Sunday, February 9, 2020

తలుపులమ్మతల్లీ

భక్తులఁ బ్రోవంగ వేంచేసి భద్ర గిరికినిఁ గూఁత దౌలన్
 రక్తినిఁ గాపాడు చున్నట్టి రమ్య సునయన! తల్లి వీవే
 ముక్తిని నీయంగ నే వేడ మూఢున కెలమి నీఁ గదమ్మా
ఙే భుక్తిఁ బ్రసాదించు కారుణ్య మూర్తివి తలుపులమ్మ తల్లీ! 1.

వత్తురు దేశమ్ము లందుండి భక్తులు గనగ నీ దయం బో
 యిత్తురు వేలాది రూపాయ లింపుగ దలఁచి కానుకల్ గా
 బత్తిని పూజాది కార్యాలిఁ బావనముగఁ దలంతురమ్మా
యత్తలఁ గన్నట్టి దొడ్డమ్మ! యాదుకొ తలుపులమ్మ తల్లీ! 2.

 అమ్మరొ కామాక్షి మీనాక్షి యంచును గొలువ వత్తు మమ్మా యిమ్ముగఁ గాజాలు బోండాలు నింక నతి కమనీయ పానీ
యమ్ములు నైవేద్యముల్ నీకు నర్పణముల నొనర్తు
మమ్మా నెమ్మదిఁ గాపాడ రావమ్మ నేలకుఁ దలుపులమ్మ తల్లీ! 3.

 వన్యపు మార్గానఁ జూడంగ వాసము మిగుల నంద మొప్పన్
మన్యపు టీ కొండ యా కొండ మధ్యను దనరు చుంటి వమ్మా
 యన్యుల పుణ్యమ్ము పాపమ్ము లన్నియు సరగుఁ జూతు వమ్మా యన్యుల వేడంగ నేలమ్మ యమ్మవు తలుపులమ్మ తల్లీ! 4.


 అడ్డము లన్నింటి నే దాటి యంత్యమున నిటఁ జేరి యుంటిన్
 బిడ్డగ నన్నింక భావించి పెద్ద మనసునఁ జూడు మమ్మా
గెడ్డను దానంబు నేఁ జేసి కేలున నతుల నిచ్చి నీకున్ 
సడ్డను బూజాదు లేపారఁ జల్పుదుఁ దలుపులమ్మ తల్లీ! 5.

No comments:

Post a Comment