౩-౯-౨౦౧౧ తేదీన ఊదయము ౧౦ గంటలకు విస్కాన్సిన్ కు బయలు దేరితిమి .మధ్యాహ్నము ౨ గంటలకు హిల్టన్ గార్డెన్ ఇన్ చేరితిమి .అక్కడ ౩ గంటలకు మాకు ప్రవేశము ఇస్తానందున నేరుగా బోటు షైరుకు వె ళ్లి తిమి .బోటు ప్రయాణము
చాల వింతలతో సాగినది.అక్కడ నది విస్కాన్సిన్ రివర్ .ఆ నది కొండల మధ్యల నుండి
ప్రవహించు చున్నది .ఇరు వైపులా కొండలు శిల్పి చెక్కి నట్లుగా డిజైను తో కూ డియున్నది. ఆ రకమైన ఫార్మేషను ౫౦౦ మిలియనుల సంవత్సరము ల క్రితము
జరిగినదట .ఒక చోట కొండలు బాగా దగ్గర లో ఉన్నవి .ఒక మనిషి మాత్రమే వెళ్ళ గలడు
ఆ పొడుగునా బల్లలతో రోడ్డు లా వేసి ఆ కొండల మధ్య నుండి తీసుకోని వెళ్ళిరి .
అది చాల అద్భుతము గా ఉన్నది .ఆ రోడ్డు పొడుగునా క్రింద నీరు ప్రవహించు చున్నది .అక్కడ నుండి మరియొక చోటికి వెల్లితిమి.అక్కడ పొడుగుగా బాగా ఎత్తులో
రెండు రాళ్ళు స్తంభాలు గా డిజైనుతో ఉండినవి .అవి ఎదురెదురు గా కుక్కల ముఖమును బోలి యున్నవి .ఆ రెండు స్తంభాలకు మధ్య ౫ అడుగుల దూరము ఉండును .రెండు కుక్కలు ఇటు నుండి అటు ,అటు నుండి ఇటు దుమికినవి .ఇంకను
ఆ ప్రాంతములో చాల చోట్ల డిజైను లతో కూ డిన కొండలు చాల గలవు .ఆ ప్రాంత మంతయు చాల అందము గా ఉన్నది .అది ముగించుకొని రాత్రికి హోటలు కి వచ్చితిమి .
No comments:
Post a Comment