Friday, July 31, 2020

కవిసమ్రాట్టగువిశ్వనాధకడుదుఃఖంబందెనీనాడయో

కవనంబేదియురాకపోయిననుదాకావ్యంబువ్రాయంగభో
యవగాహంబదిరాకపోకకడుదుర్వాపోహముంబొందుటౌ
కవిసమ్రాట్టగువిశ్వనాధకడుదుఃఖంబందెనీనాడయో
కవనంబయ్యదియుండనోపుగదనెక్కాలంబుశ్రేయంబుగా

కవిసమ్రాట్ విశ్వనాధకలతపడెనయో

కవితలువ్రాయుటరాకను
నవకరముగవ్రాయుచుండియర్ఢములేకన్
కవులముమేమేయనుటను
కవిసమ్రాట్ విశ్వనాధకలతపడెనయో

Thursday, July 30, 2020

వరలక్ష్మీవ్రతమాచరింపవలెసద్భక్తిన్దగంబూరుషుల్ 

వరలక్ష్మీవ్రతమాచరింపవలెసద్భక్తిన్దగంబూరుషుల్
వరమేయయ్యదియాలితోమగడుసద్భక్తిన్దగంబూజదా
నిరతిన్జేయగనొప్పునియ్యెడలదోనీడంజమెల్గందగున్
దరుణీ!వింటివెనాదుమాటలనుమద్భాగ్యంబుపెంపొందగన్

కమలాక్షుండువిషమ్ముగ్రోలెనటలోకక్షేమముంగోరుచున్

కమలాక్షుండువిషమ్ముగ్రోలెనటలోకక్షేమముంగోరుచున్
నమలా!యేమనిబల్కుచుంటివిటయాకామారిమిత్రుండుగా
నమరుల్ బార్వతివేడగానపుడదాహర్షాతిరేకంబునన్
భ్రమరాంబాపతిద్రాగెనావిషమునింద్రాదాదులేమెచ్చగన్

వరలక్ష్మీవ్రతముజేయవలె,పురుషులిలన్ 

తరుణులుశుభములకొఱకై
వరలక్ష్మీవ్రతముజేయవలె,పురుషులిలన్
వరలక్ష్శిపూజకొఱకును
దరుణులకున్సాయబడగదప్పదుసుమ్మీ

Wednesday, July 29, 2020

కమలాక్షుండువిషమ్ముగ్రోలెనటలోకక్షేమముంగోరుచున్

కమలాక్షుండువిషమ్ముగ్రోలెనటలోకక్షేమముంగోరుచున్
నమలాయేమనిబల్కుచుంటివిటయాకామారిమిత్రుండుగా
నమరుల్ బార్వతివేడగానపుడదాహర్షాతిరేకంబునన్
భ్రమరాంబాపతిద్రాగెనావిషమునింద్రాదాదులేమెచ్చగన్

కమలాక్షుడు,విషముగ్రోలెగదశుభకరుడై

కమలములబోలునేత్రుడు
కమలాక్షుడు,విషముగ్రోలెగదశుభకరుడై
యమరులుగిరిజయువేడగ
బ్రమదముతోశంకరుండుభవ్యతగలుగన్

Tuesday, July 28, 2020

ర్మతిలేనట్టిమరుత్సుతున్ గొలిచెదన్ మాంగళ్యంబుగోరుచున్

ప్రతిభావంతుడెయౌనెయీహనుమయెభ్భంగిన్ ననున్ జేర్చుగా
పతిశ్రీయొద్దకువేగమేననుచునప్పద్మాక్షియౌత్సాహియై
యతియౌసంతసమొప్పగాననియెపెన్హర్షంబుతోసీతదు
ర్మతిలేనట్టిమరుత్సుతున్ గొలిచెదన్ మాంగళ్యంబుగోరుచున్

ర్మతిలేనట్టిపవనుజునిమానకగొల్తున్

అతియౌపూనికతోడను
బతియగునారామచంద్రుపత్నినిగనుచున్
సతియాసీతయెడలదు
ర్మతిలేనట్టిపవనుజునిమానకగొల్తున్

Monday, July 27, 2020

మానధనాఢ్యునకున్,రవికమాత్రముచాలునుచీరయేటికిన్

మానమెభూషణంబుననుమానమువద్దురయెట్టివేళలన్
మానధనాఢ్యునకున్,రవికమాత్రముచాలునుచీరయేటికిన్
మానముగల్లువారలిలమాన్యతనొందినచోలుతోడుతన్
మేనునవేసికొందురుగమెచ్చినచీరనుగూడప్రీతితోన్

చెలికిరవికిమాత్రముజాలుచీరయేల

పెట్టెనిండుగచీరలునట్టెయుండ
యింకకొనగనువ్యర్ధమువెంకి!నీదు
చెలికిరవికిమాత్రముజాలుచీరయేల
వలయుననుకొనినకొనుముచోలులిపుడు

చెలికిరవికిమాత్రముజాలుచీరయేల

పెట్టెనిండుగచీరలునట్టెయుండ
యింకకొనగనువ్యర్ధమువెంకి!నీదు
చెలికిరవికిమాత్రముజాలుచీరయేల
వలయుననుకొనినకొనుముచోలులిపుడు

రోగులెభాగ్యవంతులు,కరోనకురోగనియోగమందినన్

వీగగయాకరోనభువివిచ్చగడెందము,సంతసంబులౌ
రోగులెభాగ్యవంతులు,కరోనకురోగనియోగమందినన్
వేగమెవైద్యశాలకునుభీతినిజెందకనేగుచో,నగున్
బాగదితప్పకుండగనుభారతి!నేర్వుముముఖ్యమౌదిగా

రోగులుసంపన్నులే,కరోనావలనన్ 

ఆగాంధీహాస్పిటలుపు
రోగులుసంపన్నులే,కరోనావలనన్
రోగులుగాకనుమిగిలిన
బాగునుగలవారుకూడభయమునమెలగే

Sunday, July 26, 2020

వంచనసేయువారలక,వారితమోక్షముమాధవుండిడున్

మంచితనంబెయుండదిలమానసమంతయునుండుకుళ్ళుతో
వంచనసేయువారలక,వారితమోక్షముమాధవుండిడున్
సంచితపుణ్యముండునెడశాంతినిసౌఖ్యముగల్గజేయుచున్
నంచితుడైనవానికగుహర్షముసౌఖ్యములెల్లవేళలన్

Saturday, July 25, 2020

వంచకులకు,మాధవుడిడువరమోక్షమ్మున్

కుంచితమనసులెయుండును
వంచకులకు,మాధవుడిడువరమోక్షమ్మున్
నంచితపుణ్యముగలిగెడు
నంచితుడగువానికెపుడుహర్షముగలుగన్

స్కారముగల్గియున్నకలకాలముమెత్తురునీదుమాటలన్

భారముగాదలంచకనుభార్గవరాముడ!యాలకించుమీ
సూరనమాటలీయవియెసూక్తులుదప్పకయాచరించుమా
మీరకహద్దులెప్పుడునుమేదినిచక్కటివర్తనంపుసం
స్కారముగల్గియున్నకలకాలముమెత్తురునీదుమాటలన్ 

Friday, July 24, 2020

కారముగలమాటమెప్పుగలదెల్లపుడున్

కారముచేడుననొకయతి
కూరిమితోనిట్లుపలికెకౌతుకమొప్పన్
బారముజెందుటకేమమ
కారముగలమాటమెప్పుగలదెల్లపుడున్

Thursday, July 23, 2020

నవధానంబొనరింపగావలెను,వేశ్యాసంగతిన్బొందుచున్

కవిగాబేరునుబొందునందరునుదాకావ్యమ్మువ్రాయన్దగన్
నవధానంబొనరింపగావలెను,వేశ్యాసంగతిన్బొందుచున్
నవహేళంబుగజూడరాదసురనెయ్యైవేళలందున్సుమా
కవిరాడ్వర్యులపొందుపూర్వముననక్కాంతల్గదాయిచ్చిరే

సానితోజేయవలెనవధానములను

శంకరాభరణమనునీసాలయందు
ప్రముఖయవధానిగాబేరువడయుమేడ
సానితోజేయవలెనవధానములను
నాదుకోరికయీయదినమ్ముడార్య!

కర్ణుండేపినతండ్రిపాండవులకున్గాంగేయుడేమామయౌ

కర్ణుండేపినతండ్రిపాండవులకున్గాంగేయుడేమామయౌ
కర్ణుండౌనుగపాండవోత్తములకున్గంజాక్షునాశీసులన్
వర్ణంబించుకజూడకౌనటగదాభ్రాతాగ్రజుండౌటసూ
కర్ణుండారయకుంతిపుత్రుడుభువిన్గాంతావిలోకించుమా

Wednesday, July 22, 2020

కర్ణుడుపినతండ్రిగాదెకౌంతేయులకున్

కర్ణుడుకుంతికిసుతుడని
కర్ణములకుసోకలేద?కాంతా!నీకున్
కర్ణకఠోరములిట్లన
కర్ణుడుపినతండ్రిగాదెకౌంతేయులకున్ 

Tuesday, July 21, 2020

పూవులుమంటలంబొగలబొల్తుతకైవదడిబుక్కిళించెగా

ఆవనజాక్షికిందగిననార్యునిగన్గొనిబెండ్లిజేయగా
నావిభుడెంతకున్గదలియామెనుజేరకపోవుచుండగా
బూవిలుకానిచూపులకుపూర్తిగలొంగినగారణంబునన్
పూవులుమంటలంబొగలబొల్తుతకైవదడిబుక్కిళించెగా

పూలుసెగలబొగలాబుక్కిళించె

విరహబాధతోడప్రేయసిపతిరాక
కెదురుచూచిచూచియీసుతోడ
తట్టుకొనగలేకతమినిదాదలలోని
పూలుసెగలబొగలాబుక్కిళించె

Monday, July 20, 2020

తమ్ముంజంపిసుకీర్తిచంద్రికలనందంగదగున్భూవరా

మమ్ముంరక్షణజేయుపద్ధతియిదేమాయీకరోనామభూ
తమ్ముంజంపిసుకీర్తిచంద్రికలనందంగదగున్భూవరా
సమ్మోదంబగుమాకునట్లయినచోసద్బుద్ధిగావించుమా
య మ్మౌశార్వరికాచునిన్నికనుదాహర్షాతిరేకంబునన్ 

తమ్ముజంపిసద్యశమ్ముగొనుము

సకలజనులనిరతిజంపుకరోనభూ
తమ్ముజంపిసద్యశమ్ముగొనుము
మనదికానిచోటమరుజన్మమెత్తియు
దేశదేశములనుదిరుగుచుండె

పిల్లినిమ్రింగి,మూషికమువేగమెజొచ్చెబిలమ్ములోనికిన్ 

అల్లదెచూడుమాయచటయాఖువుదూరెనునద్బుతంబుగా
పిల్లినిమ్రింగి,మూషికమువేగమెజొచ్చెబిలమ్ములోనికిన్
నల్లటిపిల్లినింగనగనంజరతోడనునొక్కసారిగా
పిల్లులయోగిరంబరయవిఘ్నగణాధిపువాహనంబులే

Sunday, July 19, 2020

పిల్లినిన్ మ్రింగియాఖువుబిలముజొచ్చె

పంచదారతోమార్జాలప్రతిమజేయ
చుట్టుప్రక్కలదిరిగెడుచుంచుజూచి
పిల్లినిన్ మ్రింగియాఖువుబిలముజొచ్చె
జూచుచుండగక్షణమునచోద్యముగను

జీరనువిప్పిచూపినదిచెల్వమునాసతియెల్లవారికిన్

కారముచేడునందుగలగాంతునివాట్సపుజేరదాదగన్
జీరనువిప్పిచూపినదిచెల్వమునాసతియెల్లవారికిన్
మీరెనుబట్టునావలువమెచ్చిరియందఱుదానిజూచియున్
నారయయాడవారుదమహర్షముతోడనెకొందురేగదా

Saturday, July 18, 2020

చీరవిప్పిచూపెచెలువమతివ

తనదుకూతులతకుదానుకొనినయట్టి
చీరవిప్పిచూపెచెలువమతివ
పసిడిరంగుకలిగిపట్టుచీరనుబోలి
ధగధగలుగమెఱపుదలిరుదాని

Friday, July 17, 2020

వ్యాఘ్రముసింహమున్గలియవానరుడొక్కడుపుట్టెవింతగన్

వ్యాఘ్రముసింహమున్గలియవానరుడొక్కడుపుట్టెవింతగన్
వ్యాఘ్రముసింహముల్దలపబద్ధవిరోధులుగాదెజూడగా
వ్యాఘ్రపుసంగమంబునటవానరమొక్కటిపుట్టవింతయే
శీఘ్రపుమాటలోనటులజెప్పెనుబాలుడుతల్లడింపుతో

కందిశంకరయ్య,ఘనుడుకవులనుజెడగొట్టగన్

వందనీయులందుప్రధముడుగదయెన్నభువినియీ
కందిశంకరయ్య,ఘనుడుకవులనుజెడగొట్టగన్
మందబుద్ధిగలుగుమందుడటులమాటలాడునే
బంధులనగవారుపలుకసొబగుకాదుధాత్రిలో

Thursday, July 16, 2020

కందిశంకరయ్యకవులజెఱచు

కందిశంకరయ్యకవులజెఱచుననె
నమ్మవలదుమీరుకొమ్మలార!
కవులబ్రోత్సహించెగమ్మనిబలుకుల
సహనశీలియతడు సద్గురువును

పుట్టినరోజు

పుట్టితివటయీరోజున
పుట్టినయోశంకరార్య!పృధివికిమణివై
బిట్టుగగవితలుసిమ్ముచు
నట్టులెగైకొనుమునాదునభివాదములన్

భరతక్షోణిపురోగమించునటభాస్వత్సంస్కృతిభ్రష్టమై

భరతా!యేమనిజెప్పనోపుదునునీభామామహారాణులే
పరదేశంబులబోకడల్మఱగియవ్వారిన్నుటంకించగా
భరతక్షోణిపురోగమించునటభాస్వత్సంస్కృతిభ్రష్టమై
పరదేశంబులపద్ధతిన్ నికనునెవ్వారైనమానంగదే

Wednesday, July 15, 2020

భారతముసంస్కృతిభ్రష్టమైరహించు

ఇతరదేశపువ్యామోహమినుమడింప
భారతముసంస్కృతిభ్రష్టమైరహించు
దేశకాలానుగుణముగదేశప్రజలు
నడచుకొనదగుసంస్కృతివిడువకుండ

దత్తపది

ఖలుడుహీనుడుద్రోహియౌకంసునిహతి
జేసి పాపియౌరావణుచిలుమునణచి
సకలజనులకునొనరించిసంతసమును
రక్షజేసిననోహరి!లచ్చిమగడ!
వందనంబులుశతకోటివందనములు

Tuesday, July 14, 2020

మంజీరమ్ములువీడిచేయదగురంభా!నాట్యమీవేదికన్ 

మంజీరమ్ములుచూడపాతవిగదామారాముజేయంగకీ
మంజీరమ్ములువీడిచేయదగురంభా!నాట్యమీవేదికన్
భంజాదేవికటాక్షవీక్షణమురంభాభామదేహంబుపై
రంజిల్లంగనునాట్యమాడుమసఖీ!రాగంబుజోలాడగా

Monday, July 13, 2020

యందియలవీడనొప్పు,నాట్యమునరంభ

నాట్యమాడుటయగుటతోనాట్యకత్తె
యందియలవీడనొప్పు,నాట్యమునరంభ
యందెవేసినజేయిగానలరెదివిని
రంభయనగనునెఱుగుమాయప్సరసగ

Sunday, July 12, 2020

రాముడెరావణుండయిధరాతలమేలుటపాడియౌగదా

రాముడెరావణుండయిధరాతలమేలుటపాడియౌగదా
రాముడురావణుండయినలాభమెచేకురులంకకంతకున్
రామునిజన్మమున్నరయలంకవినాశనమొందజేయుచున్
భూమినిరక్షజేయగనుబుట్టెనువిష్ణువురాముగాభువిన్

రాముడేరావణుండైనప్రజకుమేలు

రాముడేరావణుండైనప్రజకుమేలు
కలుగకుండగగీడునేగలుగునెపుడు
పరమరక్కసులగుటనుబాల!వారి
సత్వమందుననుండవుజాలిదయలు

దుర్వ్యాపారముక్షేమదాయకముసంతోషంబుపౌరాళికిన్

దుర్వ్యాపారముక్షేమదాయకముసంతోషంబుపౌరాళికిన్ దుర్వ్యాపారమునష్టదాయకమునెంతోబాధగూర్చుంగదా
నిర్వ్యాపారముగూడకష్టముకదానేమానిదామోదరా!
దుర్వ్యాపారముజేయకుండుటనుసంతోషంబుజేకూర్చుగా

Saturday, July 11, 2020

దుర్వ్యాపారంబె,జనులదుఃఖముద్రోచున్ 

నిర్వ్యాపారులజేయును
దుర్వ్యాపారంబె,జనులదుఃఖముద్రోచున్
దుర్వ్యసనమురహితములే
నిర్వ్యాపారమ్మువలననిరుపేదయగున్

Friday, July 10, 2020

గీతమార్చగలదెగీతకృష్ణ!

గీతమార్చగలదెగీతకృష్ణ!చెపుమ
యేలవచ్చెనీకుబేల!శంక
రాతమార్చుజదువగీతనునిరతము
సందియంబువలదుసన్నుతాంగి!

తనయర్ధాంగి,వివాహముంగనుటకైనేగెనుత్సాహియై

వినయంబేతనమార్గమంచుమనునావైశాలియేభీమునూ
తనయర్ధాంగి,వివాహముంగనుటకైనేగెనుత్సాహియై
యనకాపల్లినిచావడిన్జరుగునాయార్యాసురేఖాలకున్
వినుమాయార్యుడుమంచినేస్తముగయీభీముండునెక్కాలమున్

Thursday, July 9, 2020

తనసతి,పెండ్లింగనుటకుదానేగెద్వరన్

వినయముగలదనెరాయుడు
తనసతి,పెండ్లింగనుటకుదానేగెద్వరన్
ననకాపల్లినిజరిగెడు
తననేస్తపుకొడుకుకూతుతన్విదియగుటన్

కవికంటెన్బరికింపగాడిదయెమేల్గాదేభువిన్మిత్రమా

కవికంటెన్బరికింపగాడిదయెమేల్గాదేభువిన్మిత్రమా
కవికిన్గాడిదపోలికాభువినినాగాయమ్మయేమంటివే
యవహేళంబునుజేసితేకవిని,నయ్యారేయివేంమాటలో
కవియేభారతదేశపుంటునికినెక్కాలంబుగాచున్గదా

Wednesday, July 8, 2020

కవికంటెనుమేలుగాదెగాడిదభువిలో

వికటకవిపేరువినగనె
పకపకయనినవ్వుచుంద్రుప్రజలెల్లరునున్
వికృతపుకవితలనల్లుకు
కవికంటెనుమేలుగాదెగాడిదభువిలో

Tuesday, July 7, 2020

పగలు,శశాంకుడంబరముపైవిలసిల్లెగళాసమగ్రుడై

జగమదిచీకటయ్యెనుగశాశ్వతువేగమరాహుపట్టగా
పగలు,శశాంకుడంబరముపైవిలసిల్లెగళాసమగ్రుడై
వగలనురేపుచుండుచునవారితప్రేమనుగల్గజేయుచున్
బగలునుఱేయిజూడకనుబంధముగట్టిబడంగజేయుగా

పగలు,శశిపూర్ణకళలతోనెగడెదివిని

కటికచీకటియయ్యెనుగ్రహణమగుట
పగలు,శశిపూర్ణకళలతోనెగడెదివిని
పున్నమియగుటకారణంబుగనెఱుగుమ
ఖదిరుకాంతులుహాయినిగలుగజేయు

Monday, July 6, 2020

కుంతికి,గుంభకర్ణునకు,గూతురుగాాాాజనియించెసీతయే

చింతనుజేయగారవినిశీఘ్రమెకర్ణుడుపుట్టెనేగదా
స్వాంతమునందునన్జెడుగవర్తిలురావణుడన్నయేసుమా
వంతలదీర్చకారణమువాసురగర్భమునుండిఱేనికిన్
కుంతికి,గుంభకర్ణునకు,గూతురుగాజనియించెసీతయే

కుంతికిన్గుంభకర్ణునకుసుతసీత

కుంతికిన్గుంభకర్ణునకుసుతసీత
వింతయదిగాదె!వినగనువిమల!యరయ
భారతంబునముడివెట్టియౌర!రామ
కధను,గజిబిజిజేసిరిగదమనమ్ము

తన్నినధిక్కరించిననుదాపమునొందకనవ్వుటొప్పగున్

కన్నకుమారుడెయ్యెడనుగారముతోడనుగాలునెత్తుచున్
తన్నినధిక్కరించిననుదాపమునొందకనవ్వుటొప్పగున్
నన్నులమిన్నగాగనిననాత్మభవుంగడుబ్రేమజూచుటన్
చిన్నవయస్కుబాలలటుజేతురుబ్రేమనుగన్నవారినిన్

Sunday, July 5, 2020

తన్నిననొవ్వంగనొప్పుదాాపముడుగుచున్

అన్నెలతియలిగికృష్ణుని
తిన్నగదానేగశయనదీమపుకడకున్
కన్నడుపొదువునకరుగగ
తన్నిననొవ్వంగనొప్పుదాాపముడుగుచున్

Saturday, July 4, 2020

కొమ్ములురెండుపుట్టినవికోమలిశీర్షమునందుగాంచగన్ 

కమ్మకులంబునందువిదకాంతిశిరోమణిరాయదేనెనున్
నమ్మలువెంట్రుకల్బిగుసునైగడుమొద్దుగనుండగాననెన్
కొమ్ములురెండుపుట్టినవికోమలిశీర్షమునందుగాంచగన్
నమ్మరొ!జూచితేయదియయబ్బురమయ్యెనుజూచువారికిన్

కోమలితలమీదరెండుకొమ్ములువుట్టెన్

పామాయిలురాయుటతో
నేమోగానయ్యిజుట్టునేర్పడబెరుసున్
నిమ్ముగగనబడెగనుమా
కోమలితలమీదరెండుకొమ్ములువుట్టెన్

పయ్యెదలాగుధూర్తుని,సెబాసనిభామనుతించెబ్రీతితోన్

చయ్యనశిక్షనీయవలెసద్గురువైననుజింతజేయకన్
పయ్యెదలాగుధూర్తుని,సెబాసనిభామనుతించెబ్రీతితోన్
దియ్యనిపాటపాడగనుదీగలభారతిమెచ్చుకోలుగా
నెయ్యముగల్గుచోభువినినేరములేవియుగానరావుగా

Friday, July 3, 2020

పయ్యెదన్ లాగువానిభామినిమెచ్చెన్

అయ్యలునమ్మలచాటున
నెయ్యముతోనొకరికొకరునెగడుచుమిగులన్
సయ్యాటలనడుమనదన
పయ్యెదన్ లాగువానిభామినిమెచ్చెన్

వానరజాతిగాంచికడువంతనుజెందుటనీకుయుక్తమే

వానరులందుమేటిగదవాయునిపుత్రుడునాంజనేయుడే
వానినెఱుంగుమాయికనువారధిదాటినమేటివీరుగా
వానరజాతియంతయునుభానునివంశపుబంటులైమనన్
వానరజాతిగాంచికడువంతనుజెందుటనీకుయుక్తమే

వానరులనుగాంచివగచదగునె

వానరులనశివునియంశపువారలు
రామబంటుగనిలరహినిజెందె
సీతజాడకొఱకుజోతలైపోరిన
వానరులనుగాంచివగచదగునె

Wednesday, July 1, 2020

నత్తనుగాంచిబల్లిదుడునమ్రతతోబ్రణమిల్లెనత్తఱిన్

అత్తరుసాయిబిచ్చటనుహైమవతీశునిభక్తురాలు,మే
నత్తనుగాంచిబల్లిదుడునమ్రతతోబ్రణమిల్లెనత్తఱిన్
నత్తలుబ్రేమచూపుదురెయల్లునిబట్లనునెల్లవేళలన్
నత్తఱివారుసైతమునునాదరమిచ్చుచుమెల్గుచుందురే

నత్తనుగనిబల్లిదుండునమ్రుండయ్యెన్ 

అత్తలుసాధారణముగ
మెత్తగమాట్లాడుదురిలనల్లునియెడలన్
నత్తరుసాయిబుతనమే
నత్తనుగనిబల్లిదుండునమ్రుండయ్యెన్