Friday, November 18, 2011

కలికాలము

కలికాలము చె డుకాలము
కలి పురుషుడు రాక కతన కలి యుగమునకున్
బలవంతులు ,దుర్మార్గులు
పలువురు దెగ రెచ్చి పోయి బాధింతు రిలన్ .

కాలమహిమ

కాలము విచిత్ర మైనది
కాలము కలిసొచ్చి నపుడు కనకము కురియున్
కాలము గతి వక్రించిన
కాలుడు ధన హీను జేయు కలవానినినిన్ .

Thursday, November 17, 2011

హారం

హారము చదువుల నిలయము
హారము నొక మంచి సొగసు నాం ధ్రా వనికిన్
హారము సాహితి పరులకు
హారమునకు సాటి లేదు యావద్భువి లోన్ .

Monday, November 14, 2011

చిల్ద్రన్సు డె

నె హ్రూ పుట్టిన రోజా
చారముగా చేసి కొండ్రు చిల్డ్రన్ డేగాన్
సరి వయసు పిల్ల లందఱు
ఆ రోజున నాడు కొండ్రు నాటలు బెక్కుల్ .

Saturday, November 12, 2011

జాతికి మేలు

సూక్తులు సెప్పుట తేలిక
ఉక్తంబులు నమలు పరచు టెంత యొ కష్టం
సూక్తులు సదివిన పిమ్మట
రిక్తుడు గా నుండ కునికి జాతికి మేలౌ .

Thursday, November 10, 2011

లేఖ

పంపిన పద్యము జూడక
పంపిరి యీ మెయిలు నాకు మాధవు గారూ!
పంపిన పద్యము నొకపరి
సంపూర్ణము చదువుడయ్య! సవరణ సేయన్ .

మమతల కోవెల

మమతల కోవెల సిరియలు
సమతా భావంబు మరియు సమ తుల్యముగాన్
మమతలు నింపుచు నుండెను
విమతుల కది రోత యయ్యె వీ క్షిం పం గాన్ .