Friday, September 24, 2021

కోకలు ద్రౌపదీసతికి గోర్కెనొసంగెను, గర్ణుడొప్పుగన్

 శోకముతోడ నాయబల స్రుక్కుచు గృష్ణుని గోరనత్తఱిన్

కోకలు ద్రౌపదీసతికి గోర్కెనొసంగెను, గర్ణుడొప్పుగన్
నాకపుఱేడు కోరగను నమ్రతయొప్పగ గుండలంబులన్
గూకటి వ్రేళ్ళతో నొలిచి కోరికతీరగ నిచ్చెనేగదా

కర్ణుడిచ్చె,ద్రౌపదికి గోకలను దయను జారవిడిచెను దేవతల్ సంతసించ

 దేవరాజగు మఘునకు దీసి తనదు

కవచ కుండలముల డుగంగ దయకలిగి
కర్ణుడిచ్చె,ద్రౌపదికి గోకలను దయను
జారవిడిచెను దేవతల్ సంతసించ
భక్తరక్షక! నీకివె వందనములు

Thursday, September 23, 2021

పిల్లిదురంబునందునిమె,పెద్దపులింగడు విక్రమించుచున్

 మెల్లగ నాగుపామొకటి మేడను బ్రాకుచు నుండునత్తఱిన్

పిల్లిదురంబునందునిమె,పెద్దపులింగడు విక్రమించుచున్

జల్లుమనంగ నొక్కపరి చాపుచు కోరలుమీదికుంజనన్

పల్లమునెత్తులంగనక పాఱెను సోముడు గుండెపట్టుచున్

బుసలు గొట్టుచు దరిజేర భోగి,యంత పిల్లి పోరాటమున జంపె,బెద్దపులి

 బుసలు గొట్టుచు దరిజేర భోగి,యంత

పిల్లి పోరాటమున జంపె,బెద్దపులిని

వేటగాడొకడు పొదల చాటునుండి

చంపె బాణాన గలిగెడు తెంపు తోడ

Monday, September 20, 2021

కోపమె భూషణమ్మగును గోడలికిన్ దనయత్త సన్నిధిన్

 రేపులు మాపులున్ ననక ఱేయియు బ్రొద్దును జేయుచుండగా

నీపని యాపనియం చికను నిట్టుగ నట్టుగ జెప్పుచుండగా
గోపమునొంది కూర్చునగ గోమున యత్తయు జేరదీయుటన్
కోపమె భూషణమ్మగును గోడలికిన్ దనయత్త సన్నిధిన్

కోడలికినత్తసన్నిధిం గోపమె నగ

 చేయుకొలదిని నింకను జేయుమనగ

కినుక వహియించి కూర్చుండ,కేలుదమ్మి
వట్టి యత్తమ్మ బ్రతిమాలు వట్టు చూడ
కోడలికినత్తసన్నిధిం గోపమె నగ

Thursday, September 16, 2021

రాముడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్

 రాముడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్

నేమని బల్కుచుంటిరిట? యిట్లుగ బల్కుట పాడియే?రమా!

రాముడు శాంతమూర్తియయి రంజిలునట్లుగ మానవాళియున్

నీమము దప్పకుండగను నిశ్చల బుద్ధిని రాజ్యమేలెగా

రాముడు గ్రోధము వహించె రాజ్యమువోవన్ ?

 ఏమీ? దారుణమీయది

రాముడు గ్రోధము వహించె రాజ్యమువోవన్ ?

రాముడనంగను దైవమ

యేమాత్రము నుండబోవు నీర్ష్యాదులహో

శంకలు లేనివాడు సరసంబునెఱుంగునె మోదమందునే

 వంకలు జూడగా దొరకు వందలువేలుగ నిజ్జగంబునన్

శంకను నొందుచున్ మనక సర్దుకు బోయిన హాయిగల్గుగా

శంకల బాటలోనడువ శక్తివిహీనులె యౌదురెప్పుడున్

శంకలు లేనివాడు సరసంబునెఱుంగునె మోదమందునే

శంకలు లేనట్టివాడు సరసుండగునే?

 వంకలు వెదకిన దొరకును

పంకజముఖి చేతలోన బరిశీలించన్

శంకలు గలుగక యుండిన

శంకలు లేనట్టివాడు సరసుండగునే?

Wednesday, September 15, 2021

ధవుని పరాభవించుటయె ధర్మము సాధ్వికి దప్పులేదిలన్

 ధవుని పరాభవించుటయె ధర్మము సాధ్వికి దప్పులేదిలన్

ధవుని పరాభవించుటను దప్పుగ నెంతును నోమహాశయా!
ధవునికి సేవజేయుట సదాశివు సేవయెయౌను ధారుణిన్
వివరముగానుటంకితిని బ్రేమను బంచుచు నుండమేలగున్

ధవుననుమానించుటె కద ధర్మముసతికిన్

 అవకతవక లీమాటలు

ధవుననుమానించుటె కద ధర్మముసతికిన్
ధవుడన దైవమ యాలికి
ధవునుని సేవించునెడల దక్కును ఫలముల్

Sunday, September 12, 2021

దానముజేయబూనుటు,చితమ్మొకొ తిండికిలేనివారికిన్

 హీనముగా దలంతునిక హేమపుటాభరణంబు లుండగా

దానముజేయబూనుటు,చితమ్మొకొ తిండికిలేనివారికిన్

దానముజేయకుండగను ధార్మికసూక్తులు బోధసేయుటన్

దానము జేయగా వలయు దప్పక యన్నము నీరమున్ రతిన్

దానమొనరింపరాదు,క్షుద్బాధితులకు

 ధనము మత్తుగ గలవాని కెన్నడిలను

దానమొనరింపరాదు,క్షుద్బాధితులకు

నన్న దానము జేసిన మిన్నగాను

పుణ్య మబ్బును దప్పక గణ్యముగను

గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే

 గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే

మరణంబెందుల కోరుచుంటివిల నామార్తాండు సేవించుచో

నిరతంబీయును నాయువున్ సిరులు పానీయంబులింపారగా

గరమున్ మానుమ దుష్టచింతనను నోకామాక్షి!నీవిప్పుడున్

గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్

 అరకొర బ్రదుకుల కంటెను

విరమణ నీయంగదలచి వివిధములుంగాన్

మరణపు యత్నము జేయగ

గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్

Thursday, September 9, 2021

కర్ణుండపకారియయ్యె గౌరవపతికిన్

కర్ణంపు కుండలంబులు
పూర్ణము గలిగిన కవచము పూర్తిగ శచికిన్
కర్ణుండీయుట కతమున
కర్ణుండపకారియయ్యె గౌరవపతికిన్

Wednesday, September 8, 2021

చలివేళ.........

వలపున్ గూర్చును నేరికైననిల నాఫాలాక్షు సాక్ష్యంబుగా
జలివేళన్ గౌగిలింత ,మిగులన్ సంతాపముంగూర్చెరా
చెలియున్ బ్రక్కన లేనిచోరవికి దాజేయండుసుమ్మేదియున్
జెలితో నాతని జీవితంబుముడి యోశ్రీరామ!నీవేగతౌ

చలిలో చెలిగౌగిలింత,సంతాపమిడున్

వలపుల రేకెత్తుంచును
చలిలో చెలిగౌగిలింత,సంతాపమిడున్
చెలి ప్రక్కనలే కనయీ
చలికాలము రవికి మిగుల సైపగ లేమిన్

Monday, September 6, 2021

పాతివ్రత్యము జూపుచుండి ,విటులన్ బైకొందురబ్జానల్

నాతుల్ రక్షణ సేయుచుండిరి గదానారీలోకంబునున్
పాతివ్రత్యము జూపుచుండి ,విటులన్ బైకొందురబ్జానల్
నీతిన్ జాతియు లేకయుండుచు నికన్ నీచంపువృత్తిన్ ధరన్
రోతన్ బొందెడు జీవితంబునుగటాలోకంబు గానుంటిరే

పాతివ్రత్యమున,విటులబైకొంద్రు సతుల్

నాతులు రాణింతురుగద
పాతివ్రత్యమున,విటులబైకొంద్రు సతుల్
వీతభయంబున,సిగ్గున
నీతిని విడనాడిరకట నీచపుబనికిన్

భర్తను పుత్రుగాదలప బాడియగున్ సతికెల్లవేళలన్

భర్తకు దాసిగా మఱియు భార్యగ నమ్మగ బ్రేమపంచుటన్
భర్తను పుత్రుగాదలప బాడియగున్ సతికెల్లవేళలన్
హర్తకు వోలె నుండకను హాయిని నిచ్చుచు నుండగావలెన్
భర్తకునెల్లవేళలను వాయికి చేతికి దోడుగాధరన్

Sunday, September 5, 2021

భర్తనుపుత్రుడుగ,దలప పాడియ సతికిన్ ?


కీర్తీ! తలపగ నేరము
భర్తనుపుత్రుడుగ,దలప పాడియ సతికిన్ ?
హర్తను సత్పురుషునిగా
గర్తవ్యము నెఱుగవలయు గనికరమందున్

 

Saturday, September 4, 2021

రతికి సిద్ధపడుడు రమణులార!

 పూజయాయె నిపుడె పూర్తిగ కనుకహా

రతికి సిద్ధపడుడు రమణులార!

హారతిచ్చి పిదప యయ్యవారినిబిల్వ

కనులకద్దు కొండ్రు తనివిదీర

రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా!శుద్ధచిత్తంబులన్

 అతివల్ జేసిన పూలతోభవుని కిన్ యారాధనంబాయె హా

రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా!శుద్ధచిత్తంబులన్

మతియందెప్పుడు శంభునేదలచి నీమంబొప్పథ్యానించుచో

సతతంబిచ్చును నాయువున్ సిరులు నాజన్మాంతమశ్రాంతమున్

Thursday, September 2, 2021

యద్దిర రామునిన్ నడవికంపుట మూలము కైకపెండ్లియే

 ముద్దులు మూటగట్టునటు మోములు గల్గిన వారుగాను నీ

కిద్దరు భార్యలున్నను వరించితెవేఱొకతెన్ రఘూద్వహా!

యద్దిర రామునిన్ నడవికంపుట మూలము కైకపెండ్లియే

తద్దయు ఘోరమే కమల!ధార్మికరూపుని బంపనిర్దయన్

సతులిద్దరు గలుగ మఱొకసతి యేలనయా

 పతిదశరధునకు రామా!

సతులిద్దరు గలుగ మఱొకసతి యేలనయా

సుతులుగ బుట్టిరిగదమీ

రతిసుందరరూపుతోడ నార్యా! చెపుమా

Wednesday, September 1, 2021

రాతిరి,చండభాస్కరుడు రాజిలెగాంచుము తూర్పుకొండపై

శీతలమయూఖుడున్ వెలుగు సేదనుదీర్చగ మానవాళికిన్
రాతిరి,చండభాస్కరుడు రాజిలెగాంచుము తూర్పుకొండపై
యాతప యుక్తుడై మిగుల యార్తిని నీయచు ,నెల్లవారుదా
భీతిని గల్గునట్లుగను బెంపువహించుచు నుండెనాయనన్

రవివెలింగెను తూర్పున ,రాత్రివేళ

ప్రబల తేజస్సు తోడను బ్రజలు మెచ్చ
రవివెలింగెను తూర్పున ,రాత్రివేళ
చలువ వెన్నెల తోడను జంద్రుడుండి
హాయి గూర్చును నెనలేని హర్ష మొదవ

అంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్

 అంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్

నంధత్వంబున నుండువారలును దానానంద ముప్పొంగగా

బంధాలెన్నియొకల్గి సంతసముతోవ్యాపారాపారీణులై

యంధత్వంబును మర్చిపోవుచును దైవారాధనంబే యికన్

అంధత్వము,పుణ్యజన్యమై ప్రాప్తించున్

 ఇంధనమువలన గలుగును

నంధత్వము,పుణ్యజన్యమై ప్రాప్తించున్

బంధము లన్నియు పుడమిని

కంధరమున్ నలుపు గలుగు ఖచరుని గొలువన్