Tuesday, February 12, 2019

ghantadala

ఘంటసాల
--
గాన గంధర్వకుంజర, ఘంటసాల,
నీదు గానము వినినంత నిజముగాను
మేనుబులకించి వెంట్రుకల్ మిన్నుకెగయు
సాటి లేరయ్య నీకిల సాటియెవరు

భక్తి గీతాల నెన్నియోపరవశించి
పాడి మమ్ముల నెచటికో పరుగులిడగ
జేసినావయ్య మఱియేమి చేసిఋణము
దీర్చు కొందుము జెప్పుమా ధీరకంఠా!

నీవు లేకున్నగానమ్ము నీది భువిని
నమరమాయెను నీవును నమరుడవెసు
గానకంఠీరవా!నీకు కరములెత్తి
వందనంబులు సేతును నందుకొనుము

No comments:

Post a Comment