Saturday, February 29, 2020

ముదియొకపుణ్యమూలముగమోదమొసంగునుమాటిమాటికిన్

ఇదియదియంచుగాలమునునీడ్చుచుబోవుచునుండకెప్పుడున్
మదినికరామచంద్రునిలమానసమందుననిల్పుచుండుచో
సదమలబుద్ధులయ్యవిసుసాధ్యములౌచునుదక్కగానికన్
ముదియొకపుణ్యమూలముగమోదమొసంగునుమాటిమాటికిన్

ముదిపుణ్యపుమూలమగుచుమోదమొసంగున్

ఇదియదియనుచునుబలుకక
మదినెప్పుడుదైవభక్తిమయముగజేయన్
సదమలభావములలవడ
ముదిపుణ్యపుమూలమగుచుమోదమొసంగున్

తిరుపతి దర్శనము

తిరుమల: వయోవృద్ధులకు { సీనియర్ సిటిజన్స్/60(+) } శ్రీ వేంకటేశ్వర స్వామి *ఉచిత దర్శనం.*
👉🏻రెండు సమయాలున్నాయి:
1. ఉదయం 10కు. తరువాత
2. సాయంత్రం 3కు. అంతే.

*ఫోటోతో వున్న వయసు నిర్ధారణ* పత్రాలు *"S-1 counter" వద్ద చూపించాల్సి* వుంటుంది.
 ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద  గోడ పక్కనే.
మెట్లు ఎక్కాల్సిన పని లేదు. *మంచి సీట్లు* ఏర్పాటు చేయబడి వుంటాయి. *సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఇస్తారు... ఉచితంగా...*
వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత  *₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు* ఇస్తారు. 

 కౌంటరు నుండి గుడికి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో *ఉచిత* ప్రయాణం.

వీరి దర్శనం కొరకు మిగతా *అన్ని క్యూ లు నిలిపి వేయబడతాయి*

ఎటువంటి *వత్తిళ్ళు-తోపులాటలు వుండవు*

*30 నిమిషాలలో దర్శనం పూర్తి* అవుతుంది.

🙏🏻అందరికీ *షేర్* చేయండి 🙏🏻
Information courtesy :  TTD.

INFORM OTHERS TOO
           🙏BR🙏

పితృదేవులు

కొందరి జీవితాలను చదివితే వారి అనుభవములు మనకు ప్రేరణ కలిగిస్తాయి. మార్గదర్శకాన్నిస్తాయి. అటువంటి ఉన్నత మార్గదర్శక లక్షణములు కలిగిన వారే కీ.శే. శ్రీ పోచిరాజు పేర్రాజు గారు.
ఆ మార్గదర్శి గారిని గూర్చి తెలుసుకుందాము వారే మన సభ్యులైన శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారి తండ్రి. వారిని గూర్చి వారి అబ్బాయిగారి మాటలలో తెలిసికుందాము. కామేశ్వర రావు గారి అన్నగారు శ్రీ సుబ్బారావుగారు మా పినతండ్రి గారి సహాధ్యాయి మా పెదతండ్రి గారికి శిష్యులు మోడేకుర్రులో.

కీ.శే. శ్రీ పోచిరాజు పేర్రాజు గారు.
బి. దొడ్డవరము, (రాజోలు తాలూక).
(1920 – 2001)
సంక్షిప్త పరిచయము:
కపిలేశ్వర పురములో శ్రీ పోచిరాజు సుబ్బారావు సత్యవతీ దంపతులకు 1920 లో జన్మించిరి.
చిన్న వయస్సు లోనే వివాహమైనది. మా తల్లి గారు శ్రీమతి సత్యసుందరి. పాలగుమ్మి వారి యాడపడచు.
అమరకోశమును తన మేనమామ అయ్యగారి భాగయ్య శాస్త్రి గారి వద్ద నేర్చుకున్నారు.
మా నాన్న గారు చిఱుత ప్రాయములోనే తండ్రిని పోగొట్టుకొని గ్రామ కరణము గా చిన్న కాఱు రైతుగా ముగ్గురు తమ్ముళ్ళ నొక్క చెల్లెలిని పోషించి పెళ్ళిళ్ళు చేసిరి.
ఆయన సంతానమైన మా నలుగు రన్నదమ్ములను మఱియు నైదుగు రప్ప చెల్లెళ్ళను వృద్ధి లోనికి తీసుకొని వచ్చిరి.
చిన్నప్పటినుంచి యాధ్యాత్మిక చింతనలో పరధ్యానముగా నుండెడి వారని మా మామయ్య (మేనత్త గారి భర్త). మాకు చెప్పరి.
స్వామి శివానందుల వారి శిష్యులు. ఉత్తర ప్రతుత్తరములు చేసిన భాగ్యవంతుఁడు.
రమణ మహర్షి, ఇనమడుగు సత్యానంద స్వాముల వారి శిష్యుఁడు.
భగవద్గీత, స్వామి వివేకానంద రచనలు,  మున్నగు నాధ్యాత్మిక గ్రంథములు నిత్యము చదువు చుండెడి వారు దిన చర్యగా.
ప్రతి రోజు మద్యాహ్నము, సాయంత్రము తిరుగుచు భాగవతము లోని పద్యములను (కంఠత) చదువు ఛుండెడి వారు క్రమము తప్పకుండ.

వ్రాసిన గ్రంథములు:
1. గీతా యోగము, భగవద్గీత వ్యాఖ్యానము.
2. Man and God
3. How to become Yogi
4. సావిత్రి, అరబిందొ ఘోష్ గ్రంధ వ్యాఖ్యానము.
5. Glimpses of Ancient Vedic Thought of India.

ఈ పుస్తకము లన్నియు నాయన ప్రియ మిత్రుఁడు, మా మామ గారు నయిన కీ.శే. ధరణీప్రగడ వేంకట సుబ్రహ్మణ్య శర్మ గారి వద్ద నుంచిరి.
అప్పటి మా బా ల్యావివేకము వలన వాటి విలువను గుర్తించ లేక పోయితిమి. ఈ ప్రతులను శ్రీ శివానందాశ్రమము, సత్యానందాశ్రమములకు నొసంగిరి.  కొన్ని ప్రతులుంచగ  వాటిక కొఱకు నేను ప్రయత్నించు చున్నాను.


సత్యాధ్యాత్మిక చింతనా కలిత భాస్వద్జ్ఞాన సంభావ్యుఁడున్
నిత్యోద్దీపిత పద్య కీర్తిత మహానీలాంగ విష్ణుండు నౌ
న్నత్యభ్రాజిత వర్తనుండు స్వపురీ నాథత్వ ధౌరేయుఁ డా
రాత్యామ్నాయ విహీనునిం గొలుతుఁ బేర్రాజాఖ్య విఖ్యాతునిన్

తరణార్థంబు భవాబ్ధి వ్రాసితివి గీతాయోగ భాష్యమ్మునున్
విరియం జేసితి పుష్ప సంచయము సావిత్రీ కథాగమ్మునం
బర భాషామృత భాండ మిచ్చితివి వప్తా సంయమీంద్రత్వమున్
వరమై యొప్పగ నిన్ను గొల్చెదము నీ పాదద్వయం బానుచున్


నర వంద్యోత్తమ సేద దీరితి శివానందద్రుమచ్ఛాయలన్
దరిఁ జేరంగఁ దలంచి వింటి వట సత్యానంద సద్బోధలం
బరమానందము నొందవే రమణ దేవజ్యోత్స్నధామంబునన్
సరి లేరెవ్వరు నీకుఁ దండ్రి యిల సంసారంపు సన్యాసివే

మాన ధనుండు గ్రామ జన మండిత తత్త్వ విశోధకుండు స
త్సూనృత గీతసార పరిశోధిత  మానస భాసమానుఁడున్
మానిత వేద సూక్త పరిమాణ మహోదయ కావ్య రాజ సం
ధానుఁడు సత్యవంత వర దార చరిత్ర మనంగ ధాత్రినిన్

దొడ్డవరంబు నాఁ బరఁగు దొడ్డ పురమ్ము సలీలఁ గాచి తీ
వడ్డము లేని చందమున వ్యర్థపుఁ బల్కుల సంహరించుచున్
దుడ్డున కీక విస్తరము దోరపు గడ్డగు కాల మందునన్
గొడ్డము లెన్ని వచ్చినను గుండె దిటమ్మున నుంటి విద్ధరన్

విబుధ జన విధేయుఁడు
పోచిరాజు కామేశ్వర రావు.

Friday, February 28, 2020

మేటిరాగాలవినిపించు పేటికయిదె

మేటిరాగాలవినిపించు పేటికయిదె
సందియములేదునిజమార్య!శంకరాభ
రణమెసుమధురపద్యాలరాగయుతము
శ్రోతలెల్లరిమనముల శుద్ధిజేయు

Thursday, February 27, 2020

చెలువలుసత్కవిత్వమునుజెప్పగనేర్తురెమేలనన్బుధుల్

చెలువలుసత్కవిత్వమునుజెప్పగనేర్తురెమేలనన్బుధుల్
చెలువులలోనబండితులుసెప్పగలేనిలవారలెందరో
గలరుమదిందలంచగనుగాకలుదీరిరికావ్యసంపద
న్నలమనశంకరాభరణమందునమీరునుజూచుచుంటిరే

చెలువలురసవత్కవితలజెప్పంగలరే!

చెలువలువ్రాసినపద్యము
లలరెనుననుచునుబలికెడునార్యా!మీరే
చెలువలనిట్లనసబబే!
చెలువలురసవత్కవితలజెప్పంగలరే!

పరమసుఖంబునిచ్చుగదపానుపు,కంటకపూర్ణమైనచో

పరుపుయుతంబునైవిరులవాసనగుప్పుమనంగనుండుచో
పరమసుఖంబునిచ్చుగదపానుపు,కంటకపూర్ణమైనచో
వెరచుదురందరచ్చటకువేగమయేగుటకెట్టివేళలన్
వరమదిజేయనెప్పుడునుబానుపునుంచనుసున్నితంబుగా

Wednesday, February 26, 2020

కంటకములున్నపాన్పు,సుఖంబునిచ్చు

నిదురరానీయదెప్పుడు నీరజాక్ష!
కంటకములున్నపాన్పు,సుఖంబునిచ్చు
నెల్లవేళలరామునియుల్లమలర
భజనజేయునరులకిల భవ్యముగను

తులువావందనమయ్య,నాకాపుడుసద్బుద్ధుల్ దగన్ నేర్పుమా



అలకావారముకాముమేముమఱియయ్యారాకుమాజోలికిన్
తులువావందనమయ్య,నాకాపుడుసద్బుద్ధుల్ దగన్ నేర్పుమా
వెలిగాజేసిరిబంధుకోటిననునీవేళన్ రమాధీశ!యీ
నలుసుంగావగరాగదేవిన్నాణంబులొప్పంగగా

Tuesday, February 25, 2020

పంతులువా?సద్బుద్ధినేర్పుదువ నాకిపుడున్

వలపులునేర్పితె?నీవొక
పంతులువా?సద్బుద్ధినేర్పుదువ నాకిపుడున్
బలువురునన్నున్ మెచ్చగ
నలకాపురివాస!సాయి!యార్తిని నడుగన్

Monday, February 24, 2020

విలసద్ధర్మపరాయణుండుమిగులన్వేధించెశిష్టాత్ములన్

ఇలశిష్టుండుగదామెలంగుచునుదానేలోకనాధుండునై
నలవోకంబుగబాధవెట్టుచునునత్యానందముంబొందగా
విలసద్ధర్మపరాయణుండుమిగులన్వేధించెశిష్టాత్ములన్
నలఘుఖ్యాతినిబొందగాదగునుదానర్ధమ్ముదానంబుతోన్

శిష్టులవేధించెధర్మశీలుండలుకన్

శిష్టులబేరనబరగుచు
గష్టములనుగలుగజేయుకఠినాత్ములుగా,
దుష్టునివోలెనునుండెడు
శిష్టులవేధించెధర్మశీలుండలుకన్

Sunday, February 23, 2020

రమణికుచంబుపైగలవుఱంపముగత్తియురాజహంసమున్

రమణికుచంబుపైగలవుఱంపముగత్తియురాజహంసమున్
రమణికుచంబుజూచితిరె!ఱంపములాదిగనున్నవంటిరే!
విమలమనంబుతోసతులవీక్షణజేయుచుగౌరవించుచున్
రమణులజూడగావలెనురామునిపత్నియసీతమాతగా

రమణికుచముపైన,ఱంపముండె

ఏమిగలదొ?చూడరెవరుబతియుదప్ప
రమణికుచముపైన,ఱంపముండె
నింటియటకమీద కంటివె!యిటులిమ్ము
కట్టెకోయవలయుగడపకొఱకు

Saturday, February 22, 2020

మోడీచర్యలుభారతప్రజకుసమ్మోదమ్ముగావిప్పుడున్

మోడీయొక్కడెభారతమ్మునుదగన్మోదమ్ముగానుంచుచో
మోడీచర్యలుభారతప్రజకుసమ్మోదమ్ముగావిప్పుడున్
నేడీవాక్యముబల్కభావ్యమె?దొరా!నీవుంగజింతింపుమా
మోడీవల్లనెగాదె!కాశ్యపిజనుల్ మోదమ్ముతోనుంటెగా

మోడీసమకూర్చలేడుమోదముప్రజకున్

మోడీయనయుగపురుషుడు
మోడీకిలసాటిలేడుమొనగాడెవడున్
బాడియె?పలుకుటయిట్లుగ
మోడీసమకూర్చలేడుమోదముప్రజకున్

దూరదర్శి

అలనాడెందఱువ్రాసినన్గనగనయ్యాద్యంతమానందిదే
లలితంబైవినసొంపునై నవరసాలన్ జిల్కునీపేటియై
కలలోనైననుజెప్పనోపుగదసాకారంబుగానాకధన్
లలితా!వింటివెనాదుమాటచెవులారానీవుసంపూర్తిగా
---

Friday, February 21, 2020

కరినిసతులువేడుకొనిరికలుములనిడగన్

అరమరికలేకయుండగ
నిరతముదాబూజజేసినియమముతోడన్గగి
వరములనొసగెడునాశాం
కరినిసతులువేడుకొనిరికలుములనిడగన్ 

Thursday, February 20, 2020

శివమగు,బాపకార్యములజేసినచోశివరాత్రికిన్ సఖా!

శివశివయంచునిత్యమునుశ్రీయుతుబ్రార్ధనజేయుచోనిలన్
శివమగు,బాపకార్యములజేసినచోశివరాత్రికిన్ సఖా!
పవలునుఱేయియున్ననకబాధలనొందునుదీవ్రశైలిలో
శివునిమదిందలంచుమికచేయునుసత్కృతినినెల్లవేళలన్

శివరాత్రికిబాపకర్మజేసిన,శివమౌ

భవమేనాశనమౌనుగ
శివరాత్రికిబాపకర్మజేసిన,శివమౌ
శివరాత్రిపర్వదినమున
శివశివయనిపలుకునెడలశివునింగరుణన్

మారెడుకాయలోన,నొకమానినియూయలలూగెబ్రీతిమై

వారునువీరునున్ననకభర్గునిరూపముజూడరండహో
మారెడుకాయలోన,నొకమానినియూయలలూగెబ్రీతిమై
భీరువులేకయేతనకువీరముతోడనుబైకియూగుచున్
నౌరయనంగవారిపుడయూహలదేలుచునుండిరేగదా

Wednesday, February 19, 2020

యూయలగలదు,మారేడుకాయలోన


అల్ల చూడుముత్రాడుతోనల్లినట్టి
యూయలగలదు,మారేడుకాయలోన
గానిపించెనుశంభునిమేనువోలె
నున్నయొకరూపు,వింతగాసన్నుతాంగి!

రసికుండేయెఱుగున్విషంపుటునికిన్,రంభాఫలంబందునన్

కసుగాయల్ దిననుండునేమిగులదాకాకోలపాషాణమై
రసికుండేయెఱుగున్విషంపుటునికిన్,రంభాఫలంబందునన్
నసమానంబగుదీపియుండియునునాహాయంచురీతిన్ దగన్
రసనాగ్రంబునుదాకుచున్దనరివేరంజిల్లెశోభాకృతిన్

Tuesday, February 18, 2020

రంభాఫలమెంతవిషమొరసికుడెయెఱుగున్

అంభోజాక్షులఫలములు
సంభావ్యముజేయదెలియుసన్నుతులెవరో
రంభనుగూడినతదుపరి
రంభాఫలమెంతవిషమొరసికుడెయెఱుగున్

Monday, February 17, 2020

యోగులలోనవేమనయయోగ్యుడుప్రస్తుతినందగన్ భువిన్

త్యాగమయంబునైనెనరిధాత్రినినెంచగబూర్వకాలపుం
యోగులలోనవేమనయయోగ్యుడుప్రస్తుతినందగన్ భువిన్
యోగముజేయుచున్మనసునూరటపర్చెడువేమనేగదా
రాగమునొందకుండగవిరాగియువోలెనునుండునెప్పుడున్

యోగులలోవేమనయెయయోగ్యుడుస్తుతికిన్

గూగులు వెదుకగ దెలిసెను
రాగముతోనుండియయెవి రాగిగననుచున్
భోగములొల్లక పిదపను
యోగులలోవేమనయెయయోగ్యుడుస్తుతికిన్

రణసంకల్పముకంటెలేదుపరమార్ధంబెన్నగన్దూతకున్

అణువంతైననుజాలిలేకయునుబాహాటంబుగాఢీకొనన్
రణసంకల్పముకంటెలేదుపరమార్ధంబెన్నగన్దూతకున్
రణముల్సేయుచుబోవుచోనరయయీరత్నావతేగ్రుంగుగా
బ్రణతుల్సేయుదుదూతయార్యునకుదారాకన్ సుకార్యంబుకై

Sunday, February 16, 2020

రణమేపరమార్ధమందురాదూతకహో

క్షణమొకమాటనుబలుకుచు
నణువణువునుబాధవెట్టునరిజనమునకున్
వణకునుగలుగుటకొఱకై
రణమేపరమార్ధమందురాదూతకహో

భామయుభామయున్గలువ,బాలుడుపుట్టెనుసత్యభాాాాామకున్

ఏమగుజెప్పనా?నగునునీర్ష్యలుగోపములుద్ధృతంబుగా
భామయుభామయున్గలువ,బాలుడుపుట్టెనుసత్యభామకున్
గామునిమించునందమునుగల్గుచుబొద్దుగజూడముచ్చటై
ప్రేమనుముద్దువెట్టుటకువీలగుచెక్కిలియుండువాడుగా

Saturday, February 15, 2020

భామలుగలువంగసత్యభామసుతుగనెన్

ఆమనిసూర్యోదయమున
గామముతోనష్టసతులుగన్ననిదరికిన్
గోముననేగుచునగవున
భామలుగలువంగసత్యభామసుతుగనెన్

Friday, February 14, 2020

కనబడనట్టికీచకముగాలునిమించెనిదేమిచిత్రమో

వినుముకరోననాబడుచువీసముమాదిరియుండునట్టిదే
కనబడనట్టికీచకముగాలునిమించెనిదేమిచిత్రమో
కనబడకుండయయ్యదిలగాలునివోలెనుభీకరంబునై
మనుజులబ్రాణహానినిలమాటలతోడనుజెప్పలేముగా

Thursday, February 13, 2020

రోయకనేడుప్రేమికులరోజని,పిండముబెట్టగాదగున్

ఆయతరీతినిన్ వగలుహత్తుకునట్లుగసంచరించుమా
రోయకనేడుప్రేమికులరోజని,పిండముబెట్టగాదగున్
కాయమువీడువారలకుకన్నకుమారుడుఖచ్చితంబుగా
నీయవకాశమున్ మనకెయిచ్చెనుశంభుడుతీర్చయాకలిన్

ప్రేమికులరోజుపిండముబెట్టదగును

ప్రేమికులరోజుపిండముబెట్టదగును
నాహయెంతమంచిసమస్యయయ్య యదియ
చూచినంతనేపెద్దలుచూరుచేరి
యెదురుచూతురుపిండము నిత్తురనుచు

Wednesday, February 12, 2020

నయముగబావయీపదిదినమ్ములలోప్రసవించుజూడుమా

నియమముదప్పకెప్పుడునునీరజనాభునిసేవజేయుచున్
రయమునరోజులొక్కటిగరాతిరిప్రొద్దులుసాగుచుండ,దా
నయముగబావయీపదిదినమ్ములలోప్రసవించుజూడుమా
భయమునుబొందకుండుమికభార్గవిరక్షణజూచుభర్గుడేఙే

ప్రసవించునుబావ!యింకపదిదినములలో

పసగలిగిన నోగిరమును
బిసరంతయువదలకుండ బ్రేమనుదినుటన్
మిసమిసలాడగ నక్కయె
ప్రసవించునుబావ!యింకపదిదినములలో

దత్తపది-

నన్నునేకాకిగదలచి నాదరికిటు
వచ్చితివపాపి! వావియువరుసలేద?
నిన్నుచూచినదాదిగ గన్నులురిమె
యనుచుబలికెను ద్రౌపదిదనుజుతోడ

Monday, February 10, 2020

బ్రాహ్మీలగ్నమునందునిద్ర,శుభసౌభాగ్యంబులిచ్చుంగదా

బ్రహ్మాజీ!వినునాదుమాటనుసుమాభవ్యంబుగాదెప్పుడున్
బ్రాహ్మీలగ్నమునందునిద్ర,శుభసౌభాగ్యంబులిచ్చుంగదా
బ్రహ్మఙ్ఞానమునొందువారలికదాపారంబుతోబాటుగా
బ్రహ్మంబేకదమోక్షమీయగవెసన్ బ్రారబ్ధమున్బట్టియే

బ్రాహ్మముహూర్తమున,నిద్రభాగ్యప్రదమౌ

బ్రాహ్మణులునిద్రలేతురు
బ్రాహ్మముహూర్తమున,నిద్రభాగ్యప్రదమౌ
బ్రహ్మమునెఱిగినవారలు
బ్రహ్మమునేదలచుచుండిపవళించినచో

Sunday, February 9, 2020

నుండియులేనిదొక్కటియెయున్నద?యున్నదిలేద?లేదుపో

అండమునందుజూడగనునాపరమాత్మునిరూపులీలగా
నుండియులేనిదొక్కటియెయున్నద?యున్నదిలేద?లేదుపో
కొండొకచోటజూడగనుగోప్యముతోడనుగానకుండగా
నుండుచులేనివోలెనునదొక్కటెయున్నదిగాదలంచెసూ

ఉండిలేనిదొకటె,యున్నదేమొచెపుమ

దినముదినముద్రాగి యెనలేనిమాటలు
పలుకుచుండునతడు భరణిబ్రతికి
యుండిలేనిదొకటె,యున్నదేమొచెపుమ
వానివలన ఫలముబ్రజకరయగ

తలుపులమ్మతల్లీ

భక్తులఁ బ్రోవంగ వేంచేసి భద్ర గిరికినిఁ గూఁత దౌలన్
 రక్తినిఁ గాపాడు చున్నట్టి రమ్య సునయన! తల్లి వీవే
 ముక్తిని నీయంగ నే వేడ మూఢున కెలమి నీఁ గదమ్మా
ఙే భుక్తిఁ బ్రసాదించు కారుణ్య మూర్తివి తలుపులమ్మ తల్లీ! 1.

వత్తురు దేశమ్ము లందుండి భక్తులు గనగ నీ దయం బో
 యిత్తురు వేలాది రూపాయ లింపుగ దలఁచి కానుకల్ గా
 బత్తిని పూజాది కార్యాలిఁ బావనముగఁ దలంతురమ్మా
యత్తలఁ గన్నట్టి దొడ్డమ్మ! యాదుకొ తలుపులమ్మ తల్లీ! 2.

 అమ్మరొ కామాక్షి మీనాక్షి యంచును గొలువ వత్తు మమ్మా యిమ్ముగఁ గాజాలు బోండాలు నింక నతి కమనీయ పానీ
యమ్ములు నైవేద్యముల్ నీకు నర్పణముల నొనర్తు
మమ్మా నెమ్మదిఁ గాపాడ రావమ్మ నేలకుఁ దలుపులమ్మ తల్లీ! 3.

 వన్యపు మార్గానఁ జూడంగ వాసము మిగుల నంద మొప్పన్
మన్యపు టీ కొండ యా కొండ మధ్యను దనరు చుంటి వమ్మా
 యన్యుల పుణ్యమ్ము పాపమ్ము లన్నియు సరగుఁ జూతు వమ్మా యన్యుల వేడంగ నేలమ్మ యమ్మవు తలుపులమ్మ తల్లీ! 4.


 అడ్డము లన్నింటి నే దాటి యంత్యమున నిటఁ జేరి యుంటిన్
 బిడ్డగ నన్నింక భావించి పెద్ద మనసునఁ జూడు మమ్మా
గెడ్డను దానంబు నేఁ జేసి కేలున నతుల నిచ్చి నీకున్ 
సడ్డను బూజాదు లేపారఁ జల్పుదుఁ దలుపులమ్మ తల్లీ! 5.

రావణునిన్ దురాత్ముడగురాక్షసుడొక్కడుసంపెనల్కమై

ఆవహరంగమందుననమానుషరీతినిభీకరంబుగా
రావణుజంపెగాదెయటరాముడుబాహుబలంబుతోడుతన్
రావణునిన్ దురాత్ముడగురాక్షసుడొక్కడుసంపెనల్కమై
యీవిధమైనవాక్యమునునేవురుహేళనజేయవ్రాసిరే!

Saturday, February 8, 2020

రావణునిన్ సంహరించె,రాక్షసుడలుకన్

ఆవహమందునరాముడు
రావణునిన్ సంహరించె,రాక్షసుడలుకన్
బావనియగుసీతమ్మను
గావరముననొడిసిపట్టె గామముతోడన్

అన్నను బెండ్లియాడెనుమహామహితాత్ములుమెచ్చగాభువిన్ 

చెన్నగురూపమున్గలిగిశీతమయూఖునిబోలునట్టిరా
మన్ననుబెండ్లియాడెనుమహామహితాత్ములుమెచ్చగాభువిన్
నన్నువతోడగన్పడెడునామిధిలాపురముద్దుబిడ్డకా
యున్నతపూరుషుండునుమహోన్నతశీలుడునయ్యెభర్తగా

Friday, February 7, 2020

అన్ననుబెండ్లాడెనుమహితాత్ములుమెచ్చన్

చెన్నగురూపపుకుజరా
మన్ననుబెండ్లాడెనుమహితాత్ములుమెచ్చన్
మిన్నునుమన్నునుముదమున
సన్నుతిగైదండలిడుచుస్రజములువిసిరెన్

బంగారమ్మునుపేదపంచెసుఖసౌభాగ్యములంబొందగన్ 

రంగా!కంటివె?నెయ్యమొప్పగదగన్ రమ్యంపునెయ్యంబనే
బంగారమ్మునుపేదపంచెసుఖసౌభాగ్యములంబొందగన్
సింగారించగలేరుబీదలుసుమా,శ్రీమంతులౌవారలే
సింగారించగనర్హులౌదురుభువిన్ చిందించబంగారమున్

Thursday, February 6, 2020

బంగారమునునిరుపేద,పంచెజనులకున్ 

సింగారించగలేడిల
బంగారమునునిరుపేద,పంచెజనులకున్
రంగడురేషనుకార్డులు
ముంగిటముంగిటకునేగిమోదముతోడన్

దుష్టులుశిష్టులౌటగని,దుఃఖముబొందెరెల్లమానవుల్

తుష్టినిబొందెరందఱునుదుఃఖములన్నియుదీరెనంచుగా
దుష్టులుశిష్టులౌటగని,దుఃఖముబొందెరెల్లమానవుల్
శిష్టులుదుష్టులైమనినచెప్పగలేమనియీతిబాధలన్
దుష్టులదూరముంచవలెదుర్జనులౌటనుశిష్టరక్షకై

Wednesday, February 5, 2020

దుష్టులు శిష్టులుగమార,దుఃఖింత్రుజనుల్

తుష్టినిబొందుదురందఱు
దుష్టులు శిష్టులుగమార,దుఃఖింత్రుజనుల్
దుష్టులుశిష్టులెయగునెడ
కష్టములొకదానివెంటకలుగునువరుసన్

Tuesday, February 4, 2020

దిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్

బొండమువోలెనౌతనువు పూర్తిగదగ్గెనుసాంబమూర్తికిన్
దిండినిమానివేయగనె,తీరినదాకలియద్భుతమ్ముగన్
బండటిపిల్లవానిగనిపార్వతిసంతసమొందుచుండుటన్
తిండినిమానుచోమనకుతీరనినష్టముగల్గునేగదా

తిండిమానగనాకలిదీరిపోయె

ఒడలుదగ్గెనుజక్కగ నుమకుచూడు
తిండిమానగ, నాకలిదీరిపోయె
కమలతిట్టినదిట్లకు కడుపునిండి
చాలుచాలింక మీతోటిసహగమనము

క్కలుసేవింపుడటంచుగణ్యతగనెన్ గాంధీమహాత్ముండిలన్

కలగానయ్యెనునాకుసామియిదియక్కాలంపుదగ్గట్టెయ
క్కలుసేవింపుడటంచుగణ్యతగనెన్ గాంధీమహాత్ముండిలన్
కలు నాయర్ధముజూడగానగుటముఖ్యంబయ్యెగాగల్లుగా
బలవంతంబుగద్రాగువారలికనేవారుండుమానండుసూ

Monday, February 3, 2020

కలుసేవింపుడనిగాంధిగణ్యుండయ్యెన్

పిలకలబోలుపెసరమొల
కలుసేవింపుడనిగాంధిగణ్యుండయ్యెన్
గలిబొలిమాటలెయనకను
లలనలుబాటించునెడలలబ్ధులుగలుగున్

Sunday, February 2, 2020

పిలిచిరిపెండ్లిచూపులకువేడుకమీఱ,శ్మశానభూమికిన్

తెలియనివారలైన,ననుతేజునిజెంతనునుండగోరియే
పిలిచిరిపెండ్లిచూపులకువేడుకమీఱ,శ్మశానభూమికిన్
వలదుర యేగకెన్నడునుబంగరుగట్టునువింటిగాదగ
న్నలరిన శంకరుండచటయార్తినిదాపసవృత్తినుండుటన్ 

పెండ్లిచూపులకుందగుబ్రేతభూమి

ప్రేతభూమినినివసించుబీదవారి
పెండ్లిచూపులకుందగుబ్రేతభూమి
ప్రేతభూమినినొకచోటవేదికగను
జేసిచూపులుజరిపింత్రు వాసిగాను

Saturday, February 1, 2020

తోడ్పడలేదుపార్ధునకుదోచినరీతినిగృష్ణుడెప్పుడున్ 

తోడ్పడలేదుపార్ధునకుదోచినరీతినిగృష్ణుడెప్పుడున్
దోడ్పడలేద!మీకెఱికె? తోడ్పడకుండినయుద్ధభూమిలో
నేడ్పులువచ్చెగారణమునేలికలందఱికన్నుమూతలే
తోడ్పడెగాదెపార్ధునకుతొయ్యలిద్రౌపదిచెల్లికావుతన్

దోడ్పడడర్జునునకు హరిదోచినరీతిన్

తోడ్పాటనునదియుండగ
దోడ్పడడర్జునునకు హరిదోచినరీతిన్
దోడ్పడలేదనియన,కై
మోడ్పులనేనిడుదుసామి!మౌనముతోడన్