శ్రీలుపొంగెడుకళ్యాణసీమయందు
వివిధరకములవాద్యాలువీనులలరి
వేదమంత్రాలుచదువగవిబుధులచట
శ్రీనివాసునిసాక్షిగాజేయికలుపు
ఈనవవధూవరులకిడునీశుడెపుడు
సకలసంపదలెన్నియోసతినిగూడి
సందియంబిసుమంతయునిందువలదు
సకలసద్గుణశోభిత!సాయిలక్ష్మి!
అమ్మా ,సాయిలక్ష్మి !
అత్త మామలు మఱి యును నాడు బిడ్డ
నరయ మంచి వా రలు మఱి యబల ! నీవు
వారి కనుసన్న మెలగంగ వలయు నమ్మ !
యట్లు జేసిన సంతోష మమ్మ ! మిగుల
తనర వేంకటరావయే తగిన భర్త
యెదురు చెప్పక వానికి నెపుడు నీవు
పాలు నీ రును బోలుచు బ్రదుకు చుండి
మంచి గృహిణిగ బేరొం దు మనుజు లందు
మాన వత్త్వంబు తోడను మసలు కొనుచు
మానినుల యందగుచు దల మానికముగ
పిల్ల పాపల తోడన చల్ల గాను
నిండు నూరేళ్ళు బ్రదుకుమా నెమ్మనమున
ఒకరి కోసము మఱియొకరుద్భవించి
యగ్ని సాక్షిగ బరిణయ మాడదలచి
యేకమగుటకు సిధ్ధమె యైన మీర
లందు కొనుడునా జోహార్ల నందుకొనుడు
అమ్మనాన్నలవిడిచియునరుగుదేర
బెంగయుండునునిజమది బేల!నీకు
అత్తలోనన జూచినయమ్మనికను
బాధయుండదుగదనీకుపచ్చినిజము
పుట్టినింటనుమెలగిననట్లుగానె
మెట్టినింటనుగూడనుమెలగుమమ్మ
యాదిదంపతిసములగునత్తమామ
లాదరించుమునిరతముహర్షమొదవ
వైద్యశాస్త్రపుచదువులోబట్టభద్రు
లైనమీరలుపేదలనాదుకొనుచు
సేవజేయుడునిరతముసిరులుగలుగు
నేమికావలెమీకింకనింతకంటె!
సకల శుభములు గలిగించు శంకరుండు
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .
-------
స్థలము :: తిరుమల
తేది ::30-01-2020 రచన ::పెద్ద తెలుగు మే స్టా రు
వివిధరకములవాద్యాలువీనులలరి
వేదమంత్రాలుచదువగవిబుధులచట
శ్రీనివాసునిసాక్షిగాజేయికలుపు
ఈనవవధూవరులకిడునీశుడెపుడు
సకలసంపదలెన్నియోసతినిగూడి
సందియంబిసుమంతయునిందువలదు
సకలసద్గుణశోభిత!సాయిలక్ష్మి!
అమ్మా ,సాయిలక్ష్మి !
అత్త మామలు మఱి యును నాడు బిడ్డ
నరయ మంచి వా రలు మఱి యబల ! నీవు
వారి కనుసన్న మెలగంగ వలయు నమ్మ !
యట్లు జేసిన సంతోష మమ్మ ! మిగుల
తనర వేంకటరావయే తగిన భర్త
యెదురు చెప్పక వానికి నెపుడు నీవు
పాలు నీ రును బోలుచు బ్రదుకు చుండి
మంచి గృహిణిగ బేరొం దు మనుజు లందు
మాన వత్త్వంబు తోడను మసలు కొనుచు
మానినుల యందగుచు దల మానికముగ
పిల్ల పాపల తోడన చల్ల గాను
నిండు నూరేళ్ళు బ్రదుకుమా నెమ్మనమున
ఒకరి కోసము మఱియొకరుద్భవించి
యగ్ని సాక్షిగ బరిణయ మాడదలచి
యేకమగుటకు సిధ్ధమె యైన మీర
లందు కొనుడునా జోహార్ల నందుకొనుడు
అమ్మనాన్నలవిడిచియునరుగుదేర
బెంగయుండునునిజమది బేల!నీకు
అత్తలోనన జూచినయమ్మనికను
బాధయుండదుగదనీకుపచ్చినిజము
పుట్టినింటనుమెలగిననట్లుగానె
మెట్టినింటనుగూడనుమెలగుమమ్మ
యాదిదంపతిసములగునత్తమామ
లాదరించుమునిరతముహర్షమొదవ
వైద్యశాస్త్రపుచదువులోబట్టభద్రు
లైనమీరలుపేదలనాదుకొనుచు
సేవజేయుడునిరతముసిరులుగలుగు
నేమికావలెమీకింకనింతకంటె!
సకల శుభములు గలిగించు శంకరుండు
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .
-------
స్థలము :: తిరుమల
తేది ::30-01-2020 రచన ::పెద్ద తెలుగు మే స్టా రు
No comments:
Post a Comment