Thursday, December 31, 2020

నూతనవత్సరమ్మునను నూటికినూఱెయటంచునవ్వెదన్

 వ్రాతలు దప్పుగానయిన పండితవర్యులుమార్కులిచ్చిరే

నూతనవత్సరమ్మునను నూటికినూఱెయటంచునవ్వెదన్

వ్రాతలువ్రాయగానగును బాగుగనందఱి మెచ్చుకోలుగా

నీతినిగూడినట్టివియు నేరములేనివి యుండమేలగున్

నూతనసంవత్సరమున నూటికినూఱే

 కోతలుగోయుచు వ్రాసిన

నూతనసంవత్సరమున నూటికినూఱే

ప్రీతిని నిత్తురు మార్కులు

భ్రాతలు!పూరించుడయ్య!రయమున దీనిన్

చింతన్జెందకుమమ్మ!యిప్పుడదగన్ శేషుండువచ్చున్గదా
సంతోషంబుననిన్ను బంపవలెనోసంతప్తచిత్తుండనై
యెంతంగాదన నింతులందఱునుదామేగంగ గానొప్పుగా
సంతోషంబుననేగభర్తకుదరిన్ సాధ్వీమణౌనాతికిన్

Tuesday, December 29, 2020

మక్కాచేరిసభక్తిగొల్వదగు రామయ్యన్ మహీజాపతిన్

అక్కా!యిక్కడెకాక భక్తినిదగన్ నయ్యాప్రదేశంబులౌ
మక్కాచేరిసభక్తిగొల్వదగు రామయ్యన్ మహీజాపతిన్
నెక్కాలంబునునైన రామునినింపారగొల్వంగ దా
జక్కన్ గూర్చును శ్రీలు,ముక్తియునునిస్సందేహమౌనట్లుగా

మక్కాచనిచేయదగు రమాధిపపూజల్

ఇక్కడ యక్కడ కాకను
మక్కాచనిచేయదగు రమాధిపపూజల్
ఎక్కడ చేసినగలుగును
చక్కటి పుణ్యంబుమనకు శ్రద్ధనుజేయన్
 

Monday, December 28, 2020

కలముధరించిశోభనసుఖంబిడగాజనెనాతిభర్తకున్

వలపులభర్తనున్ గలువబాఱెడుసంతసమొప్పమేటివ
ల్కలముధరించిశోభనసుఖంబిడగా జనెనాతిభర్తకున్
లలనలబొందుగోరుదురు లాస్యపురీతినిభర్తలత్తఱిన్
దలపునవచ్చుటన్సతులుతద్దయునాపగరానిమోహమున్

కలముధరించిచనెసతిసుఖంబిడబతికిన్

 అలకాపురియందుండుచు

విలసిత యవ్వనముతోడ, వెఱగుంజెందన్

వలపుల ఱేనిని గలువ,స

కలముధరించిచనెసతిసుఖంబిడబతికిన్

Sunday, December 27, 2020

కవులమనోఙ్ఞకల్పనయెకాక పయోదధిద్రచ్చసాధ్యమే

 కవులమనోఙ్ఞకల్పనయెకాక పయోదధిద్రచ్చసాధ్యమే

దివిజులుమొత్తమందఱునుదైత్యులునేకములౌచుద్రచ్చగా

దవిషమునుండిపుట్టెనుగదద్దయురుచ్యపుపేయుషంబునే

కవియనునాతడెప్పుడునుగచ్చితమౌనగువ్రాతవ్రాయుసూ

కవులకల్పనకాదెసాగరమథనము

 కవులకల్పనకాదెసాగరమథనము
సాగరమథనమయ్యది సత్యమార్య!
కాదుకల్పనముమ్మాటికదియ సుమ్ము
యమృతముకొఱకు చిలికిరి యసురగణము
పాలసంద్రమునయ్యెడ వాసిగాను

Saturday, December 26, 2020

 అక్రమమైన సంగడమనంత యశమ్మునుదెచ్చునెప్పుడున్

వక్రపుమాట లాడగను వక్త్రమునీకిపు డెట్లువచ్చెనే?

చక్రముద్రిప్పు భావుకుడ!సాటువవచ్చునె? యక్రమంబునన్

నక్రమమందునన్ దొలగునాయువుగీర్తియు నెల్లవారికిన్

యక్రమసంబంధమ,ధికయశమునుదెచ్చున్

 శక్రునికి కలదుగదయా

యక్రమసంబంధమ,ధికయశమునుదెచ్చున్

జక్రిని మనసున దలచుచు

సక్రమమగురీతి బరుల శ్రమలను దీర్చన్

Friday, December 25, 2020

గానుగనెక్కి, యేగవలెగా శతయోజనముల్ రయంబునన్

 నూనెను దీయనోపునిక నువ్వులనుండియుదామమేకమై

గానుగనెక్కి, యేగవలెగా శతయోజనముల్ రయంబునన్

యానపుసాధనంబయిన యాకసతేరునునాశ్రయించియున్

గానుగమాయమాయెనిక గంతలులేవుగ నెద్దుకిప్పుడున్ 

Thursday, December 24, 2020

 క్రిస్మసునాడుసాయిబులుకృష్ణుని పూజలొనర్తు రెల్లెడన్

విస్మయమాయెనే?సరళ! పెద్దగనచ్చెరువందబోకుమా

క్రిస్మసువంటిపండుగలు గృష్ణునిపూజలనెవ్వరైననున్

కశ్మలమొందకుండగను గమ్మనిభక్తిని జేయగానగున్ 

క్రిస్మసుదినమున దురకలకృష్ణునిపూజల్

విస్మయమనియనిపించును
క్రిస్మసుదినమున దురకలకృష్ణునిపూజల్
భస్మముధరించువారలు
కశ్మములులేకయుండి ఘటియించెగదే

చలియిడుబాధవోవు హిమశైలమునందలదాచుకొన్నచో

విలయముదాండవించగను వేలకువేలుగబ్రాణనష్టమై

నీలువగనీడలేనియెడ నేర్పునగొండను నాశ్రయించగా

దెలియగరానిధైర్యమును దెంపునుగల్గుచునొక్కసారిగా

చలియిడుబాధవోవు హిమశైలమునందలదాచుకొన్నచో

చలిబాధకుదాగుము,హిమశైలమునందున్

 లలితా!పతికౌగిలిలో

చలిబాధకుదాగుము,హిమశైలమునందున్

నలయా శంభునికొఱకై

శిలవలెదాజేసెతపము శైలజ రక్తిన్

Wednesday, December 23, 2020

బుద్ధినివీడిరాముడు విమోహితుడై గ్రహియించెజానకిన్

ఉద్ధతితోడబల్కెనట నొక్కడుచాకలివాడుత్రాగియున్
బుద్ధినివీడిరాముడు విమోహితుడై గ్రహియించెజానకిన్
బద్ధుడునౌచుదాశరధి పంపెనుసీతను దారుణంబుగా
క్రుద్ధత,జెందుచున్ మనగకాననమందుననుండునట్లుగా

Tuesday, December 22, 2020

బుద్ధినివిడి,రాముడందెభూమిజకరమున్

 ఉద్ధతిజెఱనిడె సీతను

బుద్ధినివిడి,రాముడందెభూమిజకరమున్

పద్ధతిగవిల్లువిఱిచియు

పెద్దలయాశీసులందిపేర్మినినపుడున్

Monday, December 21, 2020

పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులుఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడగన్

 పరులన్ దూషణజేయుచున్ సతతమున్ బాధించుపాపాత్ములౌ

పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులుఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడగన్

గరమున్ శాంతమునొందుచున్ పరులుసౌఖ్యంబొందు చందంబుగా

నిరతిన్ జింతనజేయుచున్ సుమతిదానీడేర్చుసత్సంపదల్

పురుషులుమూర్ఖులుకుజనులుపుణ్యవిదూరుల్

 అరయగ సామీ కొందఱు

పురుషులుమూర్ఖులుకుజనులుపుణ్యవిదూరుల్

మరికొందరుండ్రునిజముగ

పురమునుదాబాగుజేయ బుట్టితిమనుచున్ 

Sunday, December 20, 2020

కాలునిదూతలౌదురనంగదగుగాంతలనెల్లధాత్రిపై

 చాలనిజీతముంగలిగి సంధ్యనునిత్యము ద్రాగువారికిన్
కాలునిదూతలౌదు రనంగన్దగుగాంతననెల్లధాత్రిపై
పాలనునీరునుంగలియ పాలనువోలెను నుండునట్లుగా
నాలునుభర్తయున్ నిరతమాహరి,కీరమువోలెనుంటనౌ

కాలునిదూతలెకనంగగాంతలుభువిలోన్

మూలముసృష్టికి కాంతలు
గోలలువెట్టగనువారు కుపితులరగుచున్
మేలములాడిటుపాడియె
కాలునిదూతలెకనంగ గాంతలుభువిలోన్

సకలసుఖాలవాలముశ్మశానమండ్రుపండితోత్తముల్

వికలమనస్కులందఱును వెంపరులాడుచు బల్కునిట్లుగా
సకలసుఖాలవాలము శ్మశానమం,డ్రుపండితోత్తముల్
సకలము విష్ణుమాయనిలసంభవమౌననినీవెఱుంగుమా
సకలసుఖంబులందగను శంభుని వేడుమఋయెల్లవేళలన్

Saturday, December 19, 2020

సకలశుభములకు నెలవుస్మశానమె సుమ్మీ

వికల మనస్కులు,రోగులు
కకలావికలము నగుచును గన్పడుకంటెన్
నకలంకుహరునిచేరిన
సకలశుభములకు నెలవుస్మశానమె సుమ్మీ

రైతేరాజు-రైతులేనిదేరాజ్యములేదు
అదినిజముఅక్షరాలా
            తిండిలేదు రైతులేనిదే
కష్టమురైతుది -సుఖముదళారులది
రైతురక్తముపీల్చేవారే-దళారులు
రక్షించాలిరైతులను-దళారులబారినుండి
దేశానికివెన్నుముకేరైతు
రైతుకష్టమేప్రజకుజీవాధారము
రైతులేనిచో-తిండిలేదు
ప్రజలులేరు-రాజ్యమేలేదు
రైతన్నేమిన్న-ఇంజనీరుకన్న
మట్టేరైతు-రైతేమట్టి
తీస్తాడుబంగారం-మట్టిలోంచే
రైతన్నకష్టంతోనే-మనపొట్టనిండుతుంది
తీర్చాలి-రైతులఅవసరాలు
ఉంచాలిహాయిగా-రైతన్నను
ఆనందడోలికలలో
దండాలు-రైతన్నకు
జేజేలు-అన్నదాతకు
---
రచన:పోచిరాజుసుబ్బారావు
హైదరాబాదు:::9866283384

విపినమ్మందునధర్మరాజుదినియెన్ పిజ్జానుబర్గర్లతో
నపురూపమ్ముగబల్కగాదగునె,హర్షానీకున్యాయంబునే!
విపినంబందుననుండునేకనగనీపిజ్జాలుచింతింపుమా
యపహాస్యంబుగ నుండునీపలుకుమాయాజాలమౌనట్లుగా

Friday, December 18, 2020

దారములేనిదైన విరిదండయెమేలుగదాధరింపగన్

దారములేనిదైన విరిదండయెమేలుగదాధరింపగన్
దారములేకయుండునదిదండనిబిల్వగనొప్పునేయెటన్
దారములేనిదండలిల దర్శనమైనధరింపుమోరమా!
యారయదండకున్భువినినాశ్రితమేగదదారమెయ్యెడన్

Thursday, December 17, 2020

దారములేనట్టి పూలదండయె మేలౌ

ఆరసి కనుమా శశిధర!
సౌరభమే లేకయుండి చూపరిదైనన్
భారముగలిగెడు నామం
దారములేనట్టి పూలదండయె మేలౌ

చుట్టమువచ్చినాడనుచుశోకమువెట్టుట,ధర్మమిద్ధరన్

 ఎట్టుగజూచినన్వినుడియిట్టులుసేయుటమంచిగాదయా

చుట్టమువచ్చినాడనుచుశోకమువెట్టుట,ధర్మమిద్ధరన్

మట్టినీనమ్ముకొన్ననరమానవుబాగును జూడగోరుటే

యట్టులెపేదవారికిలనాశ్రయమీయగబూనుకోవలెన్ 

ట్టెడుసంతసమాయెను చుట్టమువచ్చెనని,మిగులశోకింపదగున్

పుట్టెడుసంతసమాయెను
చుట్టమువచ్చెనని,మిగులశోకింపదగున్
పుట్టిన యింటనుదుఃఖము
కట్టడిలేనంతరాగ కరోననచటన్

Wednesday, December 16, 2020

కుడ్యముమీదితేలొకనిగుట్టెనుబాధయెఱుంగడింతయున్

 కుడ్యముమీదితేలొకనిగుట్టెనుబాధయెఱుంగడింతయున్

కుడ్యముమీదయుండునదికుట్టెడుతేలునుగాదుగాగనన్

కుడ్యముమీదితేలలదికూరిమితోడనుజేసెజక్కెరన్

నీడ్యమెయట్లుజేయుటనునెవ్వరినైనను సంతసంబునన్

Tuesday, December 15, 2020

తేలుగుట్టెబాధ తెలియదింతవరకు

 తేలుగుట్టెబాధ తెలియదింతవరకు

మత్తుమందునీయ మగతగలుగ

నేదియెటులయైన నీమత్తుమందులు

వాడకుండజేయవలయు సుమ్ము

మేలునుగోరివచ్చెనటమిత్రుడు,వానినిజంపగాదగున్

 మేలునుగోరివచ్చెనటమిత్రుడు,వానినిజంపగాదగున్

మేలములాడబూనుటనుమేదినిమానుము,మేలుజేయునాబాలసుడాతడేనిజముపర్వులువెట్టుచుబోవబోకుమా

కాలమె చంపువానినిక గాచుటయెవ్వరిజేత గాదులే

Monday, December 14, 2020

మేలుగోరినహితునిప్రాణాలగొనుము

ఒడిని చేర్చుకొ నుముప్రీతితోడనెపుడు
మేలుగోరినహితుని,ప్రాణాలగొనుము
కీడుజేసెడుదుర్మార్గు నొడిసిపట్టి
బంధుడైనను నెవరైన వదలవలదు

Sunday, December 13, 2020

హుండీలోనధనమ్ము వేయుపనియెట్లొౌప్పౌనుతప్పేయగున్

హుండీలోనధనమ్ము వేయుపనియెట్లొౌప్పౌనుతప్పేయగున్
హుండీలోనధనమ్మువేయుటను దప్పౌనౌయటన్ బాడియే
యాండాళ్వారులు పూజజేతురటయీహుండీలయన్నింటికిన్
భాండాగారములన్నియున్ ధనముతోవర్ధిల్లగానెప్పుడున్ 

 దండగ ఖర్చులు బదులుగ

హుండీలోధనమువేయుటొప్పె,ట్టులగున్

బండరినాధునిగరుణలు

మెండుగమనమీదయుండి మేలగుకతనన్

Saturday, December 12, 2020

చిన్నదిచీమ,లోచనముచారెడు,నోరుసురంగ మార్గమే

మిన్నగురూపముంగలిగి మేదినినంతను నాక్రమించునై

బన్నుగరామచంద్రునకు బంటుగనుండుచు సీతజాడకై

మిన్నునబోవుచున్ నడుమ మీరినలంకిణినోటచిన్నగౌన్

చిన్నదిచీమ,లోచనముచారెడు,నోరుసురంగ మార్గమే

చిన్నిచీమకన్ను చేరెడంత

మన్నుమిన్నునేలు మహితుని సేవించు
నాంజనేయుడంత యగుచుకుఱుచ
సీతజాడవెదకె శ్రీలంకయందున
చిన్నిచీమకన్ను చేరెడంత

Friday, December 11, 2020

వేదమెసత్ప్రమాణమని ఫ్రెంచిజనుల్ జగమెల్లచాటిరే

వేదపుసారమున్ దెలిసి వీడినశంకలప్రోద్బలంబుతో

వేదమెసత్ప్రమాణమని ఫ్రెంచిజనుల్ జగమెల్లచాటిరే
వేదముమూలకారణము విద్యలునేర్వగనెల్లవారికిన్
వాదనలేనిమార్గమునుభాసిలజేయును లోకమంతకున్


వేదమేప్రమాణమనిరి ఫ్రెంచిజనులు

వేదమేప్రమాణమనిరి ఫ్రెంచిజనులు
ఫ్రెంచివారితో బాటుగపృధివినిగల
యన్నిదేశములకుగద యరయవినుము
వేదమేకాకయికయేదిలేదుకొలత

Thursday, December 10, 2020

నందనుల దహించిరంట నాటిపురంధ్రుల్

 అందముగలయువతులయెడ
కొందఱు దురుసుగ బలుకగ గోమలులంతన్
గుందుచుజెప్పగ దమతమ
నందనుల దహించిరంట నాటిపురంధ్రుల్

Wednesday, December 9, 2020

గాడిదగుడ్డునుండి యొకకాకిజనించియు నీదెనీటిలోన్

గాడిదగుడ్డునుండి యొకకాకిజనించియు నీదెనీటిలోన్
గాడిదపెట్టునేచెపుమ గాదిలికోడల!గుడ్డునెచ్చటన్
చూడుమయొక్కసారియిటుసూనృతవాక్యముబల్కగాదగున్
బాడియెయిట్టికల్పనలు భావితరాలను మోసగించుటే

గార్దభాండమ్ముఛేదించికాకిపుట్టె

గార్దభాండమ్ము ఛేదించికాకిపుట్టె
యిట్టివింతలు జరుగునీమట్టిమీద
సందియంబును విడువుముసరళ!నీవు
వీరబ్రహ్మము చెప్పెనువింతలెన్నొ

Tuesday, December 8, 2020

బాసకుగీడుజేయగలపండితులన్గని,మ్రొక్కగాదగున్ 

 వీసముగూడ గారవము,బేర్మియు,వందనమీయకుండుడో

బాసకుగీడుజేయగలపండితులన్గని,మ్రొక్కగాదగున్
బాసనుసంస్కరించు,కవివర్యులపాదములెల్లవేళలన్
బాసయనంగబ్రాణము,సమాజపువృద్ధికిగాదెతెల్పుమా

బాసజెఱచు పండితులకెవందనములు

 వినుటకింపుగ లేకుండబెడిదమైన

బాసజెఱచు పండితులకెవందనములు
సంస్కరించిన భాషనేచదువునెడల
నెల్లవారలుముదముతో నిలనునుండ్రు

కాముకులైనయోగులకెకాక పరంబులభించునేరికిన్

 కాముకులైనయోగులకెకాక పరంబులభించునేరికిన్

నీమముతోడనన్ శివునినీటనుబాలను బూజజేయుచో
గామముశుద్ధమైప్రజకుగారవమబ్బుచునెల్లవేళలన్
దామసులైనబొందునిలదద్దయుమోక్షముదప్పకుండగన్ 

Monday, December 7, 2020

కాముకులగుయోగులకెమోక్షంబుదక్కు మోక్షమునకుకాదడ్డుసూచొక్కుభువిని

 గాధినందను కొమరుడుకామమతిని

పొందుగోరగ వచ్చినపొలతివలపు
దీర్చియయ్యును మోక్షంబువచ్చెగాన
కాముకులగుయోగులకెమోక్షంబుదక్కు
మోక్షమునకుకాదడ్డుసూచొక్కుభువిని

Sunday, December 6, 2020

దొరికెనులంకెబిందెలనిదుఃఖపడెన్ మిగులన్దరిద్రుడే

 వెరవునదీయగోతినట వేమరుగొల్పెడులంకెబిందెలున్

బరువుగగన్పడయ్యెడనుబారులుదీర్చుచురాగలోకులున్

సరగునరాజసేవకులుసాయుధులెైగొనిపోవబిందెలన్

దొరికెనులంకెబిందెలనిదుఃఖపడెన్ మిగులన్దరిద్రుడే

దొరికెలంకెబిందెలటంచు, దుఃఖపడెను

 సంతసంబొందెనుమిగుల సరితతనకు

దొరికెలంకెబిందెలటంచు, దుఃఖపడెను
బిందెలన్నియు దెఱువగనందుకనగ
రాళ్ళురప్పలెయుండుటకళ్ళుచెదిరి

Saturday, December 5, 2020

సహదేవుండుధరాత్మజన్గనికడున్సంతోషమున్బొందెరా?

 బెహరారాముడు పల్కెనిట్లుగనునోవీరాంంజనేయా!గనన్

సహదేవుండుధరాత్మజన్గనికడున్సంతోషమున్బొందెరా?

యహహాయేమిదిచేటుమాటలనుబాహాటంబుగాబల్కెదో?

యహముంగల్గెనెయేమిచెప్పుమసభాహ్లాదంబుజేకూర్చునే?

సహదేవుడు,సీతనుగని సంతోషించెన్ 

 బహువిధ ప్రఙ్ఞాశీలుడు

సహదేవుడు,సీతనుగని సంతోషించెన్
నహమికగలిగెడురావణు
నహమునుగడతేర్చిపిదపయగమముక్రిందన్

Friday, December 4, 2020

నోడినవాడుగెల్చె మఱియోడెనుగెల్చినాడుచిత్రమే

చూడగనేటుయోటునిక జూపరులందరిమానసంబునన్
వీడనియద్భుతంబులవి వేమఱుగుర్తుకువచ్చుచుండెనా
వాడునువీడునంచనక పెద్దమనంబున గెల్పునిచ్చుటన్
నోడినవాడుగెల్చె మఱియోడెనుగెల్చినాడుచిత్రమే


గెలిచినవాడోడెనోడిగెలిచెనొకండున్

 

కలకాలమొకేరీతిగ
గలిబొలిపలుకులగుచునుప కారములేమిన్
పలువురుమదిభావించగ
గెలిచినవాడోడెనోడిగెలిచెనొకండున్


Thursday, December 3, 2020

దినకరుడుద్భవించి నలుదిక్కులనింపెను,చిమ్మచీకటిన్

 ఘనమగు సూర్యతేజమును గాసిలిబెట్టగలోకమంతకున్

దినకరుడుద్భవించి నలుదిక్కులనింపెను,చిమ్మచీకటిన్

దినకరుడస్తమించగను దేజములేకనునింపెనాయెడన్

దినకరుడేగదా భువికిదీప్తిని,జీవనమిచ్చురత్నమౌ

దినకరుడుదయించిదెసల,దిమిరమునింపెన్

 అనయము గాంతిని నింపును

దినకరుడుదయించిదెసల,దిమిరమునింపెన్

దినకరుడేగిపడమరకు

దినకరుడేమూలమార్య!దివికిన్భువికిన్

Wednesday, December 2, 2020

జన్మదినోత్సవమ్మును శ్శశానమునంజరుపంగయుక్తమౌ

 చిన్మయరూపుడౌ శివుడుసేదనునొందుచువల్లకాడునన్

దున్మెను బాపులందరిని దోరపువాడిన శూలధారియై

సన్మతినానతీయుడిట సజ్జనులౌదగువారలెయ్యెడన్

జన్మదినోత్సవమ్మును శ్శశానమునంజరుపంగయుక్తమౌ

జన్మదినోత్సవముశ్శశానమునదగున్

 చిన్మయుడగు నాశివునకు

జననముమరణంబులనుటసబబేయార్యా!

తన్మయతగలుగునెడలను

జన్మదినోత్సవముశ్శశానమునదగున్ 

Tuesday, December 1, 2020

శివపూజనుజేయకున్న శ్రీహరియలుగున్

 శివశివ యేమని యంటిరి

శివపూజనుజేయకున్న శ్రీహరియలుగున్ ?
శివుడునుహరియునునొకరని
యవగతమేయైనయెడల యలుగుటయెటులౌ