చి.సౌ.చిన్మయి!
అత్త మామలు మఱి యును నాడు బిడ్డ
లరయ మంచి వా రలు మఱి యబల ! నీవు
వారి కనుసన్న మెలగంగ వలయు నమ్మ !
అట్లు జేసిన సంతోష మమ్మ ! మిగుల
తనర కౌండిన్య శర్మయే తగిన భర్త
యెదురు చెప్పక వానికి నెపుడు నీవు
పాలు నీ రును బోలుచు బ్రదుకు చుండి
మంచి గృహిణిగ బేరొం దు మనుజు లందు
మాన వత్త్వంబు తోడను మసలు కొనుచు
మానినుల యందగుచు దల మానికముగ
పిల్ల పాపల తోడన చల్ల గాను
నిండు నూరేళ్ళు బ్రదుకుమా నెమ్మనమున
ఒకరి కోసము మఱియొకరుద్భవించి
యగ్ని సాక్షిగ బరిణయ మాడదలచి
యేకమగుటకు సిధ్ధమె యైన మీర
లందు కొనుడునా జోహార్ల నందుకొనుడు
సకల శుభములు గలిగించు శంకరుండు
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .
No comments:
Post a Comment