Saturday, January 12, 2019

వివేకానందుడి సందేశాలు

*నేడు వివేకానందుడి 156వ జయంతి.*

 *ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం.*

 *ఓ యువతా మేలుకో !*

అద్భుత ప్రసంగంతో పాశ్చాత్యుల హృద‌యాలను సైతం చూరగొన్న భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి స్వామి వివేకానందుడు. *భవిష్యత్తు తరాలకు ఆయన ఓ మార్గదర్శి.*

 *కలకత్తాలో 1863 జనవరి 12న జన్మించిన వివేకానంద 1902 జులై నాలుగున, 39 సంవత్సరాల నిండు యవ్వనంలో శ్రీ కైవల్యం చెందారు.*

 వివేకానందుడి సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి. *యువశక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని వివేకానందుడు పేర్కొన్నాడు.* ఆయన యువతకు ఇచ్చి సందేశాల్లో ఇదో మచ్చుతునక.

 *లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి. లేవండి...మేల్కోండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి...* *ఇకపై నిద్రించకండి.... మీరు మరణించే లోపే జీవిత పరమావధిని సాధించండి. లేవండి.. మేల్కోండి... గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి..* ఎప్పడూ జాగృతంగానే ఉండండి. *బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకానందుడు కోరుకున్నాడు.*

మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి. *బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తించండి. విశ్వాసంతో లేచి నిలబడి ధైర్యంగా బాధ్యతలను మీ భుజ స్కంధాలపై వేసుకోండి. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి....* *ప్రారంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలను సాధిస్తారు....* సాహసంతో పని చేయండి అంటూ నిద్రాణమైన ఉన్న యువతను మేల్కొలిపాడు స్వామి వివేకానంద.🙏

No comments:

Post a Comment