యము లైన కార్య తతు లింపుగ నేర్పున జక్క బెట్టుచున్
వైద్యవిశారదుండు నుడువన్నిక దప్పదటంచు నించుకన్
మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతింత్రు సజ్జనుల్
Thursday, February 25, 2016
మద్యముద్రాగువారల......
మద్యముద్రాగువారలనెమాన్యులుగానుతియింత్రుసజ్జనుల్
చోద్యముగాదెయీపలుకుసోదర!చెప్పుమునీవయైననున్
మద్యముద్రాగువారలరుమత్తుననుండుచువాగుచుందురే
పద్యమునందుసజ్జనులభావమునిచ్చుటపాడియేమరిన్
విఘ్ననాధుడు
శుధ్ధవస్త్రముధరియించుసిధ్ధిగణప
తిని,భుజములవి నాలుగునెనయువాని
విఘ్ననాధునిగొలుతునుబ్రీతితోడ
నహరహమ్మునువేకువనందులేచి
గణనాధుడు
పోచిరాజుకామేశ్వరరావుగారిపూరణ
------
ధవళాంబరధరునిసకల
భువనవ్యాపిశశివర్ణుభుజచాతుష్కున్
సువికసితప్రసన్నవదను
నివిఘ్నరాహితినిమదినినిత్యముదలతున్
యజ్ఞయాగాదు.......
నెలకుమూడువానలుగాగ నియమముగను
గురియజేతురుదేవతల్గూర్మితోడ
యజ్ఞయాగాదులొనరింప,నఘముకలుగు
నట్టివారినిదూషించనహరహమును
Wednesday, February 24, 2016
రాముడనగ..............
మానవాకృతినొందినమహితుడార్య!
రాముడనగ,నెవ్వడతడొకరాక్షసుండు
లంకకధిపతియైనట్టిరావణుండు
నిజమునమ్ముముమ్మాటికినిజముసుమ్ము
పలుకె బంగార మాయెనా
పలుకెబంగారమాయెనాలలిత!నీకు
నీదునామంబులన్నియుదినము
దినముబారాయణంబు నుదీక్షతో!డ
చేయుచుంటినిగదయమ్మ!వేయి మార్లు
Tuesday, February 23, 2016
కలడందురు.......
కలడందురన్నిచోట్లను
కలడా?మరినాదుగుండెగహ్వరమందు
న్గలడేమో నేజూతును
కలడననిజమైనయెడలకాంతును భక్తిన్
పగటినిద్ర........
బధ్ధకమునొనగూర్చును బాల!వినుము
పగటినిద్ర,బధ్ధకముసంపదలనొసగు
ననుటహాస్యాస్పదమగునునరయ.సంప
దలనుబోగొట్టునిజముగ నిలనుసుమ్ము
తల్లిదండ్రులసేవ
తల్లిదండ్రులసేవలో ములిగి యతడు
మారమణునినూ రటబర్చె గారవముగ
మాధవునిసేవకంటెను మాత్రపితల
సేవమిన్నయ నిదెలియజేసెనుగద
శ్రీరామునిసేవ........
పారమునొందుదురందరు
శ్రీరామునిసేవజేయ,సిరులేపోవు
న్వీరావేశమునొందుచు
పోరానిన్జోటుకేగపొడిపొడియగుచున్
Monday, February 22, 2016
సీమచింతకాయలు
సీమచింతకాయదినగచేదు,వగరు
గలిగియుండును చెట్లవికనబడునట
పల్లెటూరులయందునబహుళముగను
పోయిచూతమురారండి భూరుహములు
వెన్నుజూపువాడె........
పిరికిపంద నాగబిలువబ డునిలఙే
వెన్నుజూపువాడె,వీరుడనగ
చావుభీతిలేకశత్రుమూకలనెల్ల
తనదుఖడ్గమునకునెనయువాడు
భండనంబునరాముడు......
చీల్చిచెండాడె రావణున్సీతకొరకు
భండనంబునరాముడు,పరుగిడెనట
రాముబాణాగ్నిధాటికిరక్కసులట
యెవరిద్రోవనవారుగానెరుకలేక
కడుపేకైలాసమండ్రు........
విడువక యెప్పుడుదినుచును
కడవలతోబాలుపెరుగుకంఠముదనుక
న్యెడపకద్రాగెడువానికి
కడుపేకైలాసమండ్రుకామినులెపుడున్
Sunday, February 21, 2016
నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవురా వలెన్
నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవురా వలె
న్బోవుద మిప్పుడే గుడికి పోచిన పెద్ది సు తుండ !వేంకటా !
రావుల కామశా స్త్రి మఱి రాయల పాటి సుధా కరా !యిక
న్వేగమె రండి పో వుదమ ప్రీతిని మ్రొక్కగ నా రమా ప్రభున్
మాతృభాషాదినోత్సవము
మాతృ భాషాది నోత్సవ మాటవినగ
పులకరించెను నాయొడల్పొరలిమిగుల
తేనె లొలికెడు భాషయీ తెలుగుభాష
తెలుగునే బలుకుదమిక తీయగాను
తెలుగుదీయదనముదెలిసినరాయలు
దేశభాషలందుతెలుగులెస్స
యనుచుమెచ్చుకొనియెగదమరిమనమును
వాయినిండుగదెలుగుబలుకుదమిట
Saturday, February 20, 2016
తాత్పర్యము బోధ పడదు తత్త్వ జ్ఞులకున్
సత్పధము లేనివారికి
తాత్పర్యము బోధ పడదు తత్త్వ జ్ఞులకున్
తత్పరత యుండు కావున
తాత్పర్యము బోధపడును దండ్రీ !వినుమా !
Friday, February 19, 2016
లంకనేలెను
రావణాసురుడనిలోనరాముచేత
పెద్ద నిద్దుర వోవవి భీ ష ణుండు
లంకనేలెనురాజయి ,లక్ష్మణుండు
సంత సంబున నతనికి సహక రించె
బీరుద్రాగిన,గలుగును వీర్యవృధ్ధి
›
మేను నిగనిగ లాడుచు మెరయుచుండు
బీరుద్రాగిన,గలుగును వీర్యవృధ్ధి
దినముదినమును నుదయాన తేనెద్రాగ
ద్రాగిచూడుడుదెలియును దానిఫలము
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్
కృష్ణుడు భగవంతుడుగద
కృష్ణునిబూజించనొసగు గైవల్యంబు
న్గృష్ణుని నిటులన నాయమె?
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్
Thursday, February 18, 2016
సమ్మక్క సారక్క
గద్దె నెక్కిరి యిద్దరు కంటి నచట
భవ్య చరితులు పుడమిని ప్రముఖ సతులు
కనుము సమ్మక్క సారమ్మ యనగ వారు
పూజ లందుకొనుదురట పుణ్యమిచ్చి
భరత మాతనుదూషించువారె,ఘనులు
పరమ చండాలురుగబుట్టుదురటభువిని
భరత మాతనుదూషించువారె,ఘనులు
తల్లి పుడమికి జేజేలు దనర చెప్పు
వారు,నతులనే నిడుదునువారికిపుడు
Tuesday, February 16, 2016
అల్లము మీద గణపతి
ఇల్లాలు కౌతుకంబున
నుల్లము విలసిల్ల గీచె నోపికతోడ
న్నల్లముమీదన గణపతి
నల్లదిగోచూచిరండి యార్యా!యిపుడే.
గొడ్రాలికిగొడుకుపుట్టె గోడండ్రేడ్వన్
గొడ్రాలనుకొనియుండగ
వడ్రంగిన సాధువొకనిబలుకులమేర
న్వడ్రంగి శంభు మ్రొక్కగ
గొడ్రాలికిగొడుకుపుట్టె గోడండ్రేడ్వన్
పాపాత్ములు భ్రష్టులు ,జన వంద్యులు జగతి
పాపములు జేయువారలు
పాపాత్ములు ,భ్రష్టులు ,జన వంద్యులు జగతి
న్నాపదుల గావు జనములు
పాపము లంజోలి బోక బ్రదికెడు వారున్
తల్లీ నిన్ను దలంచి .........
నిన్ను మనమున భావించి సన్నయమున
జేతబట్టితిబొత్తము,చిరునగవున
నన్నుదీవించియొసగుము,నచ్చువిధము
మంచివాక్కును,శబ్దముల్మందిపొగడ
సకల సద్గుణనికురంబ! శారదాంబ!
Sunday, February 14, 2016
తులసి దళపు మొగ్గు
భక్తి మిన్న యనుట పరమస త్యమనియు
తులసి దళపు మొగ్గు దెలియ పరచె
సత్య దలపు లన్ని సత్యదూ రములని
తెలియ జేసె గృష్ణు తెలివి గాను
జనగణమనాధినాయక!
జనగణమనాధినాయక!
యనవరతము నిన్నె గొలుతు నాశ్రయమిమ్మా!
మనగను సంతోషంబున
వినుమా యికనాదుమొరనువితరణ బుధ్ధిన్
వందే మాతర మన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్
వందే మాతర మన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్
సందేహం బిదియేల వచ్చెరజనీ! సామూలముం జెప్పుమా
వందే మాతర మంచు పల్కు మిపుడే వర్ష్మంబు లుప్పొంగగ
న్నందంబే యగు నట్లు జేయ ప్రజకున్నాహ్లాదముం గల్గెడిన్
తండ్రి భుజము పైకి
తండ్రి భుజము పైకి తనయుడెక్కి యనెను
దైవమెవరొకాదు తండ్రి యౌను
తల్లిదండ్రులరయ దైవసమానులు
వారి బాగు చూడ వలయు సుమ్ము
గుండ్రాతికినోరువచ్చి గొల్లున నేడ్చెన్
గుండ్రాయి మీద శిల్పులు
తండ్రీకొడుకులనుజెక్క దైన్య ముదోపన్
బండ్రాతినిజూచుసరికి
గుండ్రాతికినోరువచ్చి గొల్లున నేడ్చెన్
అడవి సింహములు
వచ్చి పోవువా హనములు భయప డంగ
నడవి సింహము లచ్చటన డ్డముగను
దారి కాచెను జూడుడు,దారిలేక
నాగి పోయెను కారులే యార్య! యచట
పురుషుని నిందించుసతిని,బూజింతురిలన్
కొరగానిసతిగజూతురు
పురుషుని నిందించుసతిని,బూజింతురిలన్
పురుషుని యాలనపాలన
దరహసిత ముఖంబుతోడ దాల్చెడునింతిన్
కోనేరున నొక్కచేప, కొంగనుమ్రింగెన్
కానగ నయ్యెను వెదుకగ
కోనేరున నొక్కచేప, కొంగనుమ్రింగె
న్గోనేరునగల మకరము
తానుగ మెల్లంగ వచ్చి దాపున నొదిగీ
వివాద నిలయములువిశ్వవిద్యాలయముల్
భువిలో నెక్కడ జూచిన
వివాద నిలయములువిశ్వవిద్యాలయముల్
రవములునరుపులతోనట
వివశతయగునట్ల యుండె వింటే సాయీ !
అదిగో ద్వారకయనగన నయ్యెను ఢిల్లీ
విదితమ యయ్యెనె? నీకిది
అదిగో ద్వారకయనగన నయ్యెను ఢిల్లీ
వదినెను గూర్చియు పలికెను
తుదిమెఱగులుచేయుచుండె దు దివ ర కుంగన్
అంగదుడాగ్రహించి దమయంతిని దిట్టెను కర్ణుడేడ్వగన్
అంగదుడాగ్రహించి దమయంతిని దిట్టెను కర్ణుడేడ్వగన్
అంగనలారవిం టిరిదె యంగదు తిట్టెను గర్ణుడేడ్వగా
నంగన చారుశీ లియగునాదమయంతిని న్యాయమే?మరిన్
అంగద రాజ్యలక్ష్మి!చెపుమంచిత ధర్మము నీవయిప్పుడున్
కాలయమునిగొలువ, గాసులిచ్చు
ఇచ్చు నాయువునిల నిబ్బడిగనుమరి
కాలయమునిగొలువ, గాసులిచ్చు
నాదిదేవుగొలువ ,నైహికసుఖములు
భోగభాగ్యములను బుడమియందు
కుంటాట
కుంటాట దానినందురు
ఒంటిగనటయొక్కరొకరునోపికకొలది
న్నొంటియ పాదముతోడను
గుంటుచునేనుందురచటకూలెడువరకున్
రక్తమునుద్రాగువాడెపో,భక్తుడనగ
రాక్ష సుడనగ బరగును రహినిభువిని
రక్తమునుద్రాగువాడెపో,భక్తుడనగ
తనదుజీవితమంతయు దన్మయతన
భగవ దారాధ నమునందు బరగునతడు
చేయగూడని పని
చేయగూడని పనియేదొ చేసెనేమొ
తనదుచేతులు నోటికిదగ్గరునిచి
సాటి వారలు వ్రేళ్లను జాపిచూప
నేడ్చుచుండెను జూడుమ యెవడొగాని?
జ హంగీర్లు
చిత్ర మందుజ హంగీర్లు చిత్రముగను
దనరె బంగారుఛాయతో ధగధగముగ
చూడ దినబుధ్ధియాయెను సుమ్ము నాకు
తెచ్చియిచ్చిన గడుపార తిందునేను
ద్రౌపదికొక్కడేపతిగదాయనిచెప్పినమెచ్చిరెల్లరున్
ద్రౌపదికొక్కడేపతిగదాయనిచెప్పినమెచ్చిరెల్లరు
న్బాపముగాదెయిట్లుడువ ద్రౌపది సాధ్వియ పాండవుల్గన
న్రూపములైదుగాని,నరయుండొకరేయనినింద్రునంశముల్
ద్రౌపదిపాతివ్రత్యమునదారెవరున్సరిరారుగాభువిన్
నాచెంతకుచేరినావు న్యాయమ చెలియా
నాచెలి కానిని వలచియు
నాచెంతకుచేరినావు న్యాయమ చెలియా
చాచానెహ్రూపటమును
దాచితినిట నీకుగానుదల్లీ! గొనుమా!
చేపల ముగ్గు
చేపల ముగ్గునుజూడుము
ఏపాపలుబెట్టిరచటయేమోకానీ
పాపల నైపుణ్యమునకు
రూపాయలనిత్తునిపుడురూఢిగ నేనున్
కోమటింట,దెగెను కుక్కుటములు
పెండ్లి జరుగు చుండె వైభవ ముగమన
కోమటింట,దెగెను కుక్కుటములు
ఊరి వారి కొరకు నోరార తినగను
షడ్రుచులమిళితపుశాకమది
రొక్కము నోట్లు
లెక్క పెట్టు చుండె రొక్కము నోట్లుగ
చిత్ర మందు చూడు చిత్ర! నీవు
వేల కొలది యుండు వేయినో టులకట్ట
లచట చూసి చెప్పు రయము గాను
కాలగతిని నిల్పగలడుగదమానవుడే
కాలపు గమనము నిల్పగ
జా లముమరియొపుడుమనముచాలును శివుడే
మేలపు పలుకే గదయిది
కాలగతిని నిల్పగలడుగదమానవుడే
పద్య రచన -కోతి పేపరు
కానన మందున నుండెడు
వానరమాపీటమీద బాగుగ గలదై
యాననము గ్రిందనునిచియు
మౌనముగా జదువుచుండె మూర్తీ! కనుమా.
వర్షాకాలమ్శువచ్చు, వైశాఖమునన్
హర్షా!శ్రావణ మందున
వర్షాకాలమ్శువచ్చు, వైశాఖమున
న్హ ర్షముగలుగగ దరువులు
శీర్షములకుబూలనిచ్చుసింగారించన్
నాపతియిటకరుదెంచును
నాపతియిటకరుదెంచును
నాపాపను నన్నుజూడ నమ్ముము లక్ష్మీ!
యీపూటకిచట నుండుచు
మాపటికిన్నేగుమధుర మమ్ములగొనుచున్
రుక్మిణీ ప్రాణనాధుడర్జునుడు నిజము
నరుడు నారాయ ణుండును నరయ యయిరి
రుక్మిణీ ప్రాణనాధుడర్జునుడు నిజము
గమరి దైవస మానులుగాదె!మరియు
భూరివిక్రమవంతులుభువినివారు
సోడాద్రాగిన
సోడాద్రాగిన యెడలను
మాడునగల నొప్పియంత మాయమయగును
న్వేడెద నాకొకసోడా
మాడుగులా!తెచ్చియిమ్శు మరినీవిపుడే
కలకాలము బ్రతుకుజీవి గార్దభ మార్యా!
కలకాలము నేజీవియు
నిలలో మరి బ్రతుకదయ్య!యెచ్చటనైన
న్బలుకుట న్యాయమె?యిట్లుగ
కలకాలము బ్రతుకుజీవి గార్దభ మార్యా!
పుట్టు మనుజుడు
పుట్టు మనుజుడు తప్పక గిట్టు కతన
బ్రతికి యున్నంత కాలము భవునిసేవ
జేసి కొనుముర తప్పక జేరుదువిక
శివుని చెంతకు నిజమునే జెప్పు చుంటి
రామునిసవతితల్లి,ధరాతనూజ
అరయగసుమిత్రయే మరి యగునుసుమ్ము
రామునిసవతితల్లి,ధరాతనూజ
రాముసహధర్మచారిణి రామ సాధ్వి
వంద నంబులుసేతును పావనికిట
పద్య రచన -పిల్లి
పిల్లి యచ్చటి బావిని బెదురులేక
చూచు చుండెనుబింబముచూడ్కులార
తనదు రూపుగా నెరుగకతలచెనేమొ
వేరు మార్జాల మదియనివివశతయయి
పతినిగోరుకాంత ,భ్రష్టురాలు
సాధ్వియనగబడును సాటివారలయందు
పతినిగోరుకాంత ,భ్రష్టురాలు
అదుపునాజ్ఞలేక నాకతాయిగృహిణి
శీలరహితయింతిచీడ భువికి
కలఁ గంటిని కలలోనన్
పోచిరాజు కామేశ్వర రావు గారి పూరణ
కలఁ గంటిని కలలోనన్
విలసిల్లె మహోన్నతంపు విగ్రహ మచటన్
ఖలుజన విదారు గృష్ణుని
జలరుహ నేత్రుం గొలుతును జగదాచారున్
జలధరమ్ములుగరళవర్షమ్ముగురిసె
యాగశాలన మునులందరామఘునికి
హోమ కార్యముల్ శ్రధ్ధగ నొనరుచుండ
రాక్షసులరక్త వర్షము రహినిజెలగి
జలధరమ్ములుగరళవర్షమ్ముగురిసె
నటుల దోచెనుజూడుమ యార్య!మీ
వంకయున్నవాడు శంకరుండు
సగము మేనువాడు,శశిధరుండునగము
నాభరణముగాగనలరువాడు
భక్తు లనల రించు వాడును చిరునెల
వంకయున్నవాడు శంకరుండు
Saturday, February 13, 2016
పార్ధసారధి................
చిమ్మచీకటిగలయట్టిచెరనుగాదె?
పార్ధసారధిజన్మించె,భానుమతికి
లక్ష్మణకుమారుడననొకలక్షణుండు
పుట్టెకొమరుడులావణ్యమూర్తియగుచు
Friday, February 12, 2016
అత్తలేనికోడలు..........
అత్తలేనికోడలుత్తమురాలుగ
బలుకుచుండ్రుజనముపాడియగునె?
అత్తకూడయరయయమ్మతోసరియగు
పూజనీయులుగద పూజ!వారు
నీలాపనిందలు
నీలాపనిందలనునవి
వాలాయమువచ్చుచుండుబ్రతియొక్కరికి
న్మేలముగావీపలుకులు
శూలునిసుతుచవితినాడుసోమునిజూడన్
Thursday, February 11, 2016
కలియుగపు......
కలియుగపుదైవమందురు
ఇలతిరుపతివేంకటేశునీశా!వినుమా
తలనీలాలనునీయగ
పలువురుమరివచ్చుచుండ్రుభక్తినినటకున్
Wednesday, February 10, 2016
దసరా.........
దసరాపండుగ వచ్చును
మిసమిసలాడంగ గుడులుమేదినిమిగులు
న్నసమానతలనువిడిచియు
వెసజతగాబోవుచుండ్రు బెద్దలుబిన్నల్
Tuesday, February 9, 2016
కలకాలము........
కలకాలమునేజీవియు
నిలలో మరిబ్రదుకదమ్శ! యెట్లుగనైన
న్జెలువా!యిట్లుగనుడువుట
కలకాలముబ్రదుకుజీవిగార్డభమార్యా!
Saturday, February 6, 2016
ఒకచో.......
ఒకచోనేలనుబవ్వళించునొకచోనొక్కండుగానుండునా
యకలంకంబగుకార్యసాధకుడునేయార్తిన్మనంబందునిం
చుకయున్నోపకభారమంతయునునాసోమెశుదేయంచుమా
నకదాకార్యపుసిధ్ధికైమిగులదానైనొందుకష్టంబులన్
Thursday, February 4, 2016
ఆటలు
చెమట తోడ మిగులచిటపటలాడును
ఆటలాడమేను,నావిరియగు
నీళ్ల కాగు లోనినీరుచా లవరకు
క్రింద మంట పెట్టబిందు!తెలియు
Wednesday, February 3, 2016
శ్రీరామునిఆ
ఆరామకైకమాతయె
శ్రీరాముని సవతితల్లి సీతయెగాదా
యారామునిసహ చారిణి
రామాయనినంతగలుగురయమునసుఖముల్
రామాయణము
తనర రామాయ ణంబునుదళితులండ్రు
రంకుమరియుభారతమునుబొంకుగాను
సత్య దూరమా పలుకులుసత్య!తెలియు
భారతమునురామాయణమలరుభువిని
Tuesday, February 2, 2016
పద్యరచన
కట్టుబొట్టుననలరుచుకాంతయొకతె
పిలిచె నచటకు రమ్మని వేశ్యయేమొ
వెళ్ల లేనార్య!వెళ్లనునొట్టుగాను
మట్టుగావించు సొమ్శులుమాయజేసి
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
About Me
subbarao
View my complete profile
Blog Archive
►
2024
(3)
►
December
(1)
►
July
(1)
►
February
(1)
►
2023
(1)
►
November
(1)
►
2022
(70)
►
December
(1)
►
September
(1)
►
August
(2)
►
July
(14)
►
June
(44)
►
March
(3)
►
February
(4)
►
January
(1)
►
2021
(480)
►
December
(3)
►
November
(3)
►
September
(31)
►
August
(57)
►
July
(54)
►
June
(61)
►
May
(61)
►
April
(53)
►
March
(56)
►
February
(53)
►
January
(48)
►
2020
(740)
►
December
(58)
►
November
(60)
►
October
(58)
►
September
(66)
►
August
(58)
►
July
(62)
►
June
(61)
►
May
(64)
►
April
(66)
►
March
(65)
►
February
(58)
►
January
(64)
►
2019
(676)
►
December
(57)
►
November
(47)
►
October
(61)
►
September
(56)
►
August
(57)
►
July
(62)
►
June
(45)
►
May
(40)
►
April
(62)
►
March
(76)
►
February
(53)
►
January
(60)
►
2018
(659)
►
December
(46)
►
November
(62)
►
October
(56)
►
September
(68)
►
August
(58)
►
July
(62)
►
June
(57)
►
May
(54)
►
April
(34)
►
March
(35)
►
February
(65)
►
January
(62)
►
2017
(525)
►
December
(21)
►
November
(53)
►
October
(44)
►
September
(61)
►
August
(30)
►
July
(25)
►
June
(31)
►
May
(16)
►
April
(50)
►
March
(71)
►
February
(56)
►
January
(67)
▼
2016
(773)
►
December
(70)
►
November
(52)
►
October
(77)
►
September
(65)
►
August
(46)
►
July
(54)
►
June
(58)
►
May
(77)
►
April
(78)
►
March
(59)
▼
February
(82)
పద్యరచన...జింక-కోతి
కాకరబెల్లమ్మువోలె......
ధర్మసత్రనిర్మాణముల్దగనిపనులు
పద్యరచన--సుగంధద్రవ్యములు
దూఫదర్శిని
మాననీయ.........
ఆవునకుముద్దు
దత్తపది.తల
చింటపండు..........
పూరణ
మద్యముద్రాగువారల......
విఘ్ననాధుడు
గణనాధుడు
యజ్ఞయాగాదు.......
రాముడనగ..............
పలుకె బంగార మాయెనా
కలడందురు.......
పగటినిద్ర........
తల్లిదండ్రులసేవ
శ్రీరామునిసేవ........
సీమచింతకాయలు
వెన్నుజూపువాడె........
భండనంబునరాముడు......
కడుపేకైలాసమండ్రు........
నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవురా వలెన్
మాతృభాషాదినోత్సవము
తాత్పర్యము బోధ పడదు తత్త్వ జ్ఞులకున్
లంకనేలెను
బీరుద్రాగిన,గలుగును వీర్యవృధ్ధి
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్
సమ్మక్క సారక్క
భరత మాతనుదూషించువారె,ఘనులు
అల్లము మీద గణపతి
గొడ్రాలికిగొడుకుపుట్టె గోడండ్రేడ్వన్
పాపాత్ములు భ్రష్టులు ,జన వంద్యులు జగతి
తల్లీ నిన్ను దలంచి .........
తులసి దళపు మొగ్గు
జనగణమనాధినాయక!
వందే మాతర మన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్
తండ్రి భుజము పైకి
గుండ్రాతికినోరువచ్చి గొల్లున నేడ్చెన్
అడవి సింహములు
పురుషుని నిందించుసతిని,బూజింతురిలన్
కోనేరున నొక్కచేప, కొంగనుమ్రింగెన్
వివాద నిలయములువిశ్వవిద్యాలయముల్
అదిగో ద్వారకయనగన నయ్యెను ఢిల్లీ
అంగదుడాగ్రహించి దమయంతిని దిట్టెను కర్ణుడేడ్వగన్
కాలయమునిగొలువ, గాసులిచ్చు
కుంటాట
రక్తమునుద్రాగువాడెపో,భక్తుడనగ
చేయగూడని పని
జ హంగీర్లు
ద్రౌపదికొక్కడేపతిగదాయనిచెప్పినమెచ్చిరెల్లరున్
నాచెంతకుచేరినావు న్యాయమ చెలియా
చేపల ముగ్గు
కోమటింట,దెగెను కుక్కుటములు
రొక్కము నోట్లు
కాలగతిని నిల్పగలడుగదమానవుడే
పద్య రచన -కోతి పేపరు
వర్షాకాలమ్శువచ్చు, వైశాఖమునన్
నాపతియిటకరుదెంచును
రుక్మిణీ ప్రాణనాధుడర్జునుడు నిజము
సోడాద్రాగిన
కలకాలము బ్రతుకుజీవి గార్దభ మార్యా!
పుట్టు మనుజుడు
రామునిసవతితల్లి,ధరాతనూజ
పద్య రచన -పిల్లి
పతినిగోరుకాంత ,భ్రష్టురాలు
కలఁ గంటిని కలలోనన్
జలధరమ్ములుగరళవర్షమ్ముగురిసె
వంకయున్నవాడు శంకరుండు
పార్ధసారధి................
అత్తలేనికోడలు..........
నీలాపనిందలు
కలియుగపు......
దసరా.........
కలకాలము........
ఒకచో.......
ఆటలు
శ్రీరామునిఆ
రామాయణము
పద్యరచన
►
January
(55)
►
2015
(743)
►
December
(53)
►
November
(44)
►
October
(72)
►
September
(62)
►
August
(75)
►
July
(50)
►
June
(55)
►
May
(54)
►
April
(62)
►
March
(64)
►
February
(71)
►
January
(81)
►
2014
(781)
►
December
(73)
►
November
(80)
►
October
(74)
►
September
(64)
►
August
(61)
►
July
(50)
►
June
(61)
►
May
(60)
►
April
(80)
►
March
(90)
►
February
(45)
►
January
(43)
►
2013
(795)
►
December
(32)
►
November
(21)
►
October
(51)
►
September
(65)
►
August
(88)
►
July
(76)
►
June
(48)
►
May
(61)
►
April
(83)
►
March
(119)
►
February
(94)
►
January
(57)
►
2012
(621)
►
December
(46)
►
November
(35)
►
October
(53)
►
September
(63)
►
August
(65)
►
July
(70)
►
June
(74)
►
May
(55)
►
April
(56)
►
March
(34)
►
February
(32)
►
January
(38)
►
2011
(202)
►
December
(72)
►
November
(43)
►
October
(13)
►
September
(25)
►
August
(22)
►
July
(10)
►
June
(17)
►
2010
(64)
►
June
(2)
►
May
(1)
►
March
(10)
►
February
(36)
►
January
(15)
►
2009
(9)
►
November
(1)
►
July
(6)
►
March
(2)
►
2008
(5)
►
November
(5)
కృష్ణునిబూజించనొసగు గైవల్యంబు
న్గృష్ణుని నిటులన నాయమె?
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్