Monday, September 5, 2011

విస్కాన్సిన్ డెల్

--౨౦౧౧ తేదీన ఊదయము ౧౦ గంటలకు విస్కాన్సిన్ కు బయలు దేరితిమి .మధ్యాహ్నము గంటలకు హిల్టన్ గార్డెన్ ఇన్ చేరితిమి .అక్కడ గంటలకు మాకు ప్రవేశము ఇస్తానందున నేరుగా బోటు షైరుకు వె ళ్లి తిమి .బోటు ప్రయాణము
చాల వింతలతో సాగినది.అక్కడ నది విస్కాన్సిన్ రివర్ . నది కొండల మధ్యల నుండి
ప్రవహించు చున్నది .ఇరు వైపులా కొండలు శిల్పి చెక్కి నట్లుగా డిజైను తో కూ డియున్నది. రకమైన ఫార్మేషను ౫౦౦ మిలియనుల సంవత్సరము క్రితము
జరిగినదట .ఒక చోట కొండలు బాగా దగ్గర లో ఉన్నవి .ఒక మనిషి మాత్రమే వెళ్ళ గలడు
పొడుగునా బల్లలతో రోడ్డు లా వేసి కొండల మధ్య నుండి తీసుకోని వెళ్ళిరి .
అది చాల అద్భుతము గా ఉన్నది . రోడ్డు పొడుగునా క్రిం నీరు ప్రవహించు చున్నది .అక్కడ నుండి మరియొక చోటికి వెల్లితిమి.అక్కడ పొడుగుగా బాగా ఎత్తులో
రెండు రాళ్ళు స్తంభాలు గా డిజైనుతో ఉండినవి .అవి ఎదురెదురు గా కుక్కల ముఖమును బోలి యున్నవి . రెండు స్తంభాలకు మధ్య అడుగుల దూరము ఉండును .రెండు కుక్కలు ఇటు నుండి అటు ,అటు నుండి ఇటు దుమికినవి .ఇంకను
ప్రాంతములో చాల చోట్ల డిజైను లతో కూ డిన కొండలు చాల గలవు . ప్రాంత మంతయు చాల అందము గా ఉన్నది .అది ముగించుకొని రాత్రికి హోటలు కి వచ్చితిమి .

Thursday, September 1, 2011

దాన ధర్మములు

ఇందు జేసిన పుణ్యంబు యందు గుడుచు
మీది జన్మంబు నకు నది మేలు జేయు
గాన తన శక్తి తో గూడ దాన ధర్మ
స్థిర పరోప కారంబులు సేయ వలయు

Wednesday, August 31, 2011

దానము -యోగ్యత

వైదిక ధర్మములనుష్టించు వారు
క్రోధము లేనివారు
సత్య వాక్కు గలవారు
ఇంద్రియ నిగ్రహము కలవారు
ధైర్య వంతులు
వర్ణాశ్ర మములను అనుష్టించు వారు
సర్వ భూతముల యందు దయ గల వారు
లోభ గుణము లేనివారు
పరిశుద్ధు లగువారు

భీష్ముడు -ధర్మ రాజు

బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్య ,శూద్ర జాతుల స్త్రీలను బ్రాహ్మణుడు వివాహ మాడ వచ్చును
క్షత్రియుడు క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీలను వివాహ మాడ వచ్చును
శూద్రుడు శూద్ర స్త్రీని మాత్రమే వివాహ మాడ వలెను
తక్కువ జాతి పురుషులు ఎక్కువ జాతి స్త్రీలను వివాహ మాడిన వారి సంతానము సాంకరులు అందురు
బ్రాహ్మణ స్త్రీ యందు శూ ద్రునకు పుట్టిన వాడు చండాలుడు అగును
ఎక్కువ జాతి పురుషులు తక్కువ జాతి స్త్రీలను వివాహము చేసి కున్నప్పుడు సంతానము స్త్రీ జాతికి చెందును
మునుల బీజము వలన జాతి స్త్రీకి పుట్టిన వారయినను బ్రాహ్మణులగుదురు
క్షత్రియుల వలన జాతి స్త్రీకి పుట్టిన వారయినను క్షత్రియు లే అగుదురు
మహా తపో జ్ఞాన సంపన్ను లైన బ్రాహ్మణ ,క్షత్రియుల వలన పుట్టిన వారు బీజ ప్రదాను లై అధికులు అగుదురు

Saturday, August 27, 2011

ఆచార విధులు

రాజ మార్గములందు, రచ్చల యందును మూత్ర విసర్జన ,మల విసర్జన చేయ రాదు
సంధ్యా వందనాది కార్య క్రమములు సక్రమము గా నిర్వర్తించ వలెను
జలముల ప్రవేశించి స్నానము చేయవలెను
సూర్యుడు ఉదయించునపుడు,ఆస్తమించునపుడు నిద్రించ రాదు
కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు ముఖము శుభ్రముగా కడిగి కొని అన్నము తినవలెను
పరులను నిందించ రాదు
తడి కాళ్ళతో నిద్రించ రాదు
ఉదయించు సూర్యుని చూడరాదు
బహిర్భూమికి పోయినపుడు తాను విడిచిన మలమును చూడరాదు
చేసిన పాపము ఇతరులకు చెప్పవలెను
గురువులను ,బ్రాహ్మణులను సేవించ వలెను

Friday, August 26, 2011

సత్యము యొక్క స్వరూపము

సకల ధర్మములకు సత్యము మూలము
సర్వ భూతముల యందు సమ భావము
సుఖ దుక్ఖములను సమముగా భావించుట
అసూయా లేకుండుట
సాధుత్వము
అహింస
దానము
ఓర్పు
యజ్ఞము లు
యోగము
మోక్షములు

Wednesday, August 24, 2011

వినాయక చవితి

గణపతి చతుర్ధి రోజున
గణనాధుని పూజసేయ గరికల తోడన్
గణముల కధిపతి గణపతి
అణువణువున సంత సించి యడ్డులు తీ ర్చున్ .